అసలు మనిషికి ఏం కావాలి | The Most Important Life Lesson | satyagrahi
https://youtu.be/fMeSA9zvoQk?si=5T7vO_xqZ1lsADdO
https://www.youtube.com/watch?v=fMeSA9zvoQk
Transcript:
(00:00) ఒకసారి ఊహించుకోండి మీరు ఒక బస్ స్టాండ్ లో ఉన్నారు. మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఆగుతుందో లేదో తెలియదు అప్పుడు మీ మనసు పరిస్థితి ఏంటి ఆందోళన టెన్షన్ కళ్ళు అటు ఇటు వెతుకుతూ ఉంటాయి కదా అదే ఆ బస్సు ఎప్పుడు వస్తుందో కచ్చితంగా తెలిస్తే హాయిగా రిలాక్స్ అయి కూర్చుంటారు.
(00:20) మన జీవితం కూడా అంతే కదా మనం దేనికోసం పరిగెడుతున్నాం. కానీ ఆ పరుగు ఎక్కడికో మనకే క్లారిటీ లేదు. అందుకే మనసు ఎప్పుడూ ఒక బరువులాగా ఉంటుంది మనకి. ఈరోజు ఈ వీడియోలో ఆ బరువును దించేసి మనసుని తేలిక చేసుకునే ఒక అద్భుతమైన జీవిత రహస్యాన్ని తెలుసుకుందాం. ఇది విన్నాక మీ లైఫ్ కచ్చితంగా మారుతుంది. అసలు మన సమస్య ఏంటో తెలుసా నిరీక్షణ కానీ సృష్టత లేకపోవడం మనం చిన్నప్పటి నుంచి ఒకటే అనుకుంటాం నాకు జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది.
(00:46) ఆ ఇల్లు కొంటే హ్యాపీగా ఉంటాను సొసైటీలో పేరు వస్తే చాలని కానీ గమనించారా ఇల్లు వచ్చాక ఉద్యోగం వచ్చాక బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగాక కూడా లోపల ఏదో తెలియని వెల్తి అన్ని ఉన్నాయి కానీ ఏదో లేదు అనే ఫీలింగ్ ఎందుకంటే మనం బస్ స్టాండ్ లో ఆందోళన పడే ప్రయాణికుల్లా బతుకుతున్నాం. మనకి నిజంగా ఏం కావాలో మనకే తెలియదు. బయట కనిపించే వస్తువులు హోదాలు మనల్ని సంతోష పెడతాయని భ్రమపడుతున్నాం.
(01:09) చేతికి దొరికిన ప్రతీది తీసుకుంటున్నాం. కానీ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఈ నిరంతరం అసంతృప్తి అనే మన స్ట్రెస్ ని యంజైటీని రకరకాల పేరులతో పిలుచుకుంటున్నాం. కానీ అసలు నిజం ఏంటంటే మనం వెతుకుతున్నది బయట లేదు. ఈ సమస్య ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక చిన్న పాప ఏడుస్తుంది అనుకోండి ఆ పాపని ఊరుకోబెట్టడానికి మీరు ఒక బొమ్మ ఇస్తారు కాసేపు ఆడుకుంటుంది మళ్ళీ ఏడుస్తుంది.
(01:35) పూని ఒక చాక్లెట్ ఇచ్చారు తింటున్నంత సేపు బాగుంటుంది. అది అయిపోగానే మళ్ళీ ఏడటం మొదలు పెడుతుంది. టీవీ పెట్టారు కాసేపు చూస్తుంది మళ్ళీ ఏడుస్తుంది. కానీ వాళ్ళ అమ్మ వచ్చి ఆ పాపని గుండెగా హత్తుకోగానే ఆ ఏడుపు ఒక్కసారిగా మాయమైపోతుంది. ఎందుకు ఎందుకంటే ఆ పాపకు కావాల్సింది బొమ్మలో చాక్లెట్ో కాదు అమ్మ స్పర్శలో ఉంది.
(01:55) సో మనం కూడా ఏడుస్తున్న పాప లాంటి వాళ్ళమే మన ఆత్మకి మన మనసుకి కావాల్సింది ఒక శాశ్వతమైన ప్రశాంతత కానీ మనం దాన్ని వస్తువులతో డబ్బుతో మనుషులతో నింపాలని చూస్తున్నాం. బొమ్మలు పాపకి తాత్కాలికంగా ఎలా ఆనందాన్ని ఇస్తాయో మనకున్న సంపదలు కూడా అంతే అవి కేవలం మనసుని కాసేపు డైవర్ట్ చేస్తాయంతే తప్ప మనలో ఉన్న అసలైన వెల్తిని పూరించలేవు అంటే పూర్తి చేయలేవు.
(02:19) మనం ఒక తప్పుడు చోటలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం కాబట్టి ఈ సమస్య వస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి లూస్ ఫిట్ అనే ఒక చిన్న సూత్రాన్ని పాటించాలి. మీరు మెడలో ఒక అందమైన హారం వేసుకున్నారనుకోండి అది మరీ గట్టిగా ఉంటే ఊపిరాడదు తెంచేసుకోవాలనిపిస్తుంది. అదే మరీ వదులుగా ఉంటే జారిపోతుంది.
(02:38) అదే కరెక్ట్ గా అమిరినప్పుడే అందం, ఆనందం మన బంధాలు మన కోరికలు కూడా అలాగే ఉండాలి. అవి మనకి అలంకారంలా ఉండాలి కానీ ఉరితాడులా బిగించుకోకూడదు. చేతి కట్టుకున్న దారం రక్త ప్రసరణ ఆపకూడదు కదా అలాగే మనుషుల మధ్య ఉన్న బంధం కూడా అలాగే ఉండాలి. కానీ అది మనల్ని బంధించకూడదు. ఒక చైనీస్ తత్వవేత్త అద్భుతమైన మాట చెప్పాడు. చెప్పు కాలికి సరిగా పడితే అసలు కాలు ఉందనే విషయం మర్చిపోతామని అంటే ఏంటి ఇప్పుడు మనం వేసుకునే షూ ఏంటి టైట్ గా ఉంటే కాలుకి నొప్పు వచ్చేస్తుంది.
(03:10) అలా అని చెప్పేసి లూస్ గా ఉంటే చిరాకు వస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకోండి అసలు మనకి ఆ కాలు ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం. అలాగే జీవితం కూడా అంతేనండి. బంధాలని ప్రేమించండి. కానీ వాటిని మీ ఆనందానికి ఏకైక కారణంగా మార్చుకోమాకండి. నా జీవితంలో వాడు ఉంటే ఆనందంగా ఉంటాను, నా జీవితంలో ఈ అమ్మాయి ఉంటే సుఖంగా ఉంటాను ఇలాంటివి పెట్టుకోమాకండి.
(03:30) కొంచెం స్పేస్ ఇవ్వండి కొంచెం వదిలేయండి అప్పుడే బంధం నిలబడుతుంది. మనసు నిలకడగా ఉంటుంది. చివరగా ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక కుక్క పిల్లని చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా గమనించారా యజమాని పక్కన ఉన్నప్పుడు కుక్క ఎంత నిశశబ్దంగా నిద్రపోతుందో దానికి రేపు తిండి దొరుకుతుందా లేదా అనే భయం లేదు. యజమాని ఉన్నాడు తాను చూసుకుంటాడు అనే నమ్మకం శరీరం మొత్తం వదిలేసి ప్రశాంతంగా పడుకుంటుంది.
(03:55) మనం కూడా ఈ ప్రకృతి పైనో ఆ దేవుడి పైనో అంత నమ్మకం ఉంచగలమా ఏది జరిగినా నా మంచికే అని భరోసాతో బ్రతకగలమా అలా బ్రతికిన రోజు మీ మనసులో బరువు మొత్తం దిగిపోతుంది. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. రైలులో పరిచయమైన వాళ్ళతో ఎంత హాయిగా మాట్లాడుతూ నవ్వుతాం. కానీ స్టేషన్ రాగానే దిగిపోతాం కదా. దిగేటప్పుడు మనం పెద్దగా బాధపడం ఎందుకంటే అది ప్రయాణం అని మనసుకు తెలుసు. లైఫ్ కూడా అలాగే ఉండాలి.
(04:18) అందరితో ఉండండి ప్రేమను పెంచండి కానీ దేనికి అతిగా అతుక్కుపోకండి గుర్తుపెట్టుకోండి మనసులోని కోరికలు బరువు దించుకుంటేనే జీవితం అనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ క్షణం నుంచి గట్టిగా పట్టుకోవడం మానేసి స్వేచ్ఛగా బ్రతకడం మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
(04:38) అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్. ఓం ఓం
No comments:
Post a Comment