మంచివాళ్లలా నటించే వాళ్లను ఎలా గుర్తించాలి?
Author Name:Telugites Adda
Youtube Channel Url:https://www.youtube.com/@telugitesadda3480
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OdmfgjcHhyM
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అడ్డ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ చుట్టూ మంచి వ్యక్తులే ఉన్నారా అని కొంతమంది బయటకి మంచిగా కనిపిస్తారు కేర్ చేస్తున్నట్లు సాఫ్ట్ గా ఉంటారు కానీ వాళ్ళకు అవసరమైనప్పుడు తప్ప మనకు అవసరమైనప్పుడు కనిపించరు. మీరు చెప్పే ప్రతిదానికి తలుపుతారు మీరు ఇష్టపడేది ఇష్టపడతారు.
(00:22) వాళ్ళు చేసే నటనకి అది ఫేకా కాదా అని చెప్పడం కూడా కష్టం. అయినప్పటికీ ఈరోజు ఈ వీడియోలో ఫేక్ నైస్ పీపుల్ లో కనిపించే ఆరు రకాల కామన్ బిహేవియర్స్ ని వివరంగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. నెంబర్ వన్ వాళ్ళు పవర్ ఉన్న వాళ్ళనే గౌరవిస్తారు.
(00:42) మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది పవర్ ఉన్న వాళ్ళతో ఒక రకంగా పవర్ లేని వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతారు. అఫ్కోర్స్ కచ్చితంగా సీఎం పిఎం లాంటి వ్యక్తులని మన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయమని కాదు. కానీ పవర్ ఉన్న వాళ్ళతో వాళ్ళు బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. బాస్ దగ్గర హై స్టేటస్ ఉన్న వాళ్ళ దగ్గర హంబుల్ గా ఉన్నట్లు రెస్పెక్ట్ చూపిస్తారు.
(01:03) కానీ వాళ్ళకంటే లోవర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళతో టోన్ పూర్తిగా మారిపోతుంది ఆటిట్యూడ్ బయటపడుతుంది. అలా ఒక వ్యక్తి మనుషులను ట్రీట్ చేసే విధానంలో చాలా తేడాలు కనిపిస్తే వాళ్ళు ఫేక్ నైస్ పర్సన్ అని గుర్తుంచుకోండి. నెంబర్ టూ మీకు అవసరమైనప్పుడు కంటికి కనిపించరు. మీకు చాలా ఇంపార్టెంట్ పనప్పుడు అవసరమైనప్పుడు కొంతమంది ఆ దరిదాపుల్లో కూడా కనిపించరు.
(01:24) ఈ సెంటెన్స్ వినగానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గుర్తొచ్చారా ఫేక్ పీపుల్ ఎప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి చాలా మంచిగా నటిస్తారు. మీ హ్యాపీ డేస్ లో ఉంటారు మీతో ఉపయోగం ఉన్నా మీరు పనికవస్తారు అన్నప్పుడు ఉంటారు. కానీ మీ ప్రాబ్లమ్స్ లో అవసరమైనప్పుడు వాళ్ళు బిజీ అయిపోతారు.
(01:45) కాల్స్ లిఫ్ట్ చేయరు మెసేజెస్ కి రిప్లై ఇవ్వరు. అయితే ఒక ట్రూ రిలేషన్ అనేది ఎప్పుడైనా సుఖ సంతోషాల్లో ఉన్నప్పటికన్నా కష్టాల్లో ఉన్నప్పుడు పరీక్షించబడతాయి. ఒక వ్యక్తి మీ హెల్ప్ ఎప్పుడూ తీసుకుంటూ మీ అవసరాల నుండి తప్పించుకుంటుంటే వాళ్ళు ఫేక్ పీపుల్ అని గుర్తుంచుకోండి. నెంబర్ త్రీ అందరినీ సంతోషపరుస్తున్నట్లు నటిస్తారు. ఫేక్ నైస్ పీపుల్ లో కనిపించే మరో లక్షణం అందరినీ హ్యాపీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు.
(02:11) అందరూ వాళ్ళని ఇష్టపడాలని ఎవరు ఏం చెప్పినా సరే అంటారు. మీరు చెప్పిన దానికి కరెక్ట్ నాకు కూడా అదే అనిపించింది అని అగ్రీ చేస్తారు. కానీ చేసిన ప్రామిసెస్ ని సరిగ్గా నిలబెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఒకరికి కాదు చాలా మందికి అలా ప్రామిస్ చేసి ఉంటారు. మరియు వాళ్ళ ఫేక్నెస్ వల్ల ఆ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయాలని కూడా అనిపించదు.
(02:31) ట్రూగా ఉండే వ్యక్తులు అందరిని ప్లీజ్ చేయరు. అందరిలో పర్ఫెక్ట్ గా ఉండి అందరినీ ప్లీజ్ చేసే వ్యక్తిని బ్లైండ్ గా నమ్మకండి. వాళ్ళ మాటల్లో ప్రవర్తనలో కన్సిస్టెన్సీ మరియు నిజాయితి ఉందా లేదా గమనించండి. నెంబర్ ఫోర్ మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంటుంది.
(02:50) కానీ మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అనేది వాళ్ళ రెప్యుటేషన్ ని పాడు చేస్తున్నట్లు కొంతమంది మన ముందు స్వీట్ గా సపోర్ట్ చేస్తున్నట్లు బెస్ట్ ఫ్రెండ్ లా మాట్లాడతారు. మనం లేని సమయంలో మనం నమ్మి చెప్పిన పర్సనల్ విషయాలను షేర్ చేసి మన మిస్టేక్స్ ని హైలైట్ చేసి కాలక్షేపానికి అన్ెసెసరీ డిస్కషన్ పెడతారు. నిజమైన ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు మన తప్పు ఉంటే మన ముందే చెప్తారు.
(03:14) కాబట్టి ఎవరైనా మీ ముందు ఇంకొకరి గురించి గాసిప్ చేస్తే మీ గురించి కూడా ఇంకొకరి దగ్గర గాసిప్ చేస్తారని తెలుసుకోండి. ఎవరైనా మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడితే అది ఒక వార్నింగ్ సైన్ లా భావించి జాగ్రత్త పడండి. నెంబర్ ఫైవ్ వాళ్ళు అటెన్షన్ కోసం ఏదైనా చేస్తారు. ఫేక్ నైస్ పీపుల్ ఎప్పుడు అటెన్షన్ కోసం అప్రిషియేషన్ కోసం తహతలాడతారు. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా మంచి వాళ్ళలా కనిపించాలని కోరుకుంటారు.
(03:38) చిన్న హెల్ప్ కి కూడా పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. ఎప్పుడూ ఎదుటివారు వాళ్ళని పొగడాలని కోరుకుంటారు. నిజమైన మంచితనం ప్రచారం లేకుండా సైలెంట్ గా ఉంటుంది. ఎవరైనా ఫేవర్ చేసే ముందు చేసిన తర్వాత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఫేక్ నైస్ పీపుల్ అని గుర్తుంచుకోండి. ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ గురించి ప్రశ్నలు అడిగితే తప్పించుకుంటారు.
(04:01) కొంతమంది మీ గురించి లోతుగా అడుగుతారు మీ పర్సనల్ విషయాలు ప్రాబ్లమ్స్, ప్లాన్స్ మీ వీక్నెస్సెస్ అన్ని తెలుసుకుంటారు. కానీ అదే మీరు వాళ్ళని అడిగితే తెలివిగా టాపిక్ మారుస్తారు లేదా క్లియర్ ఆన్సర్ ఇవ్వకుండా తర్వాత చెప్తా అని తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి దగ్గర అవుతారు. సీక్రెట్స్ అన్ని తెలిసాక మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తారు.
(04:25) ఎవరైనా మీ గురించి అన్ని తెలుసుకొని వాళ్ళ గురించి తక్కువ చెప్తే వాళ్ళు ఫేక్ నైస్ పీపుల్ అని గుర్తుంచుకోండి. బయటికి స్మైల్ చేస్తూ స్వీట్ గా కనిపించే ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు కాదు మీ లైఫ్ లో ఫేక్ నైస్ పీపుల్ ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు స్లోగా మీ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తారు. మీ ట్రస్ట్ ని మిస్యూస్ చేస్తారు.
(04:44) మెంటల్ పీస్ ని డిస్టర్బ్ చేస్తారు. అందుకే వాళ్ళ మాటలని కాదు వాళ్ళ బిహేవియర్ ని గమనించండి జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఫేక్ నైస్ పీపుల్ లో కనిపించే ఆరు రకాల కామన్ బిహేవియర్స్ ని వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే తెలుగు అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థాంక్యూ గారు
No comments:
Post a Comment