*దేవాలయంలో నైవేద్యం:*
చాలామంది ఒక స్వీట్ పాకెట్ తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి ఇవ్వండి అని దేవాలయంలోని అర్చకునికి ఇస్తారు.
స్వీట్ స్టాల్స్ లోవో మన ఇంట్లో చేసినవో స్వీట్స్ నైవేద్యంగా ఇవ్వకూడదు. దేవాలయానికి దేవునికి పండ్లు మాత్రమే తీసుకు వెళ్ళాలి.
అలాకాదు మేము ఫలానా నైవేద్యం పెట్టించ దలచుకున్నాం అనుకున్న వారు ముందురోజే అర్చకునికి సంబారాలు ఇచ్చి నైవేద్యం పెట్టించుకోవాలి. నైవేద్యం పెట్టిన తరువాత మీరు రెండు ఉంచుకొని ఇవ్వండి.
మేమే పంచుతాం ప్రసాదం అంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఈశ్వర శక్తిని అర్చకునిలోనికి ఆవాహన చేస్తారు. అర్చకుడు గుడిలో ఉన్న దేవతలో ఎనిమిదో వంతు అని చెప్తారు. చరమూర్తి క్రింద లెక్క.
దేవాలయాన్ని ఎనిమిది పెట్టిభాగిస్తారు. శిఖరం, ప్రాకారం, లోపలి గోడ, ముఖ మంటపం, అర్థ మంటపం, మహామంటపం, ధృవమూర్తి, విమానంలో ఉన్నటువంటి మూర్తి, ఇలా ఎనిమిది క్రింద విడగొట్టి ఈ ఎనిమిదిమందిలో ఎనిమిదో వంతు శక్తి అర్చకునికి ఉంటుంది. అందుకని దేవాలయంలో ప్రసాదాన్ని అర్చకుడు ఇవ్వాలి. అంతేకానీ వేరెవరూ ఇవ్వకూడదు.
**DrAyodhya Sarma Kasturi**
No comments:
Post a Comment