Monday, December 16, 2024

 *నారద భక్తి సూత్రములు* 
80 వ సూత్రము
"సంకీర్త్య మానః శీఘ్రమేవావిర్భవతి,అనుభావాయతి చ భక్తాన్"    
ఈశ్వరుడు కీర్తినీయుడు,స్తవనీయుడు.అతడు సంకీర్తనకు సంతోషించి సత్వరం సాక్షాత్కరిస్తాడు.భక్తులకు దివ్యమైన దివ్యానుభవం ప్రసాదిస్తాడు.
ఇక్కడ సద్గుణ నిర్గుణ సాకార నిరాకారాది భేదాలు లేవు,భక్తుడు ఎలాఉపాసిస్తే భగవంతుడు అలా అవతరిస్తాడు. ఈ అనన్య భక్తి యోగానికి అందరు అర్హులే.కేవలం కావాల్సింది ఆ పరమాత్మపై విశ్వాసం.

నారద భక్తి సూత్రములు 
81 వ సూత్రము
"త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి"
త్రిసత్యాలు-దైహికమైనది,వాంచికమైనది,మానసికమైనది.ఈ మూడువిధాలు ముమ్మాటికీ భక్తి యోగమే  ఇతర జ్ఞాన కర్మాది యోగాలకంటే సర్వశ్రేష్టమైనది.
సాంఘిక,ధార్మిక,నైతిక ప్రమాణాలు మారవచ్చును కానీ భక్తి నిత్యం.భక్తి ప్రేమ స్వరూపిణి,ఇది పరమాత్మవలె సత్యమైంది,భక్తి పరమాత్ముని ప్రియా సఖి.
ఉపనిషత్తులు ఇలా ఘోషిస్తున్నాయి-
అన్ని ఉపాయాలు మానుకో,భక్తిని మాత్రం ఆశ్రయించు.భక్తిపరుడుకమ్ము,అనన్య నిష్ఠ భక్తిని పొందుము,భక్తి వాళ్ళ అన్ని సిద్దులు సిద్ధిస్తాయి.భక్తియే సాధ్యం పొందదగినది భక్తియే.
నారద మహర్షి నొక్కి చెబుతున్నారు మానస,వాచా,కర్మణా ఆలోచించి నిర్ధారించాను భక్తి శ్రేష్టం భక్తి సర్వసులభం.    

No comments:

Post a Comment