Non-Veg Effect on బ్రహ్మచర్యం | 40 చుక్కల రక్తం = 1 వీర్య బిందువు | Bhagavad Gita Truth
https://youtu.be/yw67KnDWqZQ?si=QSl5WvOKoHjVlHaQ
https://www.youtube.com/watch?v=yw67KnDWqZQ
Transcript:
(00:06) నాన్వెజ్ బ్రహ్మచర్యం పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? బ్రహ్మచర్యం అనేది ఆహారం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? మరి గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? సత్వరజస్తమో గుణాల గురించి ఏం చెప్పాడు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బ్రహ్మచర్యం కరెక్ట్ వేలో ముందుకు వెళ్తుంది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(00:35) మీరు బ్రహ్మచర్యం పాటించాలనుకుంటున్నప్పుడు ఎక్కడో లోపల ఒక ప్రశ్న నిశశబ్దంగా వినిపిస్తుంది. నేను తినేది నా సాధనని ప్రభావితం చేస్తుందా? ఇది చిన్న ప్రశ్న కాదు ఇది ఆహారం పై ప్రశ్న కాదు ఇది మీ శక్తి మూలంపై ప్రశ్న. బ్రహ్మచర్యం అంటే కేవలం కోరికలను ఆపడం కాదు. అది లోపల ప్రవహించే శక్తిని పైకి మల్లించడం. కానీ అదే సమయంలో మనం తినే ఆహారం ఆ శక్తిని ఎటు లాగుతుందో మనం గమనించామా? మనిషి శరీరం ఒక యంత్రం కాదు అది ఒక జీవశక్తి ఆలయం.
(01:06) ఈ ఆలయంలోకి మీరు ఏ ఆహారం తీసుకొస్తున్నారో అదే మీ మనసు రూపం అవుతుంది. అదే మీ ఆలోచనల దిశ అవుతుంది. అదే మీ కామం లేదా నియంత్రణ అవుతుంది. అందుకే ఋషులు అన్నారు ఆహారం శుద్ధి అయితే మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయితే బ్రహ్మచర్యం సహజంగా నిలుస్తుంది అని. నాన్ వెజ్ అంటే ఏంటి కేవలం మాంసమా లేదా భయంతో వనికిన ఒక ప్రాణం చివరిసారిగా విడిచిన శక్తియా ఆ శక్తి మీ లోపలికి వెళ్ళినప్పుడు మీరు గమనించని మార్పులు మొదలవుతాయి.
(01:39) ఆలోచనలు బరువుగా మారుతాయి. మనసు స్థిరంగా ఉండదు కామం మాట వినదు. మరింత ఆశ్చర్యం ఏంటంటే మనిషి ఈ మార్పుల్ని బ్రహ్మచర్యం ఫెయిల్యూర్ గా అనుకుంటాడు. ఈ వీడియోలో నేను మిమ్మల్ని నాన్ వెజ్ మానేయమని బలవంతం చేయను భయపెట్టను కూడా కానీ ఒక నిజాన్ని మాత్రం తప్పించకుండా చెప్తా బ్రహ్మచర్యం శరీరంతో మొదలవ్వదు. అది ఆహారంతోనే మొదలవుతుంది. ఈ నిజాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మీ సాధన దిశే మారిపోతుంది.
(02:09) ఇప్పుడు ఈ ప్రయాణాన్ని నిజాయితీగా లోతుగా మొదలు పెడదామా బ్రహ్మచర్య శక్తి ప్రయాణం. నాన్ వెజ్ అంటే కేవలం మాంసం కాదు అది చనిపోయిన శరీరం అది భయంతో బాధతో వేదనతో విడిచిన నెగిటివ్ ఎనర్జీ శక్తి శాస్త్రం చెప్తుంది జంతువు చనిపోతున్నప్పుడు అడ్రినలిన్ కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు మాంసంలోనే ఉంటాయి తినేవాడి శరీరంలోకి వెళ్తాయి.
(02:39) అంటే మీరు తినేది శరీరం కాదు ఆ జంతువు చివరి భావన బ్రహ్మచర్యానికి పెద్ద శత్రువు కామం కాదు పెద్ద శత్రువు అశాంతి నాన్ వెజ్ తినే వాళ్ళలో సాధారణంగా కోపం ఎక్కువ ఆలోచనలు అశుద్ధం, కలలు గందరగోళం, నిద్ర అస్థిరంగా ఇవన్నీ ఉంటాయి. మాంసాహారం, రజోగుణం, తమోగుణం, బ్రహ్మచర్యం ఓన్లీ సత్వగుణం. సత్వగుణం పెరగాలంటే మనసు తేలికగా ఉండాలి. నాన్ వెజ్ అది అనుమతించదు.
(03:11) వీర్యం అంటే ఏంటి? కేవలం ద్రవం కాదు నాడీ శక్తి ఆయుర్వేదం చెప్తుంది 40 చుక్కల రక్తం ఒక చుక్క వీర్యం నాన్ వెజ్ జీర్ణానికి ఎక్కువ శక్తి ఖర్చువుతుంది. శరీరం ఎప్పుడూ హెవీ మోడ్ లో ఉంటుంది. వీర్యం త్వరగా దిగజారిపోతుంది. ఫలితం ఏంటి కామ ఆలోచనలు ఎక్కువ అవుతాయి. నియంత్రణ తగ్గుతుంది బ్రహ్మచర్యం నిలవదు. ఆ మీరు ఋషుల గురించి వినే ఉంటారు ఒక్క ఋషి పేరైనా చెప్పండి బ్రహ్మజ్ఞానం పొందినవాడు నాన్వెజ్ తిన్నాడు అని లేదు ఎందుకు ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కోసం నాడి శుద్ధి జరగాలి ప్రాణం పైకి కదలాలి కానీ మాంసాహారం ప్రాణాన్ని కిందకు లాగుతుంది.
(03:56) అందుకే శివుడు రాముడు హనుమంతుడు ఇలా ఎవరైనా సత్వాహారాన్నే స్వీకరిస్తారు. నిజం చెప్పాలంటే కొంతమంది నాన్ వెజ్ తింటూ కూడా కొంతకాలం బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కానీ అది స్థిరంగా ఉండదు అది లోతుకు వెళ్లదు ఎందుకంటే శరీరం ఒకటి చెప్తుంది మనసు ఇంకోటి చెప్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ లో బ్రహ్మచర్యం ఓడిపోతుంది. మీరు వెంటనే మానేయలేకపోతే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గించండి.
(04:25) మంగళ, శుక్ర, శని, సోమవారాలు అవాయిడ్ చేయండి. ఉపవాసం, పలాహారం, ధ్యానం ప్రాణాయామాన్ని చేయండి క్రమంగా మనసే మాంసాన్ని వదిలేస్తుంది. బలవంతంగా కాదు అవగాహనతో వదిలేయాలి. బ్రహ్మచర్యం త్యాగం కాదు శిక్ష కాదు అది శక్తి సేకరణ అది దైవానికి మనం దగ్గరయ్యే మార్గం మాంసం వదిలితే మీరు ఏదో కోల్పోతారని కాదు మీరు మీ అసలు శక్తిని గుర్తిస్తారు.
(04:56) బ్రహ్మచర్యం అంటే బలహీనత కాదు అది దేవతల స్థాయి జీవితం. భగవద్గీత 14వ అధ్యాయం ఏడవ శ్లోకంలో ఇలా ఉంటుంది. రజోగుణం రాగంతో కూడినదని తెలుసుకో అది తృష్ణ ఆసక్తి నుండి పుట్టినది అర్జున ఆ రజోగుణమే జీవుని కర్మల పట్ల ఆసక్తితో బంధిస్తుంది. రజోగుణం అంటే కోరికలు ఆశలు భోగాల పట్ల ఆకర్షణ ఇవి మనిషిని బానిసలుగా చేస్తాయి. రజోగుణం ఎక్కువైతే కామాలోచనలు పెరుగుతాయి మనసు బయటకి పరిగెడుతుంది బ్రహ్మచర్యం నిలవడం చాలా కష్టం.
(05:32) నాన్వెజ్ ఆహారం రజోగుణాన్ని పెంచుతుంది. భగవద్గీత 14వ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం దీన్ని తమోగుణం చెప్తారు. తమోగుణం అజ్ఞానం నుండి పుట్టిందని తెలుసుకో అది సమస్త జీవులను మోహంలో పడేస్తుంది భారత. ఆ తమోగుణమే నిద్ర అలసట నిర్లక్ష్యం ద్వారా జీవుని బంధిస్తుంది. తమోగుణం అంటే తెలియకపోవడం మత్తు శరీర బరువు జడత్వం తమోగుణం పెరిగితే శరీరం బరువుగా మారుతుంది ధ్యానం కుదరదు నియంత్రణ తగ్గుతుంది బ్రహ్మచర్యం కష్టంగా ఉంటుంది.
(06:10) భగవద్గీత 17 వ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం ఇది ఆయుషషు సత్వం బలం ఆరోగ్యం సుఖం సంతోషాన్ని పెంచేవి రుచికరంగా స్నిగ్దంగా హృదయానికి ప్రీతికరంగా ఉండే ఆహారాలు సత్వగుణానికి ఇష్టమైనవి. సత్వగుణం ఎక్కువగా ఉంటే శక్తి పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మచర్యం సహజంగా నిలుస్తుంది. రజస ఆహారం భగవద్గీతలో 17వ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో ఇలా ఉంటుంది. ఇది ఎక్కువైతే అతికారం పులుపు ఉప్పు వేడి కలిగినవి తీవ్రమైనవి పొడిబారినవి ఇవన్నీ దాహం దుఃఖం వ్యాధుల్ని కలిగించేవి.
(06:49) రజోగుణానికి ఇష్టమైన ఆహారాలు అంటే రజోగుణం అంటే కోపం అశాంతి మనసు అల్లకల్లోలం ఇవి బ్రహ్మచర్యానికి అడ్డంకిగా ఉంటాయి. భగవద్గీత 17వ అధ్యాయంలో 10వ శ్లోకం ఎంతో సేపటి క్రితం వండినవి రుచి కోల్పోయినవి పాడైపోయినవి దుర్వాసన వచ్చేటివి ఎవరైతే తిన్న తర్వాత మిగిలినవి అపవిత్రమైనవి ఇవన్నీ తమోగుణానికి ఇష్టమైన ఆహారాలు. గట్టిగా చెప్పాలంటే శవ సమాన శక్తిని ప్రాణం లేని ఆహారం మనసును దిగదాచే భోజనం ఇది.
(07:28) కృష్ణుడు చెప్తాడు ఆహారం గుణాన్ని పెంచుతుంది కానీ మనం అనుకుంటాం బ్రహ్మచర్యంతో బలం వస్తుంది కాదు బ్రహ్మచర్యం సత్వంతో వస్తుంది. సత్వం రావాలంటే ఆహారం మారాలి ఆహారం మారితే ఆలోచన మారుతుంది. ఆలోచన మారితే శక్తి దిశ ఆటోమేటిక్ గా మారుతుంది. బ్రహ్మచర్యం ఫెయిల్ అవ్వడం మీ బలహీనత కాదు. అది రజోగుణం, తమోగుణం ప్రభావం. ఈ రెండు తగ్గితే బ్రహ్మచర్యం, ధ్యానం, దైవానుభూతి సహజంగా వస్తుంది.
(07:57) బ్రహ్మచర్యం త్యాగం కాదు, శిక్ష కాదు అది శక్తి సేకరణ. అది దైవానికి మనం దగ్గరయ్యే సులభమైన మార్గం. మాంసం వదిలితే మీరు ఏదో కోల్పోతారని కాదు. మీరు మీ అసలు శక్తిని గుర్తిస్తారు. బ్రహ్మచర్యం అంటే బలహీనత కాదు అది దేవతల స్థాయి జీవితం. సో ఎవరైతే బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళు నాన్ వెజ్ అయితే మానేయాలి. ఉల్లి వెల్లుల్లిని కూడా మానేయాలి.
(08:27) సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ బ్రహ్మచర్యంలో ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవుసే ఓం
No comments:
Post a Comment