Thursday, March 5, 2026

పరిధులు దాటి పరమార్థాన్ని వెతకండి | Beyond Limits & Success | Satyagrahi

పరిధులు దాటి పరమార్థాన్ని వెతకండి | Beyond Limits & Success | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=n-jOAo2rpFc



Transcript:
(00:00) అసలు మనం ఎందుకు ఇంతలా పరిగెడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని అసంతృప్తి మన దగ్గర అన్ని ఉన్నాయి చుట్టూ మనుషులు ఉన్నారు. కంటి నిండా విలాసాలు ఉన్నాయి. కానీ గుండె లోతుల్లో ఎక్కడో ఒక అసంతృప్తి ఏదో కోల్పోతున్నామనే భయం. నిజం చెప్పాలంటే ఆదిమానవులుగా బ్రతికేటప్పుడు కన్నా ఇప్పుడు మనుషుల చేతుల్లోకి అన్ని వచ్చేసాయి.
(00:25) తినటానికి తిండి, ప్రశాంతవంతమైన నిద్ర అన్ని అన్ని వచ్చేసాయి. అయినా సరే మనిషి ఎందుకు ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి మనసులో అసంతృప్తిగా ఉంటున్నాడు. ఏదో కోల్పోతున్నామ అనే భయం ఇంకేదో సాధించాలనే ఆతృత మీరు గమనించారో లేదో ఈ రోజుల్లో మనం జీవించడం మర్చిపోయి కేవలం బతుకుతున్నాం. గడియారం ముళ్ళతో పాటు మనం కూడా ఒక యంత్రంలా మారిపోయాం.
(00:50) మన సమస్య అసలు సమస్యే కాదు. అందులోనూ సమస్యలా ఫీల్ అవుతున్నాం. మనం ఒకేసారి వందల చోట్ల ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. పని దగ్గర ఉన్నప్పుడు ఇంటి గురించి ఇంట్లో ఉన్నప్పుడు రేపటి లక్ష్యం గురించి ఆలోచిస్తూ మన చేతుల్లో ఉన్న ఈ అద్భుతమైన క్షణాలన్నిటిని చంపేస్తున్నాం. మీరు రోజు వందల మందిని కలుస్తుండవచ్చు కానీ మీకు మీరు ఎప్పుడైనా కలిశారా? మీతో మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారా? ఈ ఏకాంతం లేకపోవడమే ఈ ఆత్మీయత కరువ్వడమే ఇవాళ మనల్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య.
(01:20) పాపం ఆ విషయం చాలా మందికి తెలీదు. మనల్ని మనం ఒక వస్తువులా చూసుకుంటున్నామే తప్ప ఒక అద్భుతమైన చైతన్యంగా గుర్తించలేకపోతున్నాం. అంతెందుకండి కేవలం పని చేసి డబ్బులు సంపాదించే ఒక మిషన్ లా మనల్ని మనం ట్రీట్ చేస్తున్నామే తప్ప మనకి మనం గౌరవించుకోవడం మానేసాము. మనం ఆనందంగా ఉండకపోవడానికి కారణం మనం మన మూలాలని మర్చిపోవడమే.
(01:44) ఒక చిన్న విత్తనం భూమిలో నిశశబ్దంగా ఉంటేనే కదా అది మహా వృక్షం అయ్యేది. కానీ మనం విత్తనం దశలోనే ఆకాశాన్ని అందుకోవాలని చెప్పేసి తహతహలాడుతున్నాం. బయట ప్రపంచం మనకి కొన్ని రూల్స్ పెట్టింది. నువ్వు ఇంత సంపాదించాలి ఇలా కనిపించాలి అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్లు అని చెప్పేసి సమాజం మన మెదడులోకి ఎక్కించేసింది కొన్ని విషయాలని మనం ఇతరుల అంచనాలని అందుకోవడానికి మన సొంత నిర్ణయాలను కూడా బలి చేస్తున్నాం.
(02:10) అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఒక గేమ్ లో మనం కేవలం ప్లేయర్స్ గా ఉన్నామే తప్ప మన గేమ్ ని మనం ఆడట్లేదు. అంతెందుకు అసలు మనం గేమే ఆడట్లేదు. కేవలం బానిసల్లా బతుకుతున్నాం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళక ఏంటంటే కొన్ని వందల కోట్లు సంపాదించడం అనేది జీవిత లక్ష్యం. ఇప్పుడు ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఏదో వాళ్ళకి అవసరమైనంత డబ్బు సంపాదించుకుంటూ ఆరోగ్యంగా బతకడం ఇష్టం. ఇప్పుడు రెండు ప్రపంచాలు ఉంటాయి.
(02:40) ఒకటి డబ్బు సంపాదించే ప్రపంచం ఇంకొకటి కుటుంబంతో ఆనందంగా ఉంటూ అవసరాలకు తగిన విధంగా డబ్బు సంపాదించే ప్రపంచం కానీ ప్రపంచం మొత్తం మొదటి వాడిని ఫాలో అయితేనే గొప్ప అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఆ గొప్ప కోసం మనం కూడా మన ఇష్టాల్ని పక్కన పెట్టి పరిగెడుతూ మొదలు పెడితే ఏమవుతుంది మన జీవితంలో ఉన్న మనశశాంతి అనేది కరువవుతుంది.
(03:02) ఎందుకంటే ప్రతి మనిషి చేతికి ఉండే వేలు ముద్రలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. అలా కాకుండా అందరూ ఒకేలాగా ఉండాలి అందరి దగ్గర కోట్ల రూపాయలు ఉండాలి అందరూ ఒకే కారు కొనాలి ఇలా లైఫ్ ని డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా కొంతమందికి మాత్రం అసలు మనం ఎందుకు పుట్టాం ఏం చేస్తున్నాం డబ్బులు సంపాదించడమేనా జీవితం అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి కలుగుతుంది.
(03:29) మరో ముఖ్యమైన కారణం ఏంటంటే మన మనసు ఎప్పుడు గతం లేదా భవిష్యత్తు అనే రెండు మాయా లోకాల్లో వివహరిస్తూ ఉంటుందన్నమాట. గతం మనల్ని బాధపెడుతుంది భవిష్యత్తు మనల్ని భయపెడుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఇప్పుడు అనే సత్యం మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళ టెంప్లేట్ ని మనం ఫాలో అవుతున్నాం. అందులోనూ అదే కరెక్ట్ అని చెప్పేసి బల్ల గుద్ది మరి చెప్తూ ఉన్నాం.
(03:50) కాకపోతే అలా బల్ల గుద్ది మరి చెప్పే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ ఒక 90 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి చనిపోతే అది జీవితం కాదా ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. అందులోనూ జీవితం మీద హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారన్నమాట వీళ్ళకి బతకడం చేత కాదు అని చెప్పేసి నిజం చెప్పండి ఎవరికీ బతకడం చేత కావట్లేదు ఎవరు ప్రశాంతంగా బతుకుతున్నారు గట్టిగా చెప్పాలంటే పారే నదిని చూసి ఆనందించే ఓపిక మనకు లేదు
(04:20) వికసించే పువ్వులో ఉన్న దైవత్వాన్ని చూసే తీరిక మనకు లేదు మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉండటానికి కారణం మన లోపల నిశ్శబ్దాన్ని భరించలేకపోవడమే ఏదో ఒక శబ్దం ఏదో ఒక నోటిఫికేషన్ ఎవరో ఒకరి మాట ఇలా మనల్ని మనం మనం పరధ్యానంలో ఉంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే నిశశబ్దంగా కూర్చుంటే మన అసలు రూపం మనకి కనిపిస్తుందన్న భయం.
(04:42) మనలోని లోపాలు బయటపడతాయని భయం అందుకే ఆ సమస్యని కప్పి పుచ్చుకోవడానికి మరింత వేగంగా పరిగెడుతున్నాం. మరి ఆ సమస్యని ఎలా అధిగమించాలి అంటే ఈ సమస్య నుంచి బయటపడటం చాలా సులభం. కానీ దానికి కొంచెం సాధన కావాలి. మొదట మీరు చేయాల్సింది ఏంటంటే ఆగటం ఒక్క క్షణం ఆగి ఈ ప్రపంచాన్ని బాగా పరిశీలించి అందులోనూ కొంచం మీ శ్వాస మీద ద్యాస పెట్టి నెమ్మదిగా వర్తమానంలోకి రావటం పరమహంస యోగానంద్ గారు ఎప్పుడు చెప్పేవారు మీరు అంతరంగమే మీ అసలైన సామ్రాజ్యం అని చెప్పేసి ఆ సామ్రాజ్యంలోకి వెళ్ళాలంటే మీరు రోజులో కనీసం ఒక 10 నిమిషాలు నిశశబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అందులోనే మీతో మీరు
(05:21) మాట్లాడుకోవాలి. మీ చుట్టూ ఎవరు లేకపోయినా సరే మీతో మీరు మాట్లాడుకుంటూ అందులోన నేను జీవితంలో ఏం చేయాలి నా కుటుంబంతో ఎలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీకు మీరు సలహాలు ఇచ్చుకుంటూ ఆ టైం స్పెండ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా వాల్యూబుల్ టైం ఎందుకంటే చాలా మంది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరు.
(05:39) అందులోనే ధ్యానం అంటే ఏదో కష్టమైన ప్రక్రియ అనుకుంటారు కానీ మీరు మీతో మీరు జరిపే ఒక ప్రేమ పూర్వకమైన సంభాషణ అది మీ ఆలోచనలను గమనించండి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. అవి మేఘాల్లా వచ్చి వెళ్తూ ఉంటాయి. మీరు మాత్రం ఆకాశం లాగా స్థిరంగా ఉండండి. మీరు ప్రకృతిని గమనించడం మొదలు పెట్టండి. ఒక చిన్న మొక్క ఎదుగుదలలో ఎంత ఓర్పు ఉందో చూడండి. ఆ ఓర్పుని మీ జీవితంలోకి ఆహ్వానించండి.
(06:04) ప్రతి చిన్న పనిని ఒక దైవ కార్యంలా చేయండి. మీరు భోజనం చేస్తున్న నడుస్తున్న ఎవరితోనైనా మాట్లాడుతున్న పూర్తి స్పృహతో ఉండండి. నేను ఇక్కడ ఉన్నాను. ఈ క్షణంలో ఉన్నాను అని మీకు మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మీరు బయట ప్రపంచం ఇచ్చే సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడటం మానేస్తారో అప్పుడే మీకు అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే జీవితం అంటే కేవలం గెలవడం కాదు జీవితం అంటే ఎదగటం ఆ ఎదుగుదల లోపల నుండి మొదలవ్వాలి.
(06:33) మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో చూడటం నేర్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా అది వారి అవగాహన లోపమే తప్ప మీ తప్పు కాదని గ్రహించండి. ఒకవేళ తప్పు ఉంటే సరి చేసుకొని థాంక్యూ అని చెప్పండి. మీ లోపల ఉన్న ఆ దైవిక కాంతిని ఎప్పుడూ మసగబారనివ్వకండి. ప్రతిరోజు పడుకునే ముందు ఈరోజు మీకు జరిగిన మంచి విషయాలు గుర్తించి కృతజ్ఞతతో ఉండండి.
(06:57) కృతజ్ఞత అనేది ఒక గొప్ప ఔషధం అది మీ హృదయాన్ని విశాలం చేస్తుంది. మీ జీవితంలో క్రమశిక్షని ఒక భారంగా కాకుండా ఒక ఆభరణంలా ధరించండి. మంచి పుస్తకాలు చదవండి. గొప్ప వ్యక్తుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందండి. కానీ గుర్తుంచుకోండి ఆ స్ఫూర్తి మిమ్మల్ని పని చేసేలా చేయాలి. కేవలం వినడం వల్ల ఏమి మారదు. ఆచరణలో పెట్టినప్పుడే మార్పు మొదలవుతుంది.
(07:19) మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ చిన్న ఆనందం ఇచ్చే తృప్తి కోట్ల రూపాయల సంపాదనలో కూడా ఉండదు. ప్రేమను పెంచండి శాంతిని వెదజల్లండి. మీరు ప్రపంచాన్ని మార్చనక్కర్లేదు. మిమ్మల్ని మీరు మార్చుకుంటే చాలు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఓటం ఎదురైనప్పుడు అది ఒక పాఠం అని భావించండి. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది.
(07:39) కాబట్టి మీ కష్టాలను కూడా గౌరవించండి. అవి మిమ్మల్ని మరింత బలంగా తీర్చి దిద్దుతాయి. నేడే ఇప్పుడే ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. ఇకపై నేను నా మనసుకి యజమానిని అవుతాను కానీ బానిసని కాను అని మీకు మీరు ప్రమాణం చేసుకోండి. ఎందుకంటే లైఫ్ లో మనతో పాటు ఎవరు వస్తారో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు కానీ జీవితాంతం మనతో ఉండేది మనమే కదా అందుకని మనకి మనమే తోడుగా ఉందాం. మనకి మనమే సపోర్ట్ చేసుకుందాం.
(08:05) మనతో మనం మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకోవడం మొదలు పెట్టిన రోజే మీలో నిజమైన మార్పు మొదలైనట్లు అందులోనూ మీ ప్రయాణం ప్రారంభమైనట్లు అలా కాకుండా మీరు ఇంకొకళ్ళ మాటలు వింటూ వాళ్ళని అనుసరించినంత కాలం ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మనసుకి ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.
(08:29) ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి మరికొందరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. సో నేటి నుంచే ఈ క్షణం నుంచే మీ ప్రయాణాన్ని ప్రేమతో మొదలు పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నిజంగా నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి.
(08:48) ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. ఓం ఆ

No comments:

Post a Comment