నీకు తెలివి ఉందా.. బుద్ది ఉందా.. ఒక యమధర్మరాజు కథ✍️POSTCARD (5) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DAKNKZHwuK4
Transcript:
(00:01) అతి వద్దు ఏదేమైనా అతి వద్దు అతి వల్ల చాలా నష్టాలు [సంగీతం] అతిగా మాట్లాడడం గాన అతిగా ఒకరిని ప్రేమించడం గాన అతిగా గౌరవించడం గాన అతిగా తినడం గాన అట్లాగే అతి తెలివి గాని సో చాలామందికి తెలివికి బుద్ధికి ఉన్న తేడా తెలియదు. అతి తెలివి అనే పదం ఉంది కానీ అతి బుద్ధి అని ఎక్కడనా ఉందా? సో తెలివి అనే పదం తెలి అనే ధాతువు నుంచి వచ్చింది.
(00:36) తెలి అంటే [సంగీతం] అర్థం కావడం చీకటి పోయి వెలుగు రావడం మనకు ఒక పాట కూడా ఉంది కదా తెలించు కురిసింది తలుపు తీయరా ప్రభువు అని తెలివి అంటే స్పష్టంగా తెలుసుకునే శక్తి మనకు భాషలో కూడా తెలిసింది తెలుసు తెలియదు ఇట్లాంటి పదాల్లో [సంగీతం] తెలియనే ఒక ధాతువు ఉంది మరి బుద్ధి అంటే ఏంటి మేలుకోవడం జాగృతం కావడం సో అందుకే గౌతమ బుద్ధుడిని బుద్ధుడు అని పిలిచారు.
(01:11) అంటే తెలివి లేదని కాదు ప్రతి మనిషికి తెలివి బుద్ధి రెండు ఉంటాయి. సో తెలివి అంటే తెలుసుకున్నావ్ గుడ్ కానీ బుద్ధి అంటే ఆ తెలుసుకున్న దాన్ని నువ్వు చెప్పాలా వద్దా అన్న ఒక ఎరుక కలిగి ఉండడు ఏదైనా ఒక డిస్కషన్ జరిగితే తెలివు ఉన్నవాడు వెంటనే కౌంటర్ ఇస్తాడు ఉద్దున్నవాడు ఇది వాదించాల్సిన విషయం కాదేమో అని మౌనంగా ఉండిపోతాడు. తెలివి అన్నది నీ పాస్ట్ నాలెడ్జ్ కి సంబంధించింది.
(01:46) బుద్ధి అన్నది ఆ నాలెడ్జ్ [సంగీతం] ఈ వర్తమానపు క్షణంలో ఉపయోగించాలా వద్దా అన్న ఎరుకతో నీ యొక్క ప్రవర్తన [సంగీతం] ఉండటం తెలివి అన్నది ప్యూర్లీ ప్రదర్శన బుద్ధి అన్నది అదొక ఎరుక సో చాలామందికి తెలివి ఉంటుంది బుద్ధి ఉంటుంది కొందరికి అది తెలివి కూడా ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథ నాకు ఒకటి గుర్తొచ్చింది మీతో సరదాగా షేర్ చేసుకుంటాను.
(02:18) ఒక ఊర్లో ఒక శిల్పు ఉన్నాడు అతను అద్భుతంగా బొమ్మలు చెక్కుతాడు. చాలా తెలివి ఉంది పుస్తకాలు చదువుతాడు. రకరకాల స్కల్ప్చర్స్ రకరకాల ఆకారాల్లో ఎంతో అందంగా చెక్తాడు. సో ఎవరు వచ్చినా తన తెలివి ప్రదర్శిస్తాడు. మీకేం తెలుసు అంతా నాకే తెలుసు అని ప్రవర్తిస్తాడు. మెల్లమెల్లగా అతని దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు అతను ఎవరి మాట వినడం లేదు తానే చెప్పాలని ఎప్పుడో ఒక ఆరాటం ఎవడుంటే ఎవడు లేకపోతే నాకే అన్న ధోరణి అతనికి మరణ సమయం ఆసన్నమైంది.
(03:02) ఆ విషయం యమధర్మరాజు గుర్తించి తన భటుడిని పంపిస్తాడు [సంగీతం] వాడిని తీసుకొని రా అని ఆ సమయంలో ఇతను బొమ్మ చెక్కుతూ ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు నుంచి వచ్చిన భటుడు అంటాడు యమధర్మరాజు గారు పంపించారు మీ సమయం అయిపోయిందంట మీ ఉలి సుత్తి పక్కన పెట్టేసి మాతో రండి అంటాడు. అప్పుడు అతను ఒక రకంగా నవ్వి నేను ఎంత గొప్ప ఆర్టిస్ట్ ని తెలుసా నీకు నేను రానుపో ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు.
(03:35) నన్ను తీసుకెళ్ళాలంటే స్వయంగా యమధర్మరాజు రావాలని అంటాడు. ఈ విషయం తెలుసుకుని చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి చెప్తాడు అయ్యా ఇది విషయం అని సో యమధర్మరాజు [సంగీతం] ఇలాగ వస్తాడు అని ఈ ఆర్టిస్ట్ కి ఒక భావన కలిగి తనలాంటి విగ్రహాలు ఒక 50 చెక్కుతాడు. సో ఎదురు చూస్తా ఉంటాడు యమధర్మరాజు వస్తాడని సో యమధర్మరాజు రానే వచ్చాడు. రాగానే ఆ చెక్కిన 50 శిల్పాల్లో తను ఒక శిల్పంగా నిలబడతాడు.
(04:09) ఆ శిల్పాలు ఎంత సజీవంగా ఉన్నాయి అంటే ఎవరు నిజంగా అతను ఏవి నిజంగా అతని శిల్పాలు అని ఎవరు కనుక్కోలేరు. యమధర్మరాజు అటు ఇటు ఇటు అటు తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు సచ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఎంత అద్భుతంగా చెక్కాడు అసలు ఇతన్ని కనుక్కోవడం ఎట్లా ఒకసారి పాశం వేస్తే మిస్ఫైర్ అయింది అనుకో ఇక జీవితంలో అతనికి మరణం ఉండదు. అందుకని యమధర్మరాజు కాస్త ఆలోచిస్తాడు.
(04:42) బుద్ధిని ప్రయోగిస్తాడు. [సంగీతం] ఓ కుర్చి వేసుకొని కూర్చొని ఆ శిల్పాలు దిక్కే చూస్తూ ఉంటాడు ఆ శిల్పాల్లో ఇతను కూడా ఉన్నాడు. అటాత్తగా యమధర్మరాజు అంటాడు ఎంత బాగున్నే శిల్పాలు ఎక్సలెంట్ ఇలా చెక్కేవాడు ఇంకొకడు లేడు అంటే యమధర్మరాజు పొగడతకి అతను కాస్త [సంగీతం] ఇంపాక్ట్ అవుతాడు లోలోపట ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత యమధర్మరాజు అన్నాడంట అన్ని శిల్పాలు బాగున్నాయి కానీ ఒక్క శిల్పంలో ఒక లోపం ఉంది అనగానే అతను బయటిక వచ్చి ఎక్కడ లోపం ఉంది చూపి అన్నాడంట ఇక్కడ లోపం లేదు నీ అవగాహన లోపం ఉంది పొగడతకు పడిపోయే లక్షణం ఉంది అది నాకు
(05:27) తెలుసు అని అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట సో అతి తెలివి ఎంత మంచిది కాదు ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు తెలివైన వాళ్ళు రెండో వాళ్ళు వాళ్లే తెలివైన వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. తెలివి తక్కువతరంతో ఏ సమస్య లేదు. కానీ అతి తెలివితో చాలా ప్రాబ్లం సో మనకున్న నాలెడ్జ్ ని ఒక మంచి కోసం ఉపయోగించాలనుకోవడం వేరు కానీ మన నాలెడ్జ్ ని ప్రదర్శించాలనుకో ప్రదర్శించాలనుకున్నప్పుడే సమస్య అంతా వస్తుంది.
(06:04) సోక్రటీస్ లాంటివాడు చెప్పాడు ఐ నో దట్ ఐ నో నథింగ్ అని నేను తెలుసుకున్నాను నాకేమి తెలియదని లావచ్చు అంటాడు హి హూ నోస్ డస్ నాట్ స్పీక్ మచ్ హి హూ స్పీక్స్ మచ్ డస్ నాట్ నో అంటాడు. అతిగా మాట్లాడుతున్నావా అసందర్భంగా మాట్లాడుతున్నావా అవసరం లేకపోయినా మాట్లాడుతున్నావా పక్కవాడు వినకపోయినా మాట్లాడుతున్నావా అదంతా నీకు ఉన్న అతి తెలివి వల్లే నువ్వేదో కోరుకుంటున్నావ్ ఒక రెస్పెక్టబిలిటీ ఒక అబద్ధపు గుర్తింపు అందరిలో నేను ప్రత్యేకంగా ఉండాలని [సంగీతం] ఏదో ప్రయత్నం చేస్తున్నావ్ సో మానవ సంబంధాలు దెబ్బ దినానికి కారణం ఈ
(06:51) అతి కూడా ఒక కారణం సో అతి తెలివి వద్దు దానివల్ల ఏ ఉపయోగం లేదు. సో రకరకాల విషయాలు చదివి రకరకాల విషయాల గురించి ఆర్గ్యూ చేసి నువ్వు తెలుసుకున్నదంతా తెలివి తెలివి అనేది నీ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాబబ్లీ ఆర్టికులేటెడ్ ఇన్ఫర్మేషన్ దాన్ని నువ్వు సమయాన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది.
(07:23) కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన తెలివిని మనం దుర్వినియోగం చేస్తాం. సో ఏ సందర్భంలో మాట్లాడాలో అన్న అవగాహన బుద్ధికి సంబంధించింది. చాలా సందర్భాల్లో నువ్వు ఏమి చెప్పకుండా ఉండటం ఒక గొప్ప నిర్ణయం సో నీకు తెలిసినంత మాత్రాన చెప్పాలని కాదు తెలివైనవాడు వేగంగా స్పందిస్తాడు. ఎదుటి వ్యక్తి వినకపోయినా చెప్తాడు [సంగీతం] బుద్ధి ఉన్నవాడు ఆ సందర్భంలో అది అవసరమా లేదా అని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు.
(07:56) తెలివైన వాడికి చురుకు చాలా ఉంటుంది. కానీ బుద్ధి ఉన్నవాడికి నిర్ణయం తీసుకునే ఒక నెమ్మదితనం ఉంటుంది. తెలివైన వాడు ఇతరుని ఆశ్చర్యపరచాలి అనుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు సామరస్యం కోసం ప్రయత్నిస్తాడు. తెలివి [సంగీతం] అది కాస్త అతి తెలివిగా మారి అహంకారంగా మారుతుంది. బుద్ధి వినమ్రతగా మారుతుంది. సో తెలివి వల్ల మనం గెలవచ్చు కానీ బుద్ధి వల్ల మనం నిలబడతాం.
(08:26) అందుకే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం తెలివైన నిర్ణయమా లేకపోతే బుద్ధితో కూడి నిర్ణయం అని ఎట్లా తెలుస్తుంది అంటే గతాన్ని ఆధారం చేసుకొని వర్తమానంలో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తెలివే నిర్ణయం బుద్ధి అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయం నాకు ఉపయోగపడుతుందా లేదా అని [సంగీతం] తెలుసుకోవడం బుద్ధి అన్నది రకరకాల విషయాలని బేరీజు వేసుకొని అందులో నిన్ను నువ్వు భాగంగా చేసుకొని చేసే ఒక ఆలోచన.
(08:58) తెలివి [సంగీతం] అన్నది జస్ట్ నీ స్వార్థం కోసం తీసుకునే ఆలోచన. తెలివు ఉన్నవాడు ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. జయిస్తాడో లేదో అనుకుంటాడు. [సంగీతం] కానీ బుద్ధి ఉన్నవాడు తనలో ఉన్న అహంకారాన్ని జయిస్తాడు. అందరితో సామరస్యంగా ఉంటాడు. బుద్ధి అన్నది చాలా అర్థవంతమైన పదం బుద్ధిగా జీవిద్దాం. తెలివిని ఉపయోగించుకుందాం. అతి తెలివి అసలు అవసరమే లేదు.
(09:30) ఎవరైనా అడిగితేనే సలహా ఇవ్వండి. అడిగినా అడగకపోయినా సలహాలు ఇచ్చేవాడు నా దృష్టిలో దుర్మార్గుడు హి ఇస్ కంప్లీట్లీ మిస్అండర్స్టుడ్ ద ఎసెస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎసెస్ ఆఫ్ వర్డ్ సో తెలివి వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. అతి తెలివి వల్ల ఇంకా ఇంకా ఇంకా ప్రమాదాలు వస్తాయి. తెలివి గాని అతి తెలివి గాని ఒకవేళ నీలో [సంగీతం] ఉంటే నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
(10:07) ఆ విషయాన్ని గుర్తించడు మనిషి నేనేమి తప్పు చేయలేదు నేను ఏమ అనలేదు అంటాడు కానీ అతిగా మాట్లాడావేమో అతిగా గౌరవించావేమో అతిగా పట్టించుకున్నావేమో అతిగా సలహాలు ఇచ్చావేమో అతిగా ఒకరి మీద దృష్టి పట్టి పెట్టావేమో తెలీదు తెలియకుండా [సంగీతం] చాలా జరుగుతాయి. అందుకని ఏదైనా తెలుసుకోవడం గొప్ప కాదు అది తెలుసుకున్న దాన్ని అసలు ఉపయోగించాలా వద్దా అన్నది రియల్ ఇంటెలిజెన్స్ సో ఎవరిని [సంగీతం] ఇన్సల్ట్ చేయకండి మీకు తెలియదని తెలియకపోతే చెప్పండి అంతేగానీ ఒక అయ్యో ఇది కూడా తెలియదా ఇంత చదువుకున్నారు ఇది తెలియదండి అట్లా అనాల్సిన అవసరం లేదు
(10:55) ఎక్కువగా వేరేవాళ్ళు చెప్పేది విను నిజంగా తెలుసుకోవాలనుకున్న వాడికి నీ తెలివిని అందజేయ్ అన్ని సందర్భాల్లో బుద్ధిగా ఉండు. బి మోర్ సైలెంట్ మనం మాట్లాడే మాట అర్థవంతంగా ఉండాలి. ఒకరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న [సంగీతం] తెలివికి బుద్ధికి జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కారం మళ్ళీ మాట్లాడుకుందాం.
(11:31) వీలైతే ఈరోజు అవసరమైతేనే మాట్లాడండి చిన్న ప్రయోగం చేయండి. అడిగిన ప్రతి ఒక్కరికి సలహా ఇవ్వకండి. తెలివైనవాడు అడగగానే సలహా ఇస్తాడు. బుద్ధి ఉన్నవాడు సలహా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాడు. తెలిసినా కొన్నిసార్లు చెప్పకపోవడం నిజంగా ఇంటెలిజెన్స్ సరైన సమయంలో చెప్పాలి అంతేగన తెలుసు కాబట్టి చెప్పాలను బలటం అంత మంచిది కాదు మన శక్తిని [సంగీతం] క్రియేటివిటీలో పెడదాం నిలబెట్టడంలో పెడదాం కొందరిని కలపడంలో పెడదాం సమస్యలను క్లియర్ చేయడంలో పెడదాం అంతేగాని మన తెలివిని మనుషుల మధ్య దూరాల్పించడానికి మన అహంకారం
(12:17) ప్రదర్శించుకోవడానికి ఉపయోగించాల్సిన అవసరం లేదు. రేపు బియాండ్ ద ఐ అనే బుక్ లాంచ్ ఉంది. నవీన్ అనే ఒక అబ్బాయి రాశడు అమెరికాలో ఉంటాడు. ఏమాత్రం వీలుందా రండి త్రిశక్తి బృందావనం అని ఉంటుంది. పోస్ట్ పెట్టాను అట్లాగేవాట్ గ్రూపుల్లో కూడా షేర్ చేశాను. ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి దాని వివరాలు చెప్తాను.
(12:46) ఇక్కడి నుంచి మీలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం రీసవయస్
No comments:
Post a Comment