Wednesday, February 25, 2026

రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రశాంతత రహస్యం | Sri Ramakrishna's Lessons for Peace | Satyagrahi

రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రశాంతత రహస్యం | Sri Ramakrishna's Lessons for Peace | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yRHSdoyxVk4



Transcript:
(00:00) అందరూ పరిగెడుతున్నారు. మీరు కూడా పరిగెడుతున్నారు. మంచి జాబ్ వచ్చింది. చేతి నిండ జీతం వస్తుంది. కోరుకున్న ఫోన్ కొన్నారు నచ్చిన కార్లు తిరుగుతున్నారు. కాకపోతే జీవితంలో ఇంకా ఏదో కావాలని ఆశ ఎంత ఉన్నా సరే మనసుఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు. ఇలా ఎప్పుడైనా మీకు అనిపించిందా? అన్ని ఉన్నా ప్రశాంతత లేదు. ఎంత సంపాదించినా జీవితంలో సంతోషం అనేది లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీకు ఎప్పుడైనా సరే అన్ని ఉన్నా కూడా లేనట్టు అనిపించిందా? ఒకవేళ ఇలా అనిపిస్తే మాత్రం సమస్య ఎక్కడఉందో తెలుసా ఆ సమస్య మీలోనే
(00:34) ఉంది. ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లేకపోతే మీ జీవితం ఒక ముగింపు లేని పరుగు పందెంలా మిగిలిపోతుంది. ఇంక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే అసలు సమస్య ఏంటంటే మనందరికీ ఒక అలవాటు ఉంది. సంతోషం అంటే ఒక గోల్ అనుకుంటాం. ఆ ఒక్క ప్రమోషన్ వస్తే చాలు నేను హ్యాపీ. ఆ ఒక్క ఇల్లు కొంటే చాలు ఇక లైఫ్ సెటిల్డ్ కానీ నిజం ఏంటో తెలుసా ఆ ఇల్లు కొన్నాక ఆ ప్రమోషన్ వచ్చాక ఒక రెండు రోజులు బాగుంటుంది.
(01:01) మూడో రోజు నుంచి మళ్ళీ అదే అసంతృప్తి. బయట నుంచి మీరు ఎంత సంపాదిస్తున్నా ఎన్ని వస్తువులు పోగేసుకున్నా లోపల మాత్రం ఏదో తెలియని అశాంతి. పక్కనే అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్. మీ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కానీ మీ మనసు మాత్రం ఇప్పుడు ఇంకా ఏదో కావాలని ఆకలితో అలమడిస్తుంది. సరిగ్గా ఇక్కడే మనం అసలైన జీవితాన్ని మిస్ అవుతున్నాం.
(01:23) మీ దగ్గర ఉన్న వాటిని ఎంజాయ్ చేయలేకపోవడం లేని వాటి కోసం నిరంతరం తపించడం. ఇదే ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? ఈ సమస్యకు కారణం పోలిక. ప్రపంచంలో మన కంటికి కనిపించిన ప్రతి ఒక్కడితో మనం పోలిక పెట్టుకుంటాం. అలాంటిది ఇంటి పక్కన ఉన్నోడితో మన బంధువులతో వాళ్ళతో పోలికలు పెట్టుకోలేమా వాళ్ళతోనే మన పోలికలు స్టార్ట్ అవుతాయి.
(01:46) వాడు ఉద్యోగం తెచ్చుకున్నాడు నేను తెచ్చుకోలేదు. వాడు సంపాదిస్తున్నాడు నేను సంపాదించట్లేదు. వాడేంటి ఇంత అందంగా ఉన్నాడు నేను లేను. వాడికి జుట్టు ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది. వాడు ఎర్రగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నాను. సో ఇలాగ మనల్ని మనం పోలికలతో చంపవతలు పడేసుకుంటే సమస్యకి ఏమ వస్తుంది చెప్పండి. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ జీవితాన్ని ఇచ్చాడు.
(02:04) కానీ మనుషులందరూ ఏమనుకుంటారంటే అందరి జీవితాలు ఒకేలా ఉండాలని చెప్పి అనుకుంటారు. నిజం చెప్పండి అది పాసిబులా అస్సలు పాసిబుల్ కాదు అందులోనూ మన మైండ్ ఎప్పుడూ గతంలోనో లేకపోతే భవిష్యత్తులోనో అలా ఉంటూనే ఉంటుంది. ప్రెజెంట్ లో అస్సలు ఉండదు. అదిఒక పెద్ద సమస్య రామకృష్ణ పరమస గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. గాలిపటం ఎగురుతున్నప్పుడు అది గాలిలో ఎంత ఎత్తుకెళ్ళినా దాని దారం మాత్రం నీ చేతిలోనే ఉండాలి.
(02:31) అలాగే నీ మనసు అనేది ఎక్కడెక్కడో తిరుగుతున్న ఏవేవో అనుకున్నా సరే దాని నియంత్రణ నీ దగ్గరే ఉండాలి. అంటే నీ మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి అనేది నీలో ఉండాలి. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే దారం తెగిపోయిన గాలిపటం లాగా మీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. చాలా మంది మనసుని కంట్రోల్ చేసుకోలేరు. స్వీట్స్ తినకూడదు అనుకుంటారు. చూసిన వెంటనే తినేస్తారు.
(02:52) కష్టపడి చదవాలి అనుకుంటారు. ఊరికినే డైవర్ట్ అయిపోతారు. లేదా జీవితంలో నేను ఎదగాలి అని చెప్పేసి అనుకుంటారు. రేపు పొద్దునకి ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇలా తెగిపోయిన గాలిపటం లాగా అక్కడ ఎక్కడో తిరుగుతూ ఉన్నప్పుడు మీరు మనశశాంతిగా ఎలా ఉంటారు చెప్పండి. అందులోనూ మనశశాంతి అనేది లేకపోవడం అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది.
(03:11) అది మిమ్మల్ని ఎప్పటికీ ప్రస్తుతంలో బ్రతకనివ్వదు. ఫలితంగా ఏమవుతుందో తెలుసా? చిన్న చిన్న విషయాలకి కోపం రావటం ఇంట్లో వాళ్ళతో గొడవలు తెలియని డిప్రెషన్ రిలేషన్షిప్ లో గ్యాప్ మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే లోపల మనశశాంతి లేకపోతే ఆ ఎదుగుదలకి అర్థమే లేదు. ఒక నిండు కుండలా ఉండాల్సిన మీ జీవితం చిల్లులు పడ్డ పాత్రలా మారిపోతుంది. ఎంత పోసినా అది నిండదు.
(03:35) సో ఈ సమస్యను మనం ఇలా అధిగమించాలి అంటే దీనికి పరిష్కారం ముందుగా మనం ఒక విషయాన్ని బలంగా నమ్మాలి. సంతోషం అనేది వస్తువులలో లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా సంతోషం వచ్చేస్తుంది. అంటే మీరు ఎవరు? మీకు నిజంగా ఏం కావాలి? మీ నిజమైన ఆనందం మీరు [సంగీతం] ఎప్పుడు పొందగలుగుతున్నారు. అందరిలాగా ఐఫోన్ కొన్నప్పుడా కొందరిలాగా టూర్లకు వెళ్ళినప్పుడా లేకపోతే ఇంకొకళని చూసి కాపీ కొట్టి వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అది చేసినప్పుడా అది నిజమైన ఆనందమా లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా చేయడం వల్లే వచ్చే ఆనందమా? దీనికి క్లారిటీ కావాలి. అందుకనే
(04:11) మీరు ఎవరు మీకు నిజంగా ఏం కావాలి అనేది. సో ఈ రెండు ప్రశ్నలకి మీకు కరెక్ట్ గా ఆన్సర్ దొరికిందనుకోండి మీ జీవితంలో అశాంతి అనేది ఖచ్చితంగా మటుమయం అయిపోతుంది. రామకృష్ణ పరహంస గారు చెప్పినట్లు మొరికిగా ఉన్న అద్దంలో నీ ముఖం సరిగ్గా కనిపించదు. అలాగే మాలిన్యంతో నిండిన మనసులో దైవత్వం లేదా ప్రశాంతత కనిపించదు.
(04:34) మన మనసు మీద పేరుగుపోయిన అసూయ అతి ఆశ పోలిక అనే మురికిని ముందు వదిలించుకోవాలి. సంతోషం అంటే ఏదో సాధించాక వచ్చే రిజల్ట్ కాదు. అది మీరు ప్రయణించే దారిలోనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఊరో లేకపోతే ఏదో ట్రిప్ కో వెళ్తున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆనందంగా ఉంటాం. ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్లే ఆ జర్నీని గనుక మీరు ఎంజాయ్ చేయగలిగితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చే ఆనందం కన్నా జర్నీలోనే మీరు మరింత ఆనందంగా ఉంటారు కదా అది ఆయన చెప్పిన పాయింట్.
(05:04) మీ దగ్గర ఉన్న చిన్న వస్తువునైనా ప్రేమించడం నేర్చుకోండి. మీ శ్వాసను గమనించండి. మీరు బ్రతికి ఉన్నారని నిజాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ప్రపంచం మిమ్మల్ని ఏదో అవ్వమని ఒత్తుడు తెస్తుంది కానీ మీరు మీరులా ఉండటమే అన్నిటికంటే పెద్ద విజయం. ఎప్పుడైతే మీకు మీ మీద క్లారిటీ వస్తుందో అప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ లోపల ఒక నిశశబ్దం ఒక ప్రశాంతత నెలకుంటుంది.
(05:27) అంటే మిమ్మల్ని 100 మంది వచ్చి తిట్టినా లేకపోతే ఇంకొక 100 మంది వచ్చి పొగిడినా సరే మీకు తెలుసు కదా మీరెవరో మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు ఇంకొకడు పొడాల్సిన అవసరం ఏంటి? మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు ఇంకొకటి తిడితే మీరు బాధపడాల్సిన అవసరం ఏముంది కాబట్టి మీరు ఎవరో మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీ మీద మీకు క్లారిటీ ఉండాలి. సరే ఇదంతా బాగానే ఉంది.
(05:47) నా మీద నాకు క్లారిటీ ఎలా వస్తుంది నేను ఎవరో నాకు ఇలా తెలుస్తుంది అంటే మాత్రం రోజుకి మీరు మీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఫోన్ పక్కన పడేయండి. ఏ మ్యూజిక్ వినవద్దు. ఎవరితోనూ మాట్లాడవద్దు. కేవలం మౌనంగా కూర్చోండి. మీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో వాటిని గమనించండి. మొదట్లో మీ మైండ్ ఒక కోతిలా అటు ఎందుతుంది. పాత గొడవలు గుర్తొస్తాయి లేకపోతే ఇంతకుముందు జరిగిన సంఘటలన్నీ గుర్తొస్తాయి.
(06:10) అందులోన సడన్ గా మీ భవిష్యత్తు గురించి మీకు భయాలు మొదలవుతాయి. కానీ మీరు మాత్రం కదలకుండా కూర్చోండి. ఆ మౌనంలోనే మీకు మీ అసలైన శక్తి పరిచయం అవుతుంది. రామకృష్ణ పరమహంస గారు తరచు చెప్పేవారు. ముందు మీ లోపల దీపాన్ని వెలిగించు. అప్పుడు బయట ఉన్న చీకట దానంతర అదే పోతుంది అని చెప్పేసి. సో మీ చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించండి. మీ పనిని ఇష్టపడండి.
(06:32) కానీ మీ జీవితంలో ఉండే ప్రశాంతతని దేనికి తాకట్టు పెట్టకండి. తాకట్టు పెట్టడం అంటే చాలా మంది అవసరం లేకపోయినా సరే కొన్ని వస్తువులు ఈఎంఐ లో కొంటారు. సో ఆ ఈఎంఐ తీరేంతవరకు మన మనశశాంతి అనేది ఆ వస్తువు కోసం తాకట పెట్టినట్లే కదా కొన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. అవి మనిషికి జీవితంలో చాలా అవసరం. సో వాటి కోసం మనసు తాకడ పెట్టినా పర్వాలేదు ఎందుకంటే ఆ వస్తువు నాతో జీవితాంతం ఉంటుంది నా పిల్లలకి పనికొస్తుంది.
(06:57) నేను నా పిల్లల కోసం సంపాదించాను అనే ఫీలింగ్ మనలో కూడా ఉంటుంది. కానీ రెండు మూడు సంవత్సరాల్లో పాడైపోయే వస్తువులకి మీరు మనశశాంతిని తాకట్టు పెట్టి ఈఎంఐ లు కడుతూ ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. అందుకనే రామకృష్ణ పరహంస గారు ఏమంటారంటే మీ మనశశాంతిని తాకట్టు పెట్టకండి. మీ పనిని ప్రేమించండి. చుట్టూ ఉన్న మనుషుల్ని గౌరవించండి.
(07:16) అంతే అంతకుమించి ఏమ లేదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి నేను పరిగెడతాను కానీ నా ప్రశాంతతని వదిలేసి మాత్రం కాదు నేను సంపాదిస్తాను కానీ నా సంతోషాన్ని అమ్ముకొని కాదు. గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మీరు సంపాదించగలిగే అతి ఖరీదైన ఆస్తి ఏదైనా ఉంది అంటే కేవలం మనశశాంతి మాత్రమే. అది ఉన్నప్పుడే సాయంత్రం పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
(07:41) ఒకవేళ నిద్ర పట్టకపోయినా సరే మీకు నిద్ర వచ్చినప్పుడు పడుకుంటారు. కానీ మనశశాంతి అనేది లేకపోతే నిద్ర పట్టదు. సో మీ నిద్రను చెడగొట్టే వస్తువుల కోసం లేకపోతే మీ నిద్రను చెడగొట్టే మనుషుల కోసం మీ మనశశాంతిని ఎందుకు పోగొట్టుకుంటారు మీరు కాబట్టి మీ మనసుకు నచ్చిన పని చేయండి. 100 చెప్తారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు ఆ పని చేయడం ఏంటి నీ జీవితం ఇంత తక్కువ అని చెప్పేసి 100 అంటారు.
(08:03) వాడు వాడి మనశశాంతిని చెడగొట్టుకొని మరి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వాడు వాడి మనశశాంతిని చంపుకొని మరి ఇష్టం లేకుండా వేరే పని చేస్తున్నాడు. వాడు వాడి మనశశాంతిని చంపుకొని మరి వేరే ఊరు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నాడు. అలా అని చెప్పేసి మీరు మీ మనశశాంతిని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా వేరే ఊరు వెళ్లి పని చేయడం ఇష్టమైతే వెళ్ళండి పని చేయండి.
(08:23) మీకు నిజంగా ఆ వస్తువు కొనుక్కోవడం ఇష్టమైతే ఆ వస్తువు మీ జీవిత లక్ష్యం అయితే కష్టపడి పని చేయండి. అంతేగానీ ఇంకొకడిని చూసి మాత్రం కాపీ కొట్టకండి. సో రామకృష్ణ పరహంస గారు చెప్పినట్లు ఖరీదైన ఆస్తి అనేది మనశశాంతి దాని తర్వాతే డబ్బులైనా దాని తర్వాతే ఆస్తిపాస్తులైనా సరే కాబట్టి మనశశాంతిని మాత్రం పోగొట్టే పనులు అస్సలు చేయకండి అంతే అంతకుమించి ఏం లేదు నిజం చెప్పండి ఈ రోజంతా మీరు గడిపిన సమయంలో మనస్ఫూర్తిగా నవ్వుతూ ఏ ఆలోచన లేకుండా కనీసం ఒక ఐదు నిమిషాలనే గడిపారా మీరు సంపాదిస్తున్న ఈ డబ్బు హోదా ఇవన్నీ మీ మనసుకి ప్రశాంతతని ఇస్తున్నాయా లేక ఇంకా ఒత్తిడిని
(08:59) పెంచుతున్నాయా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. ఎందుకంటే మీ సమాధానం మరొకరికి స్ఫూర్తిని ఇవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఈ వీడియో గనుక మీకు నచ్చిందనుకోండి కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
(09:24) ఓం ఓం

No comments:

Post a Comment