" ఎప్పుడూ నువ్వు ఒక్కడు మాత్రమే "
నువ్వు ఎప్పుడూ మార్పు చెందవని బాగా తెలుసుకో...
నువ్వు ఎంత ప్రయత్నించినా ఎవరు కూడా ఎప్పటికీ మారరు, చివరకు ఎవరెవరి పరిధిలో వారికి ఏది తోస్తే చివరకు అదే చేస్తారు.
దీనిని సున్నితంగా అర్థం చేసుకో.
ఎప్పుడూ ఎవరి విషయంలోనూ మార్పుని కోరుకోవద్దు.
మార్పు కోసం ప్రణాళికలు వెయ్యొద్దు.
నీలోనూ ఇతరులలోనూ మార్పును కోరుకోవడం అంటే మీరు మార్పు చెందటమే అవుతుంది.
ఈ సృష్టిలో ఎవరు ఎవరికీ ఏమి కారు.
ఎవరు ఎవరినీ అర్థం చేసుకోలేరు
ఏ ఇద్దరి స్వభావం ఒక్కటిగా ఎప్పటికీ కాలేరు.
ప్రకృతి వైవిధ్యమంతా నీ ఒక్కని వైభవంతోనే ఉంది. ఇతరాన్ని అంగీకరించడమే ఇతరంతో కొనసాగడమే నీలో దుఃఖానికి కేంద్రకం అవుతుంది.
బాగా అవగాహన పరుచుకోవలసిన విషయం ఏమంటే
" ఎప్పుడూ నువ్వు ఒక్కడు మాత్రమే "
Vissuji
No comments:
Post a Comment