Thursday, July 10, 2025

 🙏🔥🔥🔥🔥🙏"
     👌 "*మీ పిల్లలకు 'నీతి నియమాలు' చెప్పే అవకాశం వస్తే! జారవిడవకండి*.
   *MAZUMDAR*
    *BANGALORE*
         🙏🇮🇳🇮🇳🙏
🚩"*కీ.శే. బి.వి. పట్టాభిరామ్ గారి నేపథ్యం*" తో,
       🔥🔥🔥
🙏"*మా అబ్బాయి మూడవ తరగతి చదువుతున్నప్పుడు 
నేను ప్రతిరోజు స్కూటర్ మీద స్కూలుకు తీసుకెళ్లే వాడిని.  ఒకసారి ఒక జంక్షన్ దగ్గర పోలీసు వారు" *ఒన్ వే  ట్రాఫిక్ బోర్డు*" ( One Way) పెట్టారు.  కానీ కొందరు అది లెక్క చేయకుండా! వెళ్ళిపోతున్నారు.  నేను స్కూటర్ ఆపి, వెనక్కి తిప్పి వెళుతుండగా మా అబ్బాయి "ఎందుకు వెనక్కి తిప్పారు?  చాలామంది అటే వెళ్తున్నారు కదా? అని అడిగాడు. 
అసలే ఆలస్యం అయిన టెన్షన్ లో నేను "నోరుముయ్! కాసేపు మాట్లాడకు" అంటూ స్కూలు వైపు వెళ్ళసాగాను.  ఆ క్షణంలో నాకెందుకో అనిపించింది ఈ సమయంలో అతడికి నేను "ట్రాఫిక్ నియమాలు" చెప్పాల్సింది పోయి ఇలా తిట్టానే ఏమిటి?
అనిపించింది.  వెంటనే మళ్లీ బండి వెనక్కి మరల్చాను.  ఒక మంచి విషయం చెప్పే అవకాశాన్ని చేరవేడువకూడదు అనిపించి ఆ "జంక్షన్' వద్దకు మళ్లీ తీసుకు వెళ్లాను.  ఆలస్యమైన 
ఒకరోజు స్కూలు పోయేనా పరవాలేదు. ఒక మంచి విషయం చెప్పాలనిపించింది. 
అక్కడున్న "*ఒన్ వే ట్రాఫిక్* " అనే బోర్డు చూపించి, "పోలీసు వారు ఈ రోజు నుండి ఈ రోడ్డుమీద వాహనాలను ఒకవైపునుండే అనుమతిస్తారు.  అది మన మంచి కోసమే. 
దానిని మనం గౌరవించాలి. ఎందుకంటే! "ప్రజాస్వామ్యం" లో చట్టాలు మనము చేసుకుని, వాటిని తప్పక అమలు మనం చేయాలి. అందుకే వెనక్కు తిప్పాను"

   🙏"మరైతే కొంతమంది ఆ బోర్డు ఉన్న అలా వెళ్ళిపోయారు కదా! 
మనం కూడా వెళ్తే! ఏమవుతుంది? అన్నాడు అమాయకంగా'.

    👌"బహుశా వాళ్లకి చదువు రాదు, చదువు వచ్చినా' *క్రమశిక్షణ*" లేని పౌరులు,.  ఏదో ఒక రోజు వారు సమస్యలు చిక్కుకుంటారు.  మన లాంటి వాళ్లు అలా ఎన్నటికీ చేయకూడదు" అని చెప్పాను. 
    🔥" ఆ రోజు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. 
*ఎన్ని గంటలు వేచ్చిస్తే! మాత్రం *? ఆ విషయం చెప్పగలం?  *అటువంటి అవకాశాలను ముఖ్యంగా మన తల్లిదండ్రులు జారవిడవకుండా! అంది పుచ్చుకోవాలి*.  దాని వలన పిల్లలు ' *మంచి పౌరులు*' గా పేరు తెచ్చుకోగలరు, ఏ దేశం వెళ్లినా!
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment