ధ్యానం యొక్క అసలైన రహస్యం||what is meditation | Best motivational video in Telugu.
Author Name:Yasaswi thoughts
Youtube Channel Url:https://www.youtube.com/@yasaswithoughts3086
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MchMBtKi434
Transcript:
(00:00) మీ శ్వాసే జీవితానికి పునాదిగా ఉందని మీకు తెలుసా? మనకు మంచిది జరగబోతుందా చెడు జరగబోతుందా అన్నది కూడా మన శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం జీవితంలో ఏం సాధించబోతున్నామో అన్నది శ్వాస ఆధారంగానే జరుగుతుంది. మన శ్వాస ఎంత లోతుగా ఉంటే మన ధ్యాస కూడా అంతే లోతుగా ఉంటుంది. ఆ ధ్యానం ద్వారా మనకు దొరికే శక్తి మన కోరికలు నెరవేర్చేలా చేస్తుంది.
(00:24) కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన శ్వాస సూక్ష్మంగా ఉంటుంది. మనకు కనిపించదు. అలాగే మన మూడవ కన్ను కూడా అలాగే ఉంటుంది. మనకు కనిపించదు. కానీ మనం వాటిని అనుభవించగలుగుతాం. శ్వాస మనం మూడవ కంటిని చేరినప్పుడు మాత్రమే మన ధ్యానం గాఢంగా మారుతుంది. ధ్యానం చేసే సమయంలో మనం లోతుగా ఊపిరి తీసుకుంటామా లేక చిన్న చిన్న ఊపిర్లు తీసుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది.
(00:48) చిన్న పిల్లలను చూడండి వాళ్ళు ఊపిరి తీసుకునేటప్పుడు వారి పొట్ట ఉబ్బుతుంది. అంటే వాళ్ళు లోతుగా ఊపిరి తీసుకుంటారు. అందుకే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆందోళన ఉండదు. అలాగే మన వయసు పెరిగే కొద్దీ మన శ్వాస చిన్నదిగా మారుతుంది. చివరకు ఆ శ్వాస ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది. అంటే మన జీవితం మొత్తం శ్వాసపై ఆధారపడింది.
(01:09) మీరు తీసుకునే ప్రతి ఊపిరి నాభికి చేరుతుంది. మన శరీరంలో ఉన్న ఆందోళన, మంచి శక్తి ఆరోగ్యకరమైన శరీరం అన్నీ కూడా నాభి పైనే ఆధారపడి ఉంటాయి. ఈ శక్తి నాభి నుంచి పైకి లేచి మూడవ కన్ను వరకు చేరితే మన ధ్యానం మరింత లోతుగా మారుతుంది. మీరు ఏది కోరినా అది మీకు లభిస్తుంది. ఈ విశ్వం మీకు కావలసింది అందించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఒక ఊపిరి మీ జీవితాన్ని మార్చగలదు.
(01:32) ఇప్పుడు మేము మీకు ఒక అద్భుతమైన ధ్యాన విధానాన్ని చెప్పబోతున్నాం. ఇది చాలా సరళమైన పద్ధతి. ఈ పద్ధతి ధ్యాన లోతులోకి తీసుకువెళ్తుంది. మనం శ్వాసను నాభి వరకు తీసుకువెళ్తాం. ఆ తర్వాత ఆ శక్తిని పైకి లేపుతాం. అప్పుడు ఆ శక్తి నేరుగా మూడవ కన్నుకు చేరుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ముందుగా 15 సార్లు ఊపిరి లోతుగా తీసుకోవాలి.
(01:52) ఇది ముక్కు పక్కన ఉన్న కండరాలను సజీవం చేస్తుంది. తర్వాత 35 లోతైన ఊపిర్లను తీసుకోండి. అది నాభిని సక్రియం చేస్తుంది. ఆ నాభి నుంచే శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత 45 ఊపిర్లు తీసుకోవాలి. ఈ 45 ఊపిరిలు మన శక్తిని నాభి నుంచి పైకి మూడో కంటికి అంటే ఆజ్ఞా చక్రానికి తీసుకువెళ్తాయి. ఎవరి శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుందో వారి ధ్యానం మరింత లోతుగా మారుతుంది.
(02:19) మీరు గతంలో ధ్యానం చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు. మేము చెప్పినట్టుగా మీరు ఈ ప్రక్రియను అనుసరించాలి. మీరు కూర్చుని ఉన్నా పడుకొని ఉన్నా ఏ స్థితిలోనైనా చేయొచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ మెడ వెనుక భాగం సూటిగా ఉండాలి. శరీరాన్ని నేరుగా ఉంచాలి. మీరు ఈ వీడియో వింటున్న స్థితిలోనే ఉండొచ్చు. మీ కళ్ళు మూసి ఇప్పుడు ఈ మాటలపై దృష్టి పెట్టండి.
(02:42) ఈ వీడియోలో మధ్యలో కొన్ని శబ్దాలు మాటలు వినిపిస్తాయి. అవే మీ శ్వాస ద్వారా శక్తిని కలిగిస్తాయి. ఆ శ్వాస నాభిని చేరి అక్కడి నుంచి మళ్ళీ మీ ఆజ్ఞా చక్రాన్ని చేరుతుంది. మీ ధ్యానం మరింత లోతుగా సాగుతుంది. మీరు ఈ ప్రక్రియలో అనుభవించిన దాన్ని కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. మొదట మీ కళ్ళను మూసుకోండి. పూర్తిగా శాంతంగా ఉండండి. రిలాక్స్ అవ్వండి.
(03:05) మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము చెప్పింది అలా చేయండి. పూర్తిగా స్థిరంగా ఉండండి. శరీరంలో ఎటువంటి కదలిక ఉండకూడదు. ఆందోళన అవసరం లేదు. మీరు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీరు వింటున్న ఈ మాటలు అద్భుతంగా మారబోతున్నాయి. ఈ వీడియో ప్రభావం మీరు 24 గంటల నుంచి 48 గంటల్లో గమనిస్తారు. అందుకు మీ కళ్ళు మూసి ఉంచండి.
(03:32) లోతుగా ఊపిరి తీసుకోండి. మళ్ళీ ఒక్కసారి లోతుగా ఊపిరి తీసి వదలండి. అదే స్థితిలో ఊపిరి తీసుకోవడం వదలడం కొనసాగించండి. బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు నిశశబ్దం చేసుకోండి. చుట్టూ ఎవ్వరూ లేరు అని ఊహించుకోండి. మీరు ధ్యానం లోతుల్లోకి వెళ్ళగలుగుతారు. ఈరోజు మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం.
(03:57) ఈరోజు మీరు మీ అంతరాత్మ వైపు ప్రయాణిస్తున్నారు. కళ్ళు మూసుకున్నా కూడా మీ మనసుతో మీ ముక్కు వైపు చూడడానికి ప్రయత్నించండి. ఆ లోపల చిన్న బిందువులో నుంచి శ్వాస బయటక వస్తుంది. లోపలికి వెళుతుంది. అదే శ్వాసను నడిపించేది. అలాగే ఉండండి. ఇప్పుడు మీ మనసు తేలిగ్గా మారుతుంది. మీ శరీరం తేలిక పడుతుంది. మీరు పూర్తిగా ప్రశాంతంగా నిశశబ్దంగా మారుతున్నారు.
(04:21) ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి భాగాన్ని గమనించండి. మీ కడుపును మీ ఛాతిని మీ రెండు చేతుల్ని అనుభవించండి. చేతుల వేళ్ళను రెండు కాళ్ళను అలాగే మీ శరీరాన్ని అంతటిని అనుభవించండి. శూన్య స్థితికి చేరుతున్న అనుభూతి మీకు కలుగుతుంది. మీ దృష్టిని కాపాడుతూ శరీరంలోని ప్రతి భాగాన్ని మీరు అనుభవిస్తున్నట్లుగా గమనించండి. మీ శరీరాన్ని మరింత శాంతంగా ఉంచండి.
(04:45) పూర్తిగా ప్రశాంతంగా మారండి. కొద్దిగా నిద్ర లాంటి స్థితి రావచ్చు. కొంచెం అలసట వంటిది అనిపించొచ్చు కానీ ఎలాంటి ఆందోళన వద్దు. ఇది సహజమే ఇప్పుడు మళ్ళీ లోతుగా ఊపిరి తీసుకోండి. మెల్లగా వదలండి. మరో లోతైన ఊపిరిని తీసుకోండి. మళ్ళీ మెల్లగా వదలండి. మళ్ళీ మరో ఊపిరి ఇలా చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ దృష్టిని నాభి ప్రాంతానికి తీసుకువెళ్ళండి.
(05:09) మీ కడుపు ఎలా ఉబ్బుతుంది? ఎలా లోపలికి వెళ్తుందో గమనించండి. ఊపిరి లోపలికి తీసుకునేటప్పుడు కడుపు పైకి వస్తుంది. ఊపిరి వదిలేటప్పుడు లోపలికి వెళుతుంది. అదేవిధంగా కొనసాగించండి. లోపలికి ఊపిరి తీసుకోండి బయటకు వదులుతూ ఉండండి. మీ కడుపు మీద దృష్టి పెట్టండి. మీ ముక్కు ద్వారా ఊపిరి తీసుకుంటున్నప్పుడు అది నాభి వరకు చేరుతుందన్న అనుభూతిని పొందండి.
(05:32) మీ శ్వాస ముక్కు ద్వారా నేరుగా కడుపులోకి వెళ్తున్నట్టు నాభి వద్ద అనుభవించండి. ఈ ధ్యాన స్థితిలోనే కొనసాగండి. పూర్తిగా ప్రశాంతంగా ఏ ఆందోళనలు లేకుండా ఒత్తిడి లేకుండా పూర్తిగా విశ్రాంతిగా ఉండండి. లోతుగా శ్వాస తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఉండండి. మీ శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు బాగానే చేస్తున్నారు మీ నాభి మీద శ్వాస మీద దృష్టి పెట్టండి.
(05:55) నాభి వద్ద ఇప్పుడు మీరు ఏదో చిన్న బిందువు వంటిది గాని గాలిలా అనిపించేది ఏదో వస్తువు గాని దాన్ని చూడడం అనుభవించండి. ఇది ఒక లైన్ లాగా నాభి పైకి లేచేలాగా అనిపిస్తుంది. ఇలా లోతుగా శ్వాస తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఉండండి. దాని మీద పూర్తి దృష్టి పెట్టండి. ఇప్పుడు ఒక లోతైన ఊపిరి తీసుకోండి మెల్లగా వదలండి. ఇప్పుడు మీరు పూర్తిగా విముక్తి పొందారు.
(06:18) ఎలాంటి ఆందోళన లేదు ఒత్తిడి లేదు. కేవలం మీ శ్వాసను గమనిస్తున్నారంతే. శ్వాసను బలవంతంగా నియంత్రించకండి. అది ఎలా సాగుతుందో అలా సాగనివ్వండి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ శరీరం తేలికగా మారుతుంది చూడండి శాంతంగా ఉన్నారు కదా ఈ తేలికపాటి అనుభవం మీకు ఎంతో అనుభూతిని ఇస్తుంది. మీ ఆలోచనలు శాంతంగా ఉన్నాయి. మీ మనసు ప్రశాంతంగా మారిపోయింది ఇప్పుడు.
(06:42) ఈ విధంగా మీ ముఖాన్ని అనుభవిస్తూ ఉండండి. మెడకు పైన ఉండే భాగం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇప్పుడు మీ తల మీ ముఖం మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ శరీరం మొత్తాన్ని వదిలేసి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న శక్తి అంతా తలలోకి వచ్చేస్తుంది. మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీ దృష్టిని మూడో కన్ను వైపు తీసుకువెళ్ళండి.
(07:04) ఆజ్ఞా చక్రం వైపు శ్రద్ధ పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ భాగంలో ఒక ఒత్తిడిలా ఉండే అనుభూతి కలుగుతుంది. దాన్ని ఫీల్ అవ్వండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ మూడవ కన్ను వద్ద ఓ చిన్న ఒత్తిడి మీకు కలిగినట్టు అనిపిస్తుంది. ఆజ్ఞా చక్రం వద్ద ఆకర్షణం అంటే ఒక బలమైన శక్తి ఏర్పడుతుంది. అది మెల్లగా పెరుగుతూ ఉంది.
(07:26) అదే శక్తి మీ ధ్యానాన్ని మరింత లోతుగా తీసుకువెళ్తుంది. లోపలికి ఊపిరి తీసుకోండి బయటకు వదలండి అలాగే కొనసాగించండి. అదే లోతులో ఉండండి. ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా మారిపోయారు. ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఒత్తిడి లేకుండా మీ శరీరాన్ని తేలిగ్గా వదిలేయండి. ఏం జరుగుతుందో అది జరిగేలా చేయండి.
(07:48) కేవలం మీ ఆజ్ఞా చక్రం పై మాత్రమే మీ దృష్టి ఉండాలి. ఇప్పుడు మెల్లగా మీ చేతులను ఫీల్ అవ్వండి. మీ శరీరాన్ని కొద్దిగా కదల్చండి. మెల్లగా రెండు చేతులను కన్నుల మీద ఉంచండి. ఆ తర్వాత మెల్లగా మీ కళ్ళు తెరవండి. మీరు ఈ విధంగా ధ్యానం చేస్తే ఈ శ్వాస మీ శరీరంలో శక్తిని కలిగిస్తుంది. ఆ శక్తి నాభి వద్ద ఉత్పత్తి ధ్యానం ద్వారా పైకి లేచి మీ మూడవ కన్ను వరకు చేరుతుంది.
(08:11) అక్కడి నుంచి మీరు అద్భుతమైన అనుభవాలు పొందుతారు. జ్ఞానం లోతైన ధ్యాస స్థితులు మీలోకి వస్తాయి. ఈ రోజు మీరు ధ్యానంలో మంచి అనుభూతిని పొందుతారు.
No comments:
Post a Comment