ప్రతిక్షణం సంతోషంగా బతకడం ఎలా? ఎపిక్యూరస్ అద్భుత సూత్రాలు! | Jaisimha | Square Talks
https://youtu.be/LZAfU7lNqUo?si=c2c_J920Sd0tgLEs
https://www.youtube.com/watch?v=LZAfU7lNqUo
Transcript:
(00:10) నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఇప్పుడు ఒక కొటేషన్ చదువుకుందాం తర్వాత ఆ కొటేషన్ గురించి మాట్లాడదాం. ఇంతకీ ఆ కొటేషన్ ఏంటంటే ఇఫ్ యు విష్ టు మేక్ ఏ మన్ వెల్తీ డు నాట్ గివ్ హిమ మోర్ మనీ రాదర్ రెడ్యూస్ హిస్ డిజైర్స్ ఈ విషయం చెప్పిన గ్రీకు తత్వవేత్త పేరు ఏంటి అంటే ఎపిక్యూరస్ ఇతను క్రీస్తుపూర్వానికి చెందిన బిఫోర్డ్ కామనేరా కి చెందిన ఒక గ్రీక్ ఫిలాసఫర్ మనం ఎట్లా అరిస్టాటిల్ లూటో అని మాట్లాడుకుంటామో అట్లా ఎపిక్యూరస్ గ్రీక్ లో గ్రీక్ గ్రీస్ దేశంలో ది గార్డెన్ అనే ఒక స్కూల్లో తన సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉండేవాడు అన్నమాట ఆయన ఎపిక్యూరస్ సిద్ధాంతం
(01:03) మొత్తానికి సారాంశం లాంటిది ఇప్పుడు మనం చెప్పుకున్న కొటేషన్ తెలుగులో ఆ మాట్లాడుకుంటే ఏంటంటే ఒక వ్యక్తిని తనవంతుడిని చేయాలనుకుంటే అతనికి ఎక్కువ డబ్బు ఇవ్వకండి అతని కోరికలను తగ్గించండి అని చెప్తున్నాడు. మనకు వినగానే కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఎందుకంటే ఒక వ్యక్తిని ధనవంతుని చేయాలి అంటే మనం ఏవి సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలి అంటే అతని దగ్గర డబ్బు లేదంటే ఇతర ఖరీదైన సంపదలు ఆ వస్తువులు ఇటువంటివన్నీ పేరుకుపోతూ ఉండాలి ఆ ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఎంత వజ్రాలు ముత్యాలు లేదా బంగారం వెండి ఇవన్నీ ఎంత పెరుగుతూ పోతే అతను అంత
(01:54) ధనవంతుడు అని మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే ఎపిక్యూరస్ చెప్తున్నది దానికి విరుద్ధమైంది అన్నమాట. అతనికి ఒక వ్యక్తిని ధనవంతుడిని మీరు చేయాలనుకుంటే అతడికి ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. మరి డబ్బులు ఇవ్వకున్నా కూడా ధనవంతులం ఎట్లా అవుతాము ధనవంతుడిని ఎలా చేయగలుగుతాము అంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఎవరినైతే ధనవంతుడిని చేయాలనుకుంటున్నారో ఆ ధనవంతుడిని చేయాలనుకుంటున్న వ్యక్తిలో కోరికల్ని తగ్గించండి అని చెప్తున్నాడు ఎపిక్యూరస్ దీన్ని గనక కొంచెం అర్థం అయ్యేలాగా మాట్లాడుకోవాలనుకుంటే మనం సాధారణంగా రోడ్డు మీద చాలామంది
(02:30) పేదవాళ్ళను చూస్తుంటాం అంటే రోడ్డు మీదే ఆ నిద్ర లేచి రోడ్డు మీదే పూట గడుపుతూ రాత్రి రోడ్డు మీదే పడుకుంటూ అక్కడే పుడతారు అక్కడే పెరుగుతారు కొంతమంది అక్కడే చనిపోతుంటారు కూడా మరి గొప్ప గొప్ప కోట్లాది రూపాయల ఇల్లున్న భవనాల్లో ఉండే ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు తమ జీవితాంతం నవ్వుతూనే ఉండాలి. అలాగే రోడ్డు మీద ఉండేవాడు అసలు ఎప్పుడూ నవ్వకూడదు.
(02:57) కోట్లాది రూపాయల భవనాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అలాగే రోడ్డు మీద ఉండి ఈ పూట చాలి చాలని విధంగా తిన్నవాడు తిని మళ్ళీ మరుసటి పూటకి ఆ తర్వాతి పూట భోజనం కూడా ఉంటుందో లేదో తెలియకుండా ఉండేవాళ్ళు అసలు తమ జీవితంలో ఎప్పుడూ నవ్వకూడదు. కానీ మనం రోడ్డు మీద కార్ ఆపుకొని గాని టూ వీలర్ మీద గాని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా చిన్న పిల్లలు కనిపిస్తూఉంటారు అక్కడ కూడా పెద్దవాళ్ళు కనిపిస్తుంటారు ఏ ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూనో లేదంటే ఆ భిక్షం అడుగుతున్నా ఏమంటారు డబ్బులు అడుక్కుంటూ చేచా డబ్బులు అడుక్కుంటూ
(03:37) ఉంటారు. వాళ్ళ ముఖల్లో కూడా మనం ఊహించుకున్నంత నిరాశ ఏం కనిపించదు వాళ్ళలో కూడా అప్పుడప్పుడు నవ్వుతుంటారు కొంతమంది అయితే మరీ చిన్న పిల్లలుఅయితే ఏ బాధ లేకుండా నవ్వుతూ తొళ్ళు తిరుగుతున్నట్టే కనిపిస్తూ ఉంటది మనకి మరి కారు లోపల ఉన్నవాడేమో సీరియస్ గా ముభావంగా నిరాశ నిస్పృహతో ఉంటాడు కారు బయట అర్థం కార్ విండో దగ్గరికి వచ్చి అడుక్కుంటున్న వాడేమో నవ్వుతూ ఉంటాడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన సంతోషా ానికి ధనానికి నేరుగా సంబంధం లేదు అలాగని ధనం లేనే లేకుండా పూర్తిగా ధనం అక్కర్లేదు కానీ చాలా సంతోషంగా ఉండొచ్చు అనేది ఇంప్రాక్టికల్
(04:17) అది కరెక్ట్ కాదు. మనం మనిషి సుఖంగా సంతోషంగా ఉండడానికి కొంత డబ్బు కొంత సంపద కొంత ఆస్తి ఇవన్నీ అవసరం ఉండొచ్చు కానీ అవి ఎంతవరకు ఉండాలనేదానికి పర్టికులర్ గా ఏ డెఫినిషన్ కానీ ఏ లిమిట్ ఏ స్టాండర్డ్ కూడా లేదు. ఎంత ఉన్నవాడైనా ఏడుపు కూర్చుకుంటూ కూర్చోవచ్చు ఎంత లేని వాడైనా సరే సంతోషంగా ఉండొచ్చు అన్నమాట అంబాని ఇల్లు ముంబైలో ఉంటుంది చాలా ఖరీద అయింది కొన్ని వేల కోట్లు ఖరీదు చేస్తుంది.
(04:46) అంబానీ ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని అదే అంబానీ ఇంటికి రోడ్డుకి ఇటువైపున ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారని ఎక్కడ మనం ఎవరి గురించి చెప్పలేం ఎందుకంటే డబ్బుకి డైరెక్ట్ సంబంధం ఏమీ లేదు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇంకొక గమనిక కూడా ఉంటది ఇంకొక గమనించాల్సిన విషయం కూడా ఉంటుంది. ఈ రోడ్ల మీద లేదంటే అనాధాశ్రమాల్లో లేదంటే ఆ స్లమ్ ఏరియాస్ లో బతికే వాళ్ళు భారతదేశంలో చాలా ఎక్కువమంది ఉన్నారు నిజానికి అల్ట్రా రిచ్ పీపుల్ కంటే మిడిల్ క్లాస్ కంటే పేదవాళ్ళు చాలా ఎక్కువమందే ఉంటారు.
(05:23) వీళ్ళందరూ లో సూయిసైడ్ చేసుకునే వాళ్ళ శాతంతో పోలిస్తే బాగా డబ్బులు ఉండి కార్లలో తిరుగుతూ విమానాల్లో తిరుగుతుండే వాళ్ళు చాలా సందర్భాల్లో సూయిసైడ్ చేసుకున్నారని చెప్పి మనకు ఈ మధ్య కాలంలో కూడా పెద్ద పెద్ద రియాల్టర్స్ కావచ్చు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు సూసైడ్ చేసుకున్నారని మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి సంపద ఉన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకోరని గాని సంపద లేని వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసేసుకుంటారని కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు అన్నమాట ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పే క్రమంలో ఎపిక్యూరస్ ఏమంటున్నారు అంటే ఎపిక్యూరస్ అనే గ్రీకు
(05:58) తత్వవేత్త ఆ ప్రబోధకుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే సాధారణంగా ధనం అంటే సంపద పేరుకపోవడం అంటే అంతకంతకు రోజు రోజుకి డబ్బులు కావచ్చు ఇతర తర్వాత విలువైన భూమి బంగారం లాంటివి కావచ్చు ఇవన్నీ పెంచుకుంటూ పోవడమే ధనం లేదా గొప్ప ఐశ్వర్యం అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఎపిక్యూరస్ చెప్తున్నది ఏంటంటే ధనం బాహ్య వస్తువులలో కాదు మనసులోని సంతృప్తిలో ఉంటుంది అని ఈయన చెప్తున్నాడు అన్నమాట.
(06:31) ఎందుకు అంటే కోరికలు ఎక్కువగా ఉంటే ఎంత డబ్బు ఉన్నా పేదరికం అనిపిస్తుంది కోరికలు తక్కువగా ఉంటే ఎక్కువ సంపదతో కూడా దానికో తక్కువ సంపదతో కూడా మనం ధనికుడిగా భావించవచ్చు అని చెప్తున్నారు. సంతృప్తి అనే పదం ఇక్కడ మనం బాగా గుర్తించాలన్నమాట. సంతృప్తి ఎవరికి ఉంటుంది అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరికలతో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఆశకి ఆశయానికి జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని దాన్ని సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉండడంలో పెద్ద తప్పేం లేదు అది కొంతవరకు నయం సబబు కూడా కానీ ఇది అయిపోయింది ఇంకొకటి ఇంకొకటి అయిపోయింది మరొకటి అని అంటే మొదటి కారు కొనుక్కున్న
(07:10) తర్వాత ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలని ఇంకా పెద్ద కారు కొన్న తర్వాత విమానాల్లో తిరగాలని లేదంటే విదేశాలకి వెళ్ళాలని ఇట్లా కేవలం కోరికలు ఆ కోరికల వల్ల మనకి గాని సమాజానికి గాని పెద్ద ఉపయోగం ఏమి లేనప్పుడు దానికి వల్ల మనకు సంతృప్తి ఏమాత్రం కలగకపోగా ఈ కోరిక తీరిన వెంటనే ఇంతకంటే పెద్ద కోరిక మనకు ఇంకొకటి కూడా కలుగుతూ వస్తుంది అంటే అది మనం ఒక దగ్గర బాగా మంట మండుతున్నప్పుడు దాంట్లో ఆయిల్ తీసుకుపోయి నెయ్యి గాని ఏదనా తీసుకుపోయి వేస్తే ఆ మంట చల్లారదు సరికాదా ఇంకా పెరుగుతుంది అన్నమాట ఆ విధంగా ఒక్కొక్క కోరిక మన ఇంకో కోరిక కారణం అవుతున్నప్పుడు
(07:52) అది చైన్ రియాక్షన్ లాగా ముందుకు వెళ్తూ ఉంటే సంతృప్తి అనేది రాదు ఎప్పుడైతే సంతృప్తి రాదో ధనికుడు అవ్వడం అనేది సాధ్యం కాదు అంటున్నాడు ఎపిక్యూరస్ ధనికుడు అంటే ధనం ఉంటుంది కానీ మనసులో సంతృప్తి ఉండకపోవడం వల్ల అశాంతితో బతకాల్సి వస్తుంది అన్నమాట పైగా ఈయన రెండు రకాలుగా కోరికల్ని డివైడ్ చేస్తాడు ఏంటంటే సహజమైన మరియు అవసరమైన కోరికలు అన్నమాట కోరికలు అసలు ఉండొద్దు అనేది కూడా ఎపిక్యూరస్ చెప్పట్లేదు కోరికలు ఉండాలి ఎటువంటివి అంటే ఆహారము ఆశ్రయం స్నేహం ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్ ఈ బేసిక్ నీడ్స్ లేదా డిజైర్స్ తప్పకుండా అందరికీ ఉంటాయి మనకు కూడా ఉండడంలో తప్పు లేదు
(08:31) వాటికి మన బ్యాంక్ బాలెన్స్ తో సంబంధం లేదు అవి తీర్చుకోవడం కోసం ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు కానీ వృధా కోరికలు చాలామందికి ఉంటాయి దాదాపుగా అందరికీ ఉంటాయి ఏంటంటే లగ్జరీ స్టేటస్ లేదంటే అంటే విపరీతమైన సంపద ప్రపంచంలో అందరికంటే ఆ సంపన్నుడిని అయిపోవాలని ఇలాన్ మాస్క్ కంటే నేను ఇంకా ఒక రూపాయి ఎక్కువ సంపాదించాలనే కోరిక పెట్టుకుంటే ఆ కోరిక నిరంతరం మనల్ని అశాంతికి గురి చేస్తూఉంటుంది అన్నమాట నిజానికి ఇలాన్ మాస్క్ అనేవాడు భూమిమీద అందరికంటే సంపన్నుడు ఎలా అయ్యాడు అంటే తనకు నచ్చిన పని చేయడం వల్ల అయ్యాడు తప్ప తను సంపన్నుడిని అందరికంటే రిచెస్ట్ పర్సన్
(09:09) అయిపోవాలనుకొని అతను కష్టపడలేదు. అతను వేరే పని చేస్తున్నప్పుడు ఆ పనిలో భాగంగా అతనికి డబ్బులు కూడా వచ్చేసినాయి. కాబట్టి చేసే పని మీద దృష్టి పెట్టడంలో తప్పు లేదు చేసే పనిలో సంతృప్తిని ఎతుక్కోవడంలో కూడా తప్పులేదు. అటు అలా చేస్తున్నప్పుడు డబ్బులు లేదా సంపద ఐశ్వర్యం ఇవన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా కానీ వాటి కోసమే పని చేస్తే మాత్రం అవి అది వృతా కోరికల కింద ఎపిక్యూరస్ చెప్తున్నాడు.
(09:35) ఇంకొకటి ఏంటంటే ధనవంతుడు ఎక్కువ సంపద ఉన్నవాడు కాదు. ధనవంతుడు అంటే ఎక్కువ సంపద ఉన్నవాడు కాదు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందగలిగేవాడే ధనవంతుడు అనేది ఎపిక్యూలస్ సిద్ధాంతం అంటే ఎంత తక్కువలో సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని కూడా మోడర్న్ పీరియడ్ లో చెప్తూఉంటారు అంటే చాలా సాదా సీదాగా బ్రతకడం నేర్చుకున్నవాడు అత్యంత ధనవంతుడు కింద లెక్క అనేది ఎపిక్యూరస్ సిద్ధాంతం ఎపిక్యూరస్ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలని కూడా చర్చించాడు అన్నమాట కేవలం ధనము సంపద ఇవే కాకుండా భయాలు ఈ భయాలని జయిస్తే గుండే జీవితం సంతృప్తికరంగా సార్ధకంగా ఉంటుంది అని చెప్తున్నాడు
(10:15) అన్నమాట మరణ భయం లేదంటే దేవుళ్ళకు సంబంధించిన భయం దేవుళ్ళ పట్ల సాధ అంటే ఒక సహేతుకమైన భక్తి వరకు కూడా ఓకే భక్తి ఉంటుంది చాలా మంది 99 శాతం మందిలో భక్తి ఉంటుంది. అని భక్తి హద్దుల్ని దాటిపోయి మరణం గురించి భయపడ్డట్టుగానే దేవుళ్ళ పట్ల రకరకాల నమ్మకాలు లేదంటే మూఢ నమ్మకాలతో భయానికి లోనవుతూ నిత్యం బిక్కుబిక్కుమంటూ అశాంతితో ఉంటే అటువంటి వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నా లేదంటే ఎటువంటి సుఖాలు సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళకి ఒక్కోసారి కనీసం నిద్ర కూడా పట్టదుఅన్నమాట అందుకే ఇన్సోమనియాల లాంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు చాలామంది సోఫాల్లో పరుపుల మీద మ్యాట్రెస్ల మీద చాలా ఖరీదైన ఆ
(11:09) బెడ్ వేసుకొని ఆ ఏసీ రూముల్లో పడుకుంటారు అయినా సరే వాళ్ళకి నిద్ర రాదు కానీ మంచి మే లేదా జూన్ ఎండకాలంలో ఫుట్ పాత్ మీద పడుకునేవాడు కూడా ఒకోసారి హాయిగా నిద్రపోతూ ఉంటాడు. దీనికి కారణం ఏంటి అంటే మనసు ఈ మనసులో అశాంతి గాని లేకపోతే తెచ్చిపెట్టుకున్న సమస్యలు గాని లేదంటే ఊహించుకొని అంచనాలు పెంచేసుకొని ఆ అంచనాల్ని రీచ్ అవ్వలేకపోయినప్పుడు అందుకోలేకపోయినప్పుడు మనలో మనమే రగిలిపోతూ ఉంటే దాని వల్ల మనం ఎంత సంపాదించినప్పటికీ ధనవంతుడు అవ్వలేదు అనేది ఎపిక్యూరస్ మనకు చెప్తున్నాడు దాన్ని ఆయన ప్రధానంగా మరణ భయం గురించి కూడా చాలా చర్చించాడు అన్నమాట
(11:48) ఆయన జీవిత కాలంలో మనిషి మరణిస్తానేమో లేదంటే తనకు సంబంధించిన వాళ్ళు మరణిస్తారేమో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాని గురించి ఊహించుకుంటూ ఉండడం ఇది కూడా ప్రధానంగా మనిషి జీవితం అశాంతిమయం అవ్వడానికి భయానికి లోనయి గంధరగోళం లేదంటే ఎప్పుడూ ఉద్విజ్ఞతకు లోన అవ్వడానికి కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళపోవడానికి ఇవన్నిటికీ కూడా ఒత్తిడికి ఒత్తిడికి కారణం భయం లేదా కోరిక అని ఈయన చెప్తున్నాడు అన్నమాట అయితే ఎపిక్యూరస్ చెప్పింది ఇప్పటికీ చాలా వందల సంవత్సరాల క్రితం కానీ ఆయన అప్పుడు చెప్పింది కూడా ఇప్పటికి రెలవెంట్ రెలవెన్స్ ఉందా
(12:27) ఇప్పటికి కూడా అది మనకు ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మార్కెట్ అనేది ప్రధానం అయపోయింది కన్స్ూమరిజం పెరిగిపోయింది ఎక్కడ చూసినా సరే యడ్స్ సోషల్ మీడియా రావడం వల్ల విపరీతమైన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేయడం వల్ల మనకు వద్దనుకున్నా కూడా రకరకాల విషయాలు తెలుస్తున్నాయి రకరకాల విశేషాలు కనిపిస్తున్నాయి రకరకాల వస్తువులు మనకు తెలియకుండానే మన మెదడులోకి చొరబడిపోతున్నాయి కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఆ మార్కెట్ లో కనిపించే క్యాంపెయిన్స్ యడ్ క్యాంపెయిన్స్ కి ప్రభావితమైపోయి ప్రచారానికి లొంగిపోయి
(13:09) రకరకాల వస్తువులు కొనేస్తూ కన్స్ూమరిజం అలవాటు పడిపోతుంది. అంటే మనిషి కేవలం కన్స్ూమర్ గా మాత్రమే మిగిలాడు తప్ప మనిషిగా ఉండట్లేదు. తక్కువ వస్తువులతో తక్కువ సేవలతో తక్కువ సర్వీసెస్ అండ్ తక్కువ ప్రాడక్ట్స్ తక్కువ గుడ్స్ తో మనిషి తన జీవితం గడపడం అనేది అసాధ్యంగా మారిపోయింది అన్నమాట దీనివల్ల మనిషి అంతకంతకు ఇంకా కొత్తవి కొనాలనుకుంటూ ఆ కొత్త కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులు సంపాదించే క్రమంలో ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఆరోగ్యం పోయిన తర్వాత మనశశాంతి లోపించడం వల్ల జీవితమే చేజారిపోయే పరిస్థితి వస్తుందన్నమాట
(13:47) ఇటువంటి మోడర్న్ ప్రాబ్లం కి కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎపిక్యూరస్ చెప్పిన కొటేషన్ మనకి ఇప్పటికీ ఉపయోగపడుతుంది అన్నమాట నిజమైన స్వేచ్ఛ ధనం కోరికలను తగ్గించడం ద్వారా మనకు లభిస్తుంది నిజమైన స్వేచ్ఛ ధనాన్ని గాని కోరికల్ని గాని తగ్గించుకుంటేనే వస్తుంది తప్ప పెంచుకుంటే రాదు సంతృప్తి అనేది సహజమైన ధనం అదే లగ్జరీ అనేది కృత్రిమమైన పేదరికం అన్నమాట ఇది మనం అర్ధం చేసుకుంటే మనం జీవితంలో మాక్సిమం ప్రతి క్షణం హ్యాపీగా ఉండడం సాధ్యం కాకున్నా కూడా జీవితంలో అత్యధిక భాగం సంతోషంగా ఉండగలుగుతాం.
(14:27) దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి థాంక్యూ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment