Sunday, February 8, 2026

The Biggest Lie The Whole World Believed | EPSTIEN FILES | Anukula Vedam || Telugu Podcast

The Biggest Lie The Whole World Believed | EPSTIEN FILES | Anukula Vedam || Telugu Podcast

https://youtu.be/TJ8lc4cRgHY?si=mDOJ67v4dx82JfP8


https://www.youtube.com/watch?v=TJ8lc4cRgHY

Transcript:
(00:01) [సంగీతం] ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక థియరీ బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఒక మనిషికి గాని పొరపాటున పవర్ ఇస్తే వాడి లోపల ఉన్న బ్రేక్స్ ఫెయిల్ అయిపోతాయట. వాడు రాక్షసుడిగా మారిపోతాడట. డోపమైన్ కోసం ఎంతకైనా దిగి సరిపోతాడట. వినడానికి ఇది మీకు జోకర్ సినిమా ఫిలాసఫీలా చాలా డీప్ గా డార్క్ గా అనిపించొచ్చు.
(00:23) ఎందుకంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు ఈ ఎబ్స్టీన్ లాంటి కసాయి వాళ్ళ మీద కోపం చచ్చిపోయి అయ్యో పాపం పవర్ వల్లే అలా అయిపోయాడేమో పసిబిడ్డ అని [సంగీతం] జాలి పుడుతుంది. ఒక క్రిమినల్ ని వెనకేసుకొని రావడానికి వాడి తప్పుని అది జస్ట్ హ్యూమన్ నేచర్ అని సింపుల్ గా హ్యూమన్ నేచర్ మీదకి నెట్టేసి తప్పించుకోవడం అన్నంత సులువైన మార్గం ఇంకొకటి లేదు.
(00:43) కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది అసలు ఫిలాసఫీఏ కాదు. ఇప్పుడు మనం అసలు పాయింట్ లోకి వెళ్దాం. కేవలం పవర్ వల్ల మనిషిలో ఉన్న బ్రేకులు ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. మరి ఎప్పుడు ఫెయిల్ అవుతాయి పవర్ చేతిలోకి రాగానే ఏహా ఈ బ్రేకులతో నాకేంటి పని నన్ను ఎవడరా ఆపేది అని వాడికి వాడి ఆ బ్రేకుల్ని పీకేస్తాడు. దీన్నే సైకాలజీలో ద క్యాటలిస్ట్ ఎఫెక్ట్ అంటారు.
(01:07) క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం. ఒక రసాయన శాస్త్రంలో ఉత్ప్రేరకం అనేది ఎలాగైతే చర్యలో పాల్గొనకుండానే వేగాన్ని పెంచుతుందో పవర్ కూడా అంతే. పవర్ మనిషిని మార్చదు వాడి లోపల ఆల్రెడీ దాక్కొని ఉన్న మృగాన్ని బయటికి రావడానికి ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఏంటి అర్థం ఈ పవర్ అనేది ఒక మనిషి లోపలికి వెళ్ళాక అప్పుడు వాడిని ఫ్రెష్ గా చెడ్డవాడిని చేయట్లేదు వాడికి పవర్ రాకముందు కూడా ఆల్రెడీ వాడు చెడ్డవాడే అయితే ఇప్పుడు ఈ పవర్ ఏం చేస్తుంది ఆ చెడ్డని బయటికి తేవడానికి ధైర్యాన్ని ఇస్తుంది.
(01:39) దీని గురించి ప్లేటో ద రిపబ్లిక్ అనే బుక్ లో ఒక మాట చెప్పారు. మనిషికి కనిపించకుండా పోయే శక్తి వస్తే వాడు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడట. ఎందుకంటే నన్ను ఎవరూ చూడట్లేదు నాకు శిక్ష పడదు అనే ధైర్యం. ఆ ఎప్స్టీన్ గాడికి వచ్చింది కూడా పవర్ కాదు ఇటువంటి ధైర్యమే. ఆ ధైర్యం రాగానే వాడి లోపల అప్పటివరకు పవర్ లేకపోవడం వల్ల దాక్కుొని ఉన్న భయం పోయి వాడి అసలైన బుద్ధి బయటపడింది.
(02:04) సో వాడిలో ఆల్రెడీ దాక్కొని ఉన్న వక్రబుద్ధిని వదిలేసి వాడికి దొరికిన పవర్ ని మాత్రమే నిందించడంలో అర్థం లేదు లాజిక్ అసలే లేదు. ఒక మనిషికి జీవితంలో అన్ని దొరికేసాక లైఫ్ లో ఒక ఎంటీనెస్ వస్తదట. అలా ఎంటీనెస్ ఫీల్ అయినప్పుడు ఎక్సైటింగ్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఫీల్ అయ్యి ఏదైనా సీక్రెట్ గా సంఘ వ్యతిరేకమైన పని చేయాలి అని అనుకుంటాడట.
(02:25) దీన్నే ఎగ్జిస్టెన్షియల్ బోర్డం అంటారు. జీవితంలో అన్ని అనుభవించేశాక ఇంకా ఏం మిగిలింది అని శూన్య భావం అది. దీనికి ప్రఖ్యాత సైకయాట్రిస్ట్ విక్టర్ ఫ్రాంక్ ఒక విరుగుడు చెప్పాడు. విల్ టు మీనింగ్ జీవితంలో బోర్ కొట్టినప్పుడు మనిషి తప్పు వైపు కాదు అర్థం వైపు ప్రయాణించాలి అని ప్రపంచంలో వేల మంది బిలియనర్లు ఉన్నారు. వాళ్ళందరికీ లైఫ్ లో బోర్ కొట్టింది.
(02:47) మరి వాళ్ళందరూ రాక్షసులుగా మారిపోయారా లేదు రతన్ టాటా గారికి పవర్ లేదా వారన్ బఫెట్ కి బోర్ కొట్టలేదా ఆనంద మహేంద్ర గారికి లైఫ్ లో కిక్ కావాలనిపించలేదా మరి వాళ్ళంతా రాక్షసులుగా ఎందుకు మారలేదు వారన్ బఫెట్ తన సొంత ఆస్తిని దానం చేస్తుంటారు. ఆనంద మహేంద్రట్wిitటter లో జోకులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఆస్తులు దానం చేశారు నలుగురికి సాయం చేశారు.
(03:09) కానీ ఎప్స్టీన్ గాడు పసిపిల్లల్ని వేధించాడు. తేడా ఎక్కడుంది మంచివాడు అర్థాన్ని వెతుక్కున్నాడు చెడ్డవాడు అనర్థాన్ని వికారాన్ని వెతుక్కున్నాడు. బోర్ కొట్టడం కామన్ కానీ ఆ తర్వాత తీసుకునే మలుపు ఉంది చూశారు అదే వాడి సంస్కారం. ఒక సాధారణ మనిషికి పవర్ ఇస్తే క్రూరంగా మారతాడు అనే వాదనకు బలం చేకూర్చడానికి చాలామంది 1971లో జరిగిన స్టాన్ఫోర్డ్ జైల్ ఎక్స్పెరిమెంట్ ని ఉదాహరణగా చూపిస్తూ అదేదో పెద్ద వేదంలా చెప్తున్నారు.
(03:36) ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగిందంటే కొంతమంది నార్మల్ గా ఉండే స్టూడెంట్స్ కి గార్డలుగా ఉండమనే పవర్ ఇచ్చారు. ఆ పవర్ వాళ్ళ చేతిలోకి రాగానే వాళ్ళు పూర్తిగా మారిపోయి అందరినీ హింసించడం మొదలుపెట్టారట. ఇది నిజమే కావాలా అని చాలా మంది నమ్మేసారు కానీ మీకు ఎవ్వరూ చెప్పని నిజం ఏంటో నేను ఇప్పుడు చెప్తా ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఫేక్ 2018 లో బయటపడిన టేబుల్ ప్రకారం ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం ఒక ఫ్రాడ్ ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రొఫెసర్ జింబార్డో ఆ స్టూడెంట్స్ కి ముందే కోచింగ్ ఇచ్చి మీరు గార్డులుగా మారాక మీరు ఖైదీలను హింసించండి క్రూరంగా ప్రవర్తించండి అని ఇన్స్ట్రక్షన్స్
(04:09) ఇచ్చాడు. అది జస్ట్ ఒక స్టేజ్డ్ డ్రామా అంటే అర్థం ఏంటి వాళ్ళు పవర్ వల్ల మారలేదు జస్ట్ ఆ ప్రొఫెసర్ డైరెక్ట్ చేసినట్టు నటించారు అంతే దీన్ని బేస్ చేసుకొని మనుషులంతా లోపల రాక్షసులే అని డిసైడ్ చేయడం మూర్ఖత్వం అది జస్ట్ ఒక సినిమా అంతే [సంగీతం] దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఎక్స్పెరిమెంట్ 2002లో బిబిసి ప్రెసెంట్ స్టడీ అని జరిగింది.
(04:31) అందులో పవర్ ఇచ్చినప్పుడు ఆ గాడ్స్ చాలా బాధ్యతగా డెమోక్రటిక్ రూల్స్ ప్రకారం నడుచుకున్నారు. రూల్స్ కి అగైన్స్ట్ గా వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంటి? దీన్ని బట్టి సైన్స్ ఏం చెప్తుంది? ఎస్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్ షేప్స్ యువర్ బిహేవియర్ బట్ ఇట్ డంట్ డిక్టేట్ ఇట్. పరిస్థితులు మనిషిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి కానీ అవి మనిషిని శాసించవు.
(04:53) చివరి నిర్ణయం ఎప్పుడూ మనిషిదే. సో ఒక ఫేక్ ఎక్స్పెరిమెంట్ ని తీసుకొచ్చి మొత్తం మనిషి స్వభావాన్ని తప్పుపట్టడం వారికి ఉన్న హాఫ్ నాలెడ్జ్ కి నిలువెత్తు నిదర్శనం. చివరిగా సైకాలజీలో హెడానిక్ అడాప్టేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. చాలా మంది దీని గురించి ఏమనుకుంటారంటే మనిషికి జీవితంలో అన్ని దొరికేస్తే బోర్ కొట్టేసి కొత్త కిక్కు కోసం నేరాలు చేస్తాడు అని అఫ్కోర్స్ ఇందులో ఖచ్చితంగా లాజిక్ ఉంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి రతన్ టాటా గారికి పవర్ లేదా బిల్ గేట్స్ కఅన్నీ దొరకలేదా వారన్ బఫెట్ కి బోర్ కొట్టలేదా మరి వాళ్ళందరూ మానభంగాలు చేసేవారిగానో ఉన్మాదులుగానో
(05:26) మారిపోయారా లేదు వాళ్ళకి బోర్ కొడితే ఆస్తులు దానం చేశారు సమాజానికి సేవ చేశారు. కానీ ఎప్స్టీన్ లాంటి వాళ్ళు మాత్రం పసిపిల్లల్ని వేధించారు. తేడా ఎక్కడ ఉంది పవర్ లో కాదు పర్సనాలిటీలో ఉంది. సైకాలజీలో డార్క్ ట్రేడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఈ నార్సిజం సైకోపాత టైపు మనుషులు ఉంటారే వాళ్ళు వాళ్ళకి మాత్రమే బోర్ కొడితే నేరం వైపు వెళ్తారు.
(05:47) మరి సాధారణ మనిషి బోర్ కొడితే తన జీవితంలో కొత్త అర్థాన్ని వెతుక్కుంటాడు. సో ఒక మానసిక రోగి లక్షణాన్ని తీసుకొచ్చి ఇదే మనిషి సహజ లక్షణం అని జెనరలైజ్ చేయడం ఇంటలెక్చువల్ బ్లండర్. [సంగీతం] ఇక చివరిగా కొంతమంది ఎప్స్టీన్ గాడి గురించి ఏమంటున్నారంటే వాడి బ్రెయిన్ లో డోపమైనే వాడితో అలా చేయించింది వాడి తప్పేమి లేదు అని వాదిస్తున్నారు.
(06:09) దీన్నే జీన్ పాల్ సాత్రే ఫిలాసఫీలో బ్యాడ్ ఫెయిత్ అనే కాన్సెప్ట్ లో వివరించారు. అంటే మన తప్పుని మన పరిస్థితుల మీదకు నెట్టేయడం. అయితే మనిషి బ్రెయిన్ లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఎందుకు ఉందో తెలుసా ఎందుకంటే మనిషికి జంతువుకి తేడా ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఒక జంతువుకి డోపమైన్ అనేది రైజ్ అయితే అది ఆగలేదు కానీ మనిషికి ఇది తప్పు ఇక్కడ ఆగాలి అని చెప్పే విచక్షణ ఉంది.
(06:37) ఆ విచక్షణ వాడకుండా ఒక జంతువులా ప్రవర్తిస్తే అది వాడి సొంత ఛాయిస్ సో ఇప్పుడు వాడు ఎంచుకున్న సొంత ఛాయిస్ ని పట్టుకొని బయాలజీ మీదకి నెట్టేయడం అంటే రేపు పొద్దున ఈ మానభంగాలు చేసినోళ్ళని కూడా పాపం వాళ్ళు హార్మోన్స్ వల్ల అలా బిహేవ్ చేశారు కానీ వాళ్ళ తప్పేమ లేదు అని వదిలేయమనా బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ లాజిక్ ఆ అబ్స్టీన్ గాడికి నేరం చేయకుండా ఆగిపోవడానికి 100 ఛాన్సులు ఉన్నాయి కానీ వాడు ఆగాడా ఆగలేదు అది వాడు ఎంచుకున్న ఛాయిస్ దాన్ని పట్టుకొని వాడి బ్రెయిన్ వైరింగ్ మీదకి నెట్టేసి వాడిని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో డోంట్ కన్ఫ్యూస్ బయాలజీ విత్ మొరాలిటీ.
(07:12) పవర్ మనిషిని కరప్ట్ చేస్తుంది అనుకుంటారు చాలామంది యాక్చుల్లీ ఈ పవర్ కరప్ట్స్ అనే సామితిని చెప్పింది లార్డ్ యక్టిన్ కానీ దాని మీద ప్రపంచ ప్రఖ్యాత బయోగ్రఫర్ పులిడ్జర్ విన్నర్ అయిన రాబర్ట్ కారో చాలా రీసెర్చ్ చేశక ఏం చెప్పాడో తెలుసా పవర్ డజంట్ కరప్ట్ పవర్ రివీల్స్ అంటే అధికారం అనేది ఒక ఎక్స్రే మిషన్ లాంటిది నీ లోపల మంచితనం ఉంటే అధికారం వచ్చాక నువ్వు మహాత్ముడిగా అవుతావు నీ లోపల విషం ఉంటే అధికారం వచ్చాక హంతకుడిగా మారుతావు అక్కడ మారింది మనిషి కాదు వాడి చేతిలో ఉన్న ఆయుధం లోపం పవర్ది కాదు ఆ పవర్ ని పట్టుకున్న చేతిది ఎప్స్టీన్ అనేవాడు పవర్
(07:49) రావడం వల్ల చెడిపోలేదు వాడు ఆల్రెడీ చెడిపోయినవాడు కాబట్టే పవర్ ని ఆయుధంగా వాడుకున్నాడు. ఈ చిన్న కామన్ సెన్స్ అండ్ లాజిక్ ఎలా మిస్ అవుతారు మరి కొంతమంది మేధావులు సో పవర్ అనేది మనిషిని మాన్స్టర్ గా మార్చదు పవర్ అనేది ఒక మాగ్నిఫయింగ్ గ్లాస్ అంటే ఒక భూతద్దం లాంటిది నువ్వు మంచివాడివైతే పవర్ వచ్చాక మహాత్ముడిలా కనిపిస్తావు చెడ్డవాడివైతే పవర్ వచ్చాక రాక్షసుడిలా కనిపిస్తావు.
(08:13) లోపం గ్లాస్ ది కాదు కింద ఉన్న మనిషిది. సో ఫిలాసఫీ అండ్ సైకాలజీ మీద చాలా గ్రిప్ ఉన్నట్టు మాట్లాడుతున్న మేధావులకి నా మనం ఏంటంటే కేవలం ఏదో YouTube లో కొన్ని డాక్యుమెంటరీలు చూసి కాకుండా కాస్త సైన్స్ జర్నల్స్ కూడా చదివితే మనుషులు పవర్ వల్ల రాక్షసులుగా మారరు ఆల్రెడీ రాక్షస స్వభావం ఉన్నవాళ్లే పవర్ లోకి రావడం వల్ల వ్యవస్థ నాశనం అవుతుంది అని అర్థంవుతుంది.
(08:34) [సంగీతం] గుర్తుపెట్టుకోండి పవర్ డంట్ కరప్ట్ పీపుల్ పీపుల్ కరప్ట్ పవర్ అధికారం మనుషులని చెడగొట్టదు మనుషులే అధికారాన్ని చెడగొడతారు. దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ స్మార్ట్ అండ్ బీయింగ్ రైట్ ఆ తేడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో YouTube లో దొరికే హాఫ్ నాలెడ్జ్ తీరలేని నమ్మి మీలో ఉన్న సహజమైన మనిషిని తక్కువ చేసుకోకండి యు ఆర్ మచ్ బెటర్ దన్ దట్ ఈ పాడ్కాస్ట్ లో ఆ తేడా మీకు క్లియర్ గా అర్థమైిందనే అనుకుంటున్నాను.
(09:02) చలో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment