*కాఫీవిత్…పుస్తకాలు.. 1961
*ఈరోజు మనిషి మానసిక వికాసానికి ఉపయోగపడే
పుస్తకాలు గురించి మనసు విప్పిమాట్లాడుకుందాం.!
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలి.లేకుంటే మడిసికి,గొడ్డుకుతేడా ఏటుంటది? ముత్యాలముగ్గు సినిమాలో ముళ్ళపూడి వారి మాటిది. మనిషి బత
కాలంటే ఆహారం కావాలి. శరీరానికి పోషకాల్లేకపోతే
ఎదుగల మందగిస్తుంది.మనిషిదేహానికివున్నట్లే,మెద
డుకూమేత వుండాలి.లేకపోతే బుద్ధి మందగిస్తుంది.
మనిషి బావిలో 🐸 కప్పలా తయారవుతాడు.సృష్టి
లో ఇతర జీవరాశులకు లేని ఆలోచనను దేవుడు మనిషి కిచ్చాడు.అలాగే 'మనసు' ను కూడా ప్రత్యే
కంగా మనిషికే ఇచ్చాడు.అంటే మనిషి కేవలం
శారీరకంగానే…కాదు.మానసికంగా కూడా ఎదగాల
న్నమాట.అప్పుడే మనిషి మానసికంగా,శారీరకంగా సమతుల్యతను సాధిస్తాడు.
మనిషి బుద్ధి వికాసానికి “రచనలు " అవసరం.రచన
లు యే రంగానికైనాసంబంధించవచ్చుగానీ.సాహిత్య
రచనలైతే అటు మెదడుకు,ఇటు మనసుకు ఉభయ
తారకంగా ఉపయోగపడతాయి.ముళ్ళపూడి వారు చెప్పిన‘కలాపోసన'కు సాహిత్యాన్ని మించిందిమరేదీ
లేదు.
పుస్తకం...నా ప్రపంచం !!
మనసు మౌనంగా వున్నప్పుడు
పుస్తకాలు నాతో మాట్లడతాయి
ఇద్దరం కలిసి ఊసులాడుకుంటాం
ఒకరినొకరం ఊరడించుకుంటాం
పుస్తకంలో బందీలైన అక్షరాలు
రెక్కలు తొడిగి ఎగురుతాయి
కొన్న అక్షరాలు సీతాకోకచిలకలై
కళ్ళముందు రంగులవిల్లవుతాయి
ఇంకొన్ని అక్షరాలు భ్రమరాలై
మెదడుచుట్టూ గిరికీలు కొడతాయి
కొన్ని అక్షరాలు ఆలోచనల లోచనాలై
భావప్రపంచంలో విహరింపజేస్తాయి
కొన్నిపదాలు పెదాలపై హసిస్తాయి
కొన్ని వాక్యాలు ఆలోచనామృతాలై
నా భావాలకు అమరత్వాన్నిస్తాయి
పుస్తకం నేస్తమై నన్ను లాలిస్తుంది
పుస్తకం సమస్తమై నన్ను పాలిస్తుంది
పుస్తకమూ నేనూ ఓ జంట
అందుకే ఒంటరితనానికి
పుస్తకమంటే అంత మంట!!
*ఎ. రజాహుస్సేన్
రచనల్లో కూడా తేడాలుంటాయి.కొన్ని రచనలు హృద్యంగా వుంటాయి.మరికొన్ని భయపెడుతుం
టాయి.సాహిత్య ప్రక్రియల్లో ఏదైనా చదవడానికి యోగ్యమే కానీ..కవిత్వమైతే ఇంకొంచెం'టచ్చీ'గా వుంటుంది.అలాగని కథ, నవల,వ్యాసం ఇతర ప్రక్రి
యలు అథమమని కాదు. దేని విలువ దానిదే…
కాకుంటేకవిత్వంలోసృజనాత్మకత కాస్తంత ఎక్కువ
గా వుంటుంది కాబట్టి, కవిత్వానికి పెద్ద పీట వేస్తుం
టారు.
ఇంటిగడపను చూసి ఇల్లాలుఎలాంటిదో చెప్పొచ్చు
అంటారు.అలాగే మనింట్లో పుస్తకాల గదిని చూసి,
మన మనస్తత్వాన్ని అంచనావెయ్యెచ్చు.పుస్తకాల అరలో పురాణాలు,ఇతిహాసాలు,తాత్విక గ్రంథాలు ఎక్కువుంటే,వాళ్ళకుదైవభీతి,ధార్మిక చింతన వున్న
ట్లు.అలాగే కవిత్వం, కావ్యాలు,ప్రబంధాలున్నాయ
నుకోండి,వారు సున్నితమనస్కులైవుంటారు.ఇక
క్షుద్ర రచనలు,అపరాథ పరిశోథక నవలలు,సెక్స్… పుస్తకాలు ఎక్కువుంటే ఖచ్చితంగా వారికి నేరప్రవృ
త్తి అంటేఇష్టమనిభావించాలి.ఇక కథలు,నవలలు,
నవలికలు,పర్యాటక స్థలాల పుస్తకాలుంటే వారు ఎక్కువగా ఊహాజగత్తులో విహరించడానికి ఆసక్తి చూపేవారని అర్థంచేసుకోవచ్చు. ఏదియేమైనా ప్రతీ ఇంటికీ గడప వున్నట్లే..ఓ పుస్తకాలఅరమరా,అందు
లో పనికొచ్చే పుస్తకాలుండాలి.అందుకేనేమోగుంటూ
రు శేషేంద్ర శర్మ గారు ఇలా అంటారు.!
“అసలు ప్రతి ఇంట్లో వంట గది వున్నట్లే,పుస్తకాల గదొకటి ప్రత్యేకంగా వుండాలి.మనిషి అయిన వాడికి కడుపుకు..మేత ఒకటే చాలదు.మెదడుకు కూడా మేత కావాలి..చదవడం ఎంతఅవసరమో? చదివిన దాని గురించి ఆలోచించడం కూడా అంతే అవసరం.
లేకపోతే ఆచదువునిరర్థకమవుతుంది.దేశంలోవాతా
వరణం ఎట్లా వున్నా చదవడం అడుగంటాలని ఎక్క
డా లేదు.మందు తాగే ఓపిక కూడా లేనంతగా రోగి క్షీణించవచ్చు..కానీ, ఆ స్థితిలో మందు మరింత అవ
సరం.అందుకే ఈ స్థితిలో లోకానికి రచనలుకావాలి!
బాధల్లో,చికాకుల్లో సైతం ఒక నిముషంసేపైనా,చదవ
డమో, ఆలోచించడమో మంచిది" !!
మీరు తీరికచేసుకొని పుస్తకాలు చదవడం మొదలు
పెట్టండి..పుస్తకం మనిషికి దివ్యౌషధం..తెలుగు పుస్త
కాలు చదివేవారికి సౌకర్యం కోసం కొన్ని మంచి పుస్త
కాల …జాబితాను ఇక్కడ ఇస్తున్నాను.(అందరికీ….
తెలిసినవే అయినా రెడీ ఫర్ రిఫరెన్స్ కోసం)
●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ
బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
●మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం -
వేల్చేరు నారాయణరావు
●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య,
త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి
*పసలపూడి కథలు…వంశీ.
*అక్షర నక్షత్రమ్మీద…అలిశెట్టి ప్రభాకర్.
*తుమ్మపూడి..సంజీవదేవ్.. స్వీయచరిత్ర
*నరేంద్ర లూథర్.. హైదరాబాద్
*అదేనేల..ముకుంద రామారావు
*త్రిపురనేని రామస్వామి చౌదరి..సర్వ లభ్యరచనలు
*ఆంధ్ర నాటక రంగం..మిక్కిలినేని
*వంశీకీ నచ్చిన కథలు…కూర్పు వంశీ.
*తుంగభద్ర..సాంధ్యశ్రీ
*స్ఫూర్తి ప్రదాతలు.. ఎ. రజాహుస్సేన్..
ఇంకా చాలా పుస్తకాలున్నాయి.ఓపిక చేసుకొని చదవండి.!!
*ఎ.రజాహుస్సేన్..!
No comments:
Post a Comment