యమకవగ్గ
1. చేసుకున్నవారికి చేసుకొన్నంత
ఒకరోజున పూజ్యచక్షుపాలుడు బుద్ధభగవానునికి ప్రణమిల్లడానికి జేతవన విహారానికి వచ్చారు. ఆయన అంధుడు. ధ్యానమగ్నుడై విహార మందిరంలో అటూ ఇటూ నడుస్తుండగా ఆయన కాళ్ళకిందపడి కొన్ని పురుగులు చచ్చిపోయినాయి. ఆ మర్రోజు ఉదయం విహార భిక్షువులు కొందరు ఆయన్ను చూడటానికి వచ్చినప్పుడు కొన్ని పురుగులు చచ్చిపోయి ఉండటం చూశారు. చక్షుపాలుడి పట్ల వాళ్ళకు వైమనస్యం కలిగింది. వాళ్ళు బుద్ధభగవానుడి దగ్గరకు వెళ్ళి ఈ అపచారం గూర్చి చెప్పారు. బుద్ధభగవానుడు అ భిక్షువులను 'ఆయన ఆ కీటకాలను తొక్కి చంపడం మీరు చూశారా?' అని అడిగాడు. ఆ భిక్షువులు మేము చూడలేదు అన్నారు. అప్పుడు బుద్ధభగవానుడు మృదువుగా మందలిస్తున్నట్లు 'ఆయన కాళ్ళ కిందపడి అవి చనిపోవడం మీరు చూడలేదు కదా! ఆయన కూడా ఆ అల్పప్రాణులను చూడలేదు. చూసి ఉండే అవకాశం లేదు. కదా! అంతేకాదు ఆయన అర్హత్వాన్ని కూడా పొందినవాడు ఇప్పటికే, జీవహింస ఆయన ఒల్లదు. ప్రాణుల్ని అంత మొందించటానికి సమ్మతించడు. అటువంటి నిందార్హమైన పని ఆయన ఎన్నడూ చేయడు' అని బుద్ధభగవానుడన్నాడు. అప్పుడా భిక్షువులు 'ఆయనకు అంధత్వం ఎందుకు సంప్రాప్తించింది' అని అడిగారు. ఎవరైనా సరే చేసుకున్న కర్మఫలితాన్ని ఎట్లా అనుభవించాలో చెప్పే చక్షుపాలుడి పూర్వజన్మ వృత్తాంతం బుద్ధభగవానుడు ఆ భిక్షువుల కిట్లా విన్పించాడు.
'ఆయన ఒక జన్మలో నిపుణుడైన కంటి వ్యాధుల వైద్యుడు ఒకసారి బుద్ధిపూర్వకంగా ఒక స్త్రీ కంటిచూపు పోగొట్టాడు. ఆ స్త్రీ తనకు కంటి జబ్బు ఏదో సంక్రమించి బాగా పేరున్న
ధమ్మపదం గాథలు
ఈ వైద్యుడి దగ్గరకు చికిత్స కోసం వచ్చింది. ఆమె పేదరాలు. ఆమె వైద్యుడితో తనకు పూర్తిగ వ్యాధి నిమ్మళిస్తే కంటిచూపు బాగుపడితే తన సంతానంతో కూడా ఆయనింట్లో పనిమ ఉంటానని చెప్పింది. ఆయన బాగా వైద్యం చేశాడు. తన పిల్లలతో తాను ఆయన ఇం దాస్యం చేయాల్సి వస్తుందని భయపడిపోయి తన కంటివ్యాధి పూర్తిగా నయం కాలేదని బొంకిం అన్నమాట తప్పింది. వైద్యుడికి కోపం వచ్చింది. అతడికి తెలుసు ఆమె కంటి జబ్బు పూర్తి౦ నయమైందని. అయినా ఆమె ఇదివరకటికన్నా తన కంటిచూపు మరింత పాడైపోయింది అబద్ధం చెప్పింది వైద్యుడికి, ఆమె మాటలకు ప్రతీకారంగా వైద్యుడు అట్లానా! ఈ పూతమందుక పూర్తిగా తగ్గిపోతుంది అని ఒక్క అంజనం ఆమెకిచ్చి వాడమని చెప్పాడు. నిజానికి అది వికటించి కంటికి చెరుపుచేసి చూపుపోగొట్టే మందు అది. ఈ మందువాడి ఆమె పూర్తిగా గుడ్డిదైపోయిండి ఈ పాపకృత్యం వల్ల చాలా జన్మలలో ఈ వైద్యుడు కంటిచూపు పోగొట్టుకొని అవస్థలపాల కావలసి వచ్చింది. ఈ జన్మలోనూ అది తప్పలేదు.
ఎవరికైనా హాని తలపెడితే పాపపు పనిచేస్తే ఆ చేసినవాడు ఆ పాపఫలం అనుభవించక తప్పదు. కాడితో ఎద్దు బండిని లాగుతుండగా దాని కాలిగిట్ట వెంబడే బండిచక్రం సాగుతున్నట్ల పాపం చేసిన వాడి వెంట ఆ పాపం అనుసరించి వస్తూనే ఉంటుంది, అని బుద్ధభగవానుడు చెప్పాడు.
No comments:
Post a Comment