నిరాశలో ఉన్నావా ఇది విను | Never Give Up Video | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=43OzJRPDNhI
Transcript:
(00:00) ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ఆలోచించండి దేవుడు మీకు ఉండటానికి ఇల్లిచ్చాడు తోడుగా కుటుంబం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు బ్రతికే శక్తి అన్ని ఇచ్చాడు కానీ ఒక చిన్న కష్టం రాగానే మనం ఏమైపోతున్నాం ఒక చిన్న ఇబ్బంది ఒక చిన్న ఓటమి ఎవరో ఉన్న ఒక చిన్న మాట అంతే మనసు విరిగిపోతుంది నా బ్రతుకు ఎందుకు ఇలా తగలబడింది నేను ఎందుకు ఇలా ఉన్నాను ఇదంతా నా తలరాదు అని చెప్పేసి గుండెలు బాధేసుకుంటాం లేనిపోని విరక్తి తెచ్చుకొని ఎప్పుడు కష్టాల గురించే ఆలోచిస్తూ మనల్ని మనం శిక్షించుకుంటాం ంటున్నాం. ఇదే మనందరిలో ఉన్న పెద్ద సమస్య.
(00:32) మనకున్న మంచి విషయాలు మన కంటికి కనిపించవు. కానీ లేనిది మాత్రం కొండంతలా కనిపిస్తుంది. ఉదాహరణకి చాలా మందికి ఏంటంటే లేటెస్ట్ గా ఏదైనా ఫోన్ వస్తే మాత్రం అబ్బా అది నా దగ్గర లేదే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. చాలా మంది చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న 100 వరాలన్నిటిని మర్చిపోయి ఒక చిన్న కష్టం వస్తే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు.
(00:59) ఇది మనసు బలహీనత లేక మనం మర్చిపోతున్న నిజమా ఒకసారి నీ జీవితాన్ని గమనించు నీకు ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది పక్కన కూర్చుని మాట్లాడే మనుషులు ఉన్నారు శరీరం బాగుంది శ్వాస ఆడుతుంది అయినా మనసులో మాత్రం నా బ్రతుకు ఇంతే అనే మాట సమస్య బయట ఉన్న కష్టంలో లేదు మన చూపులో ఉంది. మన చూపు ఎప్పుడూ కష్టం మీదే ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న వాటి మీద ఉండదు. మనం బాధపడటానికే అలవాటు పడిపోయాం.
(01:21) సంతోషంగా ఉండాలంటే ఏదో పెద్ద కారణం కావాలి. కానీ ఏవడానికి మాత్రం ఒక చిన్న కారణం చాలు. ఇదే అసలు సమస్య. ఎందుకంటే మనం ఎప్పుడు మన జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. పక్కవాడి ఇల్లు పెద్దదిగా అనిపిస్తుంది. వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకుంటాం. వాడు చాలా సుఖంగా ఉన్నాడు అనుకుంటాం. మన బ్రతుకు మాత్రం సరిపోదు అనిపిస్తుంది.
(01:41) ఉన్నదానికంటే లేనిది ఎక్కువగా కనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే మనం కష్టాన్ని ఒక శాపంగా చూస్తాం. కానీ నిజానికి కష్టం అనేది ఒక శిక్ష కాదు. ఇది ఒక నేర్చుకునే పాఠం. ఒకసారి పాండవుల గురించి ఆలోచించండి వాళ్ళు ఇన్ని కష్టాలు పడలేదు అడవుల్లో తిరిగారు అవమానాలు భరించారు యుద్ధాలు చేశారు కన్న వాళ్ళని కూడా పోగొట్టుకున్నారు.
(02:01) అయినా వాళ్ళు కూలబడిపోయారా మా జీవితం పాడైపోయిందని ఏడ్చారా లేదు వాళ్ళు కష్టాన్ని ఎదుర్కున్నారు దాంతో పాటు పెరిగారు. కానీ మనం ఒక చిన్న తప్పు జరిగిన మనల్ని మనం తిట్టుకుంటాం. ఇంకొక కారణం ఏంటంటే కృతజ్ఞతలు లేకపోవడం మనకు దక్కిన మంచిని మనం గుర్తుంచుకోవడం లేదు. ఉదయం లేవగానే మరోరోజు బ్రతికున్నందుకు ధన్యవాదాలు అని చెప్పడం మానేసి అది లేదు ఇది లేదని కోరుకోవడం నేర్చుకున్నాం.
(02:24) మనసును సరిగ్గా ఉంచుకోకపోతే అది ఎప్పుడు నెగిటివ్ వైపుకే వెళ్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తే అది నీలో పెరుగుతుంది. ముందుగా ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఇక్కడి నుంచి కష్టానికి బానిసని కాను. ఏదైనా కష్టం రాగానే ఒక నిమిషం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించడం అడగండి. ఇది నా జీవితం నాశనం చేసే అంత పెద్దదా లేక అది కూడా గడిచిపోయే కాలం లాగానా? జీవితం అనేది ఎత్తు పల్లాలో ఉన్న రోడ్డు లాంటిది.
(02:48) రోడ్ల మీద పల్లం వచ్చినంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు కదా కృతజ్ఞత కలిగి ఉండటం ప్రతిరోజు మూడు విషయాలు గుర్తుంచుకోండి నా దగ్గర ఏముంది నాకు తోడుగా ఎవరున్నారు నేను ఇంకా ఏం చేయగలను ఈ మూడు ప్రశ్నలు మీ ఆలోచన తీరుని మార్చేస్తాయి. ఆలోచనలని గమనించండి. ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే దాన్ని వెంటనే నమ్మకండి. మనసు కొన్నిసార్లు అబద్ధాలు చెప్తుంది నీ వల్ల కాదు నీ బ్రతుకు ఇంతే అని భయపెడుతుంది.
(03:10) అప్పుడు మీరు గట్టిగా నిలబడి నిజంగానా అని ఎదురు ప్రశ్నించండి. పనిలో పడండి అంటే బాధలో ఖాళీగా కూర్చోవడం చాలా ఈజీ కానీ ఆ బాధలో ఉన్నప్పుడు ఒక చిన్న పని చేయడం గొప్ప విషయం. ఏదో ఒక చిన్న మార్పు చేయండి. ఒక మంచి అలవాటు మొదలు పెట్టండి. పనిలో ఉన్నప్పుడు మనసు బలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఏ కష్టం ఎప్పటికీ ఉండదు. మీ జీవితం ఒక గొప్ప వరం. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలవంతులు.
(03:34) ఇప్పటి నుంచి కొత్తగా బ్రతుకుదాం. కష్టాలను లెక్క పెట్టే జీవితం కాదు మనసుకు మంచిని లెక్క పెట్టే జీవితం. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఈరోజు నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని ఆలోచించండి. మీ మాటల్లో నమ్మకాన్ని నింపండి. చిన్న చిన్న సంతోషాలను ఎంజాయ్ చేయండి. పొద్దున్నే వచ్చే ఎండ ఒకప్పుడు టీ ఇంట్లో వాళ్ళ నవ్వు మీ శ్వాస అవి చిన్నవి కావు ఇవే అసలైన జీవితం. మీ జీవితం ఏమి పాడైపోలేదు.
(03:58) అది ఇంకా బాగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. ఇక నుంచి ఒక రూల్ పెట్టుకోండి కష్టం వస్తే పడిపోను నిలబడి ఎదురు చూస్తాను. మీ జీవితం మీకు శత్రువు కాదు అది ఒక గురువు ఇది మీరు పాడు చేసుకునే బ్రతుకు కాదు ఇది భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రతిరోజు ఒక కొత్త పేజీ దాని మీద మీరు ఏం రాస్తారు బాధనా లేక ధైర్యాన్న ఈరోజు నిర్ణయం తీసుకోండి.
(04:19) నేను ఏడ్చే మనిషిని కాదు ఎదిగే మనిషిని నా ప్రాణం వరం, నా కుటుంబం వరం, నాకు ఉన్న ప్రతి అవకాశం ఒక వరం. చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో మీకు సంతోషాన్ని ఇచ్చే మూడు మంచి విషయాలు ఏంటి? ఇప్పుడే ఆలోచించి ఆ మూడు విషయాలను కింద కామెంట్స్ లో చెప్పండి. మీ సమాధానం ఇంకొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. అందరం కలిసి మనకున్న మంచిని లెక్కపెట్టే ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడదాం.
(04:43) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.
(05:08) ఓం ఓం
No comments:
Post a Comment