Wednesday, February 25, 2026

రోజూ 10 నిమిషాలు... దీపాన్ని ఇలా చూస్తే మీ Brainలో జరిగే మ్యాజిక్ ఇదే! 🧠🔥 | Trataka Science

రోజూ 10 నిమిషాలు... దీపాన్ని ఇలా చూస్తే మీ Brainలో జరిగే మ్యాజిక్ ఇదే! 🧠🔥 | Trataka Science

Author Name:Telugu Talks with VRS

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalkswithVRS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wE9pTSGbqGU



Transcript:
(00:00) మీ కనుగుడ్లను ఒక్కసారి అంటే ఒక్కసారి కదలకుండా 10 సెకండ్లు ఆపగలరా ఆ చుక్కనే చూడండి రెప్ప వేయొద్దు కదలిక వద్దు కష్టం కదు మీకు తెలియకుండానే మీ చూపు జారిపోయింది. మీ కళ్ళు మీ మాట వినడం లేదు. ఎందుకంటే మీ కంటికి మీ మెదడుకి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఈరోజు ఆ తెగిపోయిన కనెక్షన్ ని తిరిగి కలిపే ఒక ప్రాచీన విజ్ఞానం గురించి చెప్పబోతున్నాను.
(00:33) వెల్కమ్ టు త్రాటక. ఈరోజు ఈ క్షణం మీ జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? అది మీ ఆఫీస్ పని కాదు మీ అప్పులు కాదు చివరికి మీ బద్ధకం కూడా కాదు. అసలు సమస్య మీ కంటి చాంచల్యం అంటే మీ కళ్ళు ఒక్కచోట కూడా నెలకడగా ఉండలేకపోవడం ఎప్పుడైనా గమనించారా రోజంతా కుర్చీలోనే కూర్చున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మెదడు పిండేసినట్లు ఎందుకు అయిపోతుందో ఎందుకంటే మీ కళ్ళు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు కాబట్టి స్క్రీన్స్ నోటిఫికేషన్స్ రీల్స్ మెసేజెస్ వీటివల్ల ప్రతి ప్రతి నిమిషం మీ కనుగుడ్లు
(01:19) వేలసార్లు కదులుతూనే ఉన్నాయి. కానీ అసలు నష్టం జరుగుతోంది మీ కళ్ళకు కాదు. నేను ఇప్పుడు చెప్పేది వింటే మీరు మీ ఫోన్ వైపు చూడటానికి కూడా భయపడతారు. సైన్స్ ఏం చెప్తోందంటే మీ కంటి కదలికలే మీ మెదడుకు స్టీరింగ్ వీల్ లాంటివి. అంటే మీ కళ్ళు ఎటు తిరిగితే అటు మీ మెదడు పరిగెడుతుంది. కానీ ఈ రోజుల్లో మన కళ్ళు ఏం చేస్తున్నాయి? ఒక కోతిలా గంతులు వేస్తున్నాయి.
(01:51) దానివల్ల మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా ట్రాఫిక్ జామ్ దీనికి అనాదిగా వస్తున్న ఒకే ఒక పరిష్కారం ఉంది. ఇందులో మంత్రాలు లేవు మాయలు లేవు. కేవలం ఒక దీపం దాని ముందు నిశ్చలంగా ఉన్న మీ కళ్ళు దీన్నే యోగశాస్త్రం త్రాటక ధ్యానం అంటుంది. పైకి చూడడానికి ఇది ఆధ్యాత్మికతలా కనిపించవచ్చు. కానీ లోతుగా చూస్తే ఇది మీ బ్రెయిన్ ని రీవైరింగ్ చేసే సత్తా ఉన్న అటెన్షన్ ఇంజనీరింగ్ అసలు త్రాటక అంటే ఏంటి మాయలు చేయడమా గాలిలో తేలడమా ఆ క్లేమ్స్ సంగతి పక్కన పెడితే సైన్స్ మాత్రం ఒక నిజాన్ని ఓపెన్ గా ఒప్పుకుంది.
(02:34) అదేంటంటే త్రాటక అంటే మీ బ్రెయిన్ గేర్ మార్చడం ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా ఊహించుకోండి. మీ బ్రెయిన్ ఒక కారు ఇంజన్ అనుకుందాం. మరి దాన్ని నడిపే స్టీరింగ్ అంటే మీ కళ్ళు ఎలా పనిచేస్తాయో తెలుసా మామూలుగా మీరు ఫోన్ చూస్తున్నప్పుడు మీ కళ్ళు సాకెడ్స్ అనే చిన్న చిన్న కుదుపులు ఇస్తుంటాయి. అంటే మీ కళ్ళు స్టీరింగ్ ని ఒకచోట ఉంచకుండా మీ బ్రెయిన్ ని బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నట్టు కళ్ళు కదిలిన ప్రతిసారి బ్రెయిన్ బ్రేక్ అయ్యాలి క్లచ్ నొక్కాలి మళ్ళీ గేర్ మార్చాలి.
(03:09) దీనివల్ల ఏమవుతుంది మీ మెంటల్ ఫ్యూయల్ తొందరగా ఆవిరైపోతుంది. ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. అందుకే ఏ పని చేయకపోయినా మీకు ఆ మానసిక అలసట వస్తుంది. కానీ త్రాటక చేసే ఆ 10 నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే మీరు ఆ జ్వాలను కదలకుండా చూస్తారో మీ బ్రెయిన్ ట్రాఫిక్ నుంచి హైవే మీదకి ఎక్కుతుంది. అక్కడ బ్రేకులు లేవు మలుపులు లేవు కేవలం ఒకే ఒక్క స్మూత్ జర్నీ సైన్స్ భాషలో చెప్పానంటే మీరు కంటి కదలికను ఆపినప్పుడు మెదడులోని ఫ్రాంటల్ ఐ ఫీల్డ్స్ అనే సర్క్యూట్ రిలాక్స్ అవుతుంది.
(03:50) బ్రెయిన్ కి ఒక క్లియర్ సిగ్నల్ వెళ్తుంది. బాస్ ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. మనం దేన్ని వెతకాల్సిన పని లేదు. ఆ ఒక్క సిగ్నల్ చాలు మీ మెదడువాడే ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది. ఆ మిగిలిన ఎనర్జీయే మీకు ఫోకస్ లాగా మారుతుంది. కానీ ఆగండి కేవలం కళ్ళు ఆపినంత మాత్రాన సరిపోదు. అసలు మ్యాజిక్ కళ్ళలో లేదు. మీ లోపల రన్ అవుతున్న ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రాం్ లో ఉంది.
(04:17) అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. మీ మెథడులో డఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒక వ్యవస్థ ఉంటుంది. దీని పేరేదో టెక్నికల్ గా ఉంది కానీ దీన్ని సింపుల్ గా ఓపెన్ గా ఉన్న బ్రౌజర్ టాబ్స్ అనుకోండి. మీరు ఏ పని చేయకపోయినా మీ బ్యాక్గ్రౌండ్ లో ఇవి రన్ అవుతూనే ఉంటాయి. నిన్న వాడు నన్ను ఎందుకు తిట్టాడు అనే టాబ్ రేపు ఈ అమ్మాయి ఎలా కట్టాలి అనే టాబ్ నా జీవితం ఎటు పోతోంది అనే టాబ్ ఇలా వందల టాబ్స్ ఓపెన్ అయ్యి మీ మెదడును స్లో చేసేస్తుంటాయి.
(04:50) దీన్నే మనం ఓవర్ థింకింగ్ లేదా మెంటల్ నాయిస్ అంటాం. కానీ ఎప్పుడైతే మీ చూపు ఆ దీపం జ్వాల మీద లాక్ అవుతుందో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ జ్వాలలోని కదలిక ఆ వెలుగు మీ కళ్ళను ఎంతగా కట్టిపడేస్తాయి అంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఆ అనవసరమైన టాబ్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తుంది. మీ లోపలి గొడవ తగ్గుతుంది. మీతో మీరు మాట్లాడుకోవడం ఆగిపోతుంది.
(05:16) గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లే టైం మెషీన్ ఆగిపోతుంది. ఋషులు దీన్నే ఏకాగ్రత అన్నారు. ఈనాటి సైంటిస్టులు దీన్నే ఫ్లో స్టేట్ అంటున్నారు. పేరుఏదైనా సరే ఆ అనుభవం మాత్రం ఒకటే పరమ నిశశబ్దం సైన్స్ దీన్ని ఇంకా లోతుగా విశ్లేషించింది. మీ మెదడు మధ్యలో థలామస్ అనే ఒక భాగం ఉంటుంది. ఇది మీ ఇంటికి ఉండే వాచ్ మన్ లాంటిది.
(05:48) మామూలుగా ఈ వాచ్మన్ కంటికి కనిపించే ప్రతి చిన్న విషయాన్ని లోపలికి రానిస్తాడు. అందుకే మీకు ఏకాగ్రత కుదరదు. కానీ త్రాటక సాధనలో ఈ వాచ్మన్ గేట్లు మూసేస్తాడు. ఎంతలా అంటే మీ పక్కన ఎవరైనా నడిచినా సరే ఆ ఇన్ఫర్మేషన్ మీ మెదడుకు చేరదు. యోగులు దీన్నే ప్రత్యాహార అంటారు. అంటే ఇంద్రియాలను లోపలికి లాక్కోవడం మీరు కళ్ళు తెరిచే ఉంటారు కానీ ప్రపంచం మ్యూట్ అయిపోతుంది.
(06:18) దీన్ని ప్రూవ్ చేయడానికి యూనివర్సిటీ ల్యాబ్స్ లో ఈఈజి మెషిన్ పెట్టి చూశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే త్రాటక చేసేటప్పుడు మెదడులో ఆల్ఫా వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల గాఢ నిద్రలో ఉండే ప్రశాంతతను మీరు కళ్ళు తెరిచే అనుభవిస్తారు. మీకు ఒక ప్రాక్టికల్ డౌట్ రావచ్చు అసలు దీపమే ఎందుకు గోడ మీద చుక్క పెట్టొచ్చు కదా అని దీనికి సమాధానం మీ కళ్ళలో లేదు మానవ పరిణామ క్రమంలో ఉంది.
(06:49) లక్షలే క్రితం చిమ్మ చీకటి నిండిన అరణ్యంలో మనిషిని మృగాల నుంచి కాపాడింది ఒకటే అగ్ని ఆ మంట నుంచి వచ్చే వేడి ఆ వెలుగు ఆ మనిషి చుట్టూ ఒక లక్ష్మణ రేఖలా పనిచేస్తూ క్రూరమృగాలను దూరంగా ఉంచేది. అందుకే ఆ మంట వైపు చూస్తున్నంతసేపు ఆదిమ మానవుడి మెదడులో ఒకే ఒక్క సిగ్నల్ వెలుగుతుండేది. నేను సేఫ్ యుగాలు మారాయి. కానీ ఆ భద్రతా భావం మన జీన్స్ లో ఒక బయో ఇన్స్టింట్ గా ముద్రించుకుపోయింది.
(07:21) ఇప్పుడు చెప్పండి గోడ మీద పెట్టిన చుక్క మీ ఏకాగ్రతను ఎక్కువసేపు ఎలా నిలిపి ఉంచగలదు? దానికి మీ బ్రెయిన్ కి ఎలాంటి ఎవల్యూషనరీ హిస్టరీ లేదు. కానీ ఆ జ్వాల అది మీ లోపల నిద్రపోతున్న ఒక ఏన్షియంట్ కోడ్ ని తట్టి లేపుతుంది. మీ బ్రెయిన్ కి ఒక క్లియర్ లాజిక్ తెలుసు అగ్ని ఉంటే రక్షణ ఉన్నట్టే రక్షణ ఉంటే భయం లేదు. భయం లేకపోతే మిగిలేది నిశశబ్దమే.
(07:52) ఈ ఒక్క కారణం వల్లే మీరు త్రాటక చేస్తున్నప్పుడు ఆ దీపం మిమ్మల్ని అప్రయత్నంగా తనలో లీనం చేసుకుంటుంది. అయితే ఆ స్థితికి చేరుకోవడం అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి మొదటి రెండు నిమిషాలు నరకంలా అనిపించొచ్చు. కళ్ళలో నీళ్లు కారుతాయి. కనురెప్పలు బరువుగా మారుతాయి. అయినా వదిలేయకండి. అది మీ కళ్ళు చేస్తున్న శుభ్రత మాత్రమే. ఆ తర్వాత జరిగేదే అసలైన మ్యాజిక్ అకస్మాత్తుగా ఆ జ్వాల తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారిపోతుంది.
(08:25) మీకు ఆ దీపం తప్ప ఇంకేమీ కనిపించదు. మీ చెవులకు శబ్దాలు వినిపిస్తున్న అవి మిమ్మల్ని తాకవు. ఆ క్షణంలో మీరు కేవలం చూడటం లేదు. మీరు ఆ కాంతితో కలిసిపోతున్నారు. సరే ఇదంతా మెదడు లోపల. మరి శరీరం సంగతి ఏంటి? కేవలం ఐదు నిమిషాల తర్వాత మీ గుండె వేగం ఎలా మారుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ శరీరం గురించి ఒక చేదు నిజం చెప్పమంటారా మీరు రోజులో 90% సమయం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటున్నారు.
(08:57) అంటే ఏదో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు మీ నరాలు బిగుసుకుపోయి కండరాలు టైట్ గా మారిపోయి ఉంటాయి. టెక్నికల్ గా చెప్పాలంటే మీ బాడీ ప్రస్తుతం హ్యాంగ్ అయిపోయింది అంటారు. మీ ఫోన్ ఎప్పుడైనా బాగా హ్యాంగ్ అయితే ఏం చేస్తారు మొత్తం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు. దాన్నే రీబూట్ అంటాం. సరిగ్గా త్రాటక చేసే పని కూడా అదే.
(09:20) ఇది మీ నాడీ వ్యవస్థకు ఒక రీబూట్ బటన్ లాంటిది. ఎప్పుడైతే మీ కళ్ళు నిశ్చలంగా మారుతాయో మీ మెదడు మీ శరీరానికి ఒక సీక్రెట్ కోడ్ పంపిస్తుంది. ఆల్ ఇస్ వెల్ యుద్ధం అయిపోయింది. ఇక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. వెంటనే ఏం జరుగుతుందో తెలుసా మీ గుండె వేగం నెమ్మదిస్తుంది. మీ శ్వాస పొట్ట లోతుల్లోనుంచి లయబద్ధంగా మారుతుంది. మీ కండరాల్లో ఉన్న టెన్షన్ మంచులా కరిగిపోతుంది.
(09:49) దీన్నే సైన్స్ పారాసింపథటిక్ యాక్టివేషన్ అంటుంది. యోగులు నిశ్చల తత్వం అంటారు. పేరు ఏదైనా సత్యం మాత్రం ఒక్కటే. నిశ్చలమైన దృష్టి నిశ్చలమైన మనస్సును సృష్టిస్తుంది. ఇదంతా చేస్తే నాకేంటి లాభం? నా జీతం పెరుగుతుందా నా సమస్యలు పోతాయా నేరుగా చెప్తున్నాను త్రాటక మీ సమస్యలను మాయం చేయదు కానీ ఆ సమస్యలను ఛేదించే మీ పదునుని పెంచుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఫిజిక్స్ లాజిక్ చాలు ఒక 100 వాట్ల బల్బ్ తీసుకోండి.
(10:24) అది కాంతిని గదంతా వెదజల్లుతుంది. అందుకే అది కేవలం వెలుగుని మాత్రమే ఇవ్వగలదు. కానీ అదే 100 వాట్ల కాంతిని ఒకే బిందువు మీద కేంద్రీకరిస్తే ఏమవుతుంది? అది లేజర్ అవుతుంది. ఆ లేజర్ ఇనుముని కూడా వెన్నలా కోసేస్తుంది. మీ మనసు కూడా అంతే ఇప్పుడు మీ మనసు ఆ బల్బ్ లాగా ఉంది. మీ ఎనర్జీ అంతా సోషల్ మీడియా రీల్స్ పనికిరాని ఆలోచనల వైపు వృధాగా పోతుంది.
(10:50) మీ దగ్గర శక్తి ఉంది కానీ దానికి దిశ లేదు. త్రాటక సాధన ఆ చెదిరిన శక్తిని ఒక పవర్ఫుల్ లేజర్ లా మారుస్తుంది. అప్పుడు చూడండి మ్యాజిక్ మీరు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు పక్కకు చూడరు. ఎవరైనా మిమ్మల్ని ప్రవోక్ చేసినా మీరు తొనకరు. అంతేకాదు క్లిష్టమైన సమస్య కూడా మీకు చాలా స్పష్టంగా పరిష్కరించగలిగేలా కనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల స్టూడెంట్స్ కి జాబ్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన లాభం ఉంది.
(11:19) సైన్స్ ప్రకారం ఇది మీ వర్కింగ్ మెమొరీని పెంచుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ బ్రెయిన్ కి రామ్ లాంటిది. ఇందులోనే మీరు చదివిన సబ్జెక్టులు ఆఫీస్ టాస్కులు అన్నీ టెంపరరీగా స్టోర్ అవుతాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వాటితో పాటు రోజంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే నోటిఫికేషన్లు ఆందోళనలు పనికిరాని ఆలోచనలు కూడా అదే రామ్ లో స్పేస్ ఆక్రమిస్తాయి.
(11:43) అలా స్టోరేజ్ నిండిపోయినప్పుడు జరిగేది ఇదే. ఒక గదిలోకి వెళ్తారు అరే ఇక్కడికి ఎందుకు వచ్చాను అని మైండ్ బ్లాంక్ అయిపోతుంది. లేదా పేజీ తిప్పగానే వెనక పేజీలో ఏముందో మర్చిపోతారు. లేదా చేతిలో ఉన్న ఫైల్ ని ఎక్కడో పెట్టి గంటల సేపు వెతుకుతారు. దీనికి కారణం మీ మతిమరుపు కాదు మీ రామ్ ఆ జంక్ ఫైల్స్ తో ఓవర్లోడ్ అయిపోవడమే. త్రాటక ఆ అనవసరమైన చెత్తను క్లీన్ చేసి మీ రామ్ ని ఖాళీ చేస్తుంది.
(12:10) ఎప్పుడైతే స్పేస్ ఖాళీ అవుతుందో ఆ తర్వాత మీరు చదివిన సబ్జెక్ట్ అయినా బాస్ చెప్పిన పనైనా ఫెవికాల్ వేసినట్టు బ్రెయిన్ లో అతుక్కుపోతుంది. అందుకే మెమరీని పెంచడంలో ఇదొక అల్టిమేట్ టెక్నిక్ కానీ అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇది మీ భయాన్ని కూడా చంపేస్తుంది. పురాణాల్లో యోగులు అభయ గురించి మాట్లాడారు. మృత్యువు ఎదురొచ్చినా సరే నా కనురెప్ప వాలదు అని ఇది వినడానికి మీకు ఓవర్ గా అనిపించొచ్చు.
(12:40) కానీ మోడర్న్ సైన్స్ ఈ మాటలో ఎంత నిజం ఉందో టెస్ట్ చేసింది. మనిషి భయపడినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో రికార్డ్ చేసే బయో సెన్సార్లు పెట్టి మరీ చూశారు. ఆ రిజల్ట్ చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. మామూలు మనిషి భయపడితే అతని గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది. కానీ త్రాటక చేసే వారి గుండె భయంకరమైన తుఫాన్లో కూడా సముద్రం అడుగున ఉండే నిశబ్దంలా లయబద్ధంగా కొట్టుకుంది.
(13:09) దీని అర్థం వాళ్ళకి భయం లేదని కాదు ఆ భయం వాళ్ళని కంట్రోల్ చేయలేదని భయం అనేది మనిషి సహజ లక్షణం కానీ త్రాటక సాధన చేసిన వాడికి ఆ భయాన్ని చూస్తూ కూడా ప్రశాంతంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తి వస్తుంది. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు స్థిత ప్రజ్ఞత అన్నాడు. గుర్తుపెట్టుకోండి ఎవరు తమ చూపును జయిస్తారో ఈ ప్రపంచం వారికి దాసోహం అవుతుంది.
(13:37) ఇవి సూపర్ పవర్స్ కాదు ఒకప్పుడు ప్రతి మనిషికి ఉండే సహజ లక్షణాలు మనం వాటిని మర్చిపోయామ అంతే మరి దీన్ని సురక్షితంగా ఎలా ప్రాక్టీస్ చేయాలిగూగు లో వెతికితే మీకు దీపాన్ని చూడండి అని చెప్తారు. కానీ ఎలా చూడాలో ఎవ్వరు చెప్పరు. ఆ చిన్న సీక్రెట్ తెలియకపోతే మీకు కంటి నొప్పులు వస్తాయి తప్ప ఎలాంటి లాభం ఉండదు. అందుకే దీన్ని ఆచరించాల్సిన సరైన విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
(14:01) దీనికి రెండు అద్భుతమైన సమయాలు ఉన్నాయి. మొదటిది రాత్రి పడుకునే ముందు రోజంతా మీ బ్రెయిన్ లో పోగైన చెత్తనంతా ఇది క్లియర్ చేసేస్తుంది. దీంతో మీ నిద్ర కూడా ఒక ధ్యానంలా మారుతుంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మీ మెదడు బరువు దించుకున్నంత తేలికగా అప్పుడే విరిసిన పువ్వులా ఫ్రెష్ గా ఉంటుంది. రెండవది ఉదయం పూట. మీరు ఫ్రెష్ అయ్యాక లేదా ఆఫీస్ కో కాలేజ్ కో వెళ్ళే ముందు ఇది చేస్తే ఆ రోజంతా మీ ఫోకస్ లేజర్ లా ఉంటుంది.
(14:33) సో రాత్రి చేస్తే నిద్ర బాగుంటుంది. ఉదయం చేస్తే రోజు బాగుంటుంది. ఛాయిస్ మీది లేదు నాకు ఈ రెండు ఫలితాలు కావాలి అనుకుంటే మీ సాధనని రెండుగా విభజించండి. ఉదయం ఒక 10 నిమిషాలు ఫోకస్ కోసం రాత్రి ఒక 10 నిమిషాలు ప్రశాంతత కోసం చేయండి. దీనివల్ల అటు లేజర్ షార్ప్ మైండ్ ఇటు డీప్ స్లీప్ రెండు మీ సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి మీరు ఏ టైంలో చేసినా మీ బ్రెయిన్ పవర్ పెరగడం ఖాయం.
(15:01) కానీ భోజనం చేసిన వెంటనే దీన్ని ప్రయత్నించకండి. తిన్న తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి పొట్ట తేలికగా ఉన్నప్పుడే ఇది చేయండి. ఎప్పుడు చేసినా గదిలో చిమ్మ చీకటి ఉండేలా చూసుకోండి. అలాగే ఫ్యాన్ వేయకండి. కిటికీలు మూసేయండి. ఎందుకంటే గాలికి దీపం కదిలితే మీ ఏకాగ్రత కూడా కదిలిపోతుంది. ఆ మంట నిశ్చలంగా ఉండాలి. ఇక పద్ధతి విషయానికి వస్తే ముందుగా సుఖాసనంలో గాని కుర్చీలో గాని మీకు సౌకర్యంగా ఉండేలా కూర్చోండి.
(15:28) ఎక్కడ కూర్చున్నా మీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండేలా చూసుకోండి. ఇక ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలి? చాలా మంది పొరపాటు చేసేది ఇక్కడే. అందుకే మన యోగులు రెండు విషయాల్లో ఖచ్చితమైన నియమాలు పెట్టారు. మొదటిది దూరం మీకు ఆ దీపానికి మధ్య ఖచ్చితంగా ఒక చేయి చాచినంత దూరం ఉండాలి. రెండవది ఎత్తు ఆ దీపం వత్తి సరిగ్గా మీ కంటి లెవెల్ లో ఉండాలి.
(15:56) లేదా మీ కంటి కంటే ఓ అంగుళం కింద ఉన్నా పర్లేదు. ఎందుకంటే దీపం మరీ ఎత్తులో ఉంటే తలనొప్పి వస్తుంది. మరీ కింద ఉంటే మెడ నరాలు పట్టేస్తాయి. అందుకే దాన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. మీకు కళ్ళద్దాలు ఉంటే దయచేసి వాటిని తీసేసి సాధన చేయండి. ఇక అసలు విషయానికి వస్తే దీపాన్ని చూడమన్నాం కదా అని ఏదో యుద్ధం చేస్తున్నట్టు సీరియస్ గా చూడకండి. మీ కనురెప్పల్ని పూర్తిగా వదిలేసి ఒక పసిపాపని తల్లి ఎంత ప్రేమగా చూస్తుందో అంత సాఫ్ట్ గా ఆ జ్వాలని చూడండి.
(16:25) వత్తికి కొంచెం పైన ఎక్కడైతే మంట అత్యంత కాంతివంతంగా ఉంటుందో అక్కడ మీ చూపుని నిలపండి. అప్పుడే కళ్ళలో అనవసరమైన మంట రాకుండా మీరు ఎక్కువ సేపు నిలకడగా చూడగలరు. మీ కళ్ళలో నీళ్లు వచ్చినా అలసిపోయినా వెంటనే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసిన మరుక్షణం మీ కనుబ్రహ్మల మధ్యలో ఆ జ్వాల వెలుగుతూనే కనిపిస్తుంది. దాన్నే గమనిస్తూ ఉండండి.
(16:49) అది మెల్లగా మసకబారి మాయమైపోతుంది. అప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ దీపాన్ని చూడండి. ఇలా ఆ 10 నిమిషాల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ నెయ్యి దీపమా కొవ్వొత్తా అని దీనికి సమాధానం నా సొంత అనుభవంతోనే చెప్తాను. నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇంటి బయట కూర్చుని చదువుకునేవాడిని కానీ సమస్య ఏంటంటే దారిన పోయే జనాల్ని చూడకుండా నా కళ్ళు ఉండేవి కావు వాళ్ళని గమనించడం ట్రాక్ చేయడం ఇలా నా బ్రెయిన్ అనవసరమైన డేటాని ప్రాసెస్ చేసి 10 నిమిషాలకే హ్యాంగ్ అయిపోయేది.
(17:23) తీరా ఇంట్లోకి వచ్చి చదువుదాం అన్నా ఆ మానసిక అలసట వల్ల పేజీలు తిప్పడమే తప్ప బుర్రకఎక్కేది కాదు. అప్పుడే నేను లైబ్రరీలో ఈ త్రాటక గురించి చదివాను. అందులో ఆవు నెయ్యి శ్రేష్టం అని ఉంది. కానీ అప్పట్లో నాకు నెయ్యి కొనే స్తోమక లేదు. నా దగ్గర ఉన్న ఆప్షన్ ఒక్కటే కొవ్వొత్తి ఏదైతే అది అయిందని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ కొవ్వొత్తి జ్వాల నా కంటి చాంచల్యాన్ని కంట్రోల్ చేసింది. నా ఫోకస్ మారిపోయింది.
(17:49) సో ఫ్రెండ్స్ నా అనుభవం మోడర్న్ సైన్స్ చెప్పేది ఒక్కటే ఎన్నో సైంటిఫిక్ టెస్టుల్లో కూడా కేవలం కొవ్వత్తితోనే ఫోకస్ మెమరీ పవర్ పెరుగుతుందని ఆందోళన తగ్గుతుందని స్పష్టంగా రుజువైంది. కాబట్టి నెయ్యి లేదు అని ఆగకండి కొవ్వత్తితో మొదలు పెట్టండి. మనకు కావలసింది ఇంధనం కాదు జ్వాల. ఇప్పుడు మీకుొక యోగుల రహస్యం చెప్తాను జాగ్రత్తగా వినండి.
(18:13) బాహ్య త్రాటక చేయడం అనేది కేవలం ఫోకస్ ని పోగు చేసుకోవడం లాంటిది. అంతర్త్రాటక చేయడం అనేది ఆ శక్తిని బ్రెయిన్ లోకి ఎక్కించుకోవడం లాంటిది. మనం బాహ్య త్రాటక చేసి వదిలేస్తే అది అన్నం వండి తినకుండా పారేసినట్టే కళ్ళు మూసుకున్నప్పుడే అసలైన న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది. మీరు కళ్ళు మూసుకున్నాక ఆ జ్వాల తాలూకు ముద్ర ఎంతసేపు నిలిచి ఉంటే మీ బ్రెయిన్ రీవైరింగ్ అంత బలంగా అంత శాశ్వతంగా జరుగుతుంది.
(18:42) అందుకే ఆ లోపలి వెలుగుని మాయమయ్యేదాకా వదలద్దు. సాధన అయిపోయాక మీ రెండు అరచేతుల్ని బాగా రుద్ది ఆ వేడిని మీ కళ్ళపై పెట్టుకోండి. కంటి నరాలు రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా సాధన అవ్వగానే వెంటనే ఫోన్ చూడకండి. ఆ ప్రశాంతతని కాసేపు ఆస్వాదించండి. మీకో సందేహం రావచ్చు. రోజుకి 24 గంటలు ఉంటే కేవలం 20 నిమిషాలు చేస్తే సరిపోతుందా? మిగతా టైంలో నా బ్రెయిన్ మళ్ళీ కోతి అయిపోదా? అని.
(19:08) దీనికి సమాధానం జిమ్ ఉదాహరణలో ఉంది. మీరు జిమ్ లో గంట సేపు బరువులెత్తారు అనుకోండి. ఆ బలం ఆ రోజంతా మీ బాడీలో ఉంటుంది కదా సరిగ్గా ఇక్కడ కూడా అంతే త్రాటక అనేది మెదడుకి జిమ్ ఉదయం చేసిన ఆ 20 నిమిషాల ఫోకస్ రోజంతా మీ మెదడుని స్టేబుల్ గా ఉంచుతుంది. బయట ట్రాఫిక్ జామ్ ఉన్నా మీ లోపల మాత్రం క్లియర్ గా ఉంటుంది. అయితే కొత్తలో ఒకేసారి 20 నిమిషాలు చేయడం కష్టంగా అనిపించొచ్చు.
(19:36) అలాంటప్పుడు కేవలం ఐదు నుంచి 10 నిమిషాలతో మొదలు పెట్టండి. జిమ్ లో బరువులు మెల్లగా పెంచినట్టే ఇక్కడ కూడా మీ కెపాసిటీని బట్టి టైం పెంచుకుంటూ వెళ్ళండి. నిలకడ ముఖ్యం తొందరపాటు కాదు. నాది గ్యారెంటీ దీనికి సంవత్సరాలు అక్కర్లేదు కేవలం 21 రోజులు ఈరోజు రాత్రి మొదలు పెట్టండి. 21వ రోజు మీ పాత వర్షన్ కి కొత్త వర్షన్ కి ఉన్న తేడా చూసి మీరే షాక్ అవుతారు.
(20:00) ఆ రిజల్ట్ చూశక ఇక మీరే దీన్ని లైఫ్ లాంగ్ వదలరు. ఇక చివరిగా ఈ 21 రోజుల సాధన తర్వాత మీలో జరిగే అతి ముఖ్యమైన మార్పు గురించి చెప్పాలి. రోజు ఫోన్లు సిస్టమ్స్ చూసి అలసిపోయిన మీ కళ్ళకు ఈ సాధన అమృతంలా పనిచేస్తుంది. ఆ జ్వాల వైపు చూస్తున్నప్పుడు కారిపోయే కన్నీళ్లతో పాటే కంటిలో పేరుకుపోయిన వేడి మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల మీ కళ్ళు కాంతివంతంగా ఆకర్షణీయంగా మారడమే కాదు మీ చూపులో ఒక తెలియని స్పష్టత వస్తుంది.
(20:32) కానీ ఈ మార్పు కేవలం బయట కళ్ళకే కాదు యోగశాస్త్రం ప్రకారం త్రాటక అనేది కేవలం కంటి వ్యాయామం కాదు ఇది ధ్యానానికి తొలిమెట్టు ఎప్పుడైతే మీ చూపు నిలకడగా మారుతుందో అప్పుడే మీ ప్రయాణం మీ లోపలికి మొదలవుతుంది. ఆ నిశశబ్దంలోనే మీరు మీ నిజమైన శక్తిని కలుసుకుంటారు. సో ఈరోజే ఆ దీపాన్ని వెలిగించండి. చూపుని గెలవండి, ప్రపంచాన్ని గెలవండి.
(20:57) మీరు సిద్ధంగా ఉంటే కింద డే వన్ అని కామెంట్ చేసి ఈ 21 రోజుల ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. మీ లైఫ్ మారబోతోంది. నమస్తే.

No comments:

Post a Comment