Thursday, March 5, 2026

మీతో నా సొంత విషయాలు కొన్ని..... || @sridevi_vlogs515

మీతో నా సొంత విషయాలు కొన్ని..... || @sridevi_vlogs515

https://www.youtube.com/watch?v=JEruPjl29DM



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు హోలీ పండగ మనందరి జీవితంలో కొత్త రంగులు ఇంకా చల్లుకుంటాం అంటే పాత రంగులు తుడిచేస్తారా అని మీరు అడగొచ్చు. అసల అందరి లైఫ్ లో మనం ఈ హోలీ చేసుకుంటున్నట్టు రంగులు చల్లుకుంటున్నట్టు ఆనందాలు సంతోషాలు లైఫ్ అంటే ఒక జిల్ జిల్ జిగేల్ అనట్టు ఎవ్వరికీ ఉండదండి ప్రతి ఒక్కరి లైఫ్ లో బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి చెప్పుకోలేని వెదలు ఉంటాయి.
(00:44) అలాంటి వెదల్లో నాదొక వెద అంటే బరువెక్కిన గుండెలతో జీవితం సాగించే వారిలో నేను ఒకదాన్నే అని మీకు ఈరోజు నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న పార్టు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో ఆ బాధని పంచుకుందాం అనుకుంటున్నాను. నేను మీకు ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా భార్యా భర్తల బంధం గురించి కుటుంబం ఐకమత్యంగా ఉండడం గురించి పిల్లల పెంపకం గురించి ఆడవాళ్ళలో మార్పు రావాలని చెప్పే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను.
(01:20) కానీ మధ్య మధ్యలో కూడా మనందరి లైఫ్ లో కూడా ఏం జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఆ లైఫ్ అన్నది ఎవరి పర్సనల్ వాళ్ళది తీసుకొచ్చి మనం బయట పెట్టుకుంటామా వీధిలో పెట్టుకుంటామా అని కాదు మన లైఫ్ లో జరిగిన సంఘటన వల్ల కొంతమంది జాగ్రత్త పడొచ్చు అని నా ఉద్దేశం అన్నమాట కాబట్టి ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి ఆఖరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు మనందరికీ ఒక అవేర్నెస్ వీడియో అన్నమాట ముందుగా అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలుండి అందరి జీవితాల్లో కొత్త కొత్త కొత్త రంగులు చోటు చేసుకోవాలని ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో ప్రపంచంలో అన్ని మనం చవి చూడాలని ఎన్ని
(02:02) బాధలు వచ్చినా ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా జీవితం సంకనాకి పోతుంది పోయింది అన్న పరిస్థితుల్లో కూడా మనం పైకి లేసి నించోవాలని ఆశిస్తూ మీ అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ అందరి లైఫ్ లో హోలీ పండగ అది ఒక ప్రత్యేకమైన డే నార్త్ ఇండియన్స్ బాగా చేస్తారు మనవాళ్ళు తక్కువ చేస్తారు హైదరాబాద్ కాస్ కూడా బాగా చేసుకుంటారు.
(02:30) నేను అంటుంది ఇక్కడ ఎవరు చేసుకుంటారు అని కాదు హోలీ పండగ అనేది మా లైఫ్ లో ఒక విషాదాన్ని మిగిల్చింది అన్నమాట అది 2019వ సంవత్సరం ఇదే హోలీ పండగ రోజున ఉదయం మా అన్నయ్య చనిపోయాడు అంటే నాకు ఇద్దరు అన్నయలు మా చిన్నన్నయ్య ఆ రోజే కాలం చేశాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ లైఫ్ లో మనం ఎన్ని చూసినా కూడా కొంతమంది ఆ వాళ్ళ మైండ్సెట్ కి ఒక దండం పెట్టొచ్చున్నమాట అన్నిటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు సిల్లీగా తీసుకుంటారు పెద్ద సీరియస్నెస్ ఉండదు వాళ్ళ లైఫ్ తో పాటు అందరి జీవితాలను కూడా పాడు చేస్తూ ఉంటారు. కానీ నేను ఒక్క విషయం ఏం
(03:14) చెప్పాలనుకుంటున్నాను అంటే జీవితం చాలా చిన్నదండి అది మనం ఎంత అందంగా మలుచుకుంటే అంత అందంగా ఉంటదని నా ఉద్దేశం. కానీ ఇదే జీవితం విలువ తెలియక కొంతమంది మూర్ఖులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం కూడా నాశనం చేస్తారు. ఆ పెయిన్ ఎలా ఉంటదో నాకు తెలుసు ఎవరి సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం వచ్చాను నా లైఫ్ లో నాకు ఎదురు దెబ్బలు తగిలినట్టు ఎవ్వరికీ తగులు ఉండవు అన్నమాట అందరికీ ఎదురు దెబ్బలు తగులుతాయి ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు కానీ నించోడం కష్టం దిగుమింగుకుంటూ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే ఆ ఈ ఆర్థికాలు
(03:57) వచ్చినప్పుడు వాళ్ళు పుట్టిన రోజులు వచ్చినప్పుడు ఆ మనిషి జ్ఞాపకాలు వచ్చినప్పుడు అది ఎంత నరకం అనుభవిస్తామో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ లైఫ్ లో మనం ఏం నేర్చుకోవాలి అసలు జీవితం అంటే ఏంటో అన్నది ఇప్పుడు ప్రజలకి అసలు తెలియట్లే జనాలు ఎలా ఉన్నారు అంటే ప్రతిది వదిలేశరు చెప్పాలంటే సిగ్గు వదిలేశరు అన్నమాట ఎంతకన్నా తెగిస్తున్నారు ధర్మం న్యాయం నీతి నిజాయితి ఒక పడికట్టు ఒక క్యారెక్టర్ ఇవేమీ లేవు నేను నా కుటుంబం నా పిల్లలు అని గిరిగిసుకొని బతుకుతున్నారు ఇంకా చెప్పాలంటే అదే కుటుంబంలో పిల్లల్ని
(04:43) భార్యల్ని పట్టించుకొని వేదవలు కూడా ఉన్నారు. మనం ఎంత చెప్పుకున్నా ఈ వీడియో ముందుకు వెళ్తూనే ఉంటది. అది 2019వ సంవత్సరం అండి. నేను కాలేజీలో వర్క్ చేసుకుంటున్నాను మార్నింగ్ 11 అవుతది. సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చేసి మా పెద్దన్నయ్య. విషయం ఏంటి అంటే చిన్నన్నయ్య చనిపోయాడు అని అంటే అసలు ఏం జరిగిందని కూడా తెలియదు ఆరోగ్యంగా ఉన్న మనిషి చనిపోయాడు అన్న వార్త ఒక్కసారే వినగానే మనం యక్సెప్ట్ చేయలేం అంతకుముందు ఏం జరిగింది అంటే ఆ రోజు మార్నింగ్ 9:00 కి నేను కాల్ చేశాను కాలేజీ నుంచే ఎవరికీ మా నాన్నగారికి చేసి నాన్న బయలుదేరారా అని ఒక
(05:28) మాట అడగడం జరిగింది. అమ్మ అని మా నాన్న అమ్మ అనే అంటారు అందరినీ అంటే మా చిన్న పాప అమ్మాలి ఇంటి దగ్గర ఉందన్నమాట. దిగుబెడతాను చిన్నదాన్ని తీసుకొచ్చి కూడా నేను వచ్చి దిగుబెట్టి వెళ్తాను అన్నారు. అయితే చిన్నది మీరు బయలుదేరారా అని నేను కాల్ చేయడం జరిగింది. అయితే మా నాన్న చెప్పలేక మాటలు రాక అన్నయకి బాలేదమ్మా ఏమో అంటున్నారు ఏదో అంటున్నారు చెప్పలేమ అంటున్నారు సీరియస్ గా ఉందఅంటున్నారు అని ఇవే చెప్తున్నారు కానీ అసలు ఏమైందో తెలియట్లే ఏంటి బాలేదు అన్నా కూడా వాళ్ళ మాటలు ఏమి చెప్పలేకపోతున్నారు.
(06:10) ఇంతకీ ఫీవర్ ఉంది అంతే ఒక ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది ఆ జ్వరం వల్లే లేచి భోజనం చేయని పరిస్థితి కూడా ఉంది. ఒక ఇంజెక్షన్ కానీ హాస్పిటల్ కి వెళ్ళాడు అది మా అన్నయ్య ఏమ అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఏది వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కే అక్కడ అందరూ ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట సరిగ్గా వైద్యం లేదు ఇంతకీ ఆ ఊరు వచ్చేసి చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ సత్తుపల్లి ఖమ్మం ఇటువైపు హైదరాబాద్ వెళ్తారు కదా ఆ బోర్డర్ లో మా ఊరు ఉంటది అండి దీనికి దరిద్రం ఏంటంటే అక్కడ సరైన వైద్యం అందదు ప్రజలకి అలాగే విద్య కూడా
(06:54) సరైన విద్యే లభించదు విద్యార్థులకి అందుకనే అరాకరా కానీ ఊరి కింద మిగిలిపోయింది. బాగు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల సంగతి మీకు తెలిసిందే అలాగే మన ప్రజలు ఎలా ఉంటారు అంటే చింతలపూడి ప్రజలు అక్కడున్న ప్రజల్ని ఎదగనివ్వరు అంటే మన ఊరు మన సొంత బిడ్డలు మనోడురా అని ఎదగనివ్వరు మన తెలుగుోడిలో ఉన్న చేదు అదే పక్కనుంచి ఏదనా ఊరి నుంచి వచ్చినోడిని పక్క రాష్ట్రం నుంచి వచ్చినోడిని పక్క దేశం నుంచి వచ్చినోడిని వాడిని పై నుంచి కింద వరకు సవర్ధిస్తూ ఉంటారు వాడిని వాడు ఎదుగుతూ ఉంటే వాడు మోచేతి కింద నీళ్లు వీడు తాగుతూ ఉంటాడు. అక్కడ పరిస్థితి కూడా
(07:37) అదే అండి మా ఊరి పరిస్థితి ఇంతకీ ఒక ఇంజెక్షన్ కని వెళ్ళిన మా అన్నయ్య ఎందుకు చనిపోయాడు అంటే అది ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. అంత జ్వరంలో కూడా సెలైన్ పెట్టడం వల్ల రియాక్షన్ ఇవ్వటం అవన్నీ మీరుగూగు లో కొట్టండి వచ్చేస్తాయి లేదా ఏదైనా డాక్టర్స్ చెప్తారు YouTube లో వాళ్ళు కూడా చెప్తారు రియాక్షన్ అసలు ఏంటి ఎందుకు అలా రియాక్షన్ వచ్చినప్పుడు 13 సెకండ్స్ లో ఒక ఇంజెక్షన్ రెడీ చేసి పెట్టుకుంటారు హాస్పిటల్స్ లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో రెడీగా ఉంటది అది కూడా లేదు సడన్ గా మాకు షాక్ అయితే ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు మేడం అని మీరు అడిగితే మనందరి లైఫ్ లో
(08:16) కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి హెల్త్ బాగోకపోయినా ఏమన్నా హెల్త్ కంప్లైంట్ వచ్చినా అంటే హెల్త్ ఇష్యూ ఏం చేయాలో అప్పటికప్పుడు తెలియదు. 10 మందిని సలహాలు అడుగుతాం ఒక్కడు కూడా ఏది చేయలేం ఈ లోపల చెయి దాటిపోతది టైం అయిపోద్ది ఇక అందుకనే అంటారు ఆలస్యం అమృతం విషం అని అక్కడ ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి అన్నమాట కాబట్టి ఫస్ట్ మనం యాక్షన్ తీసుకొని టెస్టులకి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా జూనియర్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారు సరైన వైద్యం అందక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
(08:55) వాళ్ళు ఫస్టు బండి నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి బండి మీద పడతాం ఒకటో రెండు సార్లు అంటాం కదా డాక్టర్ అన్నవాడు ఒక ఇద్దరిని ముగ్గురిని చంపిన తర్వాత గాని సరైన డాక్టర్ అవ్వడం అన్నది అది చాలా నిజం ఆ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఏ హాస్పిటల్స్ లో ఉన్నా ఈ జూనియర్ డాక్టర్సే ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక టైం అంతా వేస్ట్ చేస్తున్నారు సరిగ్గా స్పందించట్లేదు పెద్ద డాక్టర్లో ఇక్కడ చాలా జరుగుతున్నాయి.
(09:24) అయితే ఇదివరకు మా చిన్నప్పుడు చూస్తానండి 100 ఏళ్ళ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు ఇంత బొ్వండుకునేవారు చక్కగా ఒక్క ఉలిపాయ కోసుకొని ఇంత కూర రవ్వ పులుసు పెట్టుకొని తినేవారు ఓపికగా ఉండేవారు అరుగుల మీద కూర్చొని మీటింగ్స్ చెప్పేవారు ముసలవాళ్ళు తాతలు కూడా అంతే చుట్ట కాల్చుకుంటూ అరుగుల మీద మీటింగలు చెప్పేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు అతి చిన్న వయసులో చనిపోవడం జరుగుతుంది ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ తర్వాత మనం సరైన పోషక ఆహారం తీసుకోవట్లేదు అది ఇది అని అంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే అన్నిటికైనా మనం ఒత్తిడి స్ట్రెస్
(10:05) ఫీల్ అవుతున్నాం ఒత్తిడి తీసుకుంటున్నాం ఎంత చిన్న లైఫ్ ని ఒక వెయ్యేళ్ళ స్ట్రెస్ తీసుకొచ్చి మన లైఫ్ మీద పెడుతున్నాం అది కూడా కుటుంబ సభ్యుల వల్ల అవ్వచ్చు మన చేతులారా తీసుకొచ్చుకున్నది అవ్వచ్చు ఇంకా మన బంధువుల వల్ల కూడా అవ్వచ్చు అన్నమాట అసలు చెప్పాలంటే నరకం పెల్లం వల్ల తల్లి వల్ల ఆ బిడ్డల వల్లే ఉంటది మగవాడికి అలాగే ఆడవాళ్ళకి లేదా అంటే ఆడవాళ్ళకు కూడా భర్త వల్ల విపరీతమైన నరకం ఇంటిలో పనులు చాకీర్లు స్ట్రైన్ అవుతారు తర్వాత మెంటల్ గా వాళ్ళఒక మానసిక రోగులుగా తయారవుతారు.
(10:42) ఇవన్నీ కూడా కారణాలు ఆ ఒత్తిడితోనే చనిపోవడం జరుగుతుంది. మనం ఇంకా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోమా ప్రోటీన్ ఫుడ్ తీసుకొనివేళ్ళు బతికేస్తామ అంటే గ్యారెంటీ లేదు. అలాక ఎప్పటికప్పుడు చెకప్లు చేయించుకుంటాం అంటే గ్యారెంటీ లేదు మందులు తినుక లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసుకొని ఆ మన తోటలో మన మిద్దిలో మన దొడ్లో పండించుకునేవాంటే అది గ్యారెంటీ లేదు.
(11:07) మనిషికి మనశశాంతి చాలా అవసరం. మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిడి లేని లైఫ్ చాలా అవసరం. ఇక్కడ మన లైఫ్ ఎలాగ పాడవుతుంది అంటే ఒక స్టూడెంట్ గాడినుంచి ఒక ఆటలు ఉండవో పాటలు ఉండవో అలాగే చదువు చదువు అని అక్కడి నుంచి ఇక మనం మన జీవితాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం కానీ మనం ఏదో సాధించేయాలి అంటే ఆయుషషు లేంది ఏం సాధిస్తాం మన లైఫ్ మరి మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఒత్తిడిలు అన్నవి తగ్గించుకొని ప్రతి మనిషి మన ఆనందాలకి మన సంతోషాలకి మన పర్సనల్ లైఫ్ కి మన ఇష్టమైన వారితో గడపటానికి అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు మన లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు ఇంకా మనం చేసే పనులు అవ్వచ్చు అందులో మనం టైం పెట్టుకొని
(11:55) మన లైఫ్ ని చేంజ్ చేసుకొని ప్రకృతిలో గడపాలన్నమాట ఇది నా ఉద్దేశం అండి ఈరోజు ఆ పెయిన్ మీకు చెప్పాలనిపించింది. నేను పొద్దుట నుంచి కూడా మీకు పోస్ట్ కూడా పెట్టలేదు హోలీ శుభాకాంక్షలని అందరి లైఫ్ లో కొత్త కొత్తగా రంగులు జలుకుంటున్నారు కాలేజీలో కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు పైనుంచి చూశను పిల్లలందరూ పెద్దవాళ్ళు కూడా ఆ ఇద్దరు ఆ రోడ్ సైడ్ ఇల్లు చక్కగా జల్లుకుంటున్నారు ఆనందించాను లోపలికి వెళ్లి చూసేసరికే ఒక విషాదమైన వార్త ఆ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మాకు మిగిలిపోయింది అన్నమాట అందులో మా అమ్మ అమ్మ నాన్నగారు వెళ్లి రోజు కూడా ఆ రోజునే
(12:35) అన్నమాట మేము ఆ నరకం అనుభవిస్తున్నాము అంటే కన్నవాళ్ళకి ఎంత బాధ ఉంటదో ఒకసారి తెలుసుకోండి. హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మద్యపానం అని చెప్పి ఇంకా సిగరెట్స్ అని చెప్పి ఇంకా వేరే వేరే చెడ్డ అలవాట్లు చేసుకోవద్దు వర్క్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఎఫెక్ట్ పెట్టి భోజనాలు ఇవన్నీ లేట్ చేయటం లేట్ నైట్ పడుకోవటం లేట్ గా లేవటం ఇటువంటివి కూడా మనం మానేసి ఫిట్నెస్ పెంచుకోవాలి ఎక్సర్సైజ్ యోగా అనేది మనం ముందుకు వెళ్ళాలి.
(13:11) కానీ చిన్న లైఫ్ అండి ఈ లైఫ్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి చేది జ్ఞాపకాలు ఎవరి లైఫ్ లో ఉండకూడదు ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ మనం అనుభవిస్తున్న ఈ ఒత్తుళ్లు ఈ జాబులు ఇంట్లో పరిస్థితులు ఈ గొడవలు ఎంత మంచి చేయాలని ముందుకెళ్లి చూసినా కూడా మనకి మంచి లైఫ్ భగవంతుడు ఇవ్వడండి అంటే చిన్న వయసులో చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోలా అందుకే చనిపోతున్నారా ఇక్కడ మంచి చెడ్డ అని చూసుకుంటేనండి మన లైఫ్ లో ఒక కర్మానుసారంగా జీవితం ముందుకు వెళ్తూ ఉంటది దాన్నే ధర్మం అంటారు.
(13:46) అదే ధర్మం మనం విస్మరించినప్పుడు మనకి కర్మ రూపంలో ఆ బాధ్యతలు నెత్తి మీద పడతాయి అన్నమాట. లైఫ్ లో ఏం పోగొట్టుకున్నాం అన్నది కొంతమందికి తెలుసండి నాకులాంటిోళ్ళకి కొంతమందికి అందరూ ఉంటారు అన్ని ఉంటాయి కానీ లైఫ్ బోరుకొడుతూ ఉంటది. వాళ్ళకి లైఫ్ విలువ మనం ఈ చిన్న లైఫ్ ని చక్కగా సద్వినియోగం చేసుకుందామని తోచినంతలోనే తోటివారికి సహాయం చేసుకుంటూ ధర్మం మీద నిలబడాలని నా ఉద్దేశం అండి.
(14:16) చిన్న వయసులో చనిపోయే అందరూ చెడ్డోళ్ళు కాదు వాళ్ళ కర్మను అనుభవించారు అన్న ఒక్క మాట అయితేనండి నేను తర్వాత వీడియోలో కూడా దీనికి కర్మానుసారం అసలు ఏమిటి మనం ఎందుకు కర్మను అనుభవించాలి అన్నది కూడా మీతో చర్చిస్తాను వీడియో చేస్తాను కచ్చితంగా ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి విధి వధించిన వీరుడులో కర్ణుడు ఒకడండి ఆ మహావీర దానవీర సూర కర్ణ అంతటి దాన వీరుడు గాని అంతటి టి దయాశీలి గాని ఎక్కడ మనం చూడమండి ఇప్పటికీ ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నారు.
(14:52) ఎందుకు అంటే ఆయన జీవితంలో ఒక మహారాజు అయ ఉండి ఒక యువరాజు అయ ఉండి ఒక పరాక్రవంతమైన వీరుడై ఉండి ఇటు కుటుంబం వైపు నిలబడాలా ప్రాణ స్నేహితుడి వైపు నిలబడాలా అని ఏదైనా సరే ఇచ్చిన మాటకే నిలబడ్డాడు. అంటే ఎంతటి వీరుడైనా సరే కర్మానుసారం అనుభవించాలి వాళ్ళకి ఆ బాధలు తప్పవు కొంతమంది అంటారు కదా చచ్చాడురా పేడా వదిలింది అని అదేం కాదండి ఎవరి ఆయుషషు ఎంత ఉంటే అంత జరుగుద్ది ఈరోజు వీడియో ఇదండి నేను టాపిక్ ఏదో చెబదాం అని మీకు అర్థం అవ్వాలని చిన్న లైఫ్ ని మనం కాపాడుకుంటామని అలాగే చాలా జాగ్రత్తగా ఉంటామని మీకు చెప్పడం జరిగింది.
(15:36) అంటే నేను ఒక వన్ వీక్ వరకు వీడియోస్ పెట్టలేదు నా ఫోన్ చిన్న ట్రబుల్ వచ్చింది. ఇక నుంచి వీడియోస్ ఇప్పటిలాగే వస్తూ ఉంటాయి. నా ఇన్స్టా ఐడి కూడా ఇచ్చాను ఎందుకంటే శ్రీదేవ అక్క మీతో మాట్లాడాలి అని అంటున్నారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీ లైఫ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అవి దానికి సొల్యూషన్ నేను దానికి సొల్యూషన్ చెప్పగలగను అంటేనే మీరు మెసేజ్ చేయండి.
(16:02) కచ్చితంగా నాకు తెలిసింది చెప్తాను మంచిగానే రెస్పాండ్ అవుతాను ఇంకా మేడం మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి అని అంటున్నారు కదా మేము పెద్దగా ఇన్స్టాలో పోస్ట్ చేయకపోయినా ఇచ్చాను మీరు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా ఏమనా డౌట్స్ ఉన్నా అడగండి ఇంకా నాకు సజెషన్స్ ఏమనా చెప్పాలన్నా చెప్పండి. ఇంతకీ హోలీ పండగ మనం ఎందుకు చేసుకుంటామో కూడా కామెంట్స్ లో తెలపండి.
(16:29) హోలీ అంటే మనకి మదమోహ కామ వికృత చాష్టలు క్రూరత్వం ఇవన్నీ నాశనం చేసేవే అని నాకు తెలుసు మరి కొత్త లైఫ్ లోకి అడుగుపెట్టాలంటే అవన్నీ పాతవి వదిలేయాలి కదా అవి వదలకుండా రంగులు పూసుకుంటే ప్రయోజనం ఏంటి అని నా ఉద్దేశం మీరు ఏమనుకుంటున్నారో మీ ఉద్దేశం తెలపండి ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది.
(16:54) మా లైఫ్ లో ఇది ఒక్క ఎదురు దెబ్బే కదండీ దెబ్బలు తగిలి తగిలి అలసిపోయి ఉన్నాం అన్నమాట అయినా కూడా ముందుకు సాగుతూ ఎవరి సపోర్ట్ లేకుండా నించొని ఎందుకు బతికున్నామో అని కూడా తెలియని లైఫ్ నేను అనుభవిస్తున్నాను అంటే మీరు నమ్మరు కానీ ఎక్కడా నేను వెనకడుగు వేయను కానీ దాన్నే తలుచుకొని పొంగిపోను ముందుకి తీసుకెళ్తూ ఉంటాను 10 మందికి ఇన్స్పిరేషన్ గా నించుంటాను.
(17:23) ఇదే నా లైఫ్ అండి ఈ హోలీ పండగ మీ అందరూ బాగా జరుపుకున్నారని ఆశిస్తూ [సంగీతం]

No comments:

Post a Comment