నీ మనశ్శాంతిని నువ్వే చంపుకోవద్దు! | Secret to Inner Peace | Satyagrahi
https://youtu.be/FmSVhGPLAMA?si=UNazEUa5wJW3KUc2
https://www.youtube.com/watch?v=FmSVhGPLAMA
Transcript:
(00:00) మీ మనశశాంతిని వేరే ఎవర పాడు చేయట్లేదు. మీరే పాడు చేసుకుంటున్నారు. రోజంతా ఏదో ఒక విషయంలో చిరాకు ఎవరి మీదో కోపం ఇంకేదో జరగలేదని చెప్పేసి అసహనం ఇవే కదా మనల్ని నిద్రపోనియకుండా చేస్తున్నాయి. బయట ఎవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. మీ లోపల ఉన్న ఆలోచనలే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి.
(00:19) ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే కచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి నచ్చినట్లు మనం రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ ఉండకూడదు.
(00:38) ఆఫీస్ లో బాస్ మనం అనుకున్నట్లే మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళు కూడా మన మనసులో ఏముందో ముందే ఊహించి ప్రవర్తించాలి. కానీ రియాలిటీకి దీనికి అంతా రివర్స్ లో ఉంటుంది. ఎప్పుడైతే బయట పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవో వెంటనే మనలో ఒక రకమైన కోపం అనేది మొదలైపోతుంది. అందులోనూ చిరాగు కూడా వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది.
(00:58) అవతల వ్యక్తి తప్పు చేశాడని మనకు అనిపించినప్పుడు ఆ తప్పుకు శిక్షగా మనల్ని మనం లోపల కాల్చుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు. ఆ అన్న వ్యక్తి ఎప్పుడో వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ మీరు మాత్రం రోజంతా ఆ మాటనే తలుచుకుంటూ నన్ను ఎలా అంటాడు వాడికి ఎంత ధైర్యం అని చెప్పేసి పదే పదే అనుకుంటూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ ఉంటారు.
(01:20) సో వాడు అన్నది ఒక్కసారే కానీ మిమ్మల్ని మీరు అనుకుంటూ తలుచుకుంటూ దాని గురించి బాధపడుతుంది మీరే కదా ఇక్కడ సమస్య బయట ఉన్న వ్యక్తులు కాదు ఆ వ్యక్తుల ప్రవర్తన వల్ల మీరు పొందుతున్న మానసిక అలజడి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మనసులో ఉండే ఆ ప్రశాంతత రిమోట్ కంట్రోల్ ఎప్పుడు ఇతరుల చేతికి ఇచ్చేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు.
(01:42) వాడు నవ్వితే మీరు నవ్వుతారు వాడు తిడితే మీరు ఏడుస్తారు. అంటే మీ లైఫ్ మీ కంట్రోల్ లో లేదన్నమాట. ఇదే అసలైన సమస్య. మనం ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతాం తెలుసా? మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ప్రపంచం ఒక పద్ధతిలో ఉండాలని మనం రూల్స్ రాసుకుంటాం. ఆ రూల్స్ బ్రేక్ అయినప్పుడు మనలో ఈగో దెబ్బ తింటుంది. ఈ అసహనం కేవలం ఒక క్షణం నుంచి వచ్చిపోయేది కాదు ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది.
(02:03) నిరంతరం ఇలా కోపంగా చిరాగ్గా ఉండటం వల్ల మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మీ మెదడు పనితీరని దెబ్బతీస్తాయి. ఇక బీపి పెరగటం, నిద్ర లేకపోవడం, తినదరకపోవడం ఇవన్నీ మీ మానసిక అశాంతికి ఫిజికల్ సిస్టం మాత్రమే. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ రిలేషన్షిప్స్. మీరు కోపంలో ఉన్నప్పుడు అనే ఒక్క మాట ఏళ్ల తరబడి ఉన్న బంధాన్ని ఒక్క క్షణంలో మొక్కలు చేస్తుంది.
(02:28) మీ ఫ్రస్ట్రేషన్ వల్ల మీ పిల్లలు మీ లైఫ్ పార్ట్నర్ మీ పేరెంట్స్ దూరమవుతారు. ఒక్క తాగుబోతును చూసి వాడు మారడం లేదని మీరు రోజు గొడవ పడటం వల్ల వాడు మారతాడో లేదో తెలియదు కానీ మీ ఇంట్లో ప్రశాంతత మాత్రం కచ్చితంగా మాయమవుతుంది. విషం అవతలి వాడు తాగితే చచ్చిపోవాల్సింది మీరు అని కోరుకోవడం ఎంత మూర్ఖత్వమో ఇతరుల ప్రవర్తన వల్ల మీరు ప్రశాంతత కోరుకోవడం కూడా అంతే మూర్ఖత్వం.
(02:52) ఈ అశాంతి మిమ్మల్ని మెల్లగా డిప్రెషన్ లోకి నెగిటివిటీ లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఈ నరకం నుంచి బయటపడటం ఎలా? దీనికి ఒకే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. అది ఉన్నది ఉన్నట్లు చూడటం అంతే ఒక చెట్టు ఉంది దానికి కాయలు లేవు. మీరు వెళ్లి ఆ చెట్టుని ఎందుకు కాయలు లేవు అని చెప్పేసి కొడితే కాయలు వస్తాయా రావు. ఎందుకంటే ఆ చెట్టు స్వభావం అది. అలాగే మనుషులు కూడా ప్రపంచంలో వందల రకాలు మనుషులు ఉంటారు.
(03:15) అందరూ బుద్ధిమంతులుగా అందరూ మర్యాదగా ఉండాలని రూల్ లేదు. ఒక తాగుబోతు రోడ్డు మీద పడి ఉన్నాడంటే అది వాడు ఎంచుకున్న జీవితం. వాడిని చూసి వీడు మారాడని చెప్పేసి మీరు ఫీల్ అవ్వడం వల్ల వాడు మారతాడో లేదో తెలియదు కానీ మీరైతే డిసపాయింట్ అయిపోయి మీరు బాధపడతారు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. అంగీకరించడం అంటే తప్పును సమర్ధించడం అని కాదు.
(03:37) ఆ తప్పు వల్ల మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి మీకు మీరు ఒక రూల్ పెట్టుకోవడం. అవతలి వ్యక్తి తన సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మీరు మీ ప్రశాంతతని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు అతను మంచిగా ఉన్న చెడుగా ఉన్న సంస్కారంగా ఉన్న కుసంస్కారంతో ఉన్నా సరే మీ ప్రశాంతతని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. ఏదైనా మీకు నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి.
(04:00) అక్కడ ఒక ఐదు సెకండ్ల రూల్ పాటించండి. ఆ ఐదు సెకండ్లు దీర్ఘంగా గాలి పేల్చుకొని మనసులో ఇలా అనుకోండి. ఇది ఇలాగే [సంగీతం] ఉంది. ఆ వ్యక్తి స్వభావం అది. ఈ పరిస్థితి నా కంట్రోల్ లో లేదు కాబట్టి నేను డిస్టర్బ్ అవ్వను. మీరు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం మానేసి అబ్సర్వ్ చేయడం మొదలు పెడతారో అప్పుడే మీరు సగం యుద్ధం గెలిచినట్లే మీ ప్రశాంతత మీ బాధ్యత ఎదుటి వారి ప్రవర్తన కాదు.
(04:22) ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే ప్రశాంతత అనేది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు అది మీరు లోపల నిర్మించుకోవాల్సిన ఒక సామ్రాజ్యం. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందు ప్రోయాక్టివ్ గా ఉండడం నేర్చుకోండి. అంటే బయట ఏం జరిగినా నువ్వు లోపల ప్రశాంతంగా ఉండాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి.
(04:41) ఆ రోజంతా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. [సంగీతం] ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వి ఆ నవ్వుని వాళ్ళకి బహుమతిగా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ టైం మీ ఎనర్జీ చాలా విలువైనవి. వాటిని పనికి రాని వాదనల కోసం అర్థం లేని కోపాల కోసం వృదా చేసుకోకండి.
(05:00) చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఇష్టపడే హీరోని వాళ్ళు అభిమానించే రాజకీయ నాయకుడిని వాళ్ళు ఎంతగానో ఆదరించే క్రికెటర్లని ఎవరైనా తిట్టితే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అలా కాదు అలా ఎలా అంటావ అని చెప్పేసి వాళ్ళతో వాదిస్తారు. మీరు వాదించినంత మాత్రాన అవతలవాడు వాడి వాదన ఆపుతాడా ఆపడవు.
(05:20) సో దాని వల్ల ఏమవుతుందంటే మీరు అతని మీద గెలవాలని చెప్పేసి మీ విలువైన సమయాన్ని మీ అద్భుతమైన ఎనర్జీని మీరు వృధా చేసుకుంటారు. ఇలా ఆ విషయాలనే కాదు ప్రతి ఒక్క విషయంలో మీ ఇంటి పక్కనోళ్ళు అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీతో పాటు ఎప్పుడూ ఉండే మీ కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు. ఒక విషయం మీద వాళ్ళు వాదిస్తున్నప్పుడు లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అందులోని మీ సమయాన్ని మీ ఎనర్జీని వృధా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్.
(05:47) అలా వెళ్ళిపోవడం వల్ల జరిగేది ఏంటంటే వీడు ఏది మాట్లాడినా సరే అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మీ దగ్గర ఆ టాపిక్స్ అసలు మాట్లాడటం మానేస్తారు. అలా మాట్లాడటం మానేసినప్పుడు మీ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక విషయం మీద ఆర్గ్యూ చేసుకొని మీకు మీరు గొడవలు పడటం కన్నా మీకు నచ్చని విషయం మాట్లాడినప్పుడు చిన్న నవ్వు నవ్వారనుకోండి ఆ టాపిక్ అక్కడితో ఆగిపోతుంది కదా ఇదే మెయిన్ పాయింట్ సో కాబట్టి మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా సరే మీ దగ్గరికి వచ్చి వాగినా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు ఒక చిన్న
(06:17) చిరునవ్వున అవ్వండి అంతటితోనే అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారదు. కానీ ఆ ప్రపంచాన్ని మీరు చూసే విధానం మారుతుంది. అంటే అవతలి వాడు మారాల్సిన అవసరం లేదు. మనం మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకుంటే చాలు. ఎప్పుడైతే ఆ మార్పు అనేది వస్తుందో అప్పుడు చిన్న చిన్న విషయాలకు మీరు చిరాగు పడరు.
(06:39) మీ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడపగలుగుతారు. జీవితం చాలా చిన్నది. ఇందులో కోపతాపాలకు చోటుఇవ్వకండి. ప్రశాంతంగా ఉండడం అంటే ఏమి చేయకుండా కూర్చోవడం కాదు అలజడి మధ్యలో ఉన్నా కూడా నిశ్చలంగా ఉండగలగడం అంటే మిమ్మల్ని ఒక 100 మంది డిస్టర్బ్ చేస్తున్నా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం అనేది మీ ఛాయిస్ కదా సో దాన్నే నిశ్చలంగా ఉండటం అంటారు.
(07:03) కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసినా [సంగీతం] సరే మీరు డిస్టర్బ్ అవ్వకండి. డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి ఉదయం లేచిన తర్వాత ఈరోజు నేను ఎటువంటి నెగిటివిటీని ఎంకరేజ్ చేయను. ఎటువంటి నెగిటివిటీ మాటలు వచ్చినా సరే ఆ మాటల్ని పట్టించుకోకుండా ఉంటాను తప్ప ఆ మనుషుల్ని కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాను కాకపోతే మనిషి అన్నాక ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో కొన్ని మాటలు అంటాడు అలాంటప్పుడు ఒక నవ్వు నవ్వడం నేర్చుకోవాలి అని చెప్పేసి మీకు మీరు కన్సిస్టెంట్ గా చెప్పుకుంటూ ఉండండి.
(07:32) అవతలి వాళ్ళని క్షమించడం కూడా ఒక ఆర్ట్ అవతలి వాళ్ళని నిందించడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ సో నేను చెప్పేది ఏంటంటే అవతలి వాళ్ళు ఎన్ని సార్లు అంటారు మిమ్మల్ని మహా అయితే 10 సార్లు అంటారు. మీరు 10 సార్లు నవ్వితే అయిపోతుంది అక్కడ అంతకుమించి ఏమ లేదు కాబట్టి ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి నా ప్రశాంతత దెబ్బ తీసే అధికారం ఏ వ్యక్తికి ఏ పరిస్థితికి నేను ఇవ్వను అని గట్టిగా అనుకోండి.
(07:55) ఈ మార్పు మీలోనే మొదలవ్వాలి. ఇప్పుడే మొదలవ్వాలి. ఈరోజే ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి. మరి ఇవన్నీ విన్నాక మీకో చిన్న ప్రశ్న ఇన్ని రోజులు మీ ప్రశాంతతని పాడు చేస్తున్న ఆ ఒక్క అలవాటు లేకపోతే ఒక వ్యక్తి అది కూడా కాకపోతే ఒక టాపిక్ అన్నమాట. సో వాటి వల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం మానేలని ఇప్పుడే ఫిక్స్ అయ్యారా లేదా మీ సమాధానాన్ని కింద కామెంట్స్ రూపంలో రాయండి.
(08:18) ఎందుకంటే మీరు రాసే కామెంట్ అనేది ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ రాయండి. అంతే కాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం రెండు అద్భుతమైన వీడియోస్ ని పెం చేసి పెట్టాను వాటిని కూడా చూడండి.
(08:36) ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. ఓం
No comments:
Post a Comment