Tuesday, December 17, 2024

 *ధనుర్మాసంలో ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులే...*

ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది.

లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ , ఇఁటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ,  రామదాసు కీర్తనలు,హరినామ సంకీర్తన,శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ...

కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో  చేతిలో చిడతలతో  హరిదాసులు చేసే సంకీర్తనలు ధనుర్మాసం వేళ కనిపించే అతి గొప్ప సాంప్ర దాయాల్లో ఒకటి గా చెప్పవచ్చును.

సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు  కనపడతారు మళ్ళీ సంవత్సరం దాకా రారు, హరిదాసు అంటే పరమాత్మతో సమానం.

శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి.

మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు..

ధనుర్మాసం నెలరోజుల పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన,ధాన్య,వస్తు దానాలను స్వీకరిస్తారు..

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై పంచలోహ పాత్రను ధరిస్తారు.

ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అను గ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగాలని దీవించేవారు హరిదాసులు.

నెలరోజుల పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన,ధాన్య ,వస్తు దానాలను స్వీకరిస్తారు.

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక అతని ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు.

*హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు* .

?అందుకే గ్రామాలలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు . అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీమహా విష్ణువుకు కానుకలు బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

?హరిదాసు తల మీద గుండ్రటి రాగిపాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే
ప్రచారంలో ఉంది.

1హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి.

?ఏడాదిలో ఎప్పడూ కనపడని హరిదాసులు ధనుర్మాసం మొదలు నుంచి సంక్రాంతి వరకు ఈ  నెల రోజులు మాత్రమే కనిపిస్తారు. గ్రామాల్లో హరిదాసులు సందడి సూర్యోదయంతోటే మొదలవు తుంది.

?ఇలా నెలరోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడ గ్రాసాన్ని హరిదాసులు సంపాదించు కుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. ఏడాదిలో  ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు.

?ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు ,దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.

?గ్రామ వీధుల్లో హరి దాసులుఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి.. బాలబాలికలు పోటీలు పడతారు.

?హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.

?హరిదాసులతో పాటు, ఈ  పర్వ దినాలలో, గంగి రెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వ దినాలు తో ముగుస్తాయి.

?పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు.

మన ఆచారాలును, సంస్కృతిని కాపాడుకుంటే మన ధర్మాన్ని కాపాడుకున్నట్లే.. జై శ్రీమన్నారాయణ... ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం..

*స్వస్తి....*

*శుభమస్తు*

No comments:

Post a Comment