శరీరం వంగింది — ఆత్మ వంగలేదు Ashtavakra's PhiloVi #motivation #trendingnow #youtubeshorts #viral#yt
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M4SsP1VSzRU
Transcript:
(00:07) ఒక మనిషి పుట్టినప్పటి నుంచే శాపం మోస్తూ పుట్టాడు. అతని శరీరం ఎనిమిది చోట్ల వంగిపోయింది. అందుకే అతనికి ఒక పేరు వచ్చింది. అష్టవక్ర అష్టావక్ర అంటే ఎనిమిది వంకర్లు ఉన్నవాడు. జనాలు అతన్ని చూసి నవ్వారు రాజులు అతన్ని చూసి తక్కువగా చూశారు అతని శరీరాన్ని చూసి అతని విలువను నిర్ణయించారు. కానీ అష్టావక్ర మాత్రం ఒక్కరోజు కూడా తన శరీరాన్ని సమస్యగా చూడలేదు ఎందుకంటే అతనికి తెలుసు వంగింది శరీరం మాత్రమే మనసు కాదు బలహీనంగా కనిపించింది రూపం మాత్రమే అతని జ్ఞానం కాదు 12 ఏళ్ల వయసులోనే అష్టవక్ర రాజు జనక సభలో అడుగుపెట్టాడు. అక్కడున్న
(00:42) పండితులందరూ అతన్ని చూసి పకపకా నవ్వారు అతని శరీరాన్ని చూసి అతని విలువను తీర్చిదిద్దారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అష్టావక్ర కూడా నవ్వాడు. రాజు జనక ఆశ్చర్యంగా అడిగాడు. నీవు ఎందుకు నవ్వుతున్నావ్. అప్పుడు అష్టావక్ర ప్రశాంతంగా అన్నాడు. ఈ సభలో పండితులు ఉన్నారని అనుకున్నాను. కానీ ఇక్కడ తోలు సరిచేసే వాళ్లే కనిపిస్తున్నారు.
(01:02) ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని మాత్రమే చూశారు. ఆత్మను చూడలేకపోయారు. ఆత్మను చూడగలిగేవాడే నిజమైన పండితుడు అని అష్టావక్ర చెప్పాడు. ఆ రోజు అష్టావక్ర శరీరం కాదు అతని జ్ఞానం సభను జయించింది. అష్టవక్ర చెప్పిన మొదటి సత్యం ఏమిటంటే నీవు శరీరం కాదు మనసు కాదు పేరు కాదు గతం కాదు గాయాలు కాదు నీవు అన్నిటిని చూస్తున్న సాక్షి అంటే ఏమిటి మనమని అనుకుంటున్నది మన అసలు స్వరూపం కాదు మన భావాలు వస్తాయి పోతాయి మన ఆలోచనలు మారిపోతాయి కానీ వాటిని గమనించే నీవు ఎప్పుడూ మారడు ఆ నిజం అర్థమైన రోజు బాధకు పట్టుకున్న కారణం మాయమవుతుంది.
(01:37) ఎందుకంటే బాధ అనేది శరీరానికి మనసుకు మాత్రమే. నీ అసలు స్వరూపానికి కాదు. ఆ రోజు నుంచి నువ్వు బాధను అనుభవించవచ్చు. కానీ బాధగా మారిపోవు. అష్టవక్ర జీవితంలో అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చాయి. తండ్రి అతన్ని శపించాడు. సమాజం అతన్ని వెక్కిరించింది. ప్రపంచం అతన్ని తక్కువగా చూసింది. కానీ అతను ఒక్కసారి కూడా తనను తాను బాధపడిన వాడిగా చూడలేదు.
(01:59) ఎందుకంటే అతనికి ఒక గొప్ప సత్యం తెలుసు. బాధ అనేది అనుభవంలో ఉంటుంది. కానీ నీవు ఆ అనుభవాన్ని చూస్తున్న వాడివి అనుభవం కాదు ఫర్ ఎక్జాంపుల్ నిప్పు కాలుతుంది కానీ వెలుతురు కాలదు అలాగే బాధ వస్తుంది పోతుంది కానీ నీవు ఆ బాధను గమనించే సాక్షివి ముళ్ళు గుచ్చుకుంటే శరీరానికి నొప్పి వస్తుంది కానీ నీవు ఆ నొప్పిని గమనిస్తున్నావు కదా అంటే నీవు నొప్పి కాదు అగ్నిలో బంగారం కరిగినా దాని నాణ్యత తగ్గదు అలాగే ఎంత కష్టం వచ్చినా నీ ఆత్మ ఎప్పుడూ తగ్గదు నీళ్లలో అలలు వస్తాయి పోతాయి కానీ నీళ్లు అలలు కావు అలాగే నీ జీవితంలో సంఘటనలు వస్తాయి పోతాయి కానీ నీవు అంఘటనలు కాదు నీవు వాటిని
(02:41) గమనించేవాడివి మారకుండా ఉండే సాక్షివి అష్టవక్ర పుట్టిన క్షణం నుంచే లోకం అతన్ని రూపం ద్వారా కొలిచింది. అతని శరీరాన్ని చూసి విలువను తక్కువ చేసింది. కానీ కాలం చూపించింది. శరీరం కాదు మాటలే లోకాన్ని మార్చగలవని అష్టావక్ర ఇచ్చిన చివరి సందేశం ఇదే బయట రూపాన్ని బట్టి మనిషిని ఎప్పుడు తీర్పు ఇవ్వకు లోపల ఉన్న వెలుతురును చూడడం నేర్చుకో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ లోపల ఉన్న చైతన్యం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది.
(03:11) అది కాలంతో మారదు పరిస్థితులతో తగ్గదు దాన్ని ఎవరు దోచుకోలేరు. దాన్ని ఎవరు చెడగొట్టలేరు ఎందుకంటే అది నీలో ఉన్నది కాదు అది నీవే. ఓం
No comments:
Post a Comment