ఓషో చెప్పిన జీవిత సత్యం మీరే ఒక అద్భుతం | The Power of Self Discovery by Osho | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xAl9Q6qT6Es
Transcript:
(00:00) ప్రపంచం మొత్తం నిన్ను చూసి నవ్వుతున్న నీ లోపల ఏదో తెలియని బాధ ఉన్నా నువ్వు ఒంటరిగా అలసిపోయి ఉన్నా ఒక్క నిమిషం ఆగు అసలు నువ్వు ఎందుకు ఇక్కడదాకా వచ్చావో నీకు గుర్తుందా జీవితాన్ని జయించడం అంటే డబ్బులు సంపాదించడం కాదు నీ లోపల పొంగుతున్న నిరాశని నీ ఆలోచనల హోరుని శాసిస్తూ నిలబడటం ఈ వీడియో నీ లైఫ్ మార్చేయబోతుంది.
(00:22) చివరి వరకు వింటే నీలో ఉన్న ఒక కొత్త మనిషిని నువ్వు చూస్తావు. చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అన్ని ఉన్నా ఏదో తెలియని ఒక బాధ ఎంత సంపాదిస్తున్నా ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా లోపల మాత్రం ఒక రకమైన బాధ. మన చుట్టూ జనం ఉంటారు. కానీ ఒంటరిగా ఫీల్ అవుతాం. అది ఒక రకమైన డిసపాయింట్మెంట్. లైఫ్ లో అనుకున్నది జరగనప్పుడు మనల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపించినప్పుడు ఒక అలజడి మొదలవుతుంది.
(00:48) అలజడి సముద్రం ఊరు కంటే భయంకరంగా ఉంటుంది. మనకి మనం నచ్చం. మన పనులు మనకి బోర్ కొడతాయి. రేపటి మీద ఆశ చచ్చిపోతుంది. అదే అసలైన సమస్య. బయట ప్రపంచంతో యుద్ధం చేయడం ఈజీనే కానీ మన లోపల ఉన్న ఈ శూన్యంతో పోరాడటం చాలా కష్టం. ఈ ఎంటీనెస్ ని ఎలా నింపుకోవాలో తెలియక మనం దేని వెనుకో పరిగెడుతూ ఉంటాం. కానీ గమ్యం మాత్రం దొరకదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం మన గమ్యాన్ని బయట ఎక్కడో వెతుకుతున్నాం.
(01:13) సక్సెస్ అంటే పక్కవాడి కంటే గొప్పగా ఉండటం అనుకుంటున్నాం. మన బాధ్యతల్ని మనం ఒక భారంగా ఫీల్ అవుతున్నాం. మన మైండ్ ఎప్పుడూ పాస్ట్ లో జరిగిన తప్పుల గురించి లేదా ఫ్యూచర్ లో జరగబోయే భయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రెజెంట్ లో మౌనంగా కూర్చొని మన ఊపిరి మనం గమనించే టైం కూడా మనకి లేదు. ఈ ప్రపంచం నుంచి వచ్చే నాయిస్ లో మన అంతరాత్మ గొంతు మనకి వినిపించట్లేదు.
(01:37) మనుషుల మీద వస్తువుల మీద అతిగా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు లేనప్పుడు లేదా అవి దొరకనప్పుడు మన ప్రశాంతత ముక్కలైపోతుంది. [సంగీతం] అలా మనలో ఉన్న ఆ ప్రశాంతత అనేది ముక్కలు అవ్వడానికి కారణం బయట ప్రపంచం కాదు. మన లోపల మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను అలా అవ్వాలి నేను ఇలా అవ్వాలి ఈ టైం కల్ల నేను ఇది అయిపోవాలి అని చెప్పేసి సో దీని పరిష్కారం ఏంటో తెలుసా మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించడం అనే దానికంటే ఆ సంపాదించే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.
(02:06) ఫస్ట్ అఫ్ ఆల్ నీకు ఎదురయ్యే నిరాశని అంగీకరించు. అవును నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యాను. నేను ఇప్పుడు బాధగా ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకో అంగీకారం నుంచే మార్పు మొదలవుతుంది. ఒకవేళ మీరు అంగీకరించకుండా నా తప్పు లేదు దేవుడు తప్పు చేశడు సమాజం తప్పు చేసింది బయట అందరూ మంచిగా లేరు అని అనుకున్నంత కాలం ఆ విషయం దేవుడికి తెలియదు బయట జనాలకి తెలియదు.
(02:28) మీలో మీరు అనుకుంటూ బాధపడుతూనే ఉంటారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అని మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి మీ తప్పుని మీరు ఒప్పుకోండి ఆ తర్వాత నీ బాధ్యతలని ప్రేమించడం మొదలు పెట్టు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇన్ని డబ్బులు సంపాదించాలి ఇంతమందిని చూసుకోవాలి అది నీ బాధ్యత ఎందుకంటే మనల్ని ఇంకొకళ్ళు చూసుకున్నప్పుడు ఈ వయసుకొచ్చేంత వరకు మనం కూడా వాళ్ళని చూసుకోవాలి కదా సో అది నీ బాధ్యత నీ బాధ్యతని ప్రేమించడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు నీలో ఆల్మోస్ట్ మార్పు అనేది మొదలైనట్లే ప్రతి ఒక్క చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని ఒక సేవలా చేయి నీ పట్ల నువ్వు కరుణతో ఉండు రోజులో కనీసం
(03:04) 10 నిమిషాలు మౌనంగా ఉండు ఆ మౌనం నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని కడిగేస్తుంది. ఎందుకంటే అప్పుడు నీతో నువ్వు మాట్లాడుకుంటావు కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఎక్కడ తప్పు జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకి నీ మౌనంలో నుంచి సమాధానం వస్తుంది. అలా సమాధానం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నీ కంట్రోల్ లో లేని విషయాల గురించి ఆలోచించడం ఆటోమేటిక్ గా మానేస్తావు.
(03:28) అవును ఇప్పుడు వర్షం పడుతుంది. నేను ఆపగలనా ట్రాఫిక్ అవుతుంది. నేను ఆపగలనా ఇవేవి మన చేతుల్లో లేవు. మన చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అంటే నేను ఫెయిల్ అయ్యాను. ఓకే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచన మళ్ళీ మీలో మొదలవుతుంది. ఇంతకుముందు చేసిన తప్పు మళ్ళీ మీరు చేయరు. కాబట్టి మీతో మీరు మాట్లాడుకోండి.
(03:48) అలా మాట్లాడుకోవడం వల్ల మీ చేతిలో ఉన్న పనిని పర్ఫెక్ట్ గా చేయడం ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు మీ అహాన్ని పక్కన పెట్టి నేను నిమిత్త మాత్రుడిని అని నమ్ముతారో అప్పుడే మీకు అసలైన బలం వస్తుంది. ఆ బలం రావడానికి మెయిన్ గా ప్రతి ఒక్క మనిషికి కావలసిన రెండే రెండు ఎమోషన్లు ఒకటి దైవ చింతన ఏ దేవుడైనా పర్వాలేదు.
(04:08) దేవుడు ఏం చెప్తాడు మనుషులు మనుషులు కొట్టుకోండి అని చెప్తాడా మనుషులు మనుషులు ప్రశాంతంగా ఉండండి అని మాత్రమే చెప్తాడు. లేకపోతే ఆధ్యాత్మికత అనేది మనిషికి ఒక వెలుగునిస్తుంది. సో నిజమైన గెలుపు అంటే మనం డబ్బు సంపాదించడం కాదు ఆ డబ్బు సంపాదించే పనిని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేయటమే ఈ రోజు నుంచి నీ ఆలోచన తీరు మార్చుకో వైఫల్యం ఎదురైనప్పుడు అది ముగింపు అనుకో అది ఒక కొత్త పాఠం అని గుర్తుంచుకో ప్రతిరోజు నిద్ర లేవగానే నీకున్న బాధ్యతల్ని ఒక అవకాశంగా చూడు నీ చుట్టూ ఉన్న మనుషులకి ప్రేమను పంచడం మొదలు పెట్టు ఎందుకంటే నువ్వు ఇచ్చేది నీకు తిరిగి వస్తుంది. మౌనం అనేది నీ ఆయుధం
(04:45) కావాలి అనవసరమైన మాటలు అనవసరమైన గొడవలు నీ ఎనర్జీని వేస్ట్ చేస్తాయి. నీ లోపల ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టు నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకో ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీ ఉంటుంది. నీ ప్రొడక్టివిటీ అమాంతం పెరిగిపోతుంది. నువ్వు లోపల మారితే నీ ప్రపంచం ఆటోమేటిక్ గా మారిపోతుంది.
(05:08) ఓటమిని చూసి నవ్వడం నేర్చుకో అప్పుడు గెలుపు నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఈ క్షణం నుంచి ఆ మార్పు మొదలవ్వాలి. ఈ వీడియో చూసాక మీ మనసులో ఏదో ఒక మూల నేను మారాలి అనే ఒక చిన్న స్పందన కలిగిన అదే నా విజయం. నా లోపల ఉన్న ఆ అలజడిని తగ్గించుకొని నా లోపల ఉన్న డబ్బు సంపాదించాలి అనే కోరికను తగ్గించుకొని ఆ డబ్బు సంపాదించే పనిని ప్రేమించడం మొదలు పెట్టండి.
(05:30) అలా మొదలు పెట్టిన మరుక్షణం మీరు నిజంగా గెలిచినట్లే చివరిగా మీకోసం ఒక చిన్న ప్రశ్న మీ జీవితంలో మీరు ఎదుర్కున్న అతి పెద్ద ప్రయాణం ఏంటి? దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కుంటున్నారా లేక భయంతో వదిలేశారా మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో నేను నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను నేను నా ప్రయాణంలో గెలవబోతున్నాను అని టైప్ చేసి మాతో పాటు పంచుకోండి.
(05:52) ఈ కామెంట్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. ఓం
No comments:
Post a Comment