జీవిత భాగస్వామి శత్రువుగా మారితే? శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన పరిష్కారం! | Krishna Vani
Author Name:Telugu Box Stories
Youtube Channel Url:https://www.youtube.com/@telugubox_stories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IQ2sR4tUQIA
Transcript:
(00:00) నమస్కారం మిత్రులారా ఈ ప్రపంచంలో బయట ఉన్న శత్రువులతో పోరాడటం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు. మనం అలసిపోయి ఇంటికివచ్చి తలుపు వేసుకుంటే మనకొక రక్షణ దొరుకుతుంది. ఒక ప్రశాంతత దొరుకుతుంది. కానీ మనకు రక్షణ ఇవ్వాల్సిన ఇల్లే నరకంగా మారితే మనకు తోడుగా నీడగా ఉండాల్సిన జీవిత భాగస్వామే మన పాలిట శత్రువుగా మారితే ఆ పరిస్థితిని వర్ణించడానికి మాటలు సరిపోవు.
(00:32) అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. పెళ్లి అనేది రెండు మనసుల కలయక అని అందరూ అంటారు. ఏదో ఒక నమ్మకంతో ఎన్నో ఆశలతో మనం ఒక వ్యక్తి చేతిలో మన జీవితాన్ని పెడతాం. నాకు కష్టం వస్తే తను ఉంది అని లోకం మొత్తం నన్ను కాదన్నా తను నన్ను అర్థం చేసుకుంటాడు అని ఒక ధైర్యంతో ఉంటాం. కానీ ఈరోజు ఆ మనిషి నీడను చూస్తేనే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ప్రేమగా పలికిన గొంతు ఇప్పుడు ముల్లుగా మారి గుండెల్లో గుచ్చుతుంటే ఆ బాధను ఎవరికి చెప్పుకోగలం ఇది శారీరక గాయం కాదు కనిపించడానికి ఇది మానసిక గాయం.
(01:14) బయట వాళ్ళకు చెప్పుకుంటే సర్దుకు పోవాలి ఓపిక ఉండాలి అని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ ఆ నాలుగు గోడల మధ్య మీరు అనుభవిస్తున్న నరకం వారికేం తెలుసు. లోలోపల కుమిలిపోతే ఆరోగ్యం పాడవుతుంది. బయటపడి ఏడిస్తే పరువు పోతుందనే భయం. ఒక విచిత్రమైన ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పక్కనే మనిషి ఉంటాడు. కానీ మీరు మాత్రం ఒంటరివారే. ఒకే మంచం మీద పడుకుంటారు.
(01:43) కానీ మీ మధ్య కొన్ని మైళల దూరం ఉంటుంది. నిజానికి ఒక భార్యకు లేదా భర్తకు తన భాగస్వామి నుండి కావాల్సింది ఆస్తులు కాదు అంతస్తులు కాదు ఖరీదైన బహుమతులు అంతకన్నా కాదు. కాస్త ప్రేమ కాస్త గౌరవం నేను ఉన్నాను అనే చిన్న భరోసా ఎప్పుడైతే ఆ భరోసా పోతుందో ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఒక యుద్ధభూమిలా మారుతుంది. రోజు ఉదయం లేవగానే ఒక తెలియని భయం ఈరోజు ఏ గొడవ జరుగుతుందో ఏ చిన్న మాటకు పెద్ద యుద్ధం అవుతుందో నేను నవ్వితే తప్పు మాట్లాడితే తప్పు చివరకు మౌనంగా ఉన్నా తప్పేనా అని ప్రతిక్షణం అప్రమత్తంగా [సంగీతం] బ్రతకడం ఎంత నరకం.
(02:27) అసలు వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు? ఒకప్పుడు ప్రాణంగా చూసుకున్న మనిషి ఇప్పుడు ఇలా రాక్షసుడిలా ఎందుకు మారారు? ఇది మీ కర్మనా లేక వాళ్ళ ప్రవర్తన లేక డబ్బు అహంకారం లేదా మూడో మనిషి ప్రభావం ఏదైనా ఉందా దీనికి పరిష్కారం లేదా జీవితాంతం ఇలా భయపడుతూ ఏడుస్తూనే బ్రతకాలా కాదు ఖచ్చితంగా పరిష్కారం ఉంది. మన పురాణాల్లో చాణక్య నీతిలో మరియు మోడర్న్ సైకాలజీలో ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు అద్భుతమైన మార్గాలు చెప్పారు.
(03:00) కొన్నిసార్లు మౌనమే సమాధానం కొన్నిసార్లు తెగించి పోరాడటమే మార్గం కానీ ఎప్పుడు ఏది చేయాలో తెలియడమే అసలైన వివేకం ఈ వీడియో కేవలం మీ సమస్యను గుర్తుచేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మీకుొక దారి చూపించడానికి మీ భుజం తట్టి ధైర్యంగా ఉండు అని చెప్పడానికి ఈ ప్రయాణంలో మనం వారి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం.
(03:26) మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుందాం. మరియు ఆఖరిగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరివారు కాదు ఈ వీడియో చూస్తున్న మీలాంటి వారు లక్షల్లో ఉన్నారు. మీరు ఓడిపోలేదు మీరు కేవలం అలసిపోయారంతే ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్ళను తుడిచే సమయం వచ్చింది.
(03:54) మిత్రులారా మనం ప్రేమించిన వారు శత్రువుగా మారితే వచ్చే నొప్పి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. అసలు మా మధ్య జరుగుతున్నది సాధారణ గొడవలేనా లేక నా భాగస్వామి నిజంగానే విషపూరితమైన వ్యక్తిగా మారాడా అని ఎలా గుర్తించాలి చూడండి పాత్రలు అన్నాక తోముకునేటప్పుడు శబ్దం రావడం సహజం. ప్రతి ఇంట్లోనూ భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి.
(04:20) చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. కానీ ఆరోగ్యకరమైన గొడవలకు మరియు అనారోగ్యకరమైన బంధానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒక సాధారణ గొడవలో కోపం ఉంటుంది కానీ ద్వేషం ఉండదు. మాట జారిన ఆ తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. క్షమించు అని అడగడం ఉంటుంది. కానీ మీ భాగస్వామి నిజంగానే మీకు శత్రువుగా మారుతుంటే వారి ప్రవర్తనలో ఈ ఐదు ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయి.
(04:50) వీటిని జాగ్రత్తగా గమనించండి. ఇవి మీ జీవితంలో జరుగుతున్నాయేమో చెక్ చేసుకోండి. ఒకటి గౌరవం లేకపోవడం గొడవలో కోపం రావడం సహజం కానీ ఆ కోపంలో కూడా ఒక హద్దు ఉండాలి. మీ భాగస్వామి ఆ హద్దు దాడుతున్నారా మిమ్మల్ని నలుగురిలో పిల్లల ముందు లేదా బంధువుల ముందు అవమానిస్తున్నారా మీ తల్లిదండ్రులను మీ పెంపకాన్ని మీ కులాన్ని లేదా మీ రూపాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? నీకు బుద్ధి లేదు నువ్వు దేనికి పనికి రావు అని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి గౌరవం లేని చోట ప్రేమ ఉండదు అది కేవలం బానిసత్వం మాత్రమే రెండు మీ తప్పు లేకపోయినా నిందించడం ఇంట్లో ఏది
(05:36) జరిగినా దానికి మీరే కారణమని వేలెత్తి చూపిస్తున్నారా? పిల్లలు చదవకపోయినా మీదే తప్పు వాళ్ళకు ఆఫీసులో సమస్యలు వచ్చినా మీదే తప్పు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మీ జాతకమే బాలేదని నిందించడం. చివరకు వాళ్ళు కోపంతో అరిచి చేతులు చేసుకున్నా సరే నువ్వు రెచ్చగొట్టావు కాబట్టే నేను కొట్టాను అని ఆ తప్పును కూడా మీ మీదే నెట్టేస్తున్నారా దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు.
(06:05) అంటే మీరు పిచ్చివాళ్ళు అవుతున్నారేమో నిజంగానే మీదే తప్పేమో అనే అనుమానం మీకే కలిగేలా చేయడం. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక స్థితి. మూడు మౌఢ శిక్ష. ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడం పద్ధతి కానీ రోజుల తరబడి వారాల తరబడి మీతో మాట్లాడకుండా ముఖం తిప్పుకొని తిరుగుతున్నారా ఒకే ఇంట్లో ఉంటూ దెయ్యాల్లా ప్రవర్తిస్తున్నారా ఇది ప్రశాంతత కోసం ఉండే మౌనం కాదు ఇది మిమ్మల్ని శిక్షించడానికి వాడే మౌనం మిమ్మల్ని అస్తిత్వం లేని వ్యక్తిగా చూడడం ద్వారా మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతిమాలుకునేలా చేయడం వారి ఉద్దేశం.
(06:42) నాలుగు అనుమానం మరియు కంట్రోల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ప్రతి నిమిషం ఆరా తీస్తున్నారా మీ స్నేహితులతో పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని కండిషన్లు పెడుతున్నారా మీ డబ్బును మీ సమయాన్ని మీ నిర్ణయాలను పూర్తిగా వాళ్లే కంట్రోల్ చేస్తున్నారా ప్రేమ పేరుతో మీ స్వేచ్ఛను హరిస్తుంటే అది ప్రేమ కాదు ఒక ఓపెన్ జైలు ఐదు భయం ఇది అన్నింటికంటే పెద్ద పెద్ద లక్షణం మీరు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నారా ఈ మాట మాట్లాడితే ఏం గొడవ అవుతుందో అని ప్రతిక్షణం గుండెదడతో బతుకుతున్నారా మీ భాగస్వామి పక్కన ఉన్నప్పుడు మీకు ప్రశాంతత కంటే భయమే
(07:25) ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆ బంధం విషపూరితమైనదే ఈ ఐదు లక్షణాల్లో ఏవి మీ జీవితంలో ఉన్నా మీరు జాగ్రత్త పడాలి. మిత్రులారా ఇప్పుడు మీ మనసులో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న అసలు వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు పెళ్లికి ముందు ప్రాణంగా చూసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా రాక్షసుడిలా రాక్షసులా ప్రవర్తిస్తున్నారు నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా లేక నేను చేసిన తప్ప చూడండి ఒక మనిషి ప్రవర్తన హటాత్తుగా మారదు దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది.
(08:00) సైకాలజీ ప్రకారం జీవిత భాగస్వామి శత్రువుగా మారడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి. వీటిలో ఏది మీ జీవితానికి సరిపోతుందో గమనించండి. ఒకటి ముసుగు తొలగిపోవడం. ఇది వినడానికి చేదుగా ఉన్న చాలా సందర్భాల్లో ఇదే నిజం. కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టి చాలా మంచివారిగా నటిస్తారు. మీకు నచ్చినట్లుగా మాట్లాడతారు. మిమ్మల్ని ఆకాశంలో ఉంచుతారు.
(08:27) కానీ పెళ్లిఅయ్యాక ఇక వీళ్ళు ఎక్కడికి పోతారులే నా సొంతం అయపోయారు కదా అనే ధీమ వస్తుంది. అప్పుడు వారి అసలు రంగు బయటకు పడుతుంది. అంటే వారు ఇప్పుడు కొత్తగా మారలేదు వారు ఇప్పుడు ఇలాగే ఉండేవారు. కేవలం ఇన్నాళ్ళు మంచి వారిని వేసుకున్న ముసుగు ఇప్పుడు తొలగిపోయింది అంతే. దీన్నే హనీమూన్ ఫేస్ ఎండింగ్ అంటారు. రెండు, ఒత్తిడి, అసహనం.
(08:53) కొన్నిసార్లు వారు చెడ్డవారు కాకపోవచ్చు. కానీ వారి పరిస్థితులు వారిని అలా మారుస్తాయి. ఆఫీసులో బాస్ తిట్టాడనో వ్యాపారంలో నష్టం వచ్చిందనో లేదా అనారోగ్యం వలనో వారిలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ కోపాన్ని బయట చూపించలేక ఇంటికి వచ్చి మీ మీద చూపిస్తారు. ఎందుకంటే మీరు వారికి సాఫ్ట్ టార్గెట్. మిమ్మల్ని తిట్టినా కొట్టినా మీరు తిరిగి ఏమీ అనరు, వదిలి వెళ్లరు అనే ధైర్యం. దీన్నే ఫ్రస్ట్రేషన్ అంటారు.
(09:20) వీరికి ప్రేమ ఉంది కానీ దాన్ని మింగేసేంత కోపం కూడా ఉంది. మూడు డబ్బు పోలిక. ఈ రోజుల్లో చాలా సంబంధాలు చెడిపోవడానికి ప్రధాన కారణం డబ్బు. పక్కింటి వాళ్ళు కారు కొన్నారు మనం కొనలేకపోయాం అనే అసూయ. లేదా నా భర్త సంపాదన సరిపోవడం లేదు, నా భార్య ఉద్యోగం చేయడం లేదు అనే న్యూనతా భావం. ఎప్పుడైతే మనిషి బంధం కంటే డబ్బుకు హోదాకు ఎక్కువ విలువిస్తాడో అప్పుడు పక్కనున్న మనిషి ఒక భారం కనిపిస్తాడు.
(09:51) వారికి మీ ప్రేమ కనబడదు. కేవలం మీ లోపాలు మాత్రమే కనిపిస్తాయి. నువ్వు నా స్థాయికి తగవు అనే అహంకారం వారి కళ్ళను మూసేస్తుంది. నాలుగు అంచనాలు వర్సెస్ నిజం. సినిమాల్లో చూసి నవలల్లో చదివి పెళ్లంటే ఇలాగే ఉండాలి అని కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. కానీ నిజ జీవితంలో బాధ్యతలు కష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆశించిన సినిమా లైఫ్ దొరకదో ఆ నిరాశను మీ మీద ద్వేషంగా మారుస్తారు.
(10:19) మీ వల్లే నా జీవితం ఇలా అయ్యింది అని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. మిత్రులారా స్వచ్ఛమైన నీటిలో ఒక్క చుక్క విషం కలిస్తే ఆ నీరు మొత్తం పనికి రాకుండా పోతుంది. అలాగే రెండు మనసుల మధ్య భార్యా భర్తల మధ్య మూడో మనిషి ప్రవేశిస్తే ఆ బంధం సర్వనాశనం అవుతుంది. మీ భాగస్వామి నిన్నటిదాకా చాలా ప్రేమగా ఉండేవారు కానీ హటాత్తుగా రాక్షసుడిలా రాక్షసిలా మారా అయితే రాసి పెట్టుకోండి.
(10:53) వారి వెనుక ఖచ్చితంగా ఒక మూడో మనిషి ఉండి తీరుతారు. వారెవరు? వారిని ఎలా గుర్తించాలి? ప్రధానంగా ఈ మూడో మనిషి మూడు రూపాల్లో ఉంటాడు. ఒకటి అత్తమామలు బంధువుల ప్రభావం. ఇది మన సమాజంలో అత్యంత సాధారణమైన సమస్య అత్తగారు లేదా ఆడపడుచు కోడలి మీద లేనిపోని చాడీలు చెప్పడం నీ భార్య నిన్ను గౌరవించడం లేదు ఆమె నీ మాట వినడం లేదు అని కొడుకు చెవిలో విషం పోయడం లేదా పుట్టింటివారు కూతురికి ఫోన్ చేసి నీ భర్త నీకేం చేశాడు మా ఇంటి పరువు తీస్తున్నాడు అని రెచ్చగొట్టడం ఎప్పుడైతే మీ భాగస్వామి మీ కళ్ళతో కాకుండా వాళ్ళ అమ్మ నాన్న నాన్న కళ్ళతో మిమ్మల్ని చూడటం మొదలు పెడతారో
(11:40) అప్పుడు మీరు శత్రువులా కనిపిస్తారు. గమనించండి వాళ్ళు బయటకి వెళ్లి వచ్చిన తర్వాత లేదా అమ్మతో ఫోన్ మాట్లాడిన తర్వాత హటాత్తుగా మీ మీద కోపపడుతున్నారా అయితే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంది. బొమ్మ మాత్రం మీ ఇంట్లో ఆడుతోంది. రెండు స్నేహితుల సలహాలు కొంతమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళ సొంత జీవితాలు సరిగ్గా ఉండవు కానీ పక్కవాడికి సలహాలు ఇస్తుంటారు.
(12:08) ఏరా పెళ్లాం చేతిలో కీలు బొమ్మ అయిపోయావా మగాడివైతే కంట్రోల్ లో పెట్టుకో అని మగవారిని రెచ్చగొట్టడం లేదా నీ మొగుడు నీ మాట వినట్లేదా అయితే వదిలేసి రా చూసుకుందాం అని ఆడవారిని తప్పుదారి పట్టించడం. వీరిచ్చేది సలహా కాదు అది అహంకారం. మీ భాగస్వామి కొత్త కొత్త పదాలు వాడుతున్నారా? వింత వింత రూల్స్ మాట్లాడుతున్నారా? అయితే ఎవరో స్నేహితుడు వెనుక ఉండి నడిపిస్తున్నాడు.
(12:37) మూడు పరాయి స్త్రీ పురుషుడు ఇది అన్నింటికంటే భయంకరమైనది. మీ భాగస్వామికి ఆఫీసులోనో సోషల్ మీడియాలోనో వేరే ఎవరితోనైనా పరిచయం ఏర్పడిందా? ఒకసారి వేరే వ్యక్తి మీద ఆకర్షణ పుడితే ఇంట్లో ఉన్న భార్య భర్త ఒక అడ్డుగోడలా కనిపిస్తారు. అందుకే మీ మీద లేనిపోని తప్పులు వెతుకుతారు. నువ్వు అందంగా లేవు నీకు వంట రాదు నీతో మాట్లాడటం బోరు కొడుతోంది అని కారణం లేకుండా గొడవ పడతారు.
(13:09) ఎందుకంటే వాళ్ళ మనసులో వేరే బొమ్మ ఉంది. మీరు ఆ బొమ్మను చెరిపేస్తున్నారు. ఫోనుకు లాక్ వేసుకోవడం రాత్రిపూట రహస్యంగా చాటింగ్ చేయడం మీతో గడపడానికి ఇష్టపడకపోవడం ఇవన్నీ ప్రమాద లక్షణాలు. ఇప్పుడు ఆలోచించండి మీ యుద్ధం ఎవరితో మీ భర్తతోనా మీ భార్యతోనా కాదు వారిని ఆడిస్తున్న ఆ అదృశ్య శక్తితో వాళ్ళు కేవలం ఒక మనిషి మాత్రమే కానీ వారి బుర్రలో ఉన్న ఆలోచనలు వేరే వాళ్ళవి.
(13:39) మిత్రులారా మన సమాజంలో పెళ్లికి ముందుండే హడావిడి ఆర్భాటం కలలు పెళ్లి తర్వాత ఎందుకుండవు సినిమాల్లో హీరో హీరోయిన్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నవలల్లో భర్త భార్యను మహారాణిలా చూసుకుంటాడు. సోషల్ మీడియాలో స్నేహితులు తమ జంట ఫోటోలు పెట్టి మై వరల్డ్ మై లైఫ్ అని క్యాప్షన్లు పెడతారు. ఇవన్నీ చూసి మనం కూడా ఒక ఊహా లోకంలో బతుకుతాం.
(14:10) నా భర్త కూడా నన్ను ఇలాగే చూసుకోవాలి. [సంగీతం] నా భార్య కూడా ఇలాగే ఉండాలి అని కొన్ని అంచనాలు పెంచుకుంటాం. కానీ పెళ్లి తర్వాత జరిగేది వేరు నిజం చాలా కఠినంగా ఉంటుంది. సినిమాల్లో చూపించని వంటగది కష్టాలు ఆఫీస ఒత్తిళ్లు ఆర్థిక సమస్యలు అత్తమామల పోరు ఇవన్నీ నిజ జీవితంలో ఉంటాయి. ఆ పర్ఫెక్ట్ అనిపించిన మనిషిలో కూడా లోపాలు కనిపిస్తాయి. ఆయన గురక పెడతాడు.
(14:41) ఆమెకు కోపం వస్తుంది. ఆయనకు బద్ధకం ఉంటుంది. ఆమెకు అలసట ఉంటుంది. ఎప్పుడైతే ఈ రియల్ లైఫ్ కి మరియు రియల్ లైఫ్ కి మధ్య తేడా వస్తుందో అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. మనం మన భాగస్వామిని ఒక మనిషిగా కాకుండా ఒక సూపర్ హీరో లాగా ఊహించుకుంటాం. నాకు కోపం వస్తే తను అర్థం చేసుకోవాలి. నేను చెప్పకముందే నా మనసులో మాట గ్రహించాలి అని ఆశిస్తాం.
(15:11) కానీ వాళ్ళు మనుషులు మాత్రమే దేవుళ్ళు కాదు ఎప్పుడైతే వాళ్ళు మన అంచనాలను అందుకోలేరో ఆ ప్రేమ కాస్త నిరాశగా మారుతుంది. ఆ నిరాశ మెల్లగా కోపంగా మారుతుంది. ఆ కోపం చివరకు ద్వేషంగా మారుతుంది. నువ్వు మారిపోయావు అని మనం అంటాం. కానీ నిజానికి వాళ్ళు మారలేదు పరిస్థితులు మారాయి. పెళ్లికి ముందు బాధ్యతలు లేవు కేవలం ప్రేమ ఉంది. పెళ్లి తర్వాత బాధ్యతలు వచ్చాయి ప్రేమ వెనక్కి వెళ్ళింది.
(15:43) ఈ నిజాన్ని గ్రహించలేక నువ్వు నన్ను మోసం చేశవు అని ఒకరినొకరు నిందించుకుంటారు. మీరు గమనించారా మీ గొడవలకు అసలు కారణం వాళ్ళు చేసిన తప్పు కాకపోవచ్చు. వాళ్ళు చేయలేకపోయిన పని కావచ్చు. పక్కింటి వాళ్ళు కారు కొన్నారు మనం ఎందుకు కొనలేదు అనే పోలిక. వాళ్ళ ఆయన ఆమెకు నగలు కొన్నాడు నువ్వు కొనలేదు అనే అసంతృప్తి ఇవి మనిషిని రాక్షసుడిగా మారుస్తాయి.
(16:09) మీ భాగస్వామిని శత్రువుగా మార్చింది బయట వ్యక్తులు మాత్రమే కాదు కొన్నిసార్లు మనం ఎవరో తెలియకుండా పెంచుకున్న ఈ అంచనాలే మన పాలిట శత్రువులుగా మారతాయి. మనం వారిని ఒక భాగస్వామిగా చూడటం మానేసి మన కోరికలు తీర్చే ఒక యంత్రంగా చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా ఇప్పటివరకు మనం సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు యుద్ధం ఎలా చేయాలో నేర్చుకుందాం.
(16:34) యుద్ధం అనగానే కత్తులు కటారాలు పట్టుకోవడం కాదు మాటలతో దాడి చేయడం కాదు నిజమైన యుద్ధం నిశశబ్దంగా జరుగుతుంది. అవును మీ జీవిత భాగస్వామి మీకు శత్రువుగా మారినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన అత్యంత శక్తివంతమైన ఆయుధం మౌనం. సాధారణంగా గొడవ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఒక మాట అంటారు మీకు కోపం వస్తుంది. మీరు రెండు మాటలు అంటారు వాళ్ళు నాలుగు మాటలు అంటారు మీరు 10 మాటలు అంటారు అక్కడ గొడవ పెరిగిపోతుంది. మాటలు తూటాల్లా పేలుతాయి.
(17:07) పాత విషయాలు తబ్బి పోసుకుంటారు. చివరకు ఎవరో ఒకరు ఏడుస్తూ లేదా తలుపులు బాదుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో గెలిచింది ఎవరు ఎవర కాదు ఓడిపోయింది ఎవరు? మీ బంధం మీ ప్రశాంతత అందుకే ఈ రోజు నుంచి ఒక కొత్త వ్యూహం అమలు చేయండి. వారు అరుస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు లేదా మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి.
(17:34) గుర్తుపెట్టుకోండి మౌనం అంటే పిరికితనం కాదు భయపడి నోరు మూసుకోవడం వేరు. నీ స్థాయికి నేను దిగజారను అని నిర్ణయించుకుని మౌనంగా ఉండటం వేరు. ఇది మీ ఆత్మగౌరవాన్ని కాపాడే కవచం. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి కోపంతో అరుస్తున్నప్పుడు వారు మీ నుంచి ప్రతియ కోరుకుంటారు. మీరు కూడా అరవాలని ఏడవాలని లేదా భయపడాలని వారు ఆశిస్తారు. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉంటారో వారి అంచనా తప్పుతుంది. వారు కన్ఫ్యూజ్ అవుతారు.
(18:04) నేను ఇంత అరుస్తున్న తను ఎందుకు స్పందించడం లేదు నా మాటలకు విలువ లేదా అని వారి అహంకారం దెబ్బ తింటుంది. అగ్నిలో నెయ్యి పోస్తే మంట పెరుగుతుంది. కానీ అగ్నిలో ఏమి వేయకపోతే దానంతట అదే ఆరిపోతుంది. మీ భాగస్వామి కోపం కూడా అంతే మీరు స్పందించకపోతే కాసేపటికి వాళ్లే అలసిపోయి ఆగిపోతారు. కానీ ఈ మౌనం ఎలా ఉండాలి? ముఖం మార్చుకుని అలిగి కూర్చోవడం కాదు చాలా ప్రశాంతంగా స్థిరంగా ఉండాలి.
(18:36) వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నప్పుడు వారి కళ్ళలోకి సూటిగా చూడండి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీ కళ్ళలో భయం ఉండకూడదు కేవలం ఒక జాలి ఉండాలి. పాపం ఇతను లేదా ఈమె తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు అనే భావన ఉండాలి. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీకు ఆలోచించే సమయం దొరుకుతుంది. అసలు తను ఎందుకు అరుస్తున్నాడు? ఇందులో నిజం ఉండా లేక కేవలం తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడా అని మీరు విశ్లేషించుకోవచ్చు.
(19:06) ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వరో అప్పుడు మీదే పై చెయ్యి అవుతుంది. మాట జారితే వెనక్కి తీసుకోలేం కానీ మౌనం ఎప్పుడూ మనకు నష్టం చేయదు. చాణిక్యుడు కూడా ఇదే చెప్పాడు. మూర్ఖులతో వాదించడం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమం అని కాబట్టి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు అరుస్తున్నప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి.
(19:32) మీ మనసులో నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ మాటలు నన్ను తాకలేవు అని చెప్పుకోండి. మీ మౌనం వారి అరుపుల కంటే గట్టిగా వినిపిస్తుంది. మిత్రులారా మౌనం గురించి తెలుసుకుందాం. కానీ ఆ మౌనం కూడా కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కావాలనే తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. నువ్వు ఇలా చేశవు అలా చేశవు అని అబద్ధాలు చెప్పవచ్చు.
(19:59) అప్పుడు మనలో ఒక ఆవేశం వస్తుంది. లేదు నేను అలా చేయలేదు నువ్వు చెప్పేది తప్పు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. అక్కడే మీరు ఓడిపోతారు. గుర్తుపెట్టుకోండి ఒక మూర్ఖుడితో వాదించడం అంటే మీరే మూర్ఖులుగా మారడమే మీ భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు లేదా విషపూరితంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారికి లాజిక్ అర్థం కాదు వారు వినే స్థితిలో ఉండరు. వారు కేవలం మిమ్మల్ని ఓడించడానికి బాధ పెట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నారు.
(20:29) అలాంటి వారితో మీరు ఎంత నిజం చెప్పినా ఎన్ని సాక్షాలు చూపించినా అది బూడిదలో [సంగీతం] పోసిన పన్నీరే మీరు ఒక్క మాట మాట్లాడితే వారు ఆ మాటను పట్టుకొని మరో గొరవ మొదలు పెడతారు. అది ఒక విష వలయంలా మారుతుంది. ఒక సామెత ఉంది బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతుంది. అలాగే ఒక టార్చర్ పెట్టే వ్యక్తితో వాదించడం అంటే బురదలో దిగడమే చివరకు మీ మనశాంతే పోతుంది.
(20:59) మీ ఆరోగ్యం పాడవుతుంది. కానీ అవతలి వ్యక్తికి మాత్రం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వారికి కావాల్సింది గొడవే మీరు ఆ గొడవలో పాల్గొన్నారు కాబట్టి వారు గెలిచారు. మరి ఏం చేయాలి? వాదనను ఎలా ఆపేయాలి? దీనికి ఒక టెక్నిక్ ఉంది. జేడ్ రూల్ పాటించండి. డోంట్ జస్టిఫై ఆర్గ్యూ డిఫెండ్ ఆర్ ఎక్స్ప్లన్ అంటే సమర్థించుకోకండి నేను ఎందుకు చేశానంటే అని చెప్పకండి వాదించకండి నువ్వు చెప్పేది తప్పు అని అనకండి రక్షించుకోకండి నేను అలాంటి వాడిని దానిని కాదు అని ప్రాధేయ పడకండి.
(21:42) వివరించకండి వారికి అర్థం చేయించే ప్రయత్నం చేయకండి. కేవలం చిన్న చిన్న పదాలతో వాదనను ఆపేయండి. సరే అది మీ అభిప్రాయం దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు అర్థమైంది. ఇలాంటి తక్కువ పదాలు వాడండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు మాత్రం గోడలా మారిపోండి. గోడతో ఎవరైనా ఎంతసేపు మాట్లాడగలరు ఎంతసేపు అరవగలరు. కొంతసేపటికి విసుగొచ్చి వాళ్లే ఆపేస్తారు.
(22:10) ఇది పిరికితనం కాదు ఇది విజ్ఞత. మీ శక్తిని మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం వాదన గెలవడం ముఖ్యం కాదు మనశశాంతి గెలవడం ముఖ్యం. మీరు వాదించడం ఆపేసిన రోజు వారి చేతిలో ఉన్న ఆయుధం పోతుంది. వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మిత్రులారా శత్రువు బయట ఉంటే తలుపు వేసుకోవచ్చు. కానీ శత్రువు ఇంట్లోనే ఉంటే ఒకే గదిలో ఒకే మంచం మీద ఉంటే వారి ప్రతి మాట ఒక బాణంలా గుండెల్లో గుచ్చుతుంటే ఆ నొప్పిని ఎలా తట్టుకోవాలి దీనికి ఒకే ఒక మార్గం ఉంది.
(22:50) అదే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే మానసికంగా దూరంగా ఉండటం ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఆచరిస్తే మీ జీవితం మారిపోతుంది. మన పెద్దలు ఒక మాట చెబుతారు తామరాకు మీద నీటి బుట్టులా ఉండాలి అని తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీటిని అంటుకోదు అలాగే మీరు కూడా ఆ ఇంట్లోనే ఉండండి కానీ వారి మాటలను వారి కోపాన్ని మీ మనసుకి అంటించుకోకండి. ఇది ఎలా సాధ్యం? ముందుగా మీ భాగస్వామిని భర్త లేదా భార్యగా చూడటం ఆపేయండి.
(23:26) వారిని ఒక రూమ్ మేట్ గా మాత్రమే చూడండి. ఒకవేళ మీ రూమ్ మేట్ కోపంగా ఉంటే మీరు బాధపడతారా లేదు కదా అతనికి ఏదో సమస్య ఉందిలే అని వదిలేస్తారు. అలాగే మీ భాగస్వామి అరుస్తుంటే తిడుతుంటే అది వారి సమస్యగా చూడండి. మీ సమస్యగా కాదు వారి కోపం వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీది కాదు వారి మాటలు వారి సంస్కారాన్ని చూపిస్తాయి. మీది కాదు మీరు ఒక అద్దాన్ని ఊహించుకోండి.
(23:55) మీకు మీ భాగస్వామికి మధ్య ఒక బలమైన అద్దం ఉంది. వారు విసిరే మాటలు నిందలు [సంగీతం] అవమానాలు ఆ అద్దానికి తగిలి కింద పడిపోతున్నాయి. అవి మిమ్మల్ని తాకడం లేదు. మీరు ఆ అద్దం వెనుక సురక్షితంగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ భావనతో ఉంటారో వారి మాటలు మీకు వినిపిస్తాయి కానీ బాధ పెట్టవు. ఇంకొక ముఖ్యమైన విషయం మీ సంతోషానికి వారిని బాధ్యులుగా చేయకండి.
(24:24) తను నన్ను ప్రేమించాలి మెచ్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనే ఆశలు వదులుకోండి. ఎప్పుడైతే ఆశలు ఉండవో అప్పుడు నిరాశ కూడా ఉండదు. మీ సంతోషాన్ని వేరే చోట వెతుక్కోండి. మీ పిల్లలతో గడపండి. దేవుడి పూజలో ప్రశాంతత పొందండి. మీకు నచ్చిన పుస్తకం చదవండి లేదా ఉద్యోగం చేయండి. మీ ఎమోషనల్ ఎనర్జీని వారి మీద వృధా చేయకండి. గుర్తుపెట్టుకోండి డిటాచ్మెంట్ అంటే ప్రేమ లేకపోవడం కాదు అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎప్పుడైతే మీరు వారి మాటలకు స్పందించడం మానేస్తారో వారి చేతిలో ఉన్న ఆయుధం పోతుంది.
(25:06) వారు మిమ్మల్ని ఏడిపించలేరు భయపెట్టలేరు. మీరు ఒక రాయిలా మారిపోతారు. రాయికి గాయాలు తగలవు కదా మిత్రులారా మనం మౌనంగా ఉండటం వాదించకుండా ఉండటం గురించి చెప్పుకున్నాం. అయితే ఇక్కడో సందేహం రావచ్చు మౌనంగా ఉంటే వాళ్ళు నన్ను ఇంకా తొక్కి పారేస్తారేమో నా మెతకదనాన్ని చూసి ఇంకా చులకన చేస్తారేమో నిజమే ఈ భయం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సర్దుకు పోవడానికి బానిసత్వానికి మధ్య చాలా చిన్న గీత ఉంటుంది.
(25:43) ఆ గీత దాటితే మీ జీవితం మీ వ్యక్తిత్వం నాశనం అవుతాయి. ఆ గీతే ఆత్మగౌరవం. చాలామంది అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని ఒకటిగా చూస్తారు కానీ రెండూ వేరు. నేనే గొప్ప అనుకోవడం అహంకారం. నేను కూడా మనిషినే నాకు విలువ ఉంది అనుకోవడం ఆత్మగౌరవం. పెళ్లి అంటే ఒకరికొకరు తగ్గడం అని అంటారు. కానీ ఎంతవరకు తగ్గాలి మీరు నేలకి అతుక్కుపోతే అందుకే మీరు ఎక్కడ గట్టిగా నిలబడాలో తెలుసుకోవాలి.
(26:18) దీన్నే హద్దులు అంటారు. మీరు మీ భాగస్వామికి స్పష్టంగా చెప్పాలి. నువ్వు కోపంగా ఉంటే అరవచ్చు కానీ నన్ను కొట్టే హక్కు నీకు లేదు. నువ్వు నా వంటను విమర్శించొచ్చు కానీ నా పెంపకాన్ని నా తల్లిదండ్రులను తిట్టే హక్కు నీకు లేదు. మన మధ్య గొడవలు ఉండొచ్చు కానీ మూడో మనిషి ముందు నన్ను అవమానించే హక్కు నీకు లేదు. ఇవి మీ నాన్ నెగోషియబుల్స్ అంటే ఈ గీత దాటితే నేను సహించను అని స్పష్టంగా చెప్పాలి.
(26:48) ఎప్పుడైతే వారు ఈ గీత దాటుతారో అప్పుడు మౌనం పనికి రాదు. అప్పుడు మీ గొంతులో ధైర్యం ఉండాలి. కోపంతో అరవకండి కానీ కళ్ళలోకి చూసి గట్టిగా చెప్పండి ఆపు నువ్వు హద్దు దాటుతున్నావు నాతో ఇలా మాట్లాడడానికి నేను ఒప్పుకోను. మీరు ఎప్పుడైతే ఇలా నిలబడతారో అవతలి వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్నాళ్ళు మీరు భయపడ్డారు కాబట్టే వారు మిమ్మల్ని ఆడుకున్నారు.
(27:16) ఇప్పుడు మీరు భయపడటం మానేసారు అని తెలిస్తే వారి ఆట సాగదు. మీరు భయపడేది దేనికి నేను ఎదురు చెబితే గొడవ పెద్దది అవుతుందేమో బంధం తెగిపోతుందేమో అని కదా కానీ ఆలోచించండి గౌరవం లేని బంధం ఉంటే ఎంత పోతే ఎంత ప్రతిరోజు చస్తూ బతకడం కంటే ఒక్కసారి ధైర్యంగా నిలబడటం మేలు మీరు మీకు గౌరవం ఇచ్చుకుంటేనే లోకం మీకు గౌరవం ఇస్తుంది. మీ భాగస్వామికి మీరు నేర్పించాలి.
(27:45) నన్ను ఎలా ట్రీట్ చేయాలో గుర్తుపెట్టుకోండి మీ ఆత్మగౌరవం మీ ఆభరణం దాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకండి. భర్త అయినా భార్య అయినా గౌరవం ఇచ్చుపు తకోవాలి. మిత్రులారా భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కానీ ఆ గొడవలు ఒక యుద్ధంలా మారినప్పుడు అందులో మొదటి బాధ్యతలు ఎవరో తెలుసా? మీరు కాదు మీ భర్త భార్య కాదు ఏమీ తెలియని అమాయకులైన మీ పిల్లలు.
(28:15) మనం అనుకుంటాం పిల్లలు పడుకున్నారులే వాళ్ళకు తెలియదు అని లేదా వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళక ఏం అర్థంఅవుతుంది అని కానీ గుర్తుపెట్టుకోండి పిల్లలు స్పాంజ్ లాంటి వాళ్ళు వారు మీ మాటలను అర్థం చేసుకోకపోవచ్చు కానీ మీ ఎమోషన్స్ ని మీ కోపాన్ని ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ని వారు పీల్చుకుంటారు. మీరు అరుచుకుంటున్నప్పుడు వారు గదిమూల నక్కి భయంతో వణకిపోతుంటారు.
(28:41) వారి గుండె వేగం పెరుగుతుంది. అమ్మ నాన్న విడిపోతారా నన్ను వదిలేస్తారా అనే భద్రతా రాహిత్యం వారిని వెంటాడుతుంది. మీ గొడవల వల్ల పిల్లల మనసులో ఏం జరుగుతుందో తెలుసా? భయం వారు ప్రతిదానికి భయపడతారు. నిద్రలో ఉలిక్కిపడి లేస్తారు పక్క తడుపుతారు లేదా గోర్లు కొరుక్కుంటారు. అపరాధ భావం అమ్మ నాన్న గొడవ పడడానికి నేనే కారణమేమో అని తమని తాము నిందించుకుంటారు.
(29:10) దూకుడు సమస్య వస్తే అరవాలి కొట్టాలి అని మీ నుంచే నేర్చుకుంటారు. రేపు స్కూల్లో లేదా బయట వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? పిల్లలను ఆయుధాలుగా వాడుకోవడం చాలామంది తల్లిదండ్రులు తమ కోపాన్ని పిల్లల ద్వారా చూపిస్తారు. వెళ్లి మీ నాన్నను అడుగు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని లేదా మీ అమ్మకు చెప్పు వంట సరిగ్గా చేయమని పిల్లలను మధ్యవర్తులుగా మార్చకండి లేదా పిల్లల ముందు ఒకరినొకరు తిట్టుకోకండి.
(29:40) మీ నాన్న వేస్ట్ మీ అమ్మ చెడ్డది అని చెప్పడం పిల్లల మనసును ముక్కలు చేయడమే ఎందుకంటే ఆ పిల్లాడిలో సగం నాన్న ఉన్నాడు సగం అమ్మ ఉంది. మీరు భాగస్వామిని తిట్టినప్పుడు పరోక్షంగా మీ బిడ్డను కూడా తిట్టునట్టే దయచేసి మీ గొడవలు మీ పడక గదికి పరిమితం చేయండి. పిల్లల ముందు గొడవ పడకండి. ఒకవేళ పొరపాటున గొడవ పడినా వెంటనే వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పండి.
(30:06) నాన్న మేము గొడవ పడ్డాం కానీ అది నీ వల్ల కాదు మేము ఇద్దరం నిన్ను ప్రేమిస్తున్నాం అని భరోసా ఇవ్వండి. వారికి కావాల్సింది ఖరీదైన బొమ్మలు కాదు ప్రశాంతమైన ఇల్లు మీరు వారికి ఇచ్చే ఆస్తి వారి భవిష్యత్తు బంధాలకు పునాది మీరు ఇలాగే గొడవ పడుతూ ఉంటే రేపు వాళ్ళు కూడా పెళ్లి అంటే భయపడతారు. లేదా వాళ్ళు కూడా మీలాగే విషపూరితమైన దాంపత్యాన్ని ఎంచుకుంటారు.
(30:30) మీ బిడ్డ భవిష్యత్తుని మీ చేతులతోనే నాశనం చేయకండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత వారిని రక్షించడం భయపెట్టడం కాదు మిత్రులారా ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఉన్న ఏకైక మార్గం మాట్లాడుకోవడం కానీ చాలా జంటలు చేసే తప్పుఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నామ అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు గొడవ పడుతుంటారు. నేను చెప్పేది విను అని అరవడం కమ్యూనికేషన్ కాదు నువ్వు ఎప్పుడు ఇంతే అని నిందించడం కమ్యూనికేషన్ కాదు అది కేవలం దాడి ఎప్పుడైతే మీరు దాడి చేస్తారో అవతలి వ్యక్తి ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేస్తాడు.
(31:10) అక్కడ సమస్య పరిష్కారం కాదు యుద్ధం మొదలవుతుంది. అందుకే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించాలి. ఒకటి నువ్వు బదులు నేను వాడండి. సాధారణంగా మనం ఏమంటాం నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. నువ్వు ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటావు. ఇక్కడ నువ్వు అని వేలు చూపిస్తున్నాం. ఇది అవతలి వారికి కోపం తెప్పిస్తుంది. దీనికి బదులుగా మీ భావనను చెప్పండి.
(31:37) నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఆలస్యంగా వచ్చినప్పుడు నాకు భయంగా ఉంది. చూసారా ఇక్కడ మీరు వారిని తప్పు పట్టడం లేదు. కేవలం మీ బాధను చెప్తున్నారు. మీ బాధను ఎవరు కాదనలేరు ఇది వారి గుండెకు తాకుతుంది. రెండు సరైన సమయం ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు. వాళ్ళు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు గొడవలు పెట్టుకోకండి. దీన్నే హాల్ట్ రూల్ అంటారు.
(32:08) హంగ్రీ ఆకలి, యాంగ్రీ కోపం, లోన్లీ ఒంటరితనం, టైర్డ్ అలసట. ఈ నాలుగు స్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడితే గొడవ తప్పదు. కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుమతి అడగండి. మూడు సాండ్విచ్ టెక్నిక్ ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే దాన్ని రెండు పాజిటివ్ మాటల మధ్యలో పెట్టండి. ముందుగా ఒక మంచి మాట చెప్పండి.
(32:35) నువ్వు కష్టపడి పని చేస్తావు నాకు తెలుసు తర్వాత సమస్య చెప్పండి. కానీ నువ్వు ఇంటికి వచ్చాక నాతో మాట్లాడకపోతే బాధగా ఉంది. చివరగా మళ్ళీ ఒక మంచి మాట నువ్వు నాతో కాసేపు మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా చెబితే అవతలి వ్యక్తికి కోపం రాదు వారు వినడానికి ఇష్టపడతారు. నాలుగు వినడం మాట్లాడటం ఎంత ముఖ్యమో వినడం అంతకంటే ముఖ్యం.
(33:03) దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు అంటే మాట్లాడే దానికంటే రెట్టింపు వినమని వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకండి నాకు తెలుసులేనవి ఏం చెప్తావో అని ముందే ఊహించకండి పూర్తిగా వినండి వారి కోపాన్ని బయటకు రానివ్వండి. వారు చెప్పింది మీకు నచ్చకపోయినా సరే నీ ఉద్దేశం నాకు అర్థమైంది అని చెప్పండి. అది వారి కోపాన్ని తగ్గిస్తుంది. కానీ ఒకవేళ వారు అసలు మాట్లాడడానికే ఇష్టపడకపోతే మౌనంగా ఉంటూ మిమ్మల్ని శిక్షిస్తుంటే ఏం చేయాలి అప్పుడు ఉత్తరం రాయండి.
(33:38) మీ మనసులో ఉన్న బాధను ప్రేమను కోపాన్ని ఒక కాగితం మీద పెట్టి వారికి ఇవ్వండి. లేదా ఒక పెద్ద మెసేజ్ టైప్ చేయండి. మాట్లాడితే మధ్యలో ఆపేస్తారు. కానీ ఉత్తరమైతే చివరివరకు చదవడానికి తప్పదు. ఆ చదివే సమయంలో వారు మీ ఎమోషన్ ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి మాటలు గాయపరచగలవు గాయాన్ని మాంపగలవు. మీరు ఎంచుకునే పదాలే మీ బంధాన్ని నిలబడతాయి లేదా కూల్చేస్తాయి.
(34:06) ఈ రోజు నుంచి యుద్ధం చేయడం మానేసి మాట్లాడడం మొదలు పెట్టండి. మిత్రులారా మనం ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. కానీ మాటలతో పరిష్కారం దొరికిన మనసులో ఒక ముల్లు అలాగే ఉండిపోతుంది. అదే గతం తాలూకు గాయాలు నన్ను ఆ రోజు అందరి ముందు అలా అవమానించాడు నన్ను మోసం చేసింది నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఈ ఆలోచనలు మన మెదడులో తిరుగుతూనే ఉంటాయి.
(34:34) మనం నిద్రపోవాలనుకున్న ఈ పాత జ్ఞాపకాలు నిద్రపోనివ్వవు. దీనికి ఏకైక విరుగుడు క్షమించడం కానీ ఆగండి క్షమించడం అంటే ఏంటి చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. వాళ్ళు నన్ను ఇంత హింసించారు అయినా సరే ఏమి జరగనట్టు వదిలేయాలా వాళ్ళు చేసిన తప్పు ఒప్పు అయినట్టేనా అని అడుగుతారు. కాదు క్షమించడం అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు క్షమించడం అంటే వాళ్ళు చేసిన పని వల్ల ఇకపై నేను బాధపడకూడదు అని నిర్ణయించుకోవడం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఒక విషం బాటిల్ పట్టుకొని ఇది నేను తాగుతాను కానీ నా శత్రువు చనిపోవాలి అని కోరుకుంటే ఎలా
(35:16) ఉంటుంది మూర్ఖత్వంగా ఉంటుంది కదా ద్వేషం కూడా అంతే మీ మనసులో కోపం పగా పెట్టుకోవడం అంటే మీరు రోజు కొంచెం కొంచెం విషం తాగు గుతున్నట్టే అవతలి వ్యక్తి హాయిగా నిద్రపోతుంటాడు. కానీ మీరే రాత్రంతా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటారు. ఎవరికి నష్టం మీకే కదా అందుకే స్వార్ధపరుడిగా ఆలోచించండి. మీ ప్రశాంతత కోసం మీ ఆరోగ్యం కోసం వారిని క్షమించండి.
(35:43) మీ భుజాల మీద ఉన్న బరువును దించేయండి. అవును నువ్వు తప్పు చేశవు. నువ్వు నన్ను గాయపరిచావు. కానీ ఆ గాయాన్ని నేను ఇక మోయలేను. అందుకే నిన్ను వదిలేస్తున్నాను అని మీ మనసులో అనుకోండి. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు గాయం మానడానికి సమయం పడుతుంది కానీ మందు వేయడం మొదలు పెట్టాలి కదా ఆ మందే క్షమించడం గుర్తుపెట్టుకోండి క్షమించడం వేరు నమ్మడం వేరు మీరు వారిని క్షమించవచ్చు కానీ మళ్ళీ వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు నిన్ను క్షమిస్తున్నాను కానీ ఇకపై నిన్ను గుడ్డిగా నమ్మను అని గీత గీయవచ్చు.
(36:18) ఒకవేళ వారు శారీరకంగా హింసిస్తుంటే వారిని క్షమించి ఆ బంధం నుంచి బయటకు రావచ్చు. క్షమించడం అంటే కలిసి ఉండటం కాదు మనసులో ద్వేషం లేకుండా ఉండటం మానవుడు తప్పు చేయడం సహజం దైవం క్షమించడం సహజం మీ భాగస్వామి కూడా ఒక మనిషే వారిలో కూడా లోపాలు ఉన్నాయి వారి పెంపకం వారి పరిస్థితులు వారిని అలా మార్చాయి వారిని ఒక శత్రువుగా కాకుండా ఒక రోగిగా చూడండి అప్పుడు మీ కోపం జాలిగా మారుతుంది. ఈ రోజు ఒక పని చేయండి.
(36:49) కళ్ళు మూసుకొని వారి ముఖాన్ని ఊహించుకోండి. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇకపై నీ తప్పుల భారం నాది కాదు అని గట్టిగా అనుకోండి. అప్పుడు చూడండి మీ గుండె ఎంత తేలికగా మారుతుందో మీరు ఒక పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా ఫీల్ అవుతారు. మిత్రులారా క్షమించడం గురించి తెలుసుకున్నాం. దాని పక్కనే ఉండే మరో గొప్ప గుణం ఓర్పు ఈ కాలంలో చాలామంది ఏమంటారంటే ఓర్పుగా ఉంటే మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటారు.
(37:21) మన నెత్తి మీద ఎక్కి [సంగీతం] కూర్చుంటారు. అందుకే ఎప్పటికప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలి అని నిజమే అన్యాయాన్ని ఎదిరించాలి కానీ ప్రతి చిన్న విషయానికి యుద్ధం చేస్తే సంసారం నిలబడుతుందా? అసలు ఓర్పు అంటే ఏంటి? అది బలహీనత లేక బలమా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నదిలో వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా వేళ్ళతో సహా పెకిలించబడతాయి.
(37:48) కానీ గడ్డిపూచలు మాత్రం నీటి ప్రవాహానికి తలవంచి వరద తగ్గాక మళ్ళీ పైకి లేస్తాయి. ఇక్కడ గడ్డిపోచ లొంగిపోయింది అనుకుంటే పొరపాటు అది తనను తాను కాపాడుకుంది. అదే ఓర్పు ఓర్పు అంటే ఓడిపోవడం కాదు సరైన సమయం కోసం వేచి చూడటం మన పురాణాల్లో చూడండి సీతాదేవి రాముడు అడవికి వెళ్తుంటే నేను రాణిని నేను రాను అని గొడవ చేయలేదు.
(38:20) ఓర్పుగా వెళ్ళింది. రావణుడు ఎత్తుకెళ్తే భయపడలేదు అశోక వనంలో ఓర్పుగా రాముడి కోసం ఎదురుచూసింది. చివరకు అగ్ని పరీక్ష పెట్టిన తన పవిత్రత మీద నమ్మకంతో ఓర్పుగా నిలబడింది. ఆమె మౌనం ఆమె సహనం రాముడిని కూడా కదిలించాయి. లోకానికి ఆదర్శంగా నిలిచాయి. అవసరం వచ్చినప్పుడు భూదేవిని పిలిచి తనలో కలిసిపోయింది. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంది.
(38:49) ద్రౌపది ద్రౌపది కౌరవ సభలో అవమానం జరిగినప్పుడు ఆమె వెంటనే యుద్ధం ప్రకటించలేదు. తన భర్తలైన పాండవులు గెలిచే సమయం కోసం 13 ఏళ్ళు ఓర్పుగా ఎదురుచూసింది. ఆమె ఓర్పు చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. ధర్మాన్ని గెలిపించింది. ఒకవేళ ఆమె అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉంటే లేదా పాండవులను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే చరిత్ర వేరేలా ఉండేది.
(39:19) మండోధరి రావణుడి భార్య. రావణుడు తప్పు చేస్తున్నాడని తెలిసిన చివరివరకు అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. ఆమె ఓర్పు రావణుని మార్చలేకపోయినా కానీ ఆమెను మాత్రం ఒక పతివ్రతగా నిలబెట్టింది. కాబట్టి మీ దాంపత్యంలో కూడా ఓర్పు అవసరం. మీ భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు లేదా చెడు వ్యసనాలకు బానిస అయినప్పుడు వెంటనే విడాకులు తీసుకోకండి.
(39:47) కొంతకాలం వేచి చూడండి. మొక్క నాటగానే పండు రాదు. దానికి నీళ్లు పోసి ఎండ తగలకుండా కాపాడితేనే తీయటి పండు వస్తుంది. సంసారం కూడా అంతే ఈరోజు వారు కోపంగా ఉండొచ్చు రేపు మారొచ్చు. ఆ మార్పు రావడానికి మీరు వారికి కొంత సమయం ఇవ్వాలి. మిత్రులారా మనం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో ఎంత ఓర్పుగా ఉండాలో చూసాం. మీరు అన్ని అస్త్రాలు వాడారు మౌనంగా ఉన్నారు ప్రేమగా మాట్లాడారు క్షమించారు ఓర్పు వహించారు.
(40:21) అయినా సరే మీ భాగస్వామిలో మార్పు రాలేదా ఇంకా మిమ్మల్ని హింసిస్తూనే ఉన్నారా అయితే ఇక మీరు ఒంటరి పోరాటం ఆపేయాలి. ఇది మీ చేతిలో లేదు. మీకిప్పుడు బయట వ్యక్తుల సాయం కావాలి. కానీ ఇక్కడే చాలామంది ఆగిపోతారు. మా ఇంట్లో గొడవలు బయట తెలిస్తే పరువు పోతుందేమో అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు బాధపడతారేమో కౌన్సిలింగ్ కి వెళ్తే మమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారేమో ఇలాంటి భయాలతో ఆ నరకంలోనే మగ్గిపోతుంటారు.
(40:55) గుర్తుపెట్టుకోండి క్యాన్సర్ కి కట్టు కడితే తగ్గదు. దానికి ఆపరేషన్ కావాలి. మీ దాంపత్యం ఇప్పుడు ఆ స్థితిలో ఉంది. మరి ఎవరి సాయం తీసుకోవాలి? ఒకటి పెద్దల సలహ. ఇది మన సంప్రదాయ పద్ధతి కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికి చెప్తున్నారు? మీ అత్తమామలకో లేదా మీ తల్లిదండ్రులకో చెప్తే వారు తమ బిడ్డ వైపే మాట్లాడతారు. అది గొడవను ఇంకా పెంచుతుంది.
(41:26) అందుకే ఇద్దరికీ సమానంగా ఉండే న్యాయం తెలిసిన అనుభవం ఉన్న తటస్థ వ్యక్తిని ఎంచుకోండి. అది మీ బాబాయి కావచ్చు గురువుగారు కావచ్చు లేదా ఊరి పెద్ద కావచ్చు. వారి ముందు కూర్చొని గొడవ పడకుండా మీ సమస్యను వివరించండి. నాకు విడిపోవాలని లేదు కానీ ఈ సమస్యకు పరిష్కారం కావాలి అని స్పష్టంగా చెప్పండి. రెండు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ఇది ఈ రోజుల్లో అత్యంత ఉత్తమమైన మార్గం కానీ చాలామందికి దీని మీద అపోహలు ఉన్నాయి.
(42:00) కౌన్సిలింగ్ అంటే ఎవరో వచ్చి మీ తప్పులెత్తి చూపడం కాదు కౌన్సిలర్ ఒక డాక్టర్ లాంటివారు వారు మీ ఇద్దరి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు. [సంగీతం] మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు సమస్య ఎక్కడుంది అని సైంటిఫిక్ గా విశ్లేషిస్తారు. వారు ఎవరి పక్షం వహించరు. మీకు కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి అని కొన్ని టూల్స్ ఇస్తారు.
(42:27) జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఎంత సహజమో మనసు బాగోలేనప్పుడు కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళడం అంతే సహజం. అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. మీ పరువు కంటే మీ ప్రాణం మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. ఆలోచించండి సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకుంటే అది పెద్దది కాదు మొదటి దశలో డాక్టర్ దగ్గరకు వెళితే జబ్బు నయంవుతుంది. చివరి దశలో వెళితే దేవుడు కూడా కాపాడలేడు.
(42:56) మిత్రులారా ఇప్పటివరకు మనం మనసు గురించి బంధం గురించి మాట్లాడాం. కానీ ఈ గొడవల వల్ల అత్యంత దారుణంగా దెబ్బ తినేది ఏంటో తెలుసా? మీ శరీరం మనం అనుకుంటాం నాకు మనశశాంతి లేదు అందుకే తలనొప్పి వస్తుంది అని కానీ నిజానికి ఆ తలనొప్పే ఒక హెచ్చరిక మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ శరీరాన్ని లోపలి నుంచి తినేస్తోంది. సైన్స్ ఏం చెప్తుందో వినండి.
(43:26) మీరు గొడవ పడినప్పుడు లేదా భయంతో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది తక్కువ మోతాదులో ఉంటే పర్లేదు కానీ రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మీరు ఆ నరకంలోనే ఉంటే ఆ విషం మీ రక్తంలో కలిసిపోతుంది. దాని ఫలితమే గుండె జబ్బులు ఎప్పుడూ దడగా ఉండటం, బీపి పెరగడం, చివరకు హార్ట్ ఎటాక్ రావడం, మధుమేహం, స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పడం, జీర్ణ సమస్యలు, అల్సర్లు, గ్యాస్, తిన్నది అరగకపోవడం, నిద్రలేమి, రాత్రంతా ఆలోచిస్తూ పడుకోవడం వల్ల శరీరం అలసిపోతుంది.
(44:11) రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జుట్టు రాలడం చర్మ సమస్యలు ముఖం కలతప్పడం జుట్టు రూడిపోవడం ఒక్కసారి ఆలోచించండి మీరు ఎవరి కోసం ఇదంతా భరిస్తున్నారు మీ భాగస్వామి కోసమా పిల్లల కోసమా ఒకవేళ రేపు పొద్దున్న మీకు ఏదైనా జరిగి మీరు ఆసుపత్రి పాలైతే మీరు మంచం మీద ఉంటే ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని హింసించే మీ భర్త భార్య చూసుకుంటారా లేక దిక్కు లేని వారైపోతారా మీ పిల్లల పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి మీ శరీరం ఒక దేవాలయం దాన్ని పాడు చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు చివరకు మీకు కూడా లేదు.
(44:52) సంసారం చక్కదిద్దడం ముఖ్యం కానీ దానికంటే ముఖ్యం మీ ప్రాణం మీరు బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించగలరు పోరాడగలరు. అందుకే ఈ రోజు నుంచి ఒక శపదం చేయండి. ఎన్ని గొడవలు ఉన్నా సరే నేను నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సమయానికి తినండి కోపంతో అన్నం మానేయకండి అది మీ పొట్టను కాలుస్తుంది వారిని కాదు నిద్రపోండి రాత్రి 10 గంటలకు ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకోండి రేపటి యుద్ధానికి శక్తి కావాలి కదా వాకింగ్ చేయండి ఉదయం లేవగానే స్వచ్ఛమైన గాలి పీల్చండి ఆక్సిజన్ మీ మెదడుని కూల్ చేస్తుంది.
(45:35) మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. వారి మాటలు విని కృంగిపోకండి. మీరు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉంటేనే శత్రువుకి కూడా అసూయ పుడుతుంది. అదే మీ నిజమైన గెలుపు. మిత్రులారా ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమించినా అవతలి వ్యక్తి మనల్ని హింసిస్తుంటే మనకు దేవుడి మీద కోపం వస్తుంది. నేను ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష అని ఏడుస్తాం.
(46:04) దీనికి మన శాస్త్రాలు ఒక అద్భుతమైన సమాధానం చెప్పాయి అదే రుణానుబంధం ఒక శ్లోకం ఉంది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే పశువులు పత్ని సుతులు ఆలయం ఇవన్నీ మన పూర్వజన్మ రుణాన్ని బట్టి మనకు దొరుకుతాయి. ఈ ప్రపంచంలో ఏది యాదృచ్చికంగా జరగదు. మీరు పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఊరికే రాలేదు. మీరు వారికి లేదా వారు మీకు ఏదో ఒక బాకీ ఉన్నారు.
(46:39) ఆ బాకీ తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యా భర్తలుగా కలిశారు. బహుశా గత జన్మలో మీరు వారిని బాధ పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు వారు మీకు ఆ బాధను [సంగీతం] తిరిగి ఇస్తున్నారు. లేదా మీరు వారి దగ్గర డబ్బు లేదా ప్రేమ తీసుకొని ఉండవచ్చు. ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. దీన్నే కర్మ అంటారు. ఒకసారి ఈ నిజాన్ని గ్రహిస్తే మీ దృక్పదం మారిపోతుంది.
(47:04) మీరు వారిని శత్రువుగా చూడటం మానేసి ఒక రుణగ్రస్తుడిగా చూస్తారు. సరే నా కర్మ ఏదో నేను అనుభవిస్తున్నాను. ఈ అప్పు త్వరగా తీరిపోతే చాలు అనే వైరాగ్యం వస్తుంది. కానీ దీని అర్థం మౌనంగా భరించడమేనా కాదు కర్మ సిద్ధాంతం చెప్పేది అది కాదు మీరు అనుభవిస్తున్న కష్టానికి ఒక అర్థం ఉంది. ఈ కష్టం మీకు ఏదో ఒక పాఠం నేర్పడానికి వచ్చింది.
(47:34) బహుశా మీలో ఓర్పును పెంచడానికి లేదా మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి లేదా దేవుడికి దగ్గర చేయడానికి ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారేమో ఒక కఠినమైన భర్త లేదా భార్య మనకు అతి గొప్ప గురువు వారు మనకు డిటాచ్మెంట్ నేర్పిస్తారు. ప్రపంచం మీద ఆశను చంపేసి మనశశాంతిని వెతుక్కునేలా చేస్తారు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఒకవేళ మీరు వారిని ద్వేషిస్తూ తిడుతూ మళ్ళీ మళ్ళీ గొడవ పడితే ఏమవుతుంది మీరు కొత్త కర్మను సృష్టిస్తున్నారు.
(48:08) అంటే ఈ జన్మలో అప్పు తీరదు సరి కదా వచ్చే జన్మకు కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే కర్మను తెంచుకోండి. వారిని క్షమించడం ద్వారా వారి పట్ల ఉదాసీనంగా ఉండడం ద్వారా ఆ బంధాన్ని అక్కడితో ముగించండి. నీకు నాకు ఉన్న రుణం ఈ జన్మతో తీరిపోవాలి అని సంకల్పించుకోండి. గుర్తుపెట్టుకోండి మనం ఎవరిని వివాహం చేసుకోవాలో మన చేతిలో ఉండకపోవచ్చు కానీ ఆ వివాహాన్ని ఎలా నిర్వహించుకోవాలో మన [సంగీతం] చేతిలో ఉంది.
(48:40) కర్మ అనేది శిక్ష కాదు అది ఒక అవకాశం. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన అవకాశం. మిత్రులారా కొంతమంది ఉంటారు వాళ్ళు తప్పు చేస్తారు కానీ క్షమాపణ చెప్పరు పైగా ఆ తప్పు చేయడానికి నువ్వే కారణమని మనల్నే నిందిస్తారు. వీరినే మన పెద్దలు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం అంటారు. కానీ మోడర్న్ సైకాలజీలో వీరిని నార్ససిస్ట్స్ అంటారు.
(49:09) మీ జీవిత భాగస్వామి కూడా ఈ కోవకు చెందిన వారా? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒక నార్సిసిస్ట్ తో కాపురం చేస్తుంటే మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత త్యాగం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే వారెప్పటికీ మారరు. వీరి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. ఒకటి సానుభూతి లేకపోవడం ఇది అతి పెద్ద లక్షణం మీకు జ్వరం వచ్చినా మీరు ఏడుస్తున్నా వారికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు.
(49:41) అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీ డ్రామాలు ఆపు అని విసుక్కుంటారు. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే గుణం వారిలో పుట్టుకతోనే ఉండదు. తప్పు ఎప్పుడూ మీదే వారు గ్లాసు పగలగొట్టిన నువ్వు అక్కడ ఎందుకు పెట్టావు అని మిమ్మల్ని తిడతారు. వారు అప్పులు చేసిన నీ ఖర్చుల వల్లే అంటారు. ప్రపంచంలో ఏం జరిగినా సరే వారు మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ లేదా మిస్సెస్ పర్ఫెక్ట్ తప్పెప్పుడూ ఎదుటివారిదే క్షమాపణ అనే పదం వారి డిక్షనరీలో ఉండదు.
(50:12) గ్యాస్ లైటింగ్ ఇది చాలా ప్రమాదకరమైన మాయాజాలం జరిగిన విషయాన్ని జరగనట్టు లేనిది ఉన్నట్టు నమ్మించి మీ మతిస్థితి మితం దెబ్బ తీస్తారు. నేను అలా అనలేదు నీకే ఏదో పిచ్చి పట్టింది అని వాదిస్తారు. చివరకు నిజంగానే నాకేమైనా మతిమరుపు వచ్చిందా అని మీరే డౌట్ పడేలా చేస్తారు. ఆరాధన కోరుకోవడం వారు అందరికంటే గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతారు.
(50:39) నలుగురిలో తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో మాత్రం రాక్షసుడిలా ప్రవర్తిస్తారు. కానీ బయట మాత్రం చాలా మంచివారిగా నటిస్తారు. అందుకే మీరు ఎవరికైనా చెప్తే అంత మంచి మనిషిని అలా అంటున్నావఏంటి అని మీరే బ్యాడ్ అవుతారు. ఒక కఠినమైన నిజం చెప్పనా? మీరొక నార్ససిస్ట్ ని ఎప్పటికీ మార్చలేరు. మీ ప్రేమ మీ కన్నీళ్లు మీ త్యాగాలు వేటికీ వారు కరగరు వారితో వాదించడం వారికి నచ్చ చెప్పడం గోడకు తలబాదుకోవడం లాంటిది.
(51:14) రక్తం మీకే వస్తుంది కానీ గోడకు నొప్పి తెలియదు కదా మరి ఏం చేయాలి? మీరు రెండు పనులు చేయవచ్చు. ఒకటి వారిని పూర్తిగా వదిలేయడం. రెండు ఒకవేళ వదిలేయలేకపోతే వారి నుంచి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఆశించకుండా ఒక రాయిలా మారిపోవడం వారిని ఒక మానసిక రోగిగా చూడండి కోపం రాదు జాలి మాత్రమే వస్తుంది. మిత్రులారా జీవితంలో అత్యంత కఠినమైన ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఇదే నేను ఈ బంధంలో ఉండాలా లేక విడిపోవాలా ఒకవైపు సమాజం పిల్లలు ఇన్నాళ్ళ బంధం మరోవైపు రోజువారి నరకం అవమానాలు కన్నీళ్లు మనసు ఉండు అంటుంది మెదడు వెళ్ళిపో అంటుంది. ఈ
(52:02) సందిగ్ధంలో నలిగిపోతున్న వారికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాను. విడాకులు అనేది ఒక వైఫల్యం కాదు కొన్నిసార్లు అది ఒక అవసరం అలాగే సర్దుకు పోవడం అనేది పిరికితనం కాదు కొన్నిసార్లు అది బాధ్యత కానీ ఏది ఎప్పుడు సరైనది ఎప్పుడు సర్దుకు పోవాలి ప్రేమ మిగిలి ఉన్నప్పుడు గొడవలు ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య ఇంకా ఎంతో కొంత ప్రేమ గౌరవం ఉంటే తప్పు ఒప్పుకున్నప్పుడు మీ భాగస్వామి తన తప్పును తెలుసుకొని క్షమించు నేను మారతాను అని నిజాయితీగా ప్రయత్నిస్తుంటే బాహ్య కారణాలు ఈ గొడవలకు కారణం ఆర్థిక ఇబ్బందులు లేదా మూడో మనిషి ప్రభావం అయితే ఆ కారణాలను తొలగించి బంధాన్ని
(52:49) కాపాడుకోవచ్చు. కౌన్సిలింగ్ ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ కి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ బంధానికి మరో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఏ బంధం కూడా పర్ఫెక్ట్ కాదు దాన్ని సరిదిద్దుకోవాలి. ఎప్పుడు విడిపోవాలి కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఊర్పు పనికి రాదు. వీటిని డీల్ బ్రేకర్స్ అంటారు.
(53:14) శారీరక హింస ఒక్కసారి చెయ్యి చేసుకున్నా సరే అది ప్రమాదమే కొట్టడం గాయపరచడం ప్రేమ కాదు నేరం అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకండి. మానసిక హింస. మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేసి మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా మారుస్తుంటే మీ ప్రాణం కాపాడుకోవడానికి బయటకు రావాలి. పరాయి సంబంధాలు పదే పదే మోసం చేస్తూ దొరికినా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటే ఆ బంధంలో ఇక మిగిలింది ఏమీ లేదు.
(53:46) వ్యసనాలు తాగుడు లేదా జూదానికి బానిసై కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటే వారిని మార్చడం మీ వల్ల కాదు. మునిగిపోయే పడవలో మీరు కూడా మునిగిపోవడం ఎందుకు పిల్లల కోసం ఉండాలా చాలామంది చేసే తప్పు ఇదే మా ఆయన రాక్షసుడు కానీ పిల్లల కోసం భరిస్తున్నాను అంటారు. గుర్తుపెట్టుకోండి ఒక విషపూరితమైన ఇంట్లో రోజు గొడవలు చూస్తూ పెరగడం కంటే ప్రశాంతంగా ఉన్న ఒక సింగిల్ పేరెంట్ దగ్గర పెరగడం పిల్లలకు చాలా మంచిది.
(54:18) పిల్లలకు కావలసింది తల్లిదండ్రులు కలిసి ఉండటం మాత్రమే కాదు వారు సంతోషంగా ఉండటం మీరు రోజు ఏడుస్తుంటే మీ పిల్లలు సంతోషంగా ఎలా ఉంటారు? సమాజం ఏమంటుంది? విడాకులు తీసుకుంటే సమాజం చిన్నచూపు చూస్తుంది [సంగీతం] అని భయపడకండి. సమాజం రెండు రోజులు మాట్లాడుకుంటుంది. కానీ ఆ నరకాన్ని మీరు జీవితాంతం అనుభవించాలి. మీ బాధను పంచుకోవడానికి పక్కింటి వాళ్ళు రారు మీ సంతోషం మీ బాధ్యత చివరిగా ఒక మాట విడిపోవడం అనేది ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాకూడదు.
(54:56) అలాగే కలిసి ఉండడం అనేది భయంతో తీసుకునే నిర్ణయం కాకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తును మీ ప్రశాంతతను దృష్టిలో ఉంచుకొని తీసుకోండి. మిత్రులారా ఒక విషపూరితమైన బంధం నుంచి బయటకు రావడం అంటే జైలు నుంచి విడుదలైనట్టే కానీ బయట ప్రపంచం అంత సులభంగా ఉండదు. ముఖ్యంగా మన భారతీయ సమాజంలో ఒంటరి మహిళకు లేదా పురుషుడికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.
(55:22) ఇప్పుడు ఎలా బతుకుతావు పిల్లల భవిష్యత్తు ఏంటి సమాజం ఏమంటుంది అని భయపెట్టే వాళ్లే ఎక్కువ కానీ భయపడకండి. మీరు తీసుకున్న నిర్ణయం సరైందే అయితే ఈ ఒంటరి పోరాటంలో గెలవడం కష్టం కాదు దానికి మూడు ప్రధాన ఆయుధాలు కావాలి. ఆర్థిక స్వాతంత్రయం ఇదే అన్నింటికంటే ముఖ్యం డబ్బు లేకపోతే స్వేచ్ఛ ఉండదు. మీరు విడిపోవాలని నిర్ణయించుకున్నా లేదా ఇప్పటికే విడిపోయినా వెంటనే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి.
(55:52) ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకండి. నేను చదువుకోలేదు నావల్ల [సంగీతం] ఏమవుతుంది అని దిగులు పడకండి. టైలరింగో ట్యూషన్లో లేదా చిన్న వ్యాపారమో ఏదైనా సరే మీ కష్టార్జితంతో మీ పిల్లలకు అన్నం పెడితే వచ్చే తృప్తి కోట్లు ఉన్న భర్త దగ్గర చేతులు చాచడంలో ఉండదు. డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను అనే నమ్మకాన్ని ఇస్తుంది.
(56:18) సమాజం లోకులు కాకులు అని ఊరికే అనలేదు. మీరు విడిపోతే ఆమెదే తప్పు అతనిదే తప్పు అని కథలల్లడం సమాజం పని మీరు నవ్వుతూ కనిపిస్తే ఒక మాట ఏడిస్తే ఒక మాట అంటారు. గుర్తుపెట్టుకోండి మీ కరెంట్ బిల్లు కట్టడానికి మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఈ సమాజం రాదు వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయకండి. ఎవరైనా ఎందుకు విడిపోయావు అని అడిగితే తలదించుకోకండి. కళ్ళల్లోకి చూసి చెప్పండి.
(56:45) నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం. నేను సంతోషంగా ఉండటం నా పిల్లలకు ముఖ్యం అని. మీ కాన్ఫిడెన్స్ చూస్తే వాళ్లే నోరు మూసుకుంటారు. ఎమోషనల్ బలం మొదట్లో చాలా ఒంటరిగా అనిపిస్తుంది భయంగా ఉంటుంది. నేను తప్పు చేశానా అని అనిపించవచ్చు కానీ ఒక నరకంలో ఇద్దరుగా ఉండటం కంటే స్వర్గంలో ఒంటరిగా ఉండటం చాలా మేలు. మీ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోండి.
(57:11) ఆ సమయాన్ని మీకోసం వాడుకోండి. పుస్తకాలు చదవండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. దైవ ధ్యానం చేయండి. మీరు సంతోషంగా ఉంటేనే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఒక ఏడుస్తున్న అమ్మ లేదా నాన్న కంటే ధైర్యంగా పోరాడే సింగిల్ పేరెంట్ ని చూసి పిల్లలు గర్వపడతారు. మీరు ఒక ఫీనిక్స్ పక్షి లాంటివారు బూడిదలో నుంచి కూడా మళ్ళీ పుట్టగలరు. మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు.
(57:37) మీరు బాధితులు కాదు మీరు విజేతలు ఈ ప్రయాణం కష్టంగా ఉండొచ్చు కానీ గమ్యం మాత్రం చాలా అందంగా ఉంటుంది. మీరు మీ కాళ్ళ మీద నిలబడిన రోజు మిమ్మల్ని విమర్శించిన నోళ్లే మిమ్మల్ని పొగుడతాయి. మిత్రులారా మనం ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. ఈ వీడియో మొత్తం సారాంశం ఒక్కటే. మీ సంతోషానికి బాధ్యత మీదే. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మన సంతోషం అనే తాళం చెవిని తీసుకెళ్లి మన భర్త భార్య జేబులో పెడతాం.
(58:07) వారు నవ్వితే మనం నవ్వుతాం. వారు కోప్పడితే మనం ఏడుస్తాం. అంటే మనం ఒక కీలు బొమ్మలా మారాం. కానీ ఈరోజు ఆ తాళం చెవిని వెనక్కి తీసుకోండి. మీరు నవ్వాలా ఏడవాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి. వారి ప్రవర్తన కాదు. గుర్తుపెట్టుకోండి ఈ జీవితం చాలా చిన్నది మరియు చాలా విలువైనది. దేవుడు మీకు ఈ మానవ జన్మని ఇచ్చింది ఒక గదిలో కూర్చొని ఏడవడానికి కాదు ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించలేదని అర్థం చేసుకోలేదని మీ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటారా? అలా చేస్తే నష్టపోయేది మీరే మీరు ఏడ్చినా నవ్వినా కాలం ఆగదు వయసు ఆగదు.
(58:47) రేపు ముసలితనం వచ్చాక అయ్యో నా యవ్వనం అంతా గొడవలతోనే గడిపేసానే అని బాధపడితే ఏం లాభం అందుకే ఈ క్షణం నుంచే బతకడం మొదలు పెట్టండి. మీరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారా సంతోషం కానీ బానిసలా కాదు రాణిలా రాజులా ఉండండి. హద్దులు గీయండి. ఆత్మగౌరవంతో నిలబడండి. లేదా విడిపోవాలని నిర్ణయించుకున్నారా? భయపడకండి అదొక కొత్త ఆరంభం ఒక తలుపు మూసుకుంటే దేవుడు మరో 100 తలుపులు తెరుస్తాడు.
(59:18) ఆర్థికంగా నిలబడండి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. సమాజం ఏమనుకుంటుందో అని భయపడి నరకంలోనే మగ్గిపోకండి. మీరు ఒక యుద్ధవీరులు మీరు అనుభవించిన నొప్పి మీకు ఒక పాఠం నేర్పింది. ఆ పాఠం పేరు సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు నచ్చిన పనులు చేయండి. ఉదయం లేవగానే అద్దంలో చూసుకొని నవ్వండి. ఈరోజు నేను సంతోషంగా ఉంటాను.
(59:45) ఏ శక్తి నన్ను బాధ పెట్టలేదు అని మీకు మీరే చెప్పుకోండి. ఈ ప్రపంచంలో శాశ్వతమైన శత్రువు ఎవరూ లేరు శాశ్వతమైన మిత్రుడు ఎవరూ లేరు. మీకు మీరే మిత్రుడు మీకు మీరే శత్రువు మీ మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే మీ జీవిత భాగస్వామి మారకపోవచ్చు. కానీ మీరు మారారు. అదే అసలైన విజయం. ఈ ప్రయాణంలో మీ కన్నీళ్లు తుడిచి మీలో ధైర్యాన్ని నింపగలిగానని ఆశిస్తున్నాను.
(1:00:13) ఈ వీడియో మీకు నచ్చితే మీలాగే బాధపడుతున్న మరో పది మందికి షేర్ చేయండి. ఒక చిన్న మాట ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఒక చిన్న సలహా ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరివారు కాదు ఈ సృష్టిలో ప్రతి జీవికి సంతోషంగా ఉండే హక్కు ఉంది. ఆ హక్కును ఎవ్వరికీ ఇవ్వకండి ధైర్యంగా ఉండండి నవ్వుతూ ఉండండి మీ జీవితం ఒక అద్భుతమైన కథగా మారబోతుంది.
(1:00:41) ఆల్ ది బెస్ట్ జైహింద్
No comments:
Post a Comment