Wednesday, February 25, 2026

నీమ్ కరోలి బాబా చూపిన అద్భుత మార్గం | The Path to Ultimate Spiritual Freedom | Satyagrahi

నీమ్ కరోలి బాబా చూపిన అద్భుత మార్గం | The Path to Ultimate Spiritual Freedom | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hPkNhDp8lsE



Transcript:
(00:00) నేను ఏమీ కాదు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకొని చూడండి. మీ జీవితంలో 90% సమస్యలు అక్కడితోనే ఆగిపోతాయి. వినడానికి కొంచెం వింతగా ఉందా లోకమంతా నువ్వు తోపు నువ్వు తురుము అని మనుషుల్లో ఉండే గొప్పతనం గురించి పుస్తకాలు చెప్తూఉంటాయి కదా కాకపోతే నేనేంటంటే మిమ్మల్ని మీరు జీరో అనుకోండి అని చెప్పేసి అంటూ ఉంటంటే ఆలోచిస్తున్నారా అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
(00:23) ఈరోజు మనందరం ఎదుర్కుంటున్న అతి పెద్ద జబ్బు ఏంటి నేను అనే భ్రమ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకంటే మన ఈగోనే ముందు వెళ్తుంది. ఆఫీస్ లో బాస్ ఏమని అంటే ఈగో ఇంట్లో భార్య లేదా భర్త ఏదనా అంటే ఈగో ఫ్రెండ్ మధ్యలో మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఈగో ప్రతి చిన్న విషయానికి మనం హర్ట్ అయిపోతున్నాం. ఎందుకో తెలుసా మనం మనల్ని ఒక పెద్ద విగ్రహంలో ఊహించుకుంటున్నాం.
(00:43) ఆ విగ్రహానికి చిన్న గీత పడినా తట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తమను తాము గొప్పగా చూపించుకోవాలని చెప్పేసి తాపత్రయ పడతారు. తప్పులేదు. నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఐఫోన్ ఉంది, నేను ఇంత సక్సెస్ అయ్యాను. ఇలా మనల్ని మనం ఒక బ్రాండ్ లా మార్చేసుకుంటున్నాం. కానీ నిజం చెప్పమంటారా ఈ పరుగు పంద్యంలో మనం మనల్ని కోల్పోతున్నాం.
(01:04) నీ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం నువ్వు పడే తాపత్రాయం నిన్ను [సంగీతం] ఎప్పుడూ టెన్షన్ లోకి నెట్టేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు సంథింగ్ కావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాం. ఆ సంథింగ్నెస్ అనేది అవ్వనప్పుడు ఏం జరుగుతుంది? మనం టెన్షన్ అయిపోతూ ఉంటాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఈ ఈగో అనే సమస్య ఊరికే రాదు. మన చుట్టూ ఉన్న సమాజం మన పెంపకం నుంచి వస్తుంది.
(01:23) చిన్నప్పటి నుంచి మనల్ని ఇతరులతో పోలుస్తూనే ఉంటారు. వాడు ఫస్ట్ వచ్చాడు వీడు సెటిల్ అయ్యాడు. ఇలా మనల్ని కంపారిజన్ తో పెంచుతూనే ఉన్నారు. అంటే పోటీ ప్రపంచం వల్ల. సో ఈ పోటీల వల్ల మనలో ఒక భయం మొదలవుతుంది. నేను వాడికంటే గొప్పగా లేకపోతే ఈ లోకం నన్ను ఏమనుకుంటుందో అని చెప్పేసి అప్పుడే నిమ్ కరోలిీ బాబాగారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు.
(01:47) నువ్వు నీ అస్తిత్వాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంతగా దుఃఖానికి గురవుతావు అని బాబాగారు ఏం చెప్పారో తెలుసా మన ఈగో అనేది ఒక జైలు లాంటిది. మనం ఆ జైలు లోపల ఉండి బయట ప్రపంచాన్ని చూస్తూ అది మన అస్తిత్వం అనుకుంటాం. మెయిన్ ఈగో వల్ల మీ జీవితంలో ఉన్న ప్రశాంతత అనేది పోతుంది. ఎప్పుడైతే మనం నేను గొప్ప అని అనుకుంటామో అప్పుడే మనకి శత్రువులు పుడతారు. అప్పుడే మనకి అసూయ కలుగుతుంది.
(02:10) ఇతరులతో అనవసరపు పోటీ మొదలవుతుంది. వాడు కొత్తగా అరుగు అంటే మనకి నిద్ర పట్టదు. వాడికి ప్రమోషన్ వస్తే మనకి ఆకలి వేయదు. ఎందుకంటే మనం మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అందరికంటే పైన ఉండాల్సిన వాడిగా ఫీల్ అవుతాము. చివరికి ఏమవుతుంది మనశశాంతి కరువై ఒత్తిరి పెరుగుతుంది. రక్తపోటు, యంజైటీ, డిప్రెషన్ ఇవన్నీ మన ఈగో మనకి ఇచ్చే గిఫ్ట్లు అన్నమాట.
(02:34) నీమ్ కరోలి బాబా గారు ఎప్పుడు అనేవారు ప్రేమించడం నేర్చుకో సేవ చేయడం నేర్చుకో అని కానీ ఈగో ఉన్న చోట ప్రేమ ఉండదు. కేవలం అధికారం మాత్రమే ఉంటుంది. ఆ అధికారం కోసం ఆరాడపడి చివరికి ఒంటరి వాళ్ళం అయిపోతాము. అలా ఒంటరి వాళ్ళం అయిన తర్వాత మనం ఎంత సంపాదించే సుఖం ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరో ఒకతను కారు కొన్నాడు.
(02:54) అతను కారు ఎలా కొన్నాడో తెలుసుకోకుండా వాడు కారు కొన్నాడు నేను కొనలేకపోయాను అని చెప్పేసి మీలో మీరు బాధపడితే మీ అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు కారు కొనడం వెనకాల 100 కారణాలు ఉంటాయి. ఒకటి ఈ అమ్మాయిలో కొని ఉండొచ్చు. లేదా అప్పు తీసుకొని కొనుండొచ్చు. అది కూడా కాకపోతే ఇంకొక మార్గంలో కొనుండొచ్చు. సో అది కూడా కాకపోతే ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని కొనుండొచ్చు.
(03:20) ఆ ప్రాసెస్ తెలుసుకోకుండా మీలో మీరు బాధపడితే ఎవరికి ఉపయోగం చెప్పండి పోనీ ఈ అమ్మాయిలో కొన్నాడు అనుకోండి అది కట్టాల్సింది ఎవరు అతను మీరు ఎందుకు బాధపడతారు అందులోనూ రూపాయి రూపాయి పోగు వేసుకొని మరి కొన్నాడే అనుకోండి తను ఎంతో కష్టపడి ఉన్నాడు కదా సో నేను చెప్పవచ్చేది ఏంటంటే మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి మనకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి.
(03:40) అవి అందరితో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు కారు కొన్న వెంటనే నీ కోరికల్లోకి కారు రాకూడదు. వాడు ఇల్లు కొన్న వెంటనే నీ కోరికల్లోకి ఇల్లు రాకూడదు. నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అవి నీ కోరికలాగే ఉండాలి. ఎవడు ఏది చేస్తే అది నీ కోరిక అవ్వకూడదు. అప్పుడు నీ జీవితంలో మనశశాంతి అనేది అస్సలు ఉండదు. అందులో నీ ఈగో హర్ట్ అయిపోతూనే ఉంటుంది.
(03:59) అలా ఈగో హర్ట్ అయినప్పుడు ఏమవుతుంది డిప్రెషన్, రక్తపోటు, యంజైటీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కడికి వాడి వాడి ఇండివిడ్యువల్ లైఫ్ అనేది ఉంటుంది. అలాంటి ఇండివిడ్యువల్ లైఫ్ లో కొంతమంది జీవిత లక్ష్యాల వల్ల ఇల్లు కారు అనేది ఒక 10 సంవత్సరాల్లో రావచ్చు. ఇంకొంతమంది జీవిత లక్ష్యాలు వేరుగా ఉంటాయి.
(04:20) వాళ్ళకి సక్సెస్ అనేది కొంచెం టైం పట్టిన రిజల్ట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక్కొక్కడి సక్సెస్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుంది. ఇంకొకడి సక్సెస్ అనేది లేట్ గా వచ్చినా సరే సాలిడ్ గా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఈగోని మనం కంట్రోల్ చేసుకోవాలి. సరే ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే మాత్రం దీనికి సొల్యూషన్ చాలా సింపుల్ కానీ పాటించడం కొంచెం కష్టం.
(04:43) అంటే ఐ యామ్ నథింగ్ లేదా ఐ యామ్ జీరో అనే స్థితి అలవరుచుకోవడం. బాబాగారు చెప్పినట్లు మనల్ని మనం తక్కువ చేసుకోవడం అంటే మనల్ని మనం తిట్టుకోవడం కాదు మన ఈగోని చంపేయడం. ఆ ఈగో చనిపోయిన చోటే అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. నీమ్ కరోలి బాబాగారు తన దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద నాయకులకు గొప్ప వాళ్ళకు కూడా సామాన్యుల్లాని చూసేవారంట.
(05:04) ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన చెప్పిన మాట ప్రకారం మన ఈగోని వదిలేయడానికి మొదటి మెట్టు యాక్సెప్టెన్స్ మనకు జరిగే అవమానాలు పొగడతలు రెండిటిని సమానంగా తీసుకోవడం ఒక నీటి చుక్క సముద్రంలో కలిస్తే దానికి చావు లేదు ఎందుకంటే అందులో కలిసిపోయిన మరు క్షణం నుంచి ఆ నీటి చుక్క కూడా సముద్రమే కనుక అలాగే మనం నేనుని వదిలేసి విశ్వంలో ఒక భాగంగా మారాలి నేను శూన్యాన్ని అని అనుకోవడం వల్ల నీకు ఏ నష్టం ఉండదు నిజానికి నువ్వు ఒక పెద్ద భారాన్ని దించేసినట్లు అనిపిస్తుంది.
(05:36) చాలా మంది సెలబ్రిటీలు ఇన్ని కోట్లు సంపాదించినా ఎంత సక్సెస్ చూసినా చాలా డౌన్ టు ఎర్త్ తో ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అదేదో అందరి ముందు బిల్డప్లు ఇయాలని చెప్పేసిఏం కాదు వాళ్ళ నితి మీద ఉన్న ఆ భారాన్ని పీకి పక్కన పడేసి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. అది కూడా ఒక ఆర్ట్ అనుకోండి అలా చాలా మంది చేస్తూ ఉంటారు.
(05:54) కొంతమంది దాన్ని చేయలేకపోతూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. సో ఎవరైనా నిన్ను తిట్టారా నువ్వు శూన్యానివి అయితే ఆ తిట్టు నిన్ను తాగదు. ఎవరైనా నిన్ను పొగిడారా నువ్వు శూన్యానివి అయితే ఆ పొగడత నీకు తలకెక్కదు. ఈ జీరో ఫిలాసఫీని అర్థం చేసుకుంటే నువ్వు అజయుడువ అవుతావు. నిన్ను ఎవరూ బాధ పెట్టలేరు. ఎందుకంటే బాధపడటానికి అక్కడ నేను అనే అహంకారం లేదు కదా నీమ కరోలి బాబాగారు అనేవారు దేవుడిని చేరుకోవాలంటే ముందు నీ అహంకారాన్ని వదిలేయాలి అనేవారంట.
(06:24) ఎందుకంటే ఆ అహంకారమే నీకు నీ ప్రశాంతతకి మధ్య ఉన్న గోడ. ఆ గోడని కూల్ చేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారం. శరీరదంతా బాగానే ఉంది. దాన్ని ఎలా కూల్చాలి జీవితంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదాన్ని నేను అలవరుచుకొని నేను నా జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం జీరో ఫిలాసఫీని ప్రాక్టికల్ గా లైఫ్ లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము.
(06:47) ఇది వినడానికి ఫిలాసఫీలా ఉన్న ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక పేపర్ మీద నేను ఏమీ కాదు లేదా ఐ యామ్ జీరో అని రాసుకోండి. అది మిమ్మల్ని నిరుత్సాహ పరచడానికి కాదు మీలో అనవసరమైన గర్వాన్ని తీసేయడానికి లేదా మొబైల్ లో వాల్పేపర్ పెట్టుకోండి ఏం పోయింది నిమ్ కరోలి బాబాగారు ఎప్పుడూ అంటుండేవారు అందరికీ సేవ చేయి అందరిని ప్రేమించు అని నువ్వు జీరో అయినప్పుడు మాత్రమే ఇతరులకి సేవ చేయగలవు.
(07:13) నీలో నేను ఉంటే ఆ నువ్వు అవతల వ్యక్తి లోపాలను చూస్తావు. కానీ నువ్వు శూన్యమైతే ఎదుటి వారిలో దైవాన్ని చూస్తావు. రోజు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనసులో నేనేం కాదు అని అనుకోండి వెంటనే మీలోని కోపం మాయమైపోతుంది. అలాగే మీ సక్సెస్ ని [సంగీతం] మీ తలక ఎక్కించుకోకండి.
(07:35) మీరు ఏదైనా సాధిస్తే అది మీ వల్ల కాదు మీ ద్వారా జరిగిందని గుర్తించండి. నీమ్ కరోలి బాబా గారు ఎన్నో అద్భుతాలు చేసినా తాను ఏమి చేయలేదని చాలా సింపుల్ గా ఉండేవారు. ఆ సింప్లిసిటీ లోనే పవర్ ఉంది. గుర్తుంచుకోండి ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలన్నా పునాది మాత్రం భూమిలోనే ఉండాలి. నువ్వు ఎంత శూన్యంగా ఉంటే అంత ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ నీలోకి వస్తుంది. జీవితం అంటే ఒక ప్రయాణం.
(07:58) ఇందులో నువ్వు ఎంత తక్కువ లగేజ్ మోస్తే అంత వేగంగా అంత హ్యాపీగా నీ గమ్యానికి చేరుకుంటావు. నీ గతాన్ని [సంగీతం] నీ హోదాని నీ గర్వాన్ని పక్కన పెట్టేయ్ ఈ క్షణం నుంచి ఒక కొత్త మనిషిలా జీవించు లోకం నిన్ను ఏమనుకుంటుందో అనే భయం వదిలేయ్ ఎందుకంటే నువ్వు ఏమీ కానప్పుడు నీ కోల్పోది ఏముంటుంది ఏమ ఉండదు అక్కడే నీకు అసలైన స్వేచ్ఛ అంతులేని ఆనందం దొరుకుతాయి.
(08:20) ఈ క్షణం నుంచే ఆ మార్పు మొదలవ్వాలి. మన ఈగోని పక్కన పెట్టి అందరిలో మామూలు మనిషిలా కలిసిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే ఎంతమంది వాళ్ళ వాళ్ళ ఈగోని పక్కన పెట్టి అందరితో ఈ భూమిమీద కలిసి బతకడానికి సిద్ధంగా ఉన్నారో నాకు కూడా తెలియాలి కదా అందుకనే కామెంట్ చేయండి.
(08:42) అది కూడా ఐ యామ్ జీరో అని చెప్పేసి కామెంట్ చేయండి. అంతేనండి అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. [సంగీతం]

No comments:

Post a Comment