Monday, April 21, 2025

 🔔 *శివోహం* 🔔

ప్రశ్న : శివలింగాలు ఎన్ని రకములు ఉంటాయి?  

జవాబు : శివలింగాలు 5 రకములు అందులో ముక్యమైనవి:

1. స్వయంభువు లింగం: దేవతలు, ఋషులు ప్రార్ధించినప్పుడు శివుడు అనుగ్రహించి వెలిసిన లింగం.

2. బిందు లింగం: యంత్రంలో చెక్కబడిన లింగం.

3. ప్రతిష్ఠ లింగం (పౌరుషము) లింగం: దేవతల, గురువుల, మానవుల ఆధ్వర్యవంలో శిల్పి ద్వారా చేయించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠిత లింగం

4. చర లింగం: పాదరసం, ఏదైనా లోహంతో చేసిన, మెడలో కట్టుకునేవి అలా గురువులు, భక్తులు ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లి పూజించే లింగం.

5. గురు లింగం: నడుస్తున్న గురువే లింగం. ఈశ్వరుడే గురువురూపంలో ఉంటాడు
కలియుగంలో ప్రతి ఒక్కరూ యథాశక్తి లింగం ప్రతిష్ఠించాలి లేదా ప్రతిష్ఠ జరిగిన లింగంకి పూజలు జరగడానికి ధనం ఇవ్వాలి...


ప్రశ్న : శివలింగంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత ఉంటుందని శివ మహాపురాణం వివరించింది. 
ఏ ఏ దేవత ఏ ఏ భాగంలో ఉంటారు?

*జవాబు : పానవట్టం అమ్మవారు, లింగం పరమేశ్వరుడు.... 🙏*

🙏🕉️🙏

No comments:

Post a Comment