నిజమైన జ్ఞాని లక్షణం ఇదే.. ఆది శంకరాచార్యుల అద్భుతమైన కథ 🕉️ #TeluguShorts
Author Name:NVVidyalayam
Youtube Channel Url:https://www.youtube.com/@NVVidyalayam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VT6RroljbTE
Transcript:
(00:00) నిజమైన జ్ఞానికి తన జ్ఞానం యొక్క పరిధి బాగా తెలిసి ఉంటుంది. అందువల్లనే ఆ వ్యక్తిలో అహంకారం అనేది జనించదు. [సంగీతం] కానీ అల్పజ్ఞాని లేదా మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తి తనను తాను మేధావిగా అత్యంత తెలివిగలవాడిగా ఊహించుకుంటూ అహంకారంతో నిండి ఉంటాడు. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు సముద్రతీరాన కూర్చుని [సంగీతం] ఉన్నారు.
(00:22) ఆయన శిష్య బృందంలోని ఒక మాటకారి శిష్యుడు ఆయన వద్దకు వచ్చి ఇలా [సంగీతం] అన్నాడు. గురుదేవా మీరు ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను మరియు గర్వంగాను ఉంటుంది అని అన్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు ఎవరు చెప్పారు నీకు నా దగ్గర అపారమైన జ్ఞాన భాండాగారం ఉంది అని అన్నారు.
(00:44) ఆ మాటలకు ఆ శిష్యుడు నోరెల్లబెట్టాడు. ఈ సంభాషణ విన్న మిగిలిన శిష్యులందరూ కూడా వారి దగ్గరికి వచ్చారు. శంకరాచార్యుల [సంగీతం] వారు వారి శిష్యులందరికీ జ్ఞానం అనే అహంకారం ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకున్నారు. శంకరాచార్యుల వారు తమ చేతిలో ఒక సన్నని కొమ్మని తీసుకొని దాన్ని సముద్రపు నీటిలో ముంచారు. కొద్దిసేపటి తర్వాత ఆ కొమ్మని బయటకు తీసి శిష్యుల్ని అడిగారు.
(01:07) [సంగీతం] ఈ కొమ్మకి ఎంత నీరు అంటుకుంది అని అడిగారు. కొంతమంది శిష్యులు అసలే ఏమీ అంటుకోలేదు అని చెప్పారు. మరికొంతమంది కేవలం కొన్ని చుక్కలు మాత్రమే అని అన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు నేను [సంగీతం] కూడా జ్ఞానం అనే మహాసముద్రంలో మొనకలు వేస్తాను కానీ ఆ మహాసముద్రం నుండి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను ఎంత తక్కువ జ్ఞానాన్ని తెలుసుకున్నానో [సంగీతం] అని నేను నిరంతరం ఇదే విధంగా జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.
(01:35) ప్రతి మనిషిలోనూ జ్ఞానాన్ని గ్రహించే శక్తి ఎప్పటికీ అంతమవ్వదు. జ్ఞానం అనే మహా సముద్రానికి అంతం అనేదే లేదు. అల్పజ్ఞానులు మాత్రమే మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో [సంగీతం] తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో తమని తాము మేధావులుగా అనుకుంటూ ఉంటారు. ఈ అద్భుతమైన మానవునిగా జన్మించినందుకు మనం నిరంతరము ఏదో ఒక రకంగా తగిన జ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉండాలి.
(01:55) ప్రస్తుతం నేను కూడా నిత్యం జ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉన్నాను అని అన్నాడు. ఇదంతా విన్న శిష్యులకి జ్ఞానోదయం అయ్యింది. ఈ సృష్టిలోని జ్ఞానం అంతా అపారమైన మహా సముద్రం లాంటిది. ప్రతి మనిషి కూడా తన ప్రయత్నాలతో సత్కర్మలతో వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని గ్రహించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. తాను గ్రహించిన జ్ఞానాన్ని అహంకారాన్ని త్యజించి పరోపకారం కోసం వినియోగించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
No comments:
Post a Comment