కామంలో ఉండే 4 దశలు | కామం మన మైండ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది?
Author Name:Telugites Adda
Youtube Channel Url:https://www.youtube.com/@telugitesadda3480
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ems-5ByjI5Y
Transcript:
(00:00) మీరు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ వాళ్ళ పేరు వింటేనే తెలియని నవ్వు సిగ్గు ఏర్పడుతుందా అయితే అది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు లస్ట్ అంటే కామం కూడా అయి ఉండొచ్చు. ఈ లస్ట్ అనేది ప్రేమ ఆకర్షణ లాగే ఒక సహజమైన భావం దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. ఇది మన మైండ్ ఒకరిని ఇష్టపడుతుందని చెప్పే సంకేతం.
(00:26) అయితే సైకాలజీ ప్రకారం ఈ కామం అనేది నాలుగు దశల్లో పెరుగుతుంది. మీరు ఈ లస్ట్ లో ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసుకోకపోతే దాన్ని లవ్ అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో కామంలో జరిగే నాలుగు దశలను వివరంగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు అడ్డా.
(00:50) కామంలో జరిగే స్టేజెస్ లో మొదటిది అట్రాక్షన్ స్టేజ్ అంటే ఆకర్షణ దశ. ఈ దశ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఒకరు మీకు ఆకర్షణీయంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం వాళ్ళ స్మైల్ వాయిస్ లేదా జస్ట్ వాళ్ళ ప్రెసెన్స్ మీ బాడీలో స్పార్క్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మనం కంట్రోల్ చేయలేని మైండ్ చేసే బయాలజికల్ మాయ.
(01:13) ఈ దశలో మీ బాడీ అనేది మీ మైండ్ కంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. వాళ్ళు మీ పక్కన ఉంటే ఎనర్జిటిక్ గా అలర్ట్ గా ఉంటారు. ఈ స్టేజ్ లో మీ మధ్య లోతైన భావోద్వేగాలు ఏర్పడలేదు. మీ సోల్మేట్ ని కూడా కలవలేదు. కానీ మీ మైండ్ డొపమిన్ ని రిలీజ్ చేసి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి ఎలా అయినా దగ్గర అవ్వాలి అనే సిగ్నల్ ని క్రియేట్ చేస్తుంది.
(01:34) అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నేను వాళ్ళని ఇష్టపడుతున్నానా లేదా వాళ్ళ గురించి ఊహించుకుంటున్నానా అని ఎందుకంటే కొన్నిసార్లు మనం వాళ్ళని ఇష్టపడకపోయినా వాళ్ళ గురించి మనం క్రియేట్ చేసుకున్న ఐడియాను మాత్రమే ఇష్టపడతాము. స్టేజ్ ట ఫిక్సేషన్ ఆలోచనలు మొదలయ్యే దశ. ఈ దశలో ఆకర్షణ కాస్త ఆలోచనగా మారుతుంది. వాళ్ళు పదే పదే గుర్తొస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ మెసేజెస్ ని పదే పదే చదువుకుంటూ వాళ్ళ మాటలను చూపులను గుర్తు చేసుకుంటూ మీ మైండ్ అంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది.
(02:09) వాళ్ళ గురించి ఆలోచించే కొద్ది డొపమిన్ మరియు హ్యాపీ హార్మోన్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అయ్యి ప్రతి విషయాన్ని మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. ఈ దశలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోయినా మీ మైండ్ ఆ ఖాళీని పూర్తి చేస్తుంది. వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంటుంది అని ఊహించుకుంటారు.
(02:30) మీరు ఊహించుకున్న దాంట్లో వాళ్ళు సగమే కరెక్ట్ అయినా సరే మీ మైండ్ ఏ ప్రాబ్లం లేని మంచి పర్ఫెక్ట్ స్టోరీని క్రియేట్ చేస్తుంది. స్టేజ్త్రీ డిజైర్ కోరిక దశ. ఈ దశలో మీ మైండ్ తో పాటు మీ బాడీ కూడా స్పందిస్తుంది. హార్ట్ బీట్ పెరిగి హార్మోన్స్ యక్టివ్ అవుతాయి. ఇది కేవలం ఆలోచనలకే కాక వాళ్ళతో ప్రత్యేకంగా కనెక్ట్ అవ్వాలనే కోరిక పెరుగుతుంది. వాళ్ళతో టైం గడుపుతూ దగ్గరగా ఉండాలని మనసు కోరుకుంటుంది.
(02:57) ఈ స్టేజ్ లో బౌండరీస్ రెడ్ ఫ్లాగ్స్ గుర్తుకు రావు. మీ ఫీలింగ్స్ నుంచి రిలీఫ్ అవ్వాలి అనే కోరిక మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే ఈ దశ మీకు ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. కానీ అది వన్ సైడెడ్ డిజైర్ అయితే మీ ఎమోషన్స్ మీద మీరు బాలెన్స్ కోల్పోతారు. ఇక్కడ మీరు అడగవలసిన ప్రశ్న నేను వాళ్ళని చూస్ చేసుకున్నానా లేదా నా బాడీ రిలీజ్ చేసే కెమికల్స్ కి రియాక్ట్ అవుతున్నానా అని.
(03:22) స్టేజ్ఫోర్ క్లారిటీ స్పష్టత దశ ఈ దశలో మీరు క్లారిటీగా వాళ్ళు ఏంటి అనేది చూస్తారు. భావోద్వేగాల నుండి బయటకి వచ్చి వాళ్ళు మీరు అనుకున్నట్టే ఉన్నారా లేదా వాళ్ళ దగ్గర మీకు సేఫ్ ఫీలింగ్ కావలసిన రెస్పెక్ట్ దొరుకుతుందా లేదా అని అర్థం చేసుకుంటారు. ఇది నిజమైన కనెక్షన్ లేదా తాత్కాలికమా ఇలాంటి ప్రశ్నలు మీకు క్లారిటీని తెస్తాయి.
(03:45) క్లారిటీ ఉంటేనే మనం మన ఎమోషన్స్ తో కాకుండా బ్రెయిన్ తో ఆలోచిస్తాము. కామం అనేది మనలో మొదలైన భావమే అయినా దాని క్లారిటీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కామం ఆకర్షణ కోరిక ఇవన్నీ సహజమైన భావాలు అవి తప్పు కాదు కానీ వాటిని అర్థం చేసుకోవడం నియంత్రించుకోవడం సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కామంలో జరిగే నాలుగు రకాల స్టేజెస్ ని వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
(04:15) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే తెలుగు అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థాంక్యూ
No comments:
Post a Comment