Saturday, April 11, 2026

DINK Culture (Double Income No Kids) పెళ్లి ముద్దు పిల్లలు వద్దు

DINK Culture (Double Income No Kids) పెళ్లి ముద్దు పిల్లలు వద్దు

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=unggVjt_GTc



Transcript:
(00:04) వివాహ వ్యవస్థ కొత్త పుంతులు తొక్కిందండి అంటే చాప కింద నీరులాగా ప్రవహించేసింది కానీ ఆ తడి తెలిసేటప్పటికీ మనకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట అదేంటంటే డింక్ కల్చర్ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లలు వద్దు అని ఒక అంగీకారానికి ముందే వచ్చేస్తారండి అదేంటంటే ఇద్దరు సంపాదిస్తారు కానీ పిల్లలు మటుకు వద్దు అంటే ఇదిఒక జీవన విధానం అయిపోయిందండి నగరంలో దాదాపు 10 ఏళ్ల బట్టి ఉందని అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఉన్నత విద్యావంతుల్లో కూడాను ఈ ఆలోచన ధోరణ ఎప్పటి నుంచో బయలుదేరింది ఇప్పుడు అమెరికా సౌత్ కొరియా జపాన్ లాంటి
(00:51) దేశాల్లో కూడాను ఇది బాహటం అయిపోయింది ఇది ప్రాచర్లోకి ఉంది అక్కడ జీవన విధానాన్ని బట్టి అక్కడ పెద్దగా ఎవరు వాటిని తప్పు పట్టట్లేదుఅన్నమాట ఇండియాలో ఉంది కానీ నేను చెప్పాను కదా ఈ మధ్య విపరీతం అయిపోయింది అన్నమాట అంటే ఇక్కడ భార్యా భర్తల ఉద్దేశం ఏంటంటే ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎట్టి పరిస్థితిలో కూడాను భంగం కలగకూడదు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కానీ పిల్లల మటుకు వద్దు అంతేనండి కారణాలు ఏంటని ఆలోచిస్తే అంటే నేను కొంతమందిని ఎంక్వైరీ చేశను కూడా అంటే నాలాగా వ్యక్తిత్వ వికాసంలో ఒక స్థాయికి చేరిన వాళ్ళతో నేను డిస్కస్
(01:35) చేస్తే నాకు అర్థమయింది ఏంటంటే ఆర్థిక కారణాలు తప్ప ఇంకేం లేపండి ఈ డింక్ కల్చర్ లో ఇప్పుడు పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నది. ఎలా ఖర్చుతో కూడుకున్నది వాళ్ళకి విద్యను అందివ్వాలి కార్పొరేట్ స్కూల్స్ లో వేయాలంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చాయి అనుకోండి పిల్లలు పెరుగుతున్న కొద్ది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడాను సామాన్యంగా ఉండటంలేదు విపరీతంగా ఖర్చు పెట్టాలి.
(02:04) అందువలన ముఖ్యంగా పిల్లలు వద్దుఅనుకుంటున్నారండి ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ గా సౌండ్ గా ఉండాలి. ఇది స్వార్థమేనండి ఒక విధంగా చెప్పాలంటే ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అట్లాగే విదేశీ ప్రయాణాలు కూడాను చేయాలి అన్న ఉద్దేశం ఉంటుంద ఉద్దేశంతో ఉంటున్నారు అన్నమాట అలాగే కొంత కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి అని చెప్పేసి అంటే వీటితో సమానంగా క్యారీ డెవలప్మెంట్ కూడా ఉండాలి కాబట్టి పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ గనుక కాకపోతే వాళ్ళ ఉద్యోగం ఉంటుందన్న గ్యారెంటీ మటకు లేదంటే
(02:38) పిల్లలు ఉంటే ఇవన్నీ కుదరవు కదా అందుకని పిల్లలు వద్దు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లలుకి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి అసలు వాళ్ళు ఉద్యోగం పోయే అవకాశం ఉందన్నమాట. ఆ భయం కూడాను ఈ పెళ్లి చేసుకోబోయే యువతి యువకుల్లోకి వచ్చేసిందన్నమాట. అంటే బాధ్యతలు తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే పిల్లలు ఎటు ఉండరు కాబట్టి కాకపోతే వర్క్ స్ట్రెస్ ఎటు ఉంటుంది.
(03:03) అందువలన ఈ పిల్లల స్ట్రెస్ కూడాను ఎందుకు భుదానికి ఎత్తుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారండి నేను చెప్పాను కదా ఇది స్వార్థం తప్ప మరేమి కాదు అని చెప్పేసి అట్లాగే ఈ కొంతమంది ఏమంటున్నారంటే అలిసిపోతాం కదండీ అందువలన మాకున్న కొద్ది టైంలో కలిసి ఉండి మేము మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఒకోసారి నవ్వ వస్తూ ఉంటుందండి ఇది రైటా కాదా అన్న ప్రశ్న ని వేస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ఇది మా వ్యక్తిగతం అండి అన్నారనుకోండి మనం ఏం మాట్లాడడానికి ఉండదు అసలు ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న
(03:48) పిల్లలు మైనర్స్ అయిన తర్వాత ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇది మా వ్యక్తిగతం అన్నారనుకోండి మనం ఏం చేయలేమ అన్నమాట అంటే సమాజం మారుతున్న కొద్ది కుటుంబ నిర్వచనం కూడాను మారుతున్నదా అన్న అనుమానం కూడా కలుగుతుందండి మారుతున్నదేమో కదా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పరిణామం సాంప్రదాయము ఆధునిక మధ్య జరుగుతున్న సంఘర్షణగా మనం చెప్పుకోవచ్చు.
(04:13) ఇకపోతే ఇంకొక మాట అంటున్నది అంటే ఈ డింక్ కల్చర్ లో ప్రవేశించాలి అనుకుంటున్న వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మాకు జాబ్స్ లేట్ గా వస్తున్నాయండి. పగలనగా రాత్రి అనగా గనక పని చేసినట్లయితే 40 ఏదల తర్వాత మమ్మల్ని ఇంటికి వెళ్ళపోమంటారు కదా అప్పుడు మేము ఊబకాయలతో బయటపడతాం కదా మాకు ఆ స్కిల్ తప్ప ఇంకా వేరే స్కిల్ ఏమి ఉండదు కదా అసలు కొత్త స్కిల్స్ నేర్చుకునే వయసు కూడా కాదు కదా మాకు కాబట్టి మేము దాచుకునే ప్రయత్నం చేస్తాము ప్రాపర్టీస్ ని కొనుక్కునే దిశగా మేము ఆలోచిస్తాము అలా 45 ఏళ్ల తర్వాత మా జీవితాన్ని మేము కొంచెం ప్లాన్ చేసుకుంటామ అని చెప్పి
(04:52) చెప్తున్నారండి ఇది అమాయకత్వం తప్ప మరేమి కాదు ఇంకో మాట అంటున్నారు అదేంటంటే 20 ఏళ్లకు పైగా మేము స్ట్రెస్ గురైతాం కదా ఆ స్ట్రెస్ వల్ల మాకు ఊబకాయలు వచ్చేస్తాయి కదా అందువల్ల దాచుకున్న డబ్బుతో మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామ అని అంటున్నారు. అమాయకత్వం తప్ప ఏం కాదండి. సరే ఇప్పుడు యువత ఎన్ని చెప్పినా ఆ మరి బాధ్యత గల యూట్యూబర్ గా కొంచెం సమాజం గురించి మానవ సంబంధాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నాకంటూ ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది కదండి అదేంటంటే ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ని నమ్మి విదేశాల మల్టీనేషనల్ కంపెనీకి నువ్వు పని
(05:34) చేస్తున్నావో అక్కడి పగటి వ్యాపారాలకి నువ్వు ఇక్కడ రాత్రింతా పనిచేస్ ఉంటుంది నిద్రను కూడాను సాక్రిఫైస్ చేసి అప్పుడు నీకు స్ట్రెస్ తప్పదు ఆరోగ్యం కూడాను కుంటుపడే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే నువ్వు రాత్రి పని చేశవో పగలు నిద్రపోవాల్సి వస్తుంది. పెళ్ళీళ్లు గనుక చేసుకుంటే పిల్లల్ని స్కూల్లకి తీసుకెళ్ళలేవు అవసరమైతే హాస్పిటల్స్ కూడా నువ్వు తీసుకెళ్ళలేవు.
(06:01) అంటే పిల్లల్ని గాని వాళ్ళని దిక్కు లేని వాళ్ళని చేసినట్లు అవుతుంది. అందుకని నాకు పిల్లలు వద్దు అని అంటున్నారండి ఇప్పుడు యువత అంటే ఈ డింక్ కల్చర్ లో ఉన్నవాళ్ళ అన్నమాట అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ప్రతి దేశానికి కూడాను ఒక ప్రకృతి అంటూ ఉంటుంది ఒక జీవన విధానం అంటూ ఉంటుంది కదా మన దేశంలో ఉంటూ మన దేశంలో చదువుకొని ఇక్కడ జ్ఞానాన్ని పొంది మరి విదేశీ ఎంఎన్సిలకు పని చేయడం అంటే ప్రకృతికి వ్యతిరేకంగా పని చేయడమే కదా అలా ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేస్తే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి కదా సాఫ్ట్వేర్ లో దాదాపు 90% ఇప్పుడు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారండి
(06:40) అట్లాగేబి12 కూడా ఉండటంలేదు ఇదేంటంటే నిర్మోహమాటంగా చెప్పాలి అంటే స్వయం కృతాపరాధమేనండి దేశం యెడల ఆ నీకు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు గౌరవం లేదు ఈ దేశాన్ని కేవలం ఉద్యోగం కోసం ఉపయోగించుకున్నావేమో అని అనాల్సి వస్తుందండి చాలా మందికి కోపం రావచ్చు దానికి మనం ఏం చేయలేమండి. కాబట్టి ఏంటంటే విదేశాలకి ఈ రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయడం వల్ల ఈ 50 వచ్చేటప్పటికి వీళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుందండి.
(07:10) ఆ వృద్ధాప్యంలో వీళ్ళు ఒంటరితనలో కూరుకోక తప్పదు ఎందుకంటే అప్పటికి అసలు పిల్లలే ఉండదుగా మామూలుగా గనుక ధైర్యం చేసి పెళ్ళీళ్లు చేసుకుంటే చేతికి అందవచ్చే పిల్లలు ఉంటారు. మరి 50 ఏళ్ళ వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి పిల్లలు ఉండరండి. అట్లాగే స్వదేశంలో పుట్టి పెరిగి చదువుకొని ఈ విదేశీ మోజులో పడ్డప్పుడు ఏమవుతుందంటే భార్యా భర్తలు ఇద్దరు కూడాను రోగాల పాలైతారండి అప్పుడు వాళ్ళకి వృద్ధాశ్రమే గతి తప్ప ఇంకేమి ఉండదండి అలా డబ్బు వృద్ధాశ్రమాలకి వెళ్ళటానికి ఆ మంచంలో పడి దిగాలుగా చూడటానికి పనికొస్తుంది నేను
(07:49) అంటున్నాను వీళ్ళ ఏమంటున్నారంటే ఏం లేదండి 45 ఏళ్ల తర్వాత మాకు ఉద్యోగం ఎటు ఉండదు కదా ఈ లోపల మేము దాచుకుంటాము ఇన్వెస్ట్ చేసుకుంటాం ంటాము అలా మేము లైఫ్ ని ఎంజాయ్ చేస్తాము అని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి [నవ్వు] కానీ చివరికి ఒంటరితనంలో కూరుకుపోయి వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు బాగుంటుందేమో తర్వాత ఎంత పొరబాటు జరిగిపోయింది అని పశ్చాత్తాపం పడే లోపలే జీవితంఅంతా వాళ్ళ చేతి నుంచి జారిపోతుందండి అంటే నిర్మాహటంగా చెప్పాలి అంటే ఇది స్వార్థం అండి ఆ మాటక వస్తే పిరికితనం కూడాను ఓ పెద్ద పదం ఉపయోగిస్తాను మీరేమ
(08:28) అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఇక్కడే చదువుకున్నారు కదా మరి ఇక్కడే జ్ఞానాన్ని సంపాదించారు కదా మరి ఈ జ్ఞానాన్నంతా విదేశలకి అంటే విదేశీ ఎంఎన్సీలకి ఉపయోగిస్తున్నారు కదా దేశద్రోహం కాదా అండి చెప్పండి అంటే దేశద్రోహం అంటే ఇక్కడ విషయాలని ఎవరికీ తెలియకుండా విదేశాలకు అందించడం కావచ్చు కానీ ఇది కూడా ఒక విధంగా దేశద్రోహమే ఈ పదాన్ని ఉపయోగించినందుకు దయచేసి నన్ను క్షమించండి కోపం రావచ్చు కానీ కానీ మరి యూట్యూబర్ కదా సామాజిక బాధ్యత నేను ఎత్తినేసుకున్న నేను ఈ విషయం కూడా చెప్పకపోతే తప్పైతుంది కదండి అందువల్ల నేను ధైర్యంగా చెప్తున్నాను అండి
(09:09) అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలండి ఈ విదేశీ వ్యామోహం అనేది మన భారతీయ వైవాహిక వ్యవస్థని కుటుంబ వ్యవస్థని కూడాను నిర్వీర్యం చేసిందండి నిర్వీర్యం చేసింది ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే అమెరికా నిజంగా ఒక వ్యాపార సంస్థ అండి వ్యాపార సంస్థ ఐదు పైసలు ఇచ్చి అర్ధ రూపాయి పని చేయించుకుంటున్నాం అన్నమాట అంటే అంటే మన శరీరంలో ఉన్న ఎనర్జీని అట్లాగే మానసిక శక్తిని మాక్సిమం పిండేసుకుంటుంది అన్నమాట అందువల్లనే మన సాఫ్ట్వేర్ పిల్లల యొక్క ఆరోగ్యాలు 35 40 కి వచ్చేటప్పటికీ పూర్తిగా చెడిపోతున్నాయండి అయితే అక్కడ వివాహం వచ్చేసి ఒక విధంగా చెప్పాలి అంటే కాంట్రాక్ట్ అండి
(09:50) కాంట్రాక్ట్ కానీ మన వివాహ వ్యవస్థ వచ్చేసి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక బంధం అండి అట్లాగే నైతికం కూడాను అంటే డబ్బుకు ఆశపడి మన యువత కూడా మన వివాహ వ్యవస్థని తెలిసో తెలియకో నిర్వీర్యం చేసిందండి నిర్వీరం చేసింది. అందుకని మన యువత ఒక విధంగా చెప్పాలి అంటే సఫర్ కాక తప్పకండి మరి ఇటువంటి నేపథ్యంలో ఈ డింక్ కల్చర్ అనేది తప్ప ఒప్పా నా అభిప్రాయం అయితే నేను చెప్పాను మరి లిజనర్స్ గా మీ అభిప్రాయం కూడాను మీకు ఉంటుంది కదండి ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తానండి.
(10:34) మా అమ్మాయి ఏదో ఫంక్షన్ కి వెళ్ళింది మా అల్లుడు గారు ఏదో పని మీద వెళ్ళారు. మా మనవరాలు మా ఇంట్లో దింపి వెళ్ళారు. రాత్రి తొమ్మిది అయింది. మా అల్లుడు గారు ఇంటికి వచ్చారు అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. నా మనవరాలు రాత్రికి మా దగ్గరే ఉంటుందని కూడా మెసేజ్ పెట్టారు. మేము కూడా సరే అని మెసేజ్ పెట్టాం.
(10:56) ఈ విషయం మా మనవరాలకి చెప్తే మా మనవరాలు ఏమందంటే తాత ఒకసారి నాన్నతో మాట్లాడాలి అంది డాడీ కల్చర్ లేదు లేండి మొదటి నుంచి కూడా నువ్వు అమ్మ నాన్న అని పిలవమని చెప్పాము మనవడు మనవరాలు కూడా అమ్మ నాన్న అనే పిలుస్తున్నారు. ఎందుకు నాన్న ఒకసారి మాట్లాడాలి అంది 10 11 ఏళ్ళ సరే ఫోన్ ఇచ్చాను ఫోన్ ఇచ్చి నాన్న వచ్చావా అంది వచ్చామ అన్నారు నాన్న అన్నం ఉంది నువ్వు తినేసేయ్ అమ్మ బయట ఫంక్షన్లో తింటాను అంది కదా అన్నం ఉంది తినేసేయ అంది ఆ సరే అమ్మలు అన్నాడు అసలు నా శ్రీమతి నేను ఆశ్చర్యపోయావండి అబ చిన్న పిల్లలు తండ్రి గురించి తల్లి తల్లి గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూడండి.
(11:41) మరి అనుబంధమే పెరిగి పెద్దయితే అమ్మ నాన్నకి ఏదన్నా వచ్చినా కూడా మేము ఉన్నామ అంటూ అవసరమైతే ఉద్యోగాలకి లీవ్ పెట్టి అవసరమైతే వదిలేసి వచ్చేస్తారు కదండ అని ఎందుకు చెప్తున్నాను అంటే మనకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు గనక సెటిల్ అయిపోతే ఆర్థికంగా గనక వాళ్ళు కూడాను ఒక స్థిరత్వానికి వచ్చేస్తే మన గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది కదండి.
(12:06) సో ఈ ఎంఎన్సిలు కాదు గానీ ఈ మధ్య వచ్చిన ఈ డింక్ కల్చర్ కూడాను మన కుటుంబ వ్యవస్థని వైవాహిక వ్యవస్థని నాశనం చేసిందండి నాశనం చేస్తుంది ఈ డింక్ కల్చర్ ని ఆశ్రయించి దీని గురించి ఆలోచించి యువత కూడాను పెద్ద పొరపాటు చేస్తున్నదండి అంతేనండి ఎంతకంటే చెప్పాల్సింది ఏం లేదు నమస్కారం

No comments:

Post a Comment