Wednesday, February 25, 2026

అందరిని సంతోషపెట్టడం Impossible! | Stop Caring What Others Think | 5 Powerful Tips in Telugu

అందరిని సంతోషపెట్టడం Impossible! | Stop Caring What Others Think | 5 Powerful Tips in Telugu

Author Name:Telugites Adda

Youtube Channel Url:https://www.youtube.com/@telugitesadda3480

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0UyRYzni7xA



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం! వెల్కమ్ టు తెలుగు అడ్డ ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఆలోచన నుండి బయటకి రావడానికి కష్టంగా ఉందా? కొన్నిసార్లు వాళ్ళ మాటలు మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ మన నిద్రని మనశశాంతిని మనం జీవించే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనం తప్పుగా అర్థం కాకూడదు.
(00:23) ఏమి తెలియని వాళ్ళలా ఏమి చేతకాని వాళ్ళలాగా కనిపించకూడదని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా మంది వాళ్ళ భుజాల మీద మోయలేనంత బరువును మోస్తుంటారు. ఒకవేళ మీరు పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ మాటలకు జడ్జిమెంట్ కి భయపడే వ్యక్తి అయితే ఈరోజు ఈ వీడియోలో దాని నుండి ఎలా బయటపడాలి అనేది ఒక ఐదు బెస్ట్ వేస్ లో వివరంగా డిస్కస్ చేసుకుందాం.
(00:42) వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. నెంబర్ వన్ ఇతరులకు ఏం కావాలి అన్నదానికంటే మీకు ఏం కావాలి అన్న దానిపై దృష్టి పెట్టడం మీకు ఏం కావాలో మీరు అదే చేస్తున్నారా ప్రతి ఒక్కరికి లైఫ్ ని చూసే కోణం వేరుగా ఉంటుంది. ఎవ్వరి ఇష్టాలు కోరికలు హాబీస్ ప్ాషన్ అనేవి 100% మ్యాచ్ కావు.
(01:06) కానీ కొన్నిసార్లు మీ అభిప్రాయాలను పట్టించుకోకుండా మీకు ఏది కావాలి మీకు ఏది కరెక్ట అని పక్కవాళ్ళు మీకోసం డిసైడ్ చేస్తుంటారు. మీ ప్రతి నిర్ణయాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ జీవితాన్ని జీవించాల్సింది మీరు ఇతరులు కాదు. మీకు ఏం కావాలి అనేది జాగ్రత్తగా నిర్ణయించుకోండి. మీ కోరికలపై ఫోకస్ చేయండి. ఇతరులను ఇంప్రెస్ చేస్తూనే ఉంటే మీకు నచ్చినట్టు బతకలేరు.
(01:30) మీకు నిజంగా ఏం కావాలో క్లియర్ గా తెలిసిన రోజున ఇతరుల అభిప్రాయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. సో స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు వాంట్. నెంబర్ టూ ఇక్కడ ఎవరు సూపర్ హ్యూమన్ కాదు అందరూ మనుషులే. మనం పక్క వారితో కంపేర్ చేసుకున్న సోషల్ మీడియాలో చూసిన అందరూ పర్ఫెక్ట్ గా సమస్య లేనట్టే కనిపిస్తారు. మీ పక్క వాళ్ళ విజయాలను భూతద్దంలో చూస్తూ మీ విజయాలను చిన్నచూపు చూస్తే ఆ పోలిక మిమ్మల్ని తక్కువగా భావించేలా చేస్తుంది.
(01:55) కానీ నిజం ఏంటంటే అందరికీ భయాలు ఉంటాయి. అందరూ తప్పు చేసి నేర్చుకునే ఎదుగుతారు. ఎవ్వరూ సూపర్ హ్యూమన్ కాదు గిఫ్టెడ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. కొన్నిసార్లు స్పీడ్ కన్నా డైరెక్షన్ ముఖ్యం. మీ ప్రయాణం మీద దృష్టి పెట్టండి. మీతో మీరు పోటీ పడండి ఇతరులతో కాదు. నెంబర్ త్రీ అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం.
(02:16) మీరు ఎవరైనా కావచ్చు మీరు అందరినీ సంతోష పెట్టలేరు. మీ పర్సనాలిటీ వేరు మీ ఒపీనియన్స్ వేరు. మీరు ఎంత మంచి పని చేసినా ఎవరో ఒకరు అసంతృప్తిగానే ఉంటారు. ప్రపంచం మీ తప్పులనే పట్టుకొని వేళలాడదు. ఎంత పెద్ద తప్పైనా హాట్ న్యూస్ అయినా మన డొపమిన్ పని చేసినంతవరకే. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. వాళ్ళ సంతోషానికి మీరు బాధ్యతలు కారు. అందరికీ నచ్చేలా అప్రూవల్ కోసం చూస్తే మీ పీస్ అనేది దూరమవుతుంది మీ లైఫ్ మిస్ అవుతుంది.
(02:42) కాబట్టి అవసరమైన చోట నో చెప్పడం నేర్చుకోండి. నెంబర్ ఫైవ్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని పెంచుకోండి మీకు మీరే శత్రువుగా మారకండి. మిమ్మల్ని కరెక్ట్ చేసుకోకుండా మీ తప్పుల నుండి నేర్చుకోకుండా మీరే బ్లేమ్ చేసుకుంటూ ఉంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని తగ్గించుకుంటున్నట్లు. సెల్ఫ్ ని క్రిటిసైజ్ చేసుకుంటే ఇది మీ నమ్మకాన్ని తగ్గిస్తుంది ప్రయత్నించాలనే ధైర్యాన్ని కూడా కోల్పోతుంది.
(03:06) భయాన్ని పెంచుతుంది మరియు మానసిక శాంతిని దూరం చేస్తుంది. ఒకవేళ మీ ద్వారా తప్పు జరిగినా కూడా దాని నుంచి నేర్చుకోండి. ఒక తప్పుతో మీ మొత్తం వ్యక్తిత్వాన్ని నిందించకండి. మిమ్మల్ని మీరు ఎలా చూస్తారో ఈ లోకం కూడా అలాగే చూస్తుంది. కాబట్టి మీకు మీరే మద్దతుగా నిలబడండి మీ లోపల ఉన్న ఎనర్జీని నమ్మండి. ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకోండి.
(03:29) మనందరికీ సాధించాల్సిన పనులు ముందున్నప్పుడు ఆల్రెడీ సాధించిన పనులు చిన్నవిగా కనిపిస్తాయి. ఈ మూమెంట్ లో మీరున్న స్థితికి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు ఎన్నిసార్లు పడినా ఎలా మళ్ళీ లేచి నిలబడ్డారు. ఇవన్నీ ఇప్పుడు చిన్నగా అనిపించినా అవే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. మిమ్మల్ని పక్కవాళ్ళు ఎంత తక్కువగా చూసినా ఎక్కువ మనీ సంపాదించట్లేదు. సరైన స్కిల్స్ లేవు.
(03:51) బెస్ట్ గ్రేడ్స్ లేవు అని జాలిపడిన మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏం కోరుకున్నారు ఏవో సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టినా వాటిని దాటుకుంటూ ఈ స్టేజ్ కి వచ్చారు. అందుకే మీ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని మీరు సాధించిన విజయాలు అవి చిన్నవైనా సరే వాటికి విలువివ్వండి. మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకోవడం సంతృప్తి పడడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచి నేను ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది.
(04:18) ఫైనల్ గా ఈ వీడియో ద్వారా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనందరం మనుషులమైనా సరే అందరినీ సంతోష పెట్టలేము. ఎవరితో పోల్చుకోకుండా మన ప్రయాణం మనం చేయాలి. ఇతరుల కోసం కాదు మన మనశాంతి కోసం జీవించాలి. ఎప్పుడైతే మీరేంటో మీకు తెలిసిన రోజు మీ మీద మీకు నమ్మకం ఉన్న రోజు ఇతరుల మాటలకు అభిప్రాయాలకి పవర్ ఉండదు.
(04:41) కాబట్టి ఇతరుల అంచనాల నుండి బయటక వచ్చి మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి జీవించడం మొదలు పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇతరుల ఆలోచనల నుండి వాళ్ళు మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఎలా బయట పడాలి అనేది ఒక ఐదు పాయింట్స్ లో వివరంగా డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
(04:59) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే తెలుగు అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థాంక్యూ గారు

No comments:

Post a Comment