ఒకటిన్నర సంవత్సరం తర్వాత సమాధి తీసి చూస్తే?#satyanandiraju #sanatandharma #devotional #ytviral
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LyDi-FGHLI8
Transcript:
(00:00) తాను సమాధి చెందబోతున్నాను అని చెప్పి గజానన్ మహారాజు గారికి ముందే తెలిసిందా తెలిస్తే ఎన్ని సంవత్సరాల ముందు భక్తులతో చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు సమాధి చెందే ముందు రోజు ఏం జరిగింది సమాధి చెందే రోజు చివరి నిమిషాల్లో భక్తులతో స్వామివారు ఏం చెప్పారు సమాధి చెందిన రోజు ఆ రాత్రి ఊరేగింపులో జరిగిన నమ్మశక్యం కానీ అద్భుతమైన సంఘటనలు ఏమిటి ఆలయంలో మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి ఆలయంలో ఎటువంటి దర్శనాలు ఉన్నాయి దర్శనం చేసుకుంటే మనకి మంచి అనుభూతితో కూడినటువంటి తృప్తి వస్తుంది.
(00:45) ఇలాంటి విశేషాలు బోల్డ్ ఉన్నాయి. ఈ సత్సంగానికి నేను సిద్ధంగా ఉన్నాను గజానన్ మహారాజు గారు కూడా మన పక్కనే ఉండి శ్రద్ధగా గమనిస్తున్నారు వారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. హైప్ వల్ల ఏమవుతుంది అంటే వేరే డివోషనల్ వీడియోస్ దగ్గర మన సత్సంగాన్ని YouTube సజెస్ట్ చేస్తుంది.
(01:14) అట్లా మన సత్సంగ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఇంకా బోల్డ్ మంచి మంచి టాపిక్స్ మన సత్సంగానికి వస్తాయి. మేము సిద్ధం మీరు సిద్ధంగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం సత్సంగం చేసుకుని గజాన్ మహారాజు గారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందేద్దాం పదండి ఈ సత్సంగం షేగాం మొదటి సిరీస్ లో ఆఖరి సత్సంగం మొదటి రెండు సత్సంగాల్లో మనం షేగాం ఊరిలో ఏమేమి చూడాలో అవన్నీ కూడా చెప్పుకున్నాం.
(01:45) ఈ సత్సంగంలో నేను ఇందాక చెప్పినట్టు ఆలయ పరిసరాల్లో ఏం చూడాలి అలాగే శీఘం చుట్టుపక్కల కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊరిలో ఎటువంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయో ఒక్కసారి సత్సంగం చేసుకుందాం. ప్రయాణానికి సంబంధించి వసతికి సంబంధించిన అన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మీరు కంగారుపడొద్దు. ఈ సమ్మర్ కి మీ వీరు అద్భుతమైనటువంటి ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా నేను చెప్తా సరేనా మొదటి రెండు సత్సంగాలు ఎవరైనా చూడనివారు ఉంటే ఆ లింక్స్ కూడా ఈ సత్సంగం యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందుతుంది. శ్రీమాత్రే నమః మీ
(02:22) సత్యానంది రాజు అది సెప్టెంబర్ ఎనిమిది 1910 వ సంవత్సరం షేగాం ఉదయం సుమారు 7:30ర 8 గంటల మధ్యలో స్వామి గజానన్ మహారాజ్ తమ దివ్య శరీరాన్ని వదిలేశారు. సమాధిని పొందారు. కానీ సుమారు ఒక రెండు సంవత్సరాలు వెనక్కి వెళదాం. అంటే సెప్టెంబర్ 12 1908వ సంవత్సరం స్వామివారు ఉన్నప్పుడే షేగాం సంస్థానం ప్రారంభమయింది వారి ఆశీర్వాదంతోనే అది కూడా ఎక్కడ అంటే నారాయణ్ కట్టాజి పాటిల్ అనేటువంటి ఒక వ్యాపారి కుట్టులో
(03:10) ఊరి పెద్దలు భక్తులు స్వామి వారి సమక్షంలోనే ఈ షేగాం సంస్థానాన్ని ఏర్పాటు చేశారు వారి ఆశీర్వాదంతో అప్పుడు అప్పుడే చెప్పారు స్వామివారు నేను రెండు సంవత్సరాల తర్వాత సమాధి చెందబోతున్నాను అలాగే సమాధి మందిరం ఎక్కడ వెలుస్తుందో కూడా ముందే చెప్పారు వారికి అంత ముందుగా తెలుసు అన్నమాట ఆ విషయం ఇప్పుడు సమాధి చెందే ముందు రోజుకు వద్దాం ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి 1910 వ సంవత్సరం ఆ ముందు రోజు ఏం చెప్పారంటే పురాణాల ప్రకార కారం వినాయక చవితి మరునాడు స్వామి వారిని అంటే వినాయకుని నిమజ్జనం చేయాలి.
(03:55) అలాగే అది నాకు కూడా వర్తిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను రేపు ఉదయం కానీ ఆ ప్రక్రియను మీరు చాలా ఆనందంగా చేయండి మీరు ఎప్పుడు బాధపడవద్దు నేను శరీరంతో లేకపోయినా కూడా మీ వెన్నంటే ఉంటాను. నేను ఎప్పుడు అక్కడే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ఆ సమాధి నుంచే అని చెప్పి మాట ఇచ్చారు. భక్తులు భోరమని ఏడ్చారు కానీ ఎక్కడో ఆశ ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఈ విషయంలో స్వామి వారి వాక్కు విఫలం అవ్వాలని చెప్పి వారు కోరుకున్నారు అమర్నాడు అంటే భాద్రపద శుక్ల పంచమి కుష పంచమి నాడు నేను ఇందాక చెప్పినట్టు
(04:42) స్వామివారు ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో తమ తమ శ్వాసని కుంభించి జై గజానన అని చెప్పి చిట్టచివరి మాటలు పలికి పద్మాసనంలో కూర్చుని ఆ ప్రాణశక్తిని సహస్రారం దగ్గర పెట్టుకున్నారు. నిస్తేజులు అయిపోయారు ఊరంతా పాకిపోయింది ఆ వార్త పిల్ల పెద్దలు ముసలి ముతక ఆడవారు మగవారు ఒకళ్ళు కాదు అందరూ వచ్చి భూర్మ ఏడ్చారు. దాదాపు 32 సంవత్సరాలు తమను తల్లి లాగా సాకినటువంటి గజానన్ మహారాజు లేరు అనగానే శీగం నిస్తేజం అయిపోయింది.
(05:28) ఒక స్మశానంగా మారిపోయింది. అనకూడదేమో ఆ మాట కానీ నిజం అది. అంతలా వెన్నంటే ఉండి కంటి పాపలా కాపాడారు గజానన్ మహారాజ్ దాని తర్వాత ముఖ్యమైన భక్తులు ఊరిలో పెద్దలందరూ వచ్చారు గోవింద శాస్త్రి అని ఒక పండితుడు వచ్చాడు వచ్చి స్వామి వారిని చూసి చెప్పాడు స్వామి వారి యొక్క ప్రాణశక్తి ఇంకా సహస్రారం దగ్గరే ఉంది యోగులకి చాలా సాధ్యం అది కావాలంటే తలపెట్టి చూడండి ఇప్పటికీ కూడా వారి శిరస్సు వేడి వేడిగా ఉంది మీకు రుజువు కావాలంటే కొంచెం వెన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పి ఆ వెన్న పెడితే అది వెంటనే కరిగిపోయాయి భక్తులు ఆశ్చర్యపోయారు.
(06:13) ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఇది చాలా తేలిక పెద్ద పెద్ద యోగులకి మహాయోగులకి దరిదాపు అట్లా వారు ఒక సంవత్సరం పాటు ఉండగలరు కానీ మనం ఆలస్యం చేయకూడదు. ఇంకా కొంతమంది దర్శనం కోసం ఆరాటపడుతూ షేగాం వస్తూ ఉంటారు. వారికోసం ఇవాల్టి వరకు వేచి చూసి రేపు సమాధి చేద్దాం అని చెప్పి వారు నిశ్చయించుకున్నారు. అట్లా ఆ రోజు దరిదాపు 72 భజన బృందాలు వచ్చి భజనంలో సంకీర్తనలు చేశారు.
(06:45) కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు షేగా అదే సమయంలో స్వామివారు చాలామందికి స్వప్నంలో కనబడి ఈ వార్తను చేరవేశారు స్వామి వారిని ఒక రథంలో కూర్చోపెట్టి ఊరేగింపు చేస్తున్నారు రహదారులన్నీ కూడా ముగ్గులతో నింపేశారు దీపాలతో అలంకరించారు సరే ఊరేగింపు జరుగుతోంది స్వామి వారిది రథం మీద బాపునా కాలే అనే భక్తుడి ఇంటి మీద నుంచి ఆ యాత్ర జరుగుతుండగా ఒక అద్భుతం జరిగింది.
(07:12) ఆ ఇంటిలో నుంచి ఆ వ్యక్తి భార్యతో పాటు బిడ్డ నామదేవుని తీసుకువచ్చి బయటికి వచ్చాడు. వచ్చి స్వామి వారి పాదాల దగ్గర పెట్టాడు బిడ్డ నామదేవుని అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి స్వామివారు ఇలా కళ్ళు తెరిచి నామదేవం చూసి ఆ కంటి చూపుతోనే ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు మూసుకు నేను అందుకే చెప్తాను గజానందన్ మహారాజ్ కేవలం ఒక యోగి కాదు ఆయన పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క అవతారం ఆ రథయాత్ర ఇంకా ముందుకు సాగడం మొదలయింది.
(07:46) పుండలిక్ బాబా భాకరే అనేటువంటి ఇంకో భక్తుడి ఇంటి దగ్గరికి వచ్చింది ఆ రథం ఆ భక్తుడు గుండెల పాదుకున్నాడు స్వామి నాకు ఇంకొక్కసారి మీ చివరి దర్శనం నాకు కావాలి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే మళ్ళీ స్వామి వారు ఒక్కసారి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఇప్పుడు చెప్పండి స్వామివారు కేవలం ఒక యోగేనా కేవలం ఒక అవధూతేనా కానే కాదు అసలు వారి చరిత్ర మీరు పూర్తిగా చదివితే మీకే అర్థమైపోతుంది.
(08:21) ఆ రాత్రి ఆ రథం మీద ఊరేగింపు పూర్తయపోయిన తర్వాత మర్నాడు స్వామి వారిని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ సమాధి మందిరంలోనే ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి పద్మాసనంలోనే స్వామి వారిని సమాధి చేశారు. జై గజానన జై గజానన అని చెప్పి దిక్కులు పిక్కుటెల్లేలాగా నామస్మరణ చేశారు. సమాధి చెందిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత హరిపాటి తట్టుకోలేక పోయాడు స్వామివారి యొక్క ఎడబాటుని ఆ సమాధి పలకను తొలగించి చూశాడు సమాధి చెందిన రోజు స్వామివారు ఎంత తాజాగా ఉన్నారో అలానే దర్శనం ఇచ్చారు మళ్ళీ హరిపాటిలకి అప్పుడు అర్థమయింది.
(09:05) స్వామివారు ఎక్కడికి వెళ్ళలేదు వారు మాట ఇచ్చినట్టు ఇక్కడే ఉన్నారు అని చెప్పి తప్పు చెప్పుకుని ఆ సమాధి పలకను మూసివేశాడు ఆలయంలో మనకి మూడు రకాల దర్శనాలు ఉంటాయి ఒకటి శ్రీముఖ దర్శనం అంటే తొందరగా అయిపోయేటటువంటి లఘు దర్శనం లాంటిది అంటే కొంచెం దూరం నుంచి స్వామి వారి యొక్క దర్శనం అయిపోతుంది కానీ మనం దగ్గరగా వెళ్ళలేము.
(09:30) రెండోది సమాధి దర్శనం కొంచెం టైం తీసుకున్న కూడా మనం కొంత క్యూ లో నడిచి దాని తర్వాత ఒక భూగృహంలోకి వెళితే అక్కడ స్వామి వారి యొక్క సమాధి వారి యొక్క దివ్య మంగళమైనటువంటి విగ్రహాన్ని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు మనం ఏదైనా స్వామి వారికి తాకిచ్చి మనం తీసుకోవాలి ప్రసాదంగా అంటే కూడా ఈ దర్శనంతోనే మనకి సాధ్యమవుతుంది అలాగే మూడవ దర్శనం ఏమిటంటే జరోకా దర్శన్ అంటే మరాఠీలో చిన్న కిటికీ అని అర్ధం జరోకా అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బయటికి ఈ గోపురం దగ్గర చిన్న ఒక స్క్వేర్ షేప్ లో చిన్న కిటికీలా ఉంటుంది.
(10:07) దాంట్లో నుంచి చూస్తే స్వామి వారి యొక్క సమాధి మనకి దర్శనం అవుతుంది. ఇది గోపురానికి రెండు వైపులా ఉంటుంది ఎప్పుడైనా మనం ప్రదక్షణలు చేస్తున్నప్పుడు స్వామి వారిని ఒక్కసారి చూసుకోవాలి అని కోరిక పుడితే దీని ద్వారా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలయంలో ఎటువంటి పవిత్రమైనటువంటి ముఖ్యమైన స్థలాలు ఉన్నాయో వాటిని ఎలా దర్శనం చేసుకోవాలో చూద్దాం ఈ ఆలయంలోనే మీకు ఒక మెడిటేషన్ హాల్ ఉంటుంది.
(10:34) దానికి ఆపోజిట్ గా రెండు చిన్న మందిరాలు కనపడతాయి మీకు ఇట్లా ఒకటి సమాధిగ్రహణ స్థల్ రెండు విశ్రాంతి స్థల్ ఈ సమాధిగ్రహణ స్థల్ ఏమిటి అంటే నేను ఇందాక చెప్పాను చూసారా స్వామివారు పద్మాసనంలో కూర్చుని వాయువుని స్తంభింపజేసి ప్రాణశక్తిని సహస్రారం దగ్గర పెట్టి వారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పాను కదా అది జరిగింది ఈ సమాధిగ్రహణ స్థలంలోనే అక్కడ మీకు పాండురంగ స్వామి రుక్మిణి బాయి యొక్క అద్భుతమైన దివ్య మంగళ స్వరూపాలు కనబడతాయి.
(11:10) తప్పకుండా మీరు ఈ సమాధి గ్రహణ స్థలాన్ని ఆ విశ్రాంతి స్థలాన్ని కూడా దర్శించుకోండి. ఈ విశ్రాంతి స్థలం ఏమిటి అంటే స్వామి వారు అక్కడ ఒక పరుపు మీద ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేటువంటి స్థలం. అక్కడ స్వామి వారి యొక్క పాదుకలను కూడా మీరు చూడవచ్చు. మీరు తప్పకుండా ఏం చేయాలి అంటే మీరు ఈ దర్శనం చేసేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ సమాధి గ్రహణ స్థలాల్ విశ్రాంతి స్థలం తప్పకుండా దర్శనం చేసుకొని అక్కడ కాసేపు మాత్రం ధ్యానం చేసుకోండి అక్కడ నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని నేను మీకు చివర్లో తప్పకుండా చెప్పి తీరుతాను సమాధి మందిర దర్శనం చేసుకొని బయటికి రాగానే కుడి
(11:47) వైపున ఇదిగో ఇలా శ్రీరాములవారి మందిరం కనబడుతుంది. దీని ఎదురుగానే సభామండపం అని చెప్పి ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఈ మందిరంలోనే నిత్యం గజానన్ మహారాజ్ గారు వాడినటువంటి పాదుకలు ఉంటాయి. ఈ సభామండపం హాల్ చుట్టూరా కూడా స్వామి వారి యొక్క జవి చరిత్ర పెయింటింగ్స్ గా వేసి ఉంటాయి తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొదట్లో ఆలయం ఇలా ఉండేది.
(12:16) 100 సంవత్సరాల తర్వాత అంటే వారు సమాధి చెందింది 1910 కదా అంటే సుమారు 2010 వ సంవత్సరం నుంచి ఈ ఆలయాన్ని బాగా రినోవేట్ చేసి ప్రస్తుతం దీని యొక్క రూపరేఖలు ఇలా ఉన్నాయి అలాగే ఈ సత్సంగంలో మీకు కొన్ని నేను రేర్ ఫొటోస్ చూపిస్తాను అవి స్వామి వారికి సంబంధించినవి స్వామివారి భక్తులకు సంబంధించినవి స్వామి వారి యొక్క లీలకు సంబంధించినవి కూడా కాబట్టి అవి అస్సలు మిస్ అవ్వద్దు సరే మీరు ఇప్పుడు స్వామి వారి యొక్క దర్శనం చేసే ేసుకున్నారు బయటికి వచ్చారు కొన్ని ప్రదక్షణలు చేసేసుకున్నారు ఆ మెడిటేషన్ హాల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి సమాధి గ్రహణ స్థలం చూసేసారు ఆ విశ్రాంతి స్థలం
(12:54) చూసేసారు బయటకి వచ్చేశరు. ఇలా ఈ పెద్ద ఆర్చి నుంచి బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వైపు వెళితే మీకు మొట్టమొదటగా కనిపించేది నాగదేవత మందిరం ఇక్కడ స్వామి వారు చాలా సార్లు కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు కాబట్టి ఇక్కడ మీరు దర్శనం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం చాలామంది ఏంటంటే ఆ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు కానీ పెద్దగా దర్శనం చేసుకోరు [సంగీతం]
(13:52) [సంగీతం] [సంగీతం] మీరు అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా అక్కడ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్లి మీరు రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే అక్కడ ఇద్దరు భక్తుల యొక్క దివ్య సమాధులు మీకు దర్శనం ఇస్తాయి ఒకళ్ళు బాలబాబు మహారాజ్ ఇంకొకళ్ళు నారాయణ మహారాజ్ వీరు స్వామి వారికి అత్యంత ప్రియ భక్తులు శిష్యులు కాబట్టి ఇక్కడ కూడా వారి దర్శనం చేసుకుని మీరు బయటికి రండి మీరు అనుకోవచ్చు ఎందుకండీ భక్తుల యొక్క సమాధులు దర్శనం చేసుకోవచ్చు అంటే వారు ఏ సాధన చేసి
(14:38) ఏ స్థాయికి వెళ్లారో వారి ఆశీర్వచనాలు మనకు ఎలా ఫలిస్తాయో ఎవరికీ తెలుసు కాబట్టి తప్పకుండా వారి దివ్య సమాధులను దర్శనం చేసుకుని బయటకి వచ్చి కొంచెం ముందుకు వెళితే అక్కడ మీకు ఔదంబర వృక్షం కనబడుతుంది. అక్కడ ఆ వృక్షం కింద స్వామి వారు కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు అది స్వామి వారి కాలం నాటిది కాబట్టి తప్పకుండా ఆ ఔదంబర వృక్షానికి మీరు ప్రదక్షిణలు చేయండి.
(15:04) అక్కడ ప్రదక్షిణలు చేసే వెసులుబాటు ఉంది ఆ పక్కనే దక్షిణముఖ హనుమాన్ ఉంటారు దక్షిణముఖ హనుమాన్ అంటే అపమృత్య భయాన్ని తొలగిస్తారు దీర్ఘకాలిక వ్యాధులను తొలగిస్తారు కాబట్టి ఆ హనుమాన్ కూడా చక్కగా ప్రదక్షిణలు చేసుకొని బయటికి రండి సరే ఇప్పుడు నా అనుభవం దగ్గరికి వస్తే ఈ సమాధి గ్రహణ స్థలం ఎదురుగా చాలామంది కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది పారాయణ చేసుకుంటూ ఉంటారు.
(15:30) సరే నేను వారి యొక్క పారాయణ గ్రంథాన్ని అప్పుడే కొన్నాను నా భార్య చదువుతోంది నేను ధ్యానం చేసుకుంటున్నాను. చేసుకుంటూ ఉంటే నాకు ఎందుకో స్వామి వారితో సంభాషణ జరుగుతోంది అనే ఒక అనుభవం కలుగుతోంది ఎందుకంటే అంతకుముందు సత్సంగాల్లో చెప్పాను గుర్తుందా నా చిన్నప్పుడు స్వామి వారు కనిపించి రా బిడ్డ రా అని నన్ను పిలిచారు అని చెప్పాను కదా అలా సత్సంగం జరుగుతోంది స్వామి నన్ను ఎప్పుడో చిన్నప్పుడు పిలిచావు ఇప్పుడు తీసుకొచ్చావా ఇప్పుడు దర్శనం చేయిస్తున్నావా అని ఇలా జరుగుతూ ఉంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది మెదడులో ఇదంతా నిజమేనా లేకపోతే నాకు బ్రమే
(16:06) కలుగుతుందా అని అప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను స్వామి వారిని స్వామి ఎప్పుడు జరుగుతున్నటువంటి అనుభవం సత్యమైతే నాకు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి నిరూపణ చెయ్యి అని చెప్పి నేను కోరుకున్నా అప్పుడు స్వామి వారు నాతో ఏం చెప్పారు అంటే ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా సత్యం అయితే నీ ప్రయత్నం లేకుండా నీ చేతిలో పుష్పాలు వస్తాయి అని చెప్పి చెప్పారు.
(16:37) సరే అది నేను ఇంకా అదొక ట్రాన్స్ లో ఉన్నాను సరే ధ్యానం చేసుకొని బయటకు వచ్చేసాను దాని తర్వాత ఈ పారాయణ గ్రంథాన్ని స్వామివారి దగ్గర ఉంచుదాం అని చెప్పి ఆ విశ్రాంతి స్థలం అక్కడ స్వామివారి పరుపు నూనెను వారు వాడిన పాదుకలో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ అర్చకుడిని అడిగాను ఈ పారాయణ గ్రంధం స్వామివారి దగ్గర పెట్టి ఇవ్మని కాదు కాదు నేను కాదు వేరే వాళ్ళు అని చెప్పి వెనక్కి చూపిస్తున్నాడు సరే వెనక్కి చూపిస్తే ఎక్కడి నుంచి వచ్చారో వేరే అర్చకులు వచ్చారు వచ్చి టివ్ అని చెప్పి తీసుకొని ఆయనే లోపలికి వెళ్లి స్వామి వారి ఆ వాడినటువంటి ఆ పరుపుకి ఆ
(17:16) పాదుకలకి ఆ చిత్రపటానికి తగిలిచ్చి అక్కడ కొంచెం ప్రసాదం పూలు నా చేతిలో పెట్టి ఆ పారాయణ గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించా నాకు అప్పటికీ కూడా వెలగల నా మైండ్ లో కాసేపు ఆగి ఆగిన తర్వాత స్వామివారు ధ్యానంలో చెప్పింది దాని తర్వాత జరిగింది గుర్తుకు వచ్చి అప్పుడు అనిపించింది. స్వామివారు ఇందాక ధ్యానంలో చెప్పారు కదా నీ ప్రయత్నం లేకుండా నీ చేతిలో పువ్వులు వస్తాయి అని చెప్పి అదే ఇప్పుడు జరిగింది అంటే ధ్యానంలో జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా సత్యం అని చెప్పి స్వామి నిరూపించారు. అందుకే స్వామి వారు చివరి
(18:02) క్షణాల్లో అభయం ఇచ్చారు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను నన్ను నమ్ముకున్న భక్తుల్ని కంటికి రెప్పల కాపాడుకుంటూ ఉంటాను అని చెప్పింది అక్షర సత్యం లేకపోతే ధ్యానంలో నాకు జరిగిన సంభాషణ ఏమిటి అదే అక్కడ వాస్తవికంగా జరగడం ఏమిటి? ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో కూడా ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే అది ఎవరి భక్తిని ఎలా పెంచుతాయో ఎటువంటి అద్భుత ఫలితాలని వారికి ఇస్తాయో దానివల్ల పుణ్యం మీకు ఎలా కలుగుతుందో ఎవడో తెలుసు కాబట్టి తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి మీకు జరిగిన అనుభవాలు నేను ఇందాక చెప్పాను కదా కొన్ని రేర్ ఫొటోస్ చూపిస్తానని ఇప్పుడు
(18:39) అవన్నీ కూడా ప్లే చేస్తాను ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు మీరు కామెంట్స్ లో ఏ ఫోటో మీకు బాగా నచ్చిందో ఏ లీల బాగా నచ్చిందో అది కామెంట్స్ లో పెట్టండి సరేనా పదండి వెళ్లి చూసేద్దాం అన్ని అన్ని ఫొటోస్ ని [సంగీతం]
(20:27) వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు వీలుంటే హైదరాబాద్ నుంచి షేగాం షేగాం నుంచి ఆ లడకారంజ లడకారంజా నుంచి మాహూర్గడ్ మాహూర్గ నుంచి హైదరాబాద్ ఈ ట్రిప్ ని ప్లాన్ చేసుకోండి ఈ ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా అన్ని వివరాలు డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక టూరు అలాగే పిల్లలకు కూడా చాలా సరదాగా గా ఉంటుంది వేసం కాలం కాబట్టి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.
(20:58) ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ గజానన్ మహారాజు గారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసిప మందికి షేర్ చేయడమే కాదు హైట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరేనా మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మనందరం మళ్ళీ కలుద్దాం.
(21:20) నాకు తెలిసి వచ్చే సత్సంగం తప్పకుండా నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క జన్మస్థానం లడకారంజ గురించే ఉంటుంది. చాలామంది స్వామివారు పుట్టిన ఇల్లు అలాగే ఆలయాన్ని చూసి వెళ్ళిపోతారు కానీ ఇంకా అక్కడ కొన్ని చూడవలసినటువంటి గుప్తమైన స్థలాలు ఉన్నాయి అవి ఏమిటో మనం వచ్చే సత్సంగంలో తప్పకుండా చూద్దాం. ఎంతమంది ఆ సత్సంగం కోసం వేచి చూస్తున్నారో కూడా కామెంట్స్ లో పెట్టండి. సరేనా.
(21:44) శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజ్.
No comments:
Post a Comment