How Religion Turned Desire Into Sin | Nagna Satyam Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BBzod4ZdRdE
Transcript:
(00:03) మనకి చిన్నప్పటి నుండి నేర్పింది పాటిస్తుంది అంతా మన సొసైటీ చెప్పిందే. అందులో మతాలు కూడా మెయిన్ రోల్ ని ప్లే చేశాయి. అయితే మనకున్న శరీరం మనకి ఇష్టం ఉండదు కానీ పక్కోడిది గాని కనిపించే తెల్లటి అమ్మాయిది గాని భలే ఇష్టం. ఇక్కడ మన శరీరం మనకి తక్కువ కానీ ఆత్మ గొప్ప అలానే కోరిక పాపం అయితే అనిచివేయడం నీతి ఇవే కదా మనం చిన్నతనం నుంచి చూస్తూ పెరిగింది.
(00:29) కానీ ఇది నీషే దృష్టిలో ఒక భయం మీరు మీ శరీరాన్ని ద్వేషించడం నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ సొసైటీ మతాలు నీ బురలో నూరిపోసాయి గనుక నీ కోరికలు ప్రమాదకరమని నీ హ్యాపీనెస్ అపవిత్రమని నీ జీవితం అనుమానాస్పదమని ఇలా ఎన్నెన్నో చెప్పి నూరిపోశారు. ఇదంతా ఎప్పటి నుంచి జరిగింది? మనిషి బలహీనుడైన రోజు నుంచి ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు అంటే అది నీ శరీరం వల్లే నీ శరీరం నీ శత్రువేం కాదు.
(00:54) గమనిస్తే నువ్వు ఆలోచించక ముందే నీ బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నువ్వు మొరాలిటీ మాట్లాడక ముందే నీ బాడీ కోరుకుంటుంది. మీరు దేవుడు అన్న మాట నేర్చుకోకముందే నీ శరీరం జీవిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం ఉన్న శరీరాన్ని పాపంగా మార్చాం. కోరికని సిగ్గుగా మార్చాం. హ్యాపీనెస్ ని అనుమానంగా మార్చాం. ఇదంతా ఒక ట్రైనింగ్ లా మారింది. సెక్స్ అంటే వామ్మో అయ్యో అని భూకంపం వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారు.
(01:15) కానీ అందరికీ అదే కావాలి. మళ్ళీ మాట్లాడకూడదు దాని గురించి దానిని దాస్తారు. అయినా అది మీ ఆలోచన అన్నిటిలో ఉంటుంది. సెక్స్ కావాలి కానీ కోరికని నిందిస్తారు. అనుభవిస్తారు కానీ అనుభవాన్ని తిరస్కరిస్తారు. ఏంటిది? బయట అమాయకపు ఫేస్ పెట్టుకొని లోపల మాత్రం అన్ని ఆ కోరికల్ని దాచుకొని స్లోగా కుళ్ళుతున్న నిజం అది. ఆ సెక్స్ పాపం అంటాం.
(01:36) కానీ అదే పవర్ తో సామ్రాజ్యాలు కట్టబడ్డాయి. ఒక కల పుట్టింది కవిత్వం ఊపిరి తీసుకుంది. కానీ మనం దాన్ని తక్కువ చేసి చీప్ గా తీసి పడేస్తాం. ఎందుకంటే అది మీ కంట్రోల్ లో ఉండదు కనుక ఈరోజు నువ్వు నేను మన చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఈ సెక్స్ పుణ్యానే పుట్టి జీవిస్తున్న వాళ్లే ఈ సృష్టిలో తన కోరికలను భరించగలిగేవాడు తన తప్పులకు బాధ్యతలు తీసుకునేవాడు తన జీవితాన్ని నేరుగా ఎదుర్కునేవాడు వాడే బలవంతుడు.
(02:00) ఇలాంటివాడు తన పవర్ ని పాపంగా చూడడు. కోరికను సిగ్గుతో ఉంచడు. లైఫ్ లో రిస్క్ ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం బలహీనుడు క్వైట్ ఆపోజిట్ అన్నమాట మీషే పాయింట్ ఏంటంటే బాధ్యత లేని భోగం ఆలోచన లేని కోరిక పక్కోడిపై డిపెండ్ అవ్వడం ఇవి బలహీనతలు ఒక బలహీనుడు చేసేది ఇవే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కొండల మధ్య ఎప్పుడూ ఎండపడని లోయలో రెండు పక్షులు పుట్టాయి.
(02:24) ఒకటి నిప్పు పక్షి ఇంకొకటి నీడ పక్షి నీడ పక్షి చిన్నప్పటి నుంచే ఒక మాట వింటూ పెరిగింది. ఎగరడం డేంజర్ అని ఎత్తు అంటే పతనమే అని ఎండ అంటే కాలిపోవడమే అని ఆఖరికి తనకున్న రెక్కలను చూసి కూడా భయపడేది. ఒకవేళ ఎగరాలనిపించినప్పుడు అల్లా కంట్రోల్ చేసుకునేది. అది కోరిక మాత్రమే అని అలా అలా నేలకే అలవాటు పడింది. కానీ మన నిప్పు పక్షి అలా కాదు ఎగిరే ప్రాసెస్ లో కింద పడింది రెక్కలు కాలయి నొప్పి వచ్చింది.
(02:48) తన ప్రతీ గాయం తనక ఒక దిశ చూపించింది. బట్ అది చూసి నీడ పక్షి నేను ఎగరను అందుకే నేను గొప్పదాన్ని అని ఎగిరేవాళ్ళు అహంకారులని నవ్వేది. ఆ భయానికి పేరు పెట్టుకుంది పవిత్రత అని. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. చెట్లు పడ్డాయి గుళ్ళు పగిలాయి. నీడ పక్షి తన గుడి లోపలే కూర్చుంది. బయటికి రావడం పాపం అని భావించింది. తుఫాను ఎక్కువయింది.
(03:10) ఊపిరాడక లోపలే చచ్చింది. కానీ నిప్పు పక్షి తుఫాన్లో ఎగిరింది. గాయపడి రెక్కల నుంచి పొగలేచాయి. పైకి వెళ్లి ఎండలో నిలబడగలిగింది. ఇప్పుడు సర్వైవ్ అయి కూడా ఉంది. ఇప్పుడు ఎవరు గొప్ప నిప్పు పక్షా లేదా నీడ పక్షా? ఇక్కడ మన చేతగానితనాన్ని మనం గొప్పగా పవిత్రత అనే పిలుచుకుంటాం. నిప్పు పక్షి శరీరాన్ని కోరికను జీవితాన్ని ఒప్పుకున్నాడు ఫేస్ చేశాడు కాబట్టే ఈరోజు సర్వైవ్ అయ్యాడు.
(03:34) బట్ నీడ పక్షి అలా కాదు తన భయాన్ని నీదిగా మార్చుకొని చచ్చింది. ఇది సెక్స్ గురించో కాదు ఇది మన జీవితం గురించే అందరూ నిప్పు పక్షిలా ఉండడానికి ట్రై చేయండి. లేదా చేతగానితనాన్ని గొప్పగా పవిత్రత అని పేరు పెట్టుకొని చేతగాని లైఫ్ ని జీవించండి.
No comments:
Post a Comment