Unbelievable Fake Things In Movies | సినిమాలలో చూపించే కొన్ని అబద్దాలు | మీరు మోసపోయే ఉంటారు
Author Name:Telugu Ammayi - Interesting Facts in Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguAmmayiOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZmkwEIpsP4g
Transcript:
(00:00) సినిమా అంటేనే ఒక మాయా ప్రపంచం నాగస్విన్ తీసిన కల్కీ సినిమాలో కమల్ హాసన్ ఎంత దారుణంగా ఉంటాడు అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వధామ క్యారెక్టర్ అన్ని ప్రాస్థ మేకప్ మహిమే కండలు తిరిగిన బాడీతో ఉన్న హీరో దగ్గర నుండి ఫైట్స్ యాక్షన్ సీన్స్ లో పారే రక్తం పగిలే గాజు పేలే ఇల్లు ఇవన్నీ కూడా నిజమైనవి కావు అన్ని సినిమా కోసమే సృష్టించబడినవి.
(00:30) ఈరోజు మనం సినిమాలో నిజం అని భ్రమపడే ఎన్నో విషయాలను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సినిమా అంటేనే ఒక భ్రమ. ఆ భ్రమను నిజం చేయడానికి టెక్నీషియన్స్ రాత్రింబవలు కష్టపడతారు. అయితే ఇందులో మొదటగా మనం ప్రాస్థ మేకప్ గురించి మాట్లాడుకుందాం. సినిమాల్లో క్యారెక్టర్లను గుర్తుపట్టలేనంతగా మార్చడానికి ఒంటి మీద భయంకరమైన గాయాలు చూపించడానికి లేదా మాన్స్టర్లు మరియు ఏలియన్స్ లాంటి వింత ఆకారాలను సృష్టించడానికి ఈ ప్రాస్థ మేకప్ నే అందరూ వాడతారు. ఇది కేవలం రంగులు పూయటం
(01:14) మాత్రమే కాదు ఇది రియల్ స్కిన్ లాగా కనిపించే ఆర్టిఫిషియల్ పీసెస్ ను శరీరానికి అమర్చడం. వీటిని తయారు చేయడానికి లాటెక్స్ సిలికాన్ మరియు ఫోమ్ లాంటి ప్రత్యేకమైన మెటీరియల్స్ ను ఉపయోగిస్తారు. అందుకే ఇది ఎంత సహజంగా ఉంటుందంటే కెమెరా ముందు అది అసలైన చర్మం కాదని ఎవ్వరూ కనిపెట్టలేరు. అయితే దీని తయారీ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
(01:41) ముందుగా ఏ నటుడికైతే ఈ మేకప్ వేయాలో వారి ముఖం లేదా సంబంధిత బాడీ పార్ట్ యొక్క మోల్డ్ లేదా కాస్టింగ్ తీసుకుంటారు. దీనికోసం అల్జినేట్ అనే పౌడర్ ను నటుడి ముఖం మీద పూసి దానిపై ప్లాస్టర్ తో ఒక అచ్చును తయారు చేస్తారు. ఆ అచ్చులో సిలికాన్ లేదా లాటెక్స్ పోసి కావలసిన ఆకారంలో ప్రాస్థ పీస్ ను డిజైన్ చేస్తారు. దీనికి ముడతలు మచ్చలు వంటి టెక్స్చర్స్ మరియు కలరింగ్ యాడ్ చేసి ఫైనల్ లుక్ ఇస్తారు.
(02:16) హాలీవుడ్ లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో గోలం క్యారెక్టర్ లేదా అవెంజర్స్ లో తేనోస్ ముఖం వంటివి ప్రాస్థిక్స్ మరియు సిజిఐ టెక్నాలజీ కలైకతోనే సాధ్యమయ్యాయి. మన టాలీవుడ్ లో కూడా దీని వాడకం అద్భుతంగా ఉంటుంది. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు ఇంట్రడక్షన్ సీన్ లో కనిపించే ఎద్దు యొక్క మెకానికల్ మోడల్ తో పాటు కొన్ని క్యారెక్టర్లకు మచ్చలు మరియు వయసు పెరిగిన లుక్ ఇవ్వడానికి ప్రాస్థిక్స్ నే వాడారు.
(02:45) ఇక రీసెంట్ సెన్సేషన్ కల్కి 20948 ఏడి లో అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్తామ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లుక్ కోసం ఆయన ప్రతిరోజు మూడు గంటల పాటు ప్రాస్థ మేకప్ వేసుకోవాల్సి వచ్చేదట. సిలికాన్ స్కిన్ మరియు అడ్వాన్స్డ్ ఏజింగ్ లుక్ ఉపయోగించి మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిశీల్ సింగ్ ఈ అద్భుతాన్ని సృష్టించారు.
(03:12) ఈ మేకప్ పీసెస్ ను స్పిరిట్ గమ్ లేదా సిలికాన్ అడ్హెసివ్ అనే ప్రత్యేకమైన గ్లూ తో శరీరానికి అతికిస్తారు. వీటిని తొలగించడానికి కూడా ప్రత్యేకమైన సాల్వెంట్స్ అవసరమవుతాయి. చిన్న పీసులకైతే 5000 నుంచి మొదలై పూర్తి బాడీ సూట్లకైతే లక్షల రూపాయలు హాలీవుడ్ స్థాయిలో అయితే మిలియన్ డాలర్లు ఖర్చవుతాయి. ఇక మనం సినిమాల్లో చూసే బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం.
(03:40) చాలా సినిమాల్లో హీరోలు లేదా విలన్లు విపరీతమైన కండలతో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు. సహజంగా అలాంటి బాడీ రావాలంటే ఏళ్ల తరబడి జిమ్ లో కష్టపడాలి. కానీ ప్రతి సినిమాకి అంత సమయమయం ఉండదు. అప్పుడే రంగంలోకి వస్తాయి ఈ బాడీ సూట్స్ ఈ బాడీ సూట్స్ ఎంత సహజంగా ఉంటాయంటే వాటిని వేసుకున్న వ్యక్తి నిజంగానే భారీ కండలు కలిగి ఉన్నాడని మనం నమ్మేస్తాం.
(04:10) ఈ సూట్స్ లో ట్రైసెప్స్, చెస్ట్, ట్రాప్స్, బైసెప్స్ మరియు షోల్డర్స్ వంటి ప్రతి భాగాన్ని చాలా స్పష్టంగా డిజైన్ చేస్తారు. ముఖ్యంగా ప్యాక్స్ కోసం ప్రత్యేకమైన సిలికాన్ మెటీరియల్ తో తయారు చేసిన సూట్స్ ను ఉపయోగిస్తారు. ఇవి చర్మానికి అతుక్కుపోయి అసలైన బాడీ లాగే కనిపిస్తాయి. ఇక యాక్షన్ సినిమాల్లో మనల్ని అత్యంత భయపెట్టేవి బ్లాస్ట్ సీన్లు.
(04:35) కార్లు గాలిలో ఎగురుతూ పేలిపోతుంటే అబ్బా ఎంత ఖర్చు పెట్టారురా అని మనం ఆశ్చర్యపోతాం. కానీ అక్కడ వాడేవి సాధారణంగా మనం రోడ్డు మీద చూసే రియల్ కార్లు కాదు సేఫ్టీ మరియు బడ్జెట్ కారణాల వల్ల స్టెంట్ కార్లను లేదా డమ్మీ వెహికల్స్ ను ఉపయోగిస్తారు. ఈ స్టెంట్ కార్లను వీటి కోసమే ప్రత్యేకంగా మోడిఫై చేస్తారు. వాటి లోపల స్టెంట్ డ్రైవర్ సేఫ్ గా ఉండటానికి స్టీల్ ఫ్రేమ్ తో కూడిన రోల్ కేజ్ ను ఏర్పాటు చేస్తారు.
(05:06) ఇక పేలుళ్ల కోసం పెట్రోల్ ట్యాంక్ ను తీసేసి దాని బదులు ప్రోపేన్ గ్యాస్ లేదా పైరో టెక్నిక్స్ ను వాడతారు. దీనివల్ల పేలుడు నియంత్రణలో ఉంటుంది. మరోవైపు డమ్మీ వెహికల్స్ అనేవి ఫైబర్ గ్లాస్ లేదా ఫోమ్ తో తయారు చేసిన లైట్ వెయిట్ మోడల్స్ ఇవి చూడటానికి రియల్ కార్లలానే ఉంటాయి కానీ బ్లాస్ట్ లో సులభంగా డ్ామేజ్ అవుతాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి సినిమాల్లో ఒకే మోడల్ కార్లని పదుల సంఖ్యలో తయారు చేసి ఒక్కో సీన్ కు ఒక్కోటి డెస్ట్రాయ్ చేస్తారు.
(05:42) ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో కార్ బ్లాస్ట్ సీన్లు మరియు ట్రైన్ బ్లాస్ట్ సీన్ ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇక ఆ ట్రైన్ బ్లాస్ట్ కోసం అయితే ఫుల్ మెటల్ మినియేచర్ మోడల్స్ ను తయారు చేసి వాటిని పైరో టెక్నిక్స్ తో పేల్చి ఆ తర్వాత సిజిఐ తో రియలిస్టిక్ లుక్ ఇచ్చారు. ఒక బ్లాస్ట్ సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి కోటి రూపాయల కంటే ఎక్కువే ఖర్చవుతుంది. ఇక సినిమాల్లో అత్యంత సాధారణంగా మనం చూసే మరో అంశం రక్తం.
(06:13) సినిమాల్లో చూపించే రక్తం 100% నకిలీదే. ఎథికల్ రీజన్స్ మరియు సేఫ్టీ వల్ల రియల్ బ్లడ్ ను అస్సలు వాడరు. మరి ఆ రక్తాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇది మీరు ఇంట్లో కూడా చేసేయొచ్చు. దీనికి ప్రధానంగా కార్న్ సిరప్ ని ఉపయోగిస్తారు. ఇది రక్తానికి కావలసిన చిక్క ధనాన్ని ఇస్తుంది. ఇక దీనికి రెడ్ ఫుడ్ కలర్ ని బ్రౌన్ షేడ్ కోసం చాక్లెట్ సిరప్ మరియు బబుల్స్ రాకుండా కొంచెం డిటర్జెంట్ కూడా కలుపుతారు.
(06:43) ఇక కొన్నిసార్లు టమోటా సాస్ కూడా ఇందుకు ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్ గా పనిచేస్తుంది. ఇక డార్క్ బ్లడ్ కావాలంటే కాఫీ పౌడర్ ని ఇంకా థిక్ గా ఉండాలంటే జెలటిన్ ని యాడ్ చేస్తారు. గేమ్ ఆఫ్ త్రోన్స్ లేదా అనిమల్ మార్కో వంటి సినిమాల్లోని ఇంటెన్స్ ఫైట్ సీన్లలో ఇలాంటి ఫేక్ బ్లడ్ బ్యాగ్స్ మరియు స్ప్రే గన్స్ ని ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా వాషబుల్ మరియు టాక్సిక్ లేని ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ తో తయారవుతుంది కాబట్టి నటుల చర్మానికి లేదా కళ్ళకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
(07:17) అలాగే లీటర్ ఫేక్ బ్లడ్ ధర కూడా 500 నుంచి 2000 వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఫైట్ సీన్లలో హీరో విలన్ ని విండో లోంచి బయటకు విసిరేసినప్పుడు లేదా తలమీద బాటిల్ తో కొట్టినప్పుడు ఆ గాజు ముక్కలు అవుతుంది కదా అది నిజమైన గాజు కాదు. నిజమైన గాజు వాడితే నటులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో షుగర్ గ్లాస్ ని ఎక్కువగా వాడతారు.
(07:46) చక్కెర, కార్న్ సిరప్ మరియు నీటిని కలిపి మరిగించి వాటిని కావలసిన అచ్చుల్లో పోసి చల్లబరిస్తే అది అచ్చం గాజు లాగే తయారవుతుంది. ఇది చాలా సులభంగా పగిలిపోతుంది. మరియు దీని అంచులు పదునుగా ఉండవు. కాబట్టి స్టంట్మెన్ కి ఎలాంటి గాయాలు కావు. ఇక ఈ గ్లాస్ కు మరో రకం రెజిన్ గ్లాస్ ఇది కొంచెం ఎక్కువ కాలం మందుతుంది. మరియు రీయూజబుల్ డైహార్డ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో లేదా మన పుష్ప సినిమాలో బాటిల్స్ పగిలే సీన్లలో ఈ షుగర్ గ్లాస్ నే వాడారు.
(08:20) వీటిని షూటింగ్ తర్వాత క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ రోజుల్లో వీటిని విఎఫ్ఎక్స్ తో కలిపి మరింత రియలిస్టిక్ గా చూపిస్తున్నారు. నిజానికి ఇప్పటి మోడరన్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ మరియు సిజిఐ బాడకం విపరీతంగా పెరిగినప్పటికీ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఇచ్చే రియలిస్టిక్ ఫీల్ వేరు. అందుకే రాజమౌలి వంటి దర్శకులు ఇప్పటికీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
(08:45) మినియేచర్ నమూనాలు డమ్మీ వెహికల్స్ మరియు ప్రాస్థ మేకప్ అన్నీ కలిస్తేనే మనకు స్క్రీన్ మీద ఒక అద్భుతం కనిపిస్తుంది. సినిమా అనేది టెక్నాలజీ క్రియేటివిటీ మరియు కష్టాల కలయిక. మనం ఒక నిమిషం పాటు చూసే సీన్ వెనుక వందల మంది టెక్నీషియన్స్ నెలల కష్టం ఉంటుంది. బాడీ సూట్స్ ద్వారా అద్భుతమైన దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించడం టమోటా సాస్ మరియు కార్న్ సిరప్లతో భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించడం చక్కెరతో చేసిన గాజును పగలగొట్టడం ఇవన్నీ ప్రేక్షకుడు నమ్మలేని లేని విషయాలు ఇవి నకిలీవే కావచ్చు కానీ అవి మనకు ఇచ్చే అనుభూతి మాత్రం అక్షరాల నిజం. సో ఇది ఫ్రెండ్స్ ఈ
(09:32) వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment