Fake Love signs in Telugu
Author Name:Telugites Adda
Youtube Channel Url:https://www.youtube.com/@telugitesadda3480
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AnNQcLvICqE
Transcript:
(00:00) ఒక రెండు కెమికల్స్ కలిసినప్పుడు వాటి మధ్య రియాక్షన్ అనేది ఉంటే పాజిటివ్ గా ఉంటుంది లేదా నెగిటివ్ గా అయినా ఉంటుంది. అదేవిధంగా రెండు వ్యక్తిత్వాలు కలిసినప్పుడు కూడా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఇద్దరు కలిసి మంచిగా ఎదుగుతారు మంచి వ్యక్తులుగా మారుతారు కానీ వాళ్ళ మధ్య ఉండే ప్రేమ ఫేక్ అయితే దాని రిజల్ట్ అనేది ఇద్దరిని కాకుండా ఒక్కరినే ఎమోషనల్ గా బ్రేక్ చేస్తుంది.
(00:24) వాళ్ళ మనసులో ఖాళీని నింపుతుంది. అందుకే ఈరోజు మనం మన వీడియోలో ఈ ఫేక్ లవ్ ను గుర్తించే ఒక ఏడు ముఖ్యమైన అంశాల గురించి వివరంగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ైట్స్ అడ్డా. ఫేక్ లవ్ ని గుర్తించడానికి సహాయపడే సైన్స్ లో మొదటిది.
(00:48) దే డోంట్ ట్రస్ట్ యు అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడూ అనుమానిస్తూ మీపై నమ్మకం లేకుండా ఉంటున్నారా ఏదైనా కాల్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావ్ ఎందుకు కాల్ చేశారు అని పదే పదే అడుగుతూ మీరు నిజం చెప్పినా అర్థం చేసుకోకుండా అనుమానిస్తున్నారా మీ మెసేజెస్ అన్ని చెక్ చేస్తేనే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతున్నట్లయితే ఇది ఫేక్ లవ్ లో ఉండే ఒక సంకేతం నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లు ట్రీట్ చేయడం ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవడం క్లారిఫికేషన్ ఇస్తూ కేర్ఫుల్ గా ఉండడం అనేది ప్రేమ కాదు ప్రెజర్వా వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీని నీ మీద
(01:22) ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళ భయాలకు అనుమానాలకు నువ్వే కారణం అన్నట్లు మాట్లాడతారు. దీనివల్ల మీరు ఓపెన్ గా ఉండలేరు రిలేషన్ లో భయంతో బతకాల్సి వస్తుంది. కానీ ట్రస్ట్ లేని చోట ప్రేమ అనేది స్లోగా చచ్చిపోతుంది. నెంబర్ టూ దే చేంజ్ యు వాళ్ళు మిమ్మల్ని మారుస్తారు. ఫేక్ లవ్ లో వాళ్ళు నిన్ను ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా మారుస్తారు.
(01:44) అది మంచిగా అయితే కాదు. మీరు లవ్ లో ఉండడం మొదలైన దగ్గర నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి నువ్వు చాలా మారిపోయావు. ఇంతకుముందులా ఫ్రెండ్లీగా స్ట్రాంగ్ గా లేవు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయా ఫేక్ లవ్ లో నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. నువ్వు ఇలానే ఉండాలి అంటే వాళ్ళ కోసం నువ్వు అడ్జస్ట్ అవుతావు. ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతావు. ప్రతిదానికి ప్రూవ్ చేసుకుంటావు.
(02:06) చిన్న చిన్న విషయాలకు కూడా గిల్ట్ ఫీల్ అవుతావు. ఇది మంచి మార్పు కాదు. నిన్ను నిజంగా ఇష్టపడే వ్యక్తి నిన్ను మార్చాలని ప్రయత్నించరు నీ గ్రోత్ ని ఎంకరేజ్ చేస్తారు మరియు నీ హ్యాపీనెస్ ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఫేక్ లవ్ మాత్రం నిన్ను వీక్ గా మిమ్మల్ని మీకే ఒక స్ట్రేంజర్ లా మారుస్తుంది. నెంబర్ త్రీ దే ట్రై టు కంట్రోల్ యు అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు.
(02:29) మీ పార్ట్నర్ మీరు ఏ బట్టలు వేసుకోవాలి ఏవి వేసుకోకూడదు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అని రూల్స్ పెడుతున్నారా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాక ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళ పర్మిషన్ మీద డిపెండ్ అవుతున్నాయా అయితే అది ఫేక్ లవ్ లక్షణం. మొదట్లో ఇవన్నీ నీ మీద కేరింగ్ తో కన్సర్న్ లా అనిపించినా కాలక్రమేణ ఇవి రూల్స్ గా మారుతాయి.
(02:51) నీ లైఫ్ అనేది నీది కాకుండా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఒకవేళ కాదు అని డిసగ్రీ చేసినా నాకు నీకంటే ఎక్కువ తెలుసు నీ మంచికే చెప్తున్నా అని వాళ్ళ మాటలే ఫైనల్ చేస్తారు. వాళ్ళు అప్సెట్ అవుతారేమో అని మీ ఇష్టాలను కూడా వదులుకుంటారు. అది ప్రేమ వల్ల కాదు ఫియర్ వల్ల. ప్రేమ అంటే డామినేషన్ కాదు కంట్రోల్ చేయడం అసలు కాదు. మిమ్మల్ని నిజంగా ఒక వ్యక్తి ప్రేమిస్తే.
(03:14) మిమ్మల్ని బంధించరు మిమ్మల్ని స్వేచ్ఛగా ఎదగనిస్తారు. నెంబర్ఫోర్ దే ఎమోషనల్లీ డిస్టెంట్ అంటే మీ భావోద్వేగాలకు దూరంగా ఉంటారు. వాళ్ళు మీతో ఫిజికల్ గా దగ్గరగా ఉన్న రోజు మాట్లాడిన ఎమోషనల్ గా చాలా దూరంగా ఉంటారు. నువ్వు ఏడుస్తున్న నీ ఫీలింగ్స్ చెప్పాలని ప్రయత్నించినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు ఎక్కువ ఆలోచించుకు నేను బిజీగా ఉన్నా అంటూ ఆపేస్తారు.
(03:39) నీ బాధలో వాళ్ళు కంఫర్ట్ ఇవ్వరు. ఏమీ కాదు నేనున్నా అనే భరోసా కూడా ఇవ్వరు. ఈ ఎమోషనల్ డిస్టెన్స్ అనేది నిన్ను ఒంటరిగా మారుస్తుంది. మౌనంగా నీ బాధను నీలోనే దాచుకుంటావు. ఇది ఫేక్ లవ్ ఫేక్ లవ్ లో మాటలు ఉన్నా కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉండదు. నెంబర్ ఫైవ్ దే సీమ్ అన్ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళకు నువ్వు ఇష్టం లేనట్లు ప్రవర్తించడం.
(04:01) ప్రేమలో ఉన్న వ్యక్తికి మీ మాటలు మీరు చేసే అల్లరి. చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఫేక్ లవ్ లో మీ మాటలు వాళ్ళకి బోరింగ్ గా అనిపిస్తాయి. నీ డే లో ఏం జరిగిందో నీ హ్యాపీనెస్ నీ బాధ వాళ్ళకి పెద్ద అవసరం అనిపించదు. ప్రతిసారి నువ్వే కాల్ చేయాలి మెసేజ్ పెట్టాలి నువ్వే మీట్ అవ్వమని అడగాలి.
(04:22) వాళ్ళ తప్పుఉన్నా సరే నువ్వే సారీ చెప్పాలి. నువ్వు చేయకపోతే వాళ్ళు చేయరు. ఎఫర్ట్ అంతా మీరే పెడుతున్నట్లు ఉంటుంది. వాళ్ళ ప్రేమను పొందడానికి నువ్వు వర్త్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతావు. ఇది ఫేక్ లవ్. నీ ప్రెసెన్స్ అనేది వాళ్ళకి డిఫరెన్స్ క్రియేట్ చేయలేకపోతే అది ట్రూ లవ్ కాదు. నెంబర్ సిక్స్ దే డోంట్ ప్రయారిటైజ్ యు అంటే వాళ్ళు నిన్ను ముఖ్యమైన వ్యక్తిగా కాకుండా సెకండ్ ఆప్షన్ గా చూస్తారు.
(04:46) ట్రూ లవ్ లో వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో నువ్వు ముందుంటావు కానీ ఫేక్ లవ్ లో వాళ్ళు నిన్ను సెకండ్ ఆప్షన్ లా చూస్తారు. మీ ఇద్దరి ప్లాన్స్ ఎక్కువగా క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళ ఫ్రెండ్స్ వర్క్, ఫన్, సోషల్ లైఫ్ అన్నిటికీ టైం ఉంటుంది ఒక్క నీకు తప్ప. ఎమోషనల్ సపోర్ట్ కావాలి అని అడిగితే బర్డెన్ గా ఫీల్ అవుతారు. దీనివల్ల నువ్వు ఎప్పుడూ అడ్జస్ట్ అవుతూనే ఉంటావు.
(05:09) వాళ్ళకు నువ్వు ఆప్షన్ అని ఫీల్ అవుతావు. తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు దొరికిందే ప్రేమ అనుకుంటావు. స్లోగా సెల్ఫ్ రెస్పెక్ట్ ని త్యాగం చేస్తావు. కానీ ట్రూ లవ్ లో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అని అడగనవసరం లేదు వాళ్ళు చేసే పనుల్లో ఆటోమేటిక్ గా కనిపించాలి. ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి దే ఈజీలీ గివ్ అప్ ఆన్ యు అంటే మిమ్మల్ని చాలా అంటే చాలా తేలికగా వదిలేయడానికి ఇష్టపడతారు.
(05:32) నిజమైన ప్రేమలో సమస్యలు వచ్చినా మాట్లాడతారు ఫైట్ చేస్తారు పరిష్కారం కోసం వెతుకుతారు. కానీ ఫేక్ లవ్ లో చిన్న సమస్య వచ్చినా చేతులఎత్తేస్తారు. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం బ్లాక్ చేయడం నువ్వు నాకు వద్దు అని చాలా తేలికగా అంటారు. నీకు వాల్యూ ఇవ్వరు హర్ట్ అయినా పట్టించుకోరు. వాళ్ళకు రిలేషన్షిప్ కన్నా కూడా ఈగోగా ఉండడం ఇంపార్టెంట్.
(05:56) అలాంటి బిహేవియర్ వల్ల నువ్వు రీప్లేస్ చేయగలిగే వ్యక్తిగా భావిస్తావు. వాళ్ళని ఎక్కువగా ప్రేమించడానికి మీ డిగ్నిటీని కూడా అమ్ముకుంటారు. ట్రూ లవ్ లో మనిషిని వదిలేయడం అంత ఈజీ కాదు. అసలు వదిలేద్దాం అనిపించడం అసలు ప్రేమే కాదు. ప్రేమ అనేది పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు కానీ సేఫ్ ఫీలింగ్ ని కలిగించాలి. మన విలువను పెంచాలి.
(06:17) నిజమైన ప్రేమ మిమ్మల్ని బలహీనంగా కాకుండా బలమైన వ్యక్తిగా తీర్చి దిద్దుతుంది. గుర్తుంచుకోండి ఫేక్ లవ్ కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా విలువైనది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఫేక్ లవ్ లో ఉండే ఏడు ముఖ్యమైన సంకేతాల గురించి వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయతే తెలుగు హైట్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థాంక్యూ గారు
No comments:
Post a Comment