రమణ మహర్షి చెప్పిన రహస్యం | Secret to Control Your Wandering Mind | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xlxmGdAJj20
Transcript:
(00:00) మీరు ప్రశాంతంగా కూర్చున్నా కూడా మీ మనసు ఇంకా ఎందుకు బాధపడుతుంది బయట అంత నిశశబ్దంగా ఉన్నా చుట్టూ అసలు చప్పుడు లేకపోయినా మీ లోపల మాత్రం ఏదో గందరగోళం నిరంతరం ఆలోచనల యుద్ధం ఏదో సాధించాలనే తపన కంటే ఏదో కోల్పోతున్నామ అనే భయం మన బాడీని రెస్ట్ మోడ్ లో పెట్టినప్పుడు కూడా మన బ్రెయిన్ మాత్రం హై స్పీడ్ లో పరిగెడుతూనే ఉంటుంది.
(00:24) అసలు ఈ మెంటల్ నాయిస్ అంటే ఏంటో తెలుసా మీరు ఒక మూవీ చూస్తున్నప్పుడు కూడా పక్కన ఎవరో మొరుగుతున్నట్లు ఒక పని చేస్తున్నప్పుడు మరేదో గుర్తొస్తున్నట్లు ఒక రకమైన అశాంతి గతాన్ని తలుచుకొని బాధపడటం లేదా భవిష్యత్తు గురించి ఊహించుకొని భయపడటం ఈ రెండిటి మధ్యలో ప్రస్తుతం అనేది మీరు మిస్ అయిపోతున్నారు. మనం మన కంట్రోల్ లో లేము మన ఆలోచనలే మనల్ని శాసిస్తున్నాయి.
(00:45) ఇది ఏదో ఒక రోజు వచ్చే సమస్య కాదు ప్రతిరోజు మనల్ని లోపల నుంచి తినేస్తున్న ఒక సైలెంట్ వైరస్ మీరు గమనించారా రాత్రి పడుకున్నాక కూడా కళ్ళు మూసుకుంటే ఆలోచనల జాతర మొదలవుతుంది. ఈ నిరంతర హోరు మనల్ని మనం కలుసుకోనివ్వడం లేదు. ఈ సమస్య అంతా ప్రమాదకారం ఎందుకు మారుతుందంటే ఇది కేవలం ఆలోచనలతో ఆగిపోదు. ఈ మెంటల్ నాయిస్ వల్ల మీ నిద్ర కరువవుతుంది.
(01:09) నిద్ర లేకపోతే చిరాకు చిరాకు వల్ల ఏకాగ్రత లోపించడం దాని వల్ల పనిలో ఫెయిల్ అవ్వడం ఇలా ఇదొక విషవలయంలా మారిపోతుంది. తెలియని ఆందోళన అంటే యంజైటీ మన జీవితాన్ని నరకం చేస్తుంది. మనం ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాం ఎందుకంటే మనం మన ఇంద్రియాలకి అంతు లేని పని ఇస్తున్నాం. పొద్దున లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్ పనికి రాని రీల్స్ ఎవరో ఎక్కడో వేసిన ఫోటోస్ మనకి సంబంధం లేని వార్తలు ఇవన్నీ మన మెదడులోకి చెత్తలా పేరుకుపోతున్నాయి.
(01:35) మన మనసు ఒక స్పాంజ్ లాంటిది. చుట్టూ ఉన్న ప్రతి నెగిటివిటీని అది పీల్చేసుకుంటుంది. అందుకే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ పీల్చుకున్న చెత్తంతా బయటకి రావాలని అరుస్తూ ఉంటుంది. మనం వస్తువులకి వ్యక్తులకి సోషల్ మీడియాకి ఎంతగా బానిసం అయిపోయామంటే ఒక్క నిమిషం మనతో మనం ఉండలేకపోతున్నాం. ఈ డిస్ట్రాక్షన్ే మన అసలైన శత్రువు మనసు ఎప్పుడు ఏదో ఒక స్టిములేషన్ కోరుకుంటుంది.
(01:57) అది దొరకనప్పుడు అశాంతికి లోన అవుతుంది. దీనికి ఒకటే మార్గం ఇంద్రియ నిగ్రహం ఇది వినడానికి పాతకాలం మాటలు ఉండొచ్చు కానీ ఇది అల్టిమేట్ సొల్యూషన్ మన కళ్ళు, చెవులు, నోరు ఇవే మన మనసులోకి సమాచారాన్ని తీసుకెళ్లే దారులు. వీటిని మనం కంట్రోల్ చేయాలి. బయట వస్తువులను చూసి టెంప్ట్ అవ్వడం, వ్యక్తుల గురించి అనవసరంగా చర్చించడం, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం తగ్గించాలి.
(02:20) మీరు ఎంత తక్కువగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతారో అంత ఎక్కువగా మీ లోపల ప్రపంచంతో కనెక్ట్ అవుతారు. మనసు అనేది ఒక మొరిగే కుక్క లాంటిది. అది మొరుగుతున్నప్పుడు దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అది ఇంకా గట్టిగా అరుస్తుంది. దానికి బదులు దాన్ని పట్టించుకోవడం మానేయండి. మీ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటితో యుద్ధం చేయకండి. జస్ట్ వాటిని గమనించండి.
(02:40) ఓహో నా మనసు ఇప్పుడు ఇలా ఆలోచిస్తుందా? సరే ఆలోచించనివ్వు అని చెప్పేసి వదిలేయండి. మీరు రియాక్ట్ అవ్వనప్పుడు మీ మనసు మెల్లగా అలసిపోతుంది. ఆ అలసిపోయిన స్థితిలోనే మౌనం పడుతుంది. మీరు ఎంత నిశశబ్దంగా ఉంటే మీ ఆలోచనలు అంత పదునుగా మారుతాయి. రియాక్ట్ మోడ్ ని అబ్జర్వేషన్ మోడ్ లోకి మారడమే అసలైన విషయం. ఇప్పుడు ఈ మార్పుకి ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం.
(03:05) రోజుకి కనీసం 15 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. ఈ 15 నిమిషాలు మీ దగ్గర ఫోన్ ఉండకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు. కనీసం పుస్తకం కూడా చదవకూడదు కేవలం ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి శ్వాస లోపలికి వెళ్ళడం బయటికి రావడం దీన్నే ఫోకస్ చేయండి మధ్యలో మనసు వేరే ఎక్కడికో వెళ్తుంది పర్లేదు మళ్ళీ నెమ్మదిగా శ్వాస మీద తీసుకురండి దీన్ని ఒక డిజిటల్ డీటాక్సిన్ లాగా భావించండి వారంలో ఒక గంట అయినా అన్నిటికీ దూరంగా మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి.
(03:36) మీరు చూసే కంటెంట్ ని ఫిల్టర్ చేయండి. మీ మనసులోకి వెళ్లే ప్రతి ఆలోచన మీ పర్మిషన్ తోనే వెళ్ళాలి. అనవసరమైన వ్యక్తులు అనవసరమైన గొడవలకి దూరంగా ఉంటే సగం మెంటల్ నాయిస్ తగ్గుతుంది. గుర్తుంచుకోండి ప్రపంచాన్ని గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలవడం మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా గొప్ప విషయం. ఈ క్షణం నుంచి ఈ నిమిషం నుంచే మీ ఆలోచనలకి మీరే యజమాని అవ్వండి.
(03:58) రేపటి కోసం వేచి చూడకండి. మార్పు ఇప్పుడే మొదలవ్వాలి. మీ మనసు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా లేక మీరు మీ మనసుని కంట్రోల్ చేస్తున్నారా? మీ లైఫ్ లో మీరు ఎదుర్కుంటున్న అతి పెద్ద డిస్ట్రాక్షన్ ఏంటో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ యుద్ధంలో గెలవడానికి రెడీగా ఉన్నారో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.
(04:18) ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఓం
No comments:
Post a Comment