Thursday, March 5, 2026

4వేల ఏళ్ళ తెలుగు | How was the Telugu Script born? | Complete History of Telugu Language | Dhatri TV

4వేల ఏళ్ళ తెలుగు | How was the Telugu Script born? | Complete History of Telugu Language | Dhatri TV

Author Name:Dhatri TV

Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eWRDP4z47Mo



Transcript:
(00:05) శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు పలికిడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట తెలుగుదేలయన్న దేశంబు తెలుగు మనం రోజు మాట్లాడే తెలుగు భాష ఎప్పుడు పుట్టింది మనం రాస్తున్న తెలుగు లిపి ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది ఎలా ఈ రూపానికి వచ్చింది తెలుగు ఒక్క రోజులో పుట్టిన భాష కాదు వేల సంవత్సరాల ప్రయాణం చేస్తూ ప్రస్తుతం మనం మాట్లాడే రాసే రూపానికి వచ్చింది.
(00:46) ఈ వీడియోలో తెలుగు భాష పుట్టుక నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్న తెలుగు వరకు స్పష్టమైన చారిత్రక భాషా శాస్త్ర ఆధారాలతో తెలుసుకుందాం. తెలుగు ఎప్పుడు పుట్టింది అని మొదలు పెడితే కొన్ని వేల ఏళ్ల వెనక్కు వెళ్ళాలి మనం తెలుగు భాష పుట్టిన ఖచ్చితమైన తేదీ ఏది చెప్పలేం ఎందుకంటే ప్రపంచంలో ఏ భాష అయినా ఒక్కసారిగా పుట్టదు క్రమంగా నెమ్మదిగా మారుతూ వస్తుంది.
(01:17) భాషా శాస్త్రవేత్తల ప్రకారం తెలుగు దాదాపు 3000 నుండి 4వేల సంవత్సరాల క్రితం ప్రత్యేక భాషగా ఏర్పడింది. అయితే ఇది ఎక్కడి నుండి పుట్టింది అది తెలుసుకోవాలి కదా తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందిన భాష తమిళం కన్నడం మలయాళం తెలుగు లాంటి 20 కి పైగా భాషలు ఒకే మూలం నుండి వచ్చాయి ఆ మూలాన్ని మూల ద్రావిడ భాష అన్నారు.
(01:44) మూల భాషలోని పదాలు దాని నుండి ఏర్పడ్డ భాషల్లో మార్పులు పొందుతాయి. ఉదాహరణకు తమిళంలో కై తెలుగులో చేయి అవుతుంది. తమిళంలో తలై తెలుగులో తల కన్నడంలో తలే ఏ భాష అయినా పుట్టినప్పుడు ఉన్నట్లే తరువాత ఉండదు. క్రమంగా మారుతూ వస్తుంది. ఉచ్చారణలో మార్పులు వస్తాయి. కొత్త పదాలు పుడతాయి. వాక్య నిర్మాణంలోనూ మార్పులు ఉంటాయి. అయితే పదాల్లో వచ్చినంత ఎక్కువగా వాక్య నిర్మాణంలో మార్పులు రావు.
(02:14) మూల ద్రావిడం నుండి నెమ్మదిగా మారుతూ చివరికి తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడింది. వేదాలలో ద్రావిడ పదాలు ఉన్నాయి. ఆంధ్రజాతి ఆంధ్రదేశం ఉన్నప్పుడు భాష కూడా ఉండే ఉంటుంది కదా భరతుడి నాట్యశాస్త్రంలో పొత్తులకు వాడాల్సిన విభాషల్లో ఆంధ్ర భాష కూడా ఉంది. రామాయణ మహాభారతాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది ఆ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(02:41) ఆంధ్రులు ఒక జాతిగా వేదకాలానికే ఉన్నారు. ఒక దేశంగా ఆంధ్రం రామాయణంలో కనిపిస్తుంది. గొప్ప సైనిక వీరులుగా ఆంధ్రులు మహాభారతంలో ఉన్నారు. వేదాల వెలుగులో ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించిన తొలి ఆంధ్రుల ప్రస్తావన ఇది. విశ్వామిత్రుడి శాప కథలో ఆంధ్రులు ప్రత్యక్షమవుతారు. ఆ శ్లోకం ఇది. ఏ విశ్వామిత్రస్య పుత్రాహ ప్రాణా ఆహుహు ఆంధ్రాహ పుండ్రాహ శబరాహ పులిందా మూతిబాయితి తాన్ ఉదంతాన్ బహవోభవంతి దీని అర్థం ఏంటంటే విశ్వామిత్రుడి కొడుకులు దక్షిణ దిశకు వెళ్లి అక్కడ ఆంధ్రులుగా పుండ్రులుగా పులిందులుగా మారారని ఈ వేద వాక్యం చెబుతోంది. అంటే
(03:29) సాధారణ శకానికి పూర్వం 800 నాటికే ఆంధ్రులు ఒక జాతిగా ఉన్నారు. ఇక రామాయణంలో ఆంధ్రులు ఎక్కడున్నారో చూద్దాం. దక్షిణ దిశలో సీతమ్మ కోసం వెతకమని చెప్పినప్పుడు సుగ్రీవుడు వానర వీరులకు ఇచ్చిన మార్గ నిర్దేశనంలో ఆంధ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఆ శ్లోకం ఇది. అన్వీక్ష దండకారణ్యం సపర్వత నదీ గుహం నదీం గోదావరిం చైవ సర్వమేవానుపస్యత తదైవా ఆంధ్రాస్చ పుండ్రాన్స్చ చోళాన్ పాణ్యాన్ సకేరళాన్ దీని అర్థం ఏంటంటే పర్వతాలతో నదులతో గుహలతో కూడిన దండకారణ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ
(04:16) ప్రదేశాల్లో సీతమ్మను వెతకమని సుగ్రీవుడు చెప్పాడు అంటే అప్పటికే ఆంధ్రం ఒక రాజ్యం ప్రజల స్థిర నివాసమైన ఒక ప్రాంతం ఇక భారతంలో ఆంధ్రులు ఎక్కడున్నారో చూడండి మహాభారతంలో కూడా ఆంధ్రుల జాడ స్పష్టంగా కనిపిస్తోంది. భీష్మ పర్వంలో దక్షిణ రాజ్యాల జాబితాలో ఆంధ్రులు వీరులుగా కనిపిస్తారు. ఆ శ్లోకం ఇది. ఆంధ్రాన్స్చైవ పులిందాన్స్చ శబరాన్స్చ నరాధిప పశ్యద్వస్తాన్ మయారాజన్ దిశం ప్రస్తున శక్యయుహు దీని అర్థం ఏంటంటే అక్కడ ఆంధ్రులు మహా బల సంపన్నులుగా అజేయ శక్తిగా ఉన్నారు అని కౌరవ పాండవుల మధ్య ఆంధ్రుల సైనిక సామర్థ్యం ఎంత బలంగా ఉందో ఇది
(05:02) చెబుతోంది. ఇప్పుడు తొలి తెలుగు ఆనవాళ్లు ఏమిటో చూద్దాం. మొదట మౌఖిక దశ సాధారణ శకానికి పూర్వం 400 500 మధ్య తెలుగు భాష ప్రారంభ దశలో లిఖిత రూపంలో కాకుండా ప్రాకృత దేశీ భాషల ప్రభావంతో మౌఖికంగా విస్తరించింది. నేటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడిన దేశీ పదాలే ఈ కాలంలో ప్రాకృత సాహిత్యంలోకి ప్రవేశించాయి.
(05:30) ఈ దశలో తెలుగు ప్రజల నిత్యజీవిత సంభాషణల్లో నిరంతరం వినిపించిన జీవ భాష గా కొనసాగింది. నాగబు అనే మాట ఎక్కడ దొరికింది? అమరావతి శాసనంలో సాధారణ శకానికి పూర్వం సుమారు 400 ఆంధ్రప్రాంతంలోని అమరావతి బౌద్ధ మహాస్తూపం సమీపంలో లభించిన రాతి శాసనంలో కనిపించే నాగబు అనే పదాన్ని తెలుగు భాషకు లభించిన అత్యంత ప్రాచీన రాతపూర్వక ఆధారాల్లో ఒకటిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.
(05:59) ఈ పదం సుమారు సాధారణ శకానికి పూర్వం రెండవ శతాబ్దం లేదా అంతకంటే పూర్వం అంటే దాదాపుగా 2200 నుండి 2400 ఏళ్ల క్రితానిది ఇది ప్రస్తుతం పల్నాడు జిల్లా ఇదివరకు గుంటూరు జిల్లాలోని అమరావతి స్తూపం వద్ద లభించింది. నాగ అనే మూల పదానికి బు అనే తెలుగు ప్రత్యయం కలిసి ఏర్పడింది. పాము లేదా నాగ జాతికి చెందిన వ్యక్తి అని ఈ మాట అర్థం.
(06:28) ప్రాచీన తెలుగు వాడుకలో ఉన్న భూ ప్రత్యయం కాలక్రమేణ ఆధునిక తెలుగులోని ము గా మారింది. నాగబు నాగము అయితే శాసనంలో నాగబుధ అని ఉంటే ద చివరి అక్షరం దగ్గర రాయి పగిలిపోవడంతో నాగబు మాటను తీసుకున్నారని నాగంబు నాగంబు నాగము అన్న మాటలు తరువాత కూడా మనుగడలో ఉండి నాగబు అన్న మాట లేదు కాబట్టే తరువాత ఎక్కడా వాడుకలో లేదని పండితుల మధ్య ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.
(07:02) ఆ చర్చ ఎలా ఉన్నా నాగబూ పదం ద్వారా తెలుగు భాష సాధారణ శకానికి పూర్వం కాలం నుంచే ఉనికిలో ఉందని స్పష్టమవుతోంది. ఇది తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించడంలో కీలక ఆధారంగా నిలిచింది. శాతవాహనుల కాలానికే తెలుగు స్వతంత్ర రూపాన్ని సంతరించుకుందని ఈ శాసనం చెబుతోంది. గాధా సప్తశతిలో ప్రజల మాటలు. శాతవాహన రాజు హాలుడు సంకలనం చేసిన గాధా సప్తశతి గ్రంథంలో అత్త పొట్ట పిల్లి లాంటి దేశీ పదాలు కనిపిస్తాయి.
(07:37) ఇవి నేటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాషలో ఉన్నవి. ఈ గ్రంథం ద్వారా తెలుగు సామాన్య ప్రజల మౌకిక భాషగా అప్పటికే స్థిరపడిందని తెలుస్తుంది. ఈ దశలో తెలుగు ఒక అధికారిక భాషగా కాక ప్రజల జీవన వ్యవహారంలో ఉన్న మౌకిక భాషగా అభివృద్ధి చెందింది. అక్షర రూపంలో తొలి సంపూర్ణ శాసనాలు ఎప్పుడు దొరికాయి ఎక్కడ దొరికాయో చూద్దాం.
(08:02) సాధారణ శకం 500 1000 మధ్య ఈ కాలంలో తెలుగు మౌఖిక భాష నుండి లిఖిత భాషగా మారింది. నేటి కడప ప్రకాశం గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా తెలుగు పరిపాలన శాసన భాషగా విస్తరించింది. కలమళ్ళ శాసనం ఇది చాలా ప్రధానమైనది సాధారణ శకం 575 నాటిది కడప జిల్లా కలమళ్ళలో లభించిన ఈ శాసనం తెలుగులో లభించిన మొట్టమొదటి సంపూర్ణ గజ్య శాసనం ఇది తెలుగును అధికారిక పరిపాలన భాషగా స్థిరపరిచిన ముఖ్యమైన ఆధారం అద్దంకి శాసనం సాధారణ శకం 848 నాటిది అద్దంకి శాసనం తరువోజ ఛందస్సులో లభించిన తొలి పద్యరూప తెలుగు శాసనం ఇది
(08:49) తెలుగు కవిత్వానికి లిఖిత రూపంలో తొలి పునాదిగా నిలబడింది. తెలంగాణ అస్తిత్వానికి సాక్ష్యాలు హైదరాబాద్ పక్కనున్న తెల్లాపూర్ శాసనం ఇది సాధారణ శకం 1418 నాటిది సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో లభించిన ఈ రాతి శాసనంలో తెలంగాణపురం అన్న పేరు స్పష్టంగా ఉంది. బహమనీ సుల్తానుల కాలంలో ఒక బావి తవ్వించిన వివరాలను తెలిపే ఈ శాసనం మధ్యయుగ కాలానికే తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రాంతీయ గుర్తింపు ఉందని నిరూపిస్తోంది.
(09:23) ఇది తెలుగు భాషతో పాటు తెలంగాణ భౌగోళిక చారిత్రిక గుర్తింపు కూడా బలమైన ఆధారం మొదట తెలుగు ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. మొదట తెలుగు రాసే భాష కాదు. కేవలం మాట్లాడే భాష మాత్రమే. అప్పటి తెలుగు ఇప్పటి తెలుగులా ఉండదు ప్రాంతానికి అనుగుణంగా ఉచ్చారణ కొంత మారుతూ ఉంటుంది. ఎలా అయినా మన తెలుగు అజంత భాష సంగీతానికి అనుకూలం అందువల్ల అది మధురం అతి మధురం ఇప్పుడు తెలుగు లిపి పుట్టుక దానికి పునాదులు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.
(09:58) తిరుమల రామచంద్ర గారు రచించిన మన లిపి పుట్టు పూర్వోత్తరాలు గ్రంథం తెలుగు లిపి పరిణామ క్రమాన్ని వివరించడంలో ఒక ప్రామాణిక గ్రంథం. ఈ పుస్తకం ప్రకారం తెలుగు లిపి పరిణామ క్రమం అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉంటాయి. తెలుగు లిపి ఆకస్మికంగా ఏర్పడింది కాదు అది వేల ఏళ్ల పరిణామ ఫలితం మూలం దీనికి బ్రాహ్మీ లిపి భారతీయ లిపులన్నిటికీ మూలం బ్రాహ్మీ లిపి తెలుగు లిపి కూడా అశోకుడి కాలంనాటి దక్షిణ బ్రాహ్మి నుండి ఉద్భవించింది.
(10:32) భట్టిప్రోలు లిపి సాధారణ శకానికి పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన భట్టిప్రోలు శాసనాల్లో కనిపించే లిపి తెలుగు లిపికి అత్యంత ప్రాచీన రూపం ఇప్పుడు లిపి పరిణామ దశలు చూద్దాం చిత్ర లిపి నుండి అక్షర లిపి వరకు అంటే బొమ్మల నుంచి అక్షరాల వరకు ప్రారంభంలో వంకర టింకర గీతలు చిత్రాల రూపంలో ఉన్న సంకేతాలు కాలక్రమేణ రాతి బండలు రాగిరేకులు తాటాకులపై రాయడం ద్వారా నేటి గుండ్రని అక్షర రూపంలోకి మారాయి.
(11:04) వేంగీ లిపి ఎలా ఉండేదో చూద్దాం. శాలంకాయనులు ఇక్ష్వాకుల కాలంలో లిపి అభివృద్ధి చెంది వేంగి లిపిగా గుర్తింపు పొందింది. తెలుగు కన్నడ కలగలిసిన లిపి సాధారణ శకం 13వ శతాబ్దం వరకు తెలుగు కన్నడ భాషలకు ఒకే విధమైన లిపి ఉండేది. ఆ తర్వాతే ఈ రెండు లిపులు పేరుపడ్డాయి. ప్రత్యేక అక్షరాల విశ్లేషణ తెలుగులోని కొన్ని అక్షరాల ప్రత్యేకతను తిరుమల రామచంద్ర గారు శాసనాల ఆధారంగా నిరూపించారు.
(11:36) ళ బండిర ల అక్షరం భట్టిప్రోలు శాసనాల కాలం నుండే అభివృద్ధి చెందుతున్న ప్రత్యేక అక్షరం అని అది కేవలం ల నుండి పుట్టింది కాదు అలాగే బండిర ఇది సాధారణ శకం నాలుగవ శతాబ్దం నాటి శాలంకాయనుల శాసనాల నుండే కనిపిస్తుంది. ప్రాచీన తెలుగు శాసనాలైన ఎర్రగుడిపాడు లాంటి వాటిలో దీని వినియోగం స్పష్టంగా ఉంది. తెలుగు రాజులు, తెలుగు సంస్కృతి. రాజ్యాలు బలపడిన కొద్దీ భాష కూడా బలపడింది.
(12:07) చాలుక్యులు, కాకతీయులు లాంటి రాజుల కాలంలో తెలుగు అభివృద్ధి చెందింది. ఈ సమయంలో సంస్కృత ప్రభావం తెలుగు పై పడింది. అందుకే చాలా సంస్కృత పదాలు మన తెలుగులోకి వచ్చాయి. నన్నయ్య నుండి సాహిత్య భాషగా తెలుగు ఎలా అభివృద్ధి చెందిందో చూద్దాం. నన్నయ్య కంటే ముందే పద్య రచన మంచి ఆలంకారిక శైలి ఉన్నాయి. బహుశా గ్రంథాలు కూడా ఉండే ఉంటాయి. సాధారణ శకం 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు తెలుగు కావ్య సాహిత్యానికి పునాది వేశడు.
(12:35) సంస్కృతంలో ఉన్న వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. ఇక్కడి నుండి తెలుగు పూర్తి సాహిత్య భాషగా రూపుదిద్దుకుంది. అప్పటి నుండి కవులు పండితులు తెలుగులో గొప్ప రచనలు చేశారు. వాడుక భాషగా తెలుగు ఇది చాలా ప్రధానమైంది. పండితులు వాడే తెలుగు సాధారణ ప్రజలకు అర్థం కాకుండా మారింది. అప్పుడు గిడుగు రామమూర్తి పంతుల్ లాంటి వారు మనం ఎలా మాట్లాడతామో అలాగే రాయాలి అంటూ వ్యావహారిక భాషా ఉద్యమం లేవదీశారు.
(13:07) అప్పటి నుండి గ్రాంధిక తెలుగు తెర వెనక్కు వెళ్లి నేటి తెలుగు ముందుకు వచ్చింది. సినిమా మీడియా ద్వారా తెలుగు వ్యాప్తి ఒకప్పుడు నాటకాలు తరువాత సినిమా టీవీ ఇప్పుడు సోషల్ మీడియా తెలుగును మరింతగా మార్చాయి. కోస్తా తెలంగాణ రాయలసీమ అన్ని యాసలు కలిసి మన తెలుగు భాష మరింత అందంగా తయారయింది. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు వినిపిస్తోంది కనిపిస్తోంది ప్రతిధ్వనిస్తోంది.
(13:34) తెలుగు వేల సంవత్సరాల క్రితం పుట్టి కాలంతో పాటు మారుతూ ఈరోజు మనదాకా వచ్చింది. మనం మాట్లాడుతూ రాస్తూ కాపాడుకుంటే భవిష్యత్తులో కూడా బతికి ఉంటుంది. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఏమంటివి ఏమంటివి జాతి సూతకి నిలువ అర్హత లేదవా ఎంత మాట ఎంత మాట నా తెలంగాణ కోటి రత్నాల వీణ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం మా తెలుగు తల్లికి మల్లెపూదండా
(14:21) ఇందులో చారిత్రక ఆధారాలు ప్రధానంగా ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన బద్రిరాజు కృష్ణమూర్తి గారి తెలుగు భాషా చరిత్ర ప్రఖ్యాత పరిశోధకుడు రచయిత తిరుమల రామచంద్ర గారి మనలిపి పుట్టుపూర్వోత్తరాలు గ్రంథాల నుండి తీసుకున్నవి. వారిద్దరి భాషా సేవ గురించి విడివిడిగా వీడియోలు త్వరలో చేస్తాను.
(14:44) ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Facebookఇస్గ ఎక్స్లో ధాత్రిని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. ఇలాంటి లోతైన వ్యాసాలను ఐidత్రీకా వెబ్సైట్ లో చదవండి.

No comments:

Post a Comment