Saturday, April 11, 2026

ఈ రహస్యం తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది The Secret that can change your Life

ఈ రహస్యం తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది The Secret that can change your Life

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-uX-6rY5sco



Transcript:
(00:01) మనం ఒక విషయం గురించి పదే పదే అనుకుంటున్నాం అనుకోండి తెలియకుండా అది మనది అయిపోతుంది అంతే అంటే ఆలోచనకు తగ్గ వాతావరణం ఎప్పుడో ఒకప్పుడు మనక ఏదో ఒక విధంగా దగ్గరయి మనం అనుకున్నది సాధించేస్తాం అన్నమాట ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా గొప్ప వాస్తవం అండి ఒక విధంగా చెప్పాలి అంటే విశ్వ సూత్రం అన్నమాట ఈ సహకారం అనేది వ్యక్తుల ద్వారా కావచ్చు సంఘటనల ద్వారా కావచ్చు లేకపోతే పరిస్థితు ద్వారా కూడా కావచ్చు కాకపోతే మనం చేయాల్సింది ఒకటే ఆ విషయం గురించి పదే పదే ఆలోచన చేస్తూ ఉండాలిన్నమాట అసలు మేధావుల జీవితంలో జరిగింది కూడా అదేనండి అయితే ఈ విషయం గురించి కాసేపు
(00:43) మాట్లాడుకుందాం. ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే మన మనసు ఆ విషయం మీదనే కేంద్రీకృతం అవుతుంది అన్నమాట ఇప్పుడు మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను మీ మనసు ఒక మంచి బైక్ మీద గాని లేకపోతే ఒక కార్ మీద గాని పోయింది అనుకోండి మీరు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే అంటే ఈ ఆలోచన గనుక మీలో ఒక చిక్కదనంతో గనుక ఉన్నట్లయితే ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది.
(01:23) చుట్టుపక్కల ఎన్నో విషయాలు జరుగుతూ ఉండొచ్చు ఎన్నో కార్లు పోతూ ఉండొచ్చు కానీ మీ మనసులో ముద్రితమైన కారు గాని బైక్ గాని ఉంది చూసారా అది ఎంత దూరంలో అయినా సరే అలా పోతూ ఉంటే మీకు తెలియకుండా ఒక్కసారి దాని వైపు అలా చూస్తారన్నమాట అది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంతకుమించిన గొప్ప ఉదాహరణ ఇవ్వడం కూడా ఒక విధంగా కష్టమేనండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే విషయం మీద మనసు కేంద్రీకృతమై అవుతున్నది దీన్ని ఏమంటారంటే యక్టివేషన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని అంటారు.
(02:02) ఈ యాక్టివేషన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఒక స్థాయికి చేరింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సరైన టైంలో సరైన పరిస్థితులు మీకు కలిసి వస్తాయి. సరైన మనసులు మనుషులు తరసపడతారు సరైన సందేశాలు మీకు తెలియకుండా మీకు వస్తూ ఉంటాయి. ఇదేదో కాకతేంగా జరిగింది అనుకుంటాం కాదండి ఎందుకంటే మీ మనసు అనేది మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన తరంగాలని ఈ విశ్వంలోకి పంపిస్తూ ఉంటుంది అన్నమాట పంపిస్తూ ఉండేటప్పటికి ఏం జరుగుతుందంటే మీకు తెలియకుండా ఆ పరిస్థితులు సహకారం అయతూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి
(02:47) ధారిస్తూ ఉంటుంది. మనం ఏదో కాకతీయ ఏమని అనుకుంటూ ఉంటాం ఆల్ ఆఫ్ షడన్ అలా జరిగిందని కానక కాదండి నేను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అది ఏంటంటే ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నానయ్యా కాలు వచ్చేసింది అని మనం ఎంతమందితో అనలేదు అలాగే ఒక వ్యక్తి వచ్చినప్పుడు నీకు నూరేళ్ళయ్యా బాబు ఇలా ఇగో మిత్రమా మన ఇద్దరం అనుకుంటున్నాం కదా దీని గురించి ఇదిగో ఈయన వచ్చేసాడు అని మనం ఎన్నిసార్లు మన జీవితాలు అనుకో అనుకోలే చెప్పండి అంటే ఒకటండి మనం నమ్మినా నమ్మకపోయినా ఒక విశ్వశక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది.
(03:28) ఈ సంఘటనలన్నీ కూడాను అంటే మనం బలంగా నమ్మిన వాడికి కలిసి వస్తున్న పరిస్థితులన్నీ కూడాను ప్రీ డిటర్మైన్డ్ అండ్ వెల్ డిటర్మైన్డ్ ఇది ఒ ప్రోగ్రాం్ లో ఒక భాగం అండి. ఇంకా బాగా అర్థం కావాలంటే నిత్య జీవితంలో జరిగే ఒక సంఘటన గురించి చెప్తాను అదఏంటంటే ఎక్కడనా ఒక మ్యారేజ్ కి గానీ లేకపోతే ఫంక్షన్ కి గాని వెళ్ళామ అనుకోండి మనం ఏం చేస్తాం మనం లైక్ మైండెడ్ పర్సన్స్ ని ఎతుక్కుంటామా లేదా అందువలన అక్కడక్కడ అక్కడక్కడ లైక్ మైండెడ్ పర్సన్స్ అందరూ కూడా గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారున్నమాట అంటే ఒక తలహా మనుషులందరూ కూడాను ఒకచోట కలిసే ఒక విధమైన
(04:06) వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎంత సమంజసమో మీ ఆలోచనలకి ప్రకృతి గాని విశ్వం గాన దారి ఇవ్వటం కూడాను అంతే సహజం అండి మీరు ఒప్పుకున్నాపోయినా ఇది గొప్ప విశ్వసూత్రం అన్నమాట అలాగే ఒక ఆలోచన గాని ఒక లక్ష్యం గాని స్పష్టంగా గనుక ఉంటే తెలియకుండా మనలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి అదేంటంటే మన మాటలు మారతాయి. మన పరిచయాలు మారుతాయి ఇంతకుముందున పరిచయాలు కొంచెం దూరం పెట్టేస్తాం.
(04:42) అట్లాగే మెల్లమెల్లగా మన నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి కొద్ది రోజుల తర్వాత మనం అనుకుంటాం అబ్బా పరిస్థితులన్నీ కలిసి వచ్చాయి కదా అని లౌకికంగా అయితే కలిసి వచ్చాయండి. కానీ ఆధ్యాత్మిక పరంగా గనుక ఆలోచించినట్లయితే అది విశ్వం సహకరించటం మాత్రమే అవుతుంది. విశ్వం సహకరించటం వల్లే మీరు అనుకున్నది అనుకున్నట్టు సహకారం అయింది అని అర్థం కారణం ఏంటంటే ఆ విషయానికి మనమే ఒక విధమైన చిక్కదనాన్ని కల్పించాం.
(05:18) యద్భావం తద్భవతి ఎలా భావిస్తే అలా అవుతుందండి. నువ్వు ఏ భావనతో జీవిస్తున్నావో నీ జీవితం ఉంది చూసారా ఆ భావాన్ని అనుసరిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సహకారమైతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే సంకల్ప శక్తి అని అంటుంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఈ ఆలోచన నీకే ఎందుకు రావాలి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే మీకు రావాలి కాబట్టి వచ్చిందండి ఎందుకంటే మీ ఆలోచనలు ఇతరులకు రావు ఇతరుల ఆలోచనలు మీకు రావు.
(05:58) ఆన్సర్ ఈస్ సింపుల్ అండి అంతే యు ఆర్ బార్న్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్ అందువల్ల విశ్వం ఎప్పుడు కూడాను ఆ పర్పస్ వైపుకి మిమ్మల్ని తోయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే కొంతమంది కొన్నిటికి అర్హులు మీరు కొన్నిటికి అర్హులు మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నమాట చెప్పాను కదా ఇది గొప్ప వాస్తవం విశ్వం ఎక్కువ గొప్ప సూత్రం అంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అదేంటంటే ఒక వ్యక్తి యవ్వనంలోనే కొంతమంది ఉపన్యాసాలు విని ప్రభావితమై నేను కూడాను అలాగే గొప్ప స్పీకర్ కావాలని అనుకున్నాడు అనుకోండి అది పదే పదే అనుకున్నాడు అనుకోండి ఒక సంవత్సరం
(06:42) పాటు అనుకున్నాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది మంచి పుస్తకాలు చదువుతాడు దాంట్లో ఉన్న పాయింట్స్ నోట్ చేసుకుంటాడు ఆ రంగంలో ఉన్న వ్యక్తులని కలిసి కలుస్తాడు డౌట్స్ ఏమైన్నా ఉంటే ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి డిస్కస్ చేసి తీర్చుకుంటాడు ఎక్కడ ఉపన్యాసం జరిగిన ముందు అతను ఉంటాడు అతని జేబులో పెను ఉంటుంది చిన్న పుస్తకం ఉంటుందిఅన్నమాట ఇలా అతను ఏం చేస్తాడంటే తన లక్ష్యాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు.
(07:10) నిజంగానండి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా జీవితంలో కూడా అదే జరిగిందండి తెలియకుండా కొంతమంది ఉపన్యాసాలు విన్నాను ఇలా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ అయ్యాను ఏదో మీ ముందు కూర్చునేలాగా [నవ్వు] రకరకాల విషయాల మీద హాయిగా మాట్లాడుతున్నానుండి అంటే ఇది నిశశబ్దంగా ప్రకృతిలాగా జరిగిపోతుంది. అంటే మన నేచర్ కూడా అలాగే తయారవుతుంది.
(07:45) అందుకనే స్వామి వివేకానంద ఒకచోట అంటాడు ఏంటంటే నీకు ఇష్టమైన ఉపాధిని ఎన్నుకో ఒక్కరోజు కూడా నువ్వు పని చేయవలసిన అవసరం రాదు అని నీకు ఇష్టమైన ఉపాధి అంటే దాని గురించి పదే పదే అనుకొని దాన్ని సహకారం చేసుకునే దిశలో నువ్వు అనేక ప్రయత్నాలు చేశవ అని అర్థం కదండ అంటే వాస్తవం సాధించిన వాళ్ళకే తెలుస్తుందండి చాలామంది ఏమనుకుంటారంటే అదృష్టం కలిసి వచ్చిన తర్వాత అతనికి అనుకుంటారు కానీ ప్రపంచానికి దూరమై ఎన్నో నిశశబ్దమైన రాత్రులు గడిపి ఎంతో కృషి చేసి ఉన్నట్టు నుండి ఒక్కసారిగా బయటిక వస్తాడు అతను వచ్చేటప్పటికి అది వాళ్ళకి అదృష్టంగా కనిపిస్తుంది కానీ
(08:28) ఆ వ్యక్తికి తెలుసు దాని వెనక అంత కష్టం ఉందని చెప్పేసి ఒకటండి ఆలోచన దృష్టిగా మారుతుంది దృష్టి చర్యగా మారుతుంది ఆ చర్య ముందుకు పోతున్న కొద్ది రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి అంటే విశ్వం మనకి దారిస్తుంది. చివరికి అనుకున్నది అనుకున్నట్టు సహకారం అయిపోతుంది. నేను ఏ విషయం చెప్పినా కొంచెం స్పిరిచువాలిటీ జోడిస్తాను కాబట్టి స్పిరిచువల్ గా కూడాను చెప్పక తప్పదండి.
(09:02) మన ఆలోచనలు కూడాను పునర్జన్మ వాసనలే అవే కర్మలుగా మారతాయి. ఆలోచనలు స్వభావాన్ని తయారు చేస్తాయి స్వభావం చర్యలని తయారు చేస్తుంది చర్యలే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి అందుకే మనిషి ఎప్పుడు కూడా తన ఆలోచనలతోనే తన భవిష్యత్తుని నిర్మించుకుంటాడు ఇట్స్ ఏ ఫాక్ట్ వమే అగ్రీవ మే నాట్ అగ్రీ ఇట్స్ ఏ డిఫరెంట్ మటర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ గా నేను చాలా వేదికల మీద చెప్పాను ఏం ఏంటంటే యు ఆర్ వాట్ యు రిపీటెడ్లీ థింక్ అని యు ఆర్ వాట్ యు రిపీటెడ్లీ థింక్ అని ఇప్పుడు వేదాంతం
(09:48) కూడా ఏం చెప్తుందంటే మనోమూలం ఇదం జగత్తు అని చెప్తుంది. ఈ ప్రపంచాన్ని మన మనసే నిర్మిస్తుంది. ఈ ప్రపంచం అంటే నీ ప్రపంచాన్ని ఒకసారి యోగ వాసిష్టం దగ్గర గనక వెళ్ళినట్లయితే మనసే బంధానికి కారణం ఈ మనసే విముక్తికి కారణం ఈ మనసే ముక్తికి కారణం విముక్తి ముక్తి అంటే ఏం లేదండి పనికి రాని విషయాలని వదిలిపెట్టేసి పనికవచ్చే విషయాల వైపుకి మనసుని ధ్యానించి దాంట్లోనే రమించటం ఒక విధంగా చెప్పాలి అంటే ముక్తికి ఇదొక విధమైన నిర్వచనం అన్నమాట సో ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఒక్కసారి మనం అనుకున్నవి సహకారం కావండి మనం అనుకున్నవి సహకారం కావు. ఎందుకు సహకారం
(10:34) కావంటే సందేహం మన సంకల్పాన్ని బలహీన పరుస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి నేను విజయవంతుడిని కావాలి అని మీరు అనుకున్నారు అనుకోండి కానీ వెంటనే కాసేపు అయిన తర్వాత నాకు అంత సామర్థ్యం లేదు అని అనుకుంటారు అంటే మొదటిది పాజిటివ్ తర్వాత నెగిటివ్ అసలు ఈ రెండు పోట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ నెగిటివిటీ అనేది పాయిజన్ కాబట్టి సంకల్పం బలహీనం అవుతుంది అంటే అది వికల్పంగా మారుతుంది అంతేనండి మళ్ళీ యద్భావం తద్భవతి ఇప్పుడు మన కోరికలు కొన్నిసార్లు మన
(11:20) స్వభావానికి సరిపోవండి. అది మనం గుర్తించగలగాలి. మళ్ళీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా టీచర్ గా బాగా రాణించగలడు. కానీ దురదృష్టం ఏంటంటే అతని కొంతమంది తోడైతారు అతని మనసులో ఎక్కించేస్తారు. అరే నువ్వు వ్యాపారం చేస్తే పైకి వస్తావురా అని చెప్పేసి చేస్తాడు కానీ అతను విఫలమైతాడు. అందుకే భారతీ తత్వం ఏం చెప్తుందంటే స్వధర్మం ఉత్తమము అని ఇక్కడ స్వధర్మం అంటే ఒకటండి మనం నమ్మిన దాన్ని విశ్వసించిన దాన్ని చేసుకుంటూ పోవటమే ఇక్కడ స్పిరిచువల్ గా కూడా చెప్పాలి అంటే
(12:07) భగవద్గీతని గనుక ఒక్కసారిగా గన స్పృశించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు నీ స్వధర్మ యుద్ధం చేయడంరా బాబు అని చెప్పేసి అర్జునుడు అలా అతన్ని కన్ను చేయడానికి ప్రయత్నిస్తాడు అట్లాగే స్వధర్మ అంటే ఏం లేదండి మనం బలంగా నమ్మిన దాన్ని వెంబడి పడటమే అంతకంటే ఏం లేదు. ఉదాహరణలు ఇస్తూ ఉంటేనే సబ్జెక్ట్ రక్తి కడుతుందండి.
(12:32) ఇప్పుడు ఆలోచన అనేది ఒక విత్తనం అనుకుందాం. నువ్వు చేసే కృషి దానికి పోసే నీరు లాంటిది అన్నమాట. దేనికైనా టైం ఫ్రేమ్ ఉండాలిగా ఈ కాలం అనేది సూర్యకాంతి లాంటిది ఓపిక పట్టాలే కానీ ఫలితాలు మటుకు అద్భుతంగా ఉంటాయండి నాకు ఎందుకో ఇది మంచి ఉదాహరణ అన్నమాట అని అనిపించింది. అయితే చూడండి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నేమగ్నమై అంటే మనసా వాచా కర్మణ త్రిగణ శుద్ధిగా నమ్మినప్పుడు మీ శారీరక మానసిక శక్తులన్నీ కూడా ఏకీకృతం అయతాయి.
(13:11) ఏకీకృతం అయినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది మనకు తెలియకుండా అదేంటంటే పొరపాటున కొంతమంది దగ్గరికి వెళ్ళామ అనుకోండి అతను మాట్లాడే మాటలు బట్టి మనక ఎందుకో ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అట్లా కొంతమంది దగ్గరికి వెళితే అతని మాటలు వినాలనిపిస్తుంది. అంటే ఏంటి మనం ఏ చిక్కదనంతో అయితే ముందుకు వెళ్తున్నామో అంటే ఏ సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నామో ఆ సంకల్పానికి దగ్గరగా అదన మాటలు అంటూ ఉంటూ మాటలు ఉంటాయిన్నమాట అంటే ఒకటండి మనకు తెలియకుండా ఒక ఆర మన చుట్టూ ఉంటుందండి ఆ ఆర మనకు అవసరమైన వాటిని లాక్కుంటూ ఉంటుంది.
(13:58) దీనికి మనసు ప్రధానం అండి. కొంతమంది ఒక పర్టికులర్ చోటకి వెళ్ళాలనుకుంటారు వెతుక్కొని మరి వెళ్తారు. అది చెడ్డ ప్లేస్ అయితే సరే చెడ్డవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మంచివాళ్ళు మంచి స్థలాలు వెళ్తూ ఉంటారు గుళ్ళకి వెళ్తూ ఉంటారు గోపురాలు కొడుతూ ఉంటారు. చెడ్డవాళ్ళయితే ఎక్కడికి వెళ్తుంటారో దాని గురించి మనం డిస్కస్ చేయడం అనుకోండి కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటేనండి ఒక విషయాన్ని పదే పదే అనుకోగలిగినప్పుడు అంటే మీ మనసు అలా లాగుతూ ఉంటుంది అంతే తొందరపడి ప్రయత్నం చేయొద్దు ఆ మనసుని ఆ విధంగా బలోపేతం చేసుకోండి.
(14:38) ఎప్పుడూ దాని గురించి ఆలోచించండి స్వామి వివేకానంద కొటేషన్ కూడా ఉంది కదా ఒక భావనలో పరవశించండి దాన్ని మీదానిగా చేసుకోండి దాంట్లోనే కలగనండి అని ఒక అద్భుతమైన కొటేషన్ ఉందఅనుకోండి స్వామి వివేకానంద ఊరికే అనలేదండి ఊరికే అనలేదు ఒక భావం ని మీరు పట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించండి ఊరికినే డిస్టర్బ్ కావద్దు అప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు సో వీడియో కొంచెం పెద్దగా వచ్చింది కానీ ఇది ముఖ్యంగా యువతకు పనికొస్తుంది అన్న ఉద్దేశం చేస్తున్నాను ఆ మాటక వస్తే అందరికీ పనికవస్తుందండి వీలైతే ఒకసారి వినండి మీరు కూడాను తెలియకుండా సైలెంట్
(15:21) అయిపోతారండి మీ బలమైన కోరికలన్నీ కూడాను మీ ముందు సాక్షాత్కారం అయిపోతాయి. దాని ఎమ్మట మీరు తప్పకుండా పడతారు. [నవ్వు] ఇదండి ఈ వీడియోలో సంగతి విన్న కృతజ్ఞతలు థాంక్యూ వీలుంటే అందరికీ షేర్ చేయండి. నమస్కారం.

No comments:

Post a Comment