Wednesday, December 11, 2024

JIDDU KRISHNAMURTHY Philosophy About Marriage & Relationship

Youtube video link -  https://youtu.be/fypJP1VKxBk?si=w_w9bqtiX_tJkiY0

Transcript: 

మనిషి అనేవాడు అన్ని విధాలుగా నాశనం అయ్యేది కేవలం పెళ్లి వల్లనే అని ఇప్పటికే చాలా మంది ఫిలాసఫర్స్ నెత్తి నోరు ముత్తుకొని చెప్పారు బట్ జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నారంటే ముందు మనిషి అనే వాడికి పెళ్లి కంటే ముఖ్యం జీవితం జీవితం అంటే అనుభవం మరి అనుభవం అంటే సంబంధం సంబంధం అంటే చర్య ఈ మీన్ ఏదో ఒక పని సో ఈ పని జరగటానికి నువ్వు మానసికంగా కావచ్చు ఫిజికల్ గా కావచ్చు ఏదో ఒక రిలేషన్ పెట్టుకొని తీరాలి పెట్టుకోకపోతే ఆ పని జరగదు ఆ పని జరగకపోతే నీ మనుగడ ఉండదు సో దీన్ని బట్టి ఎవరు ఏ సంబంధం లేకుండా బ్రతకలేరు ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఒక్క మనిషితోనే కాదు థాట్స్ తోను వస్తువులతోను ఇలా ఏదైనా కావచ్చు సో మనిషి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మ్యారేజ్ అనే సిస్టం గురించి కాదు రిలేషన్షిప్ అనే బంధం గురించి కానీ ఈ రిలేషన్షిప్ గురించి జెకే ఏమన్నారంటే కేవలం నువ్వు ఉన్నావని అనుకోవటం వల్ల మాత్రమే నువ్వు జీవించట్లేదు ఏదో ఒక దానితో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టే జీవిస్తున్నావు సో మనిషి అనేవాడు ప్రెసెంట్ ఈ సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే ఎంత తలనొప్పి వస్తుంది అసలు మనం ఒక పర్సన్ తో రిలేషన్షిప్ పెట్టుకుంటాం సింపుల్ మన ఆనందం కోసం అవసరం కోసం ఎక్కువ సాధించడానికి ఇంకా ఏదో అవ్వటానికి మాత్రమే సంబంధాన్ని ఉపయోగించుకుంటాం సో ఇక్కడే వస్తుంది అసలు చిక్కు అంతా ఎక్కడో విన్నా నువ్వు పక్కోడిని ఏ కులముతో కొలుస్తావో వాడు కూడా తిరిగి నిన్ను అదే కులంతో కొలుస్తాడట సో దీన్ని బట్టి నువ్వు పక్కోడితో ఎలాంటి సంబంధం పెట్టుకుంటావో వాడు కూడా తిరిగి నీతో అదే సంబంధం పెట్టుకుంటాడు దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లం లో పడుతుంది ఎందుకంటే ఇద్దరు ఒకే విధమైన అవసరం కోసం సంబంధం పెట్టుకున్నప్పుడు ఎవడికి వాడు వాడి అవసరమే తీరాలి అనుకుంటాడు ఈ తీరాలి అనుకోవటంలోనే ఎత్తుకు పై ఎత్తు జరుగుతుంది అప్పుడు ఆ సంబంధం కాస్త వారుగా అవుతుంది సో యుద్ధం అన్న తర్వాత గెలిచి తీరాలిగా మరి ఆ గెలిచి తీరాలి అనే తాత్పర్యంలో నీకు అడ్డు వచ్చిన ప్రతిదీ విషం అయిపోతుంది సో పాయింట్ ఏమిటంటే ఇంకొకరి గురించి మనం పట్టించుకోము పట్టించుకోకపోవటమే మనిషిని ఇంత నాశనం చేస్తుంది మనం ప్రతి ఒక్కరితో సంబంధం పెట్టుకుంటాం బట్ వెంటనే ఒక గోడను కడతాం అలా గోడ వెనకాల బ్రతుకుతూ ఇతరులతో సంబంధం పెట్టుకుంటాం దాంతో సంబంధం కాస్త వాస్తవానికి వేరు చేసే విధానం అయిపోతుంది సో మనిషి ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని సంబంధాన్ని అర్థం చేసుకోవటం కానీ సంబంధం అంటే ఉండటం జీవించటం అవసరం కనుక నిన్ను నీవు చూసుకోగల అర్థమే సంబంధం కానీ ఆ అర్థాన్ని వక్రంగా చేయొచ్చు ఉన్నదాన్ని ఉన్నట్లుగా ప్రతిబింబించేట్లు చేయొచ్చు బట్ మనలో చాలా మంది చూడాలనుకున్న వాటిని చూస్తాం కానీ ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం అలా చూడకపోవటం వల్ల మనిషి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవటం వాడికి వాడే పెద్ద పుడింగ్ లా ఫీల్ అవ్వటం జరుగుతుంది ఇలా ఫీల్ అయ్యే వాళ్ళ వల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అదేమిటంటే అంటే వాళ్ళు ప్రెసెంట్ లో బ్రతకరు పాస్ట్ లో ఫ్యూచర్ లో బ్రతుకుతారు సో ఇలాంటి వాళ్ళు ఏదైనా సంబంధం పెట్టుకుంటే అది అధికారికంగా ఉంటుంది ఇక పెళ్లి చేసుకుంటే అది పెత్తనం అవుతుంది సో ఈ రోజుల్లో ఎవడి కింద ఎవడు బానిసగా బ్రతకాలి అనుకోవటం లేదు ఒక కాలం ఉండేది ఆ కాలానికి ఇప్పుడు కాలం చెల్లింది బట్ ఇలాంటి వాళ్ళు ప్రతి చోట అధికారాన్ని కోరుకుంటారు ఇంట బయట వర్క్ లో ఇలా ప్రతి సంబంధంలో అధికారం ఎలా ఇస్తారు ఇలాంటి వాళ్ళని పెళ్లి కాదు కదా కనీసం సంబంధాలు కూడా పెట్టుకోవద్దు అంటాడు ఎందుకంటే మనిషి అనేవాడు వేరుగా ఒక్కడిగా ఏ సంబంధం లేకుండా జీవించలేడు ఏదో ఒక సంబంధం అనేది మనిషి మూలాల్లో జీవంలో ఇమిడిపోయి ఉంది అలాంటిది సంబంధంలో కూడా నువ్వు అధికారాన్ని చూపిస్తే అది నిన్ను బానిసగా మార్చుకుంటుంది నువ్వు బానిసగా మారావన్న సంగతి నీకు కూడా తెలియదు ఎందుకంటే నీపై అధికారాన్ని చూపించేది నువ్వే కాబట్టి 


No comments:

Post a Comment