పెళ్లి తర్వాత విడాకులకు కారణం ఇదే The real reason for divources
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i4fkrTrZWf0
Transcript:
(00:01) హిందూ వివాహ వ్యవస్థలో ఏ ఇంట్లో అయితే తండ్రి మాట చల్లదో తల్లి పెత్తనమే నడుస్తుందో ఆ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారితో తరుచు గొడవలు పడుతూ అలాగే భర్తతో కూడాను గొడవలు పెట్టుకుంటూ చివరికి విడాకులు తీసుకొని పుట్టింటికి వచ్చి కూర్చుంటుందండి. ఇది నేను ఒక సైకాలజిస్ట్ మాట్లాడుతుంటే నేను విన్నాను అన్నమాట విషయాన్ని ఏంటి ఇంత డైరెక్ట్ గా చెప్పేసాడు అని అనుకున్నాను ఒకటికి రెండు సార్లు విన్నాను అన్నమాట విన్న తర్వాత దీని మీద ఎందుకు రీసెర్చ్ చేయకూడదు అని అనిపించింది.
(00:43) సరే కొంతేదో పరిశ్రమ చేశను అనుకోండి [గొంతు సవరించుకోవడం] ఆ విషయాన్ని మీతో పంచుకోవడమే ఈ వీడియోలోని విషయం అన్నమాట. ఇప్పుడండి తల్లి పెత్తనం నడిచే ఇంట్లో తల్లి ఎప్పుడు కూడాను పవర్ మోడల్ గా అయితుందన్నమాట అదే తల్లి తన భర్తని గౌరవిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూ అత్తమామలని కూడా నువ్వు చక్కగా చూసుకుంటూ ఉంటే మటుకు ఆ తల్లి రోల్ మోడల్ అయితుందండి ఇప్పుడు తల్లి గాని తండ్రి గాని పిల్లలకు రోల్ మోడల్స్ే కావాలి.
(01:12) ఈ తండ్రి మాట చల్లని ఇంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఏంటంటే నా మాట నెక్కాలి అనుకుంటూ దాన్ని వారసత్వ సంపదగా మేటిని ఇంటికి తీసుకెళ్ళిపోతారండి. ఇక్కడ ప్రమాదం ఇంటికి వెళ్లి మొగుతున్నాయి. ముఖ్యంగా తల్లి మాటే చెల్లుబాటుగా ఉండే ఇంట్లో ఆడపిల్లలకి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే దుష్పరిణామమే ఒకటండి ఇంట్లో తతంగానికి పిల్లలు ఎప్పుడూ ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఖాళీగా ఉన్న మెదడు అనే వాళ్ళ కప్పుల్లో ఈ భావజాలన్నీ నింపుకుంటూ ఉంటారు అందువల్లన ఈ వాతావరణంలో పెరిగిన ఆడపిల్ల
(01:57) ఏం నేర్చుకుంటుంది అంటే [గొంతు సవరించుకోవడం] పురుషుని డామినేట్ చేయాలి అడ్డువచ్చిన అత్తగారిని ఖండించాలి అవసరమైతే ఎదిరించాలి నా మాటే ఫైనల్ కావాలి ఎవరైనా నా మాటకు ఎదురు చెప్తే నేను తట్టుకోలేను అంటే ఈ భావాలన్నీ తెలియకుండా మైండ్లో రిజిస్టర్ అయిపోతాయండి సైకాలజీలో అటాచ్మెంట్ థియరీ అని ఒకటి ఉంది. అదేంటంటే అందరి నుంచి ఎక్కువ అటాచ్మెంట్ ని ఆశించడం ఎదుటివారు తనకు తగ్గట్టుగా నడుచుకోవాలి ఉండాలి అని అనుకోవడం అలాగే చిన్న విషయాలకి ఎమోషనల్ గా రియాక్ట్ కావడం జరుగుతూ
(02:43) ఉంటుందండి. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఆడపిల్లల్లో ఇందాక నేను చెప్పినట్టుగా తల్లి పెత్తనమే కొనసాగుతూ ఇంట్లో తండ్రి మాటకి వీలు ఉండదు అప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఈ భావజాలంతో మెట్టిన ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు పెళ్లిఅయిన తర్వాత నా నాన్న నా అమ్మ మాట ఎలా విన్నాడో నా భర్త కూడాను నా మాట అలాగే వినాలి అని చెప్పేసి అమ్మాయి ఒక రిజల్ట్ మైండ్ తో ఉండిపోతుందండి అలా గనక జరగకపోతే అది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ కిందకి దారి తీసి దారి తీసి గొడవలు అయిపోతూ ఉంటాయి. చివరికి అది విడాకులకు కూడా దారి
(03:26) తీస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా కుటుంబాల్లో జరుగుతున్నది ఇదే అన్నమాట ఇందాక నేను రోల్ మోడల్ అనే పదాన్ని ఉపయోగించాను కదా ఆ విషయం గురించి కొంచెం మాట్లాడుకుందాంఅండి పిల్లలు ఎప్పుడూ కూడాను చెప్పిన దాని కంటే చూసిన దాని నుంచే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారండి ఓ తండ్రి ఇప్పుడు రివర్స్ గా ఆలోచిద్దాం ఓ తండ్రి తల్లిని తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ డామినేట్ చేస్తున్నాడు అనుకుందాంండి ఆ పిల్లవాడు కూడాను రేపు పెళ్లి అయితే తన భార్యని డామినేట్ చేయవచ్చు చేయకపోవచ్చు తల్లి పడిన బాధని పదే పదే గుర్తుకు
(04:11) తెచ్చుకుంటూ తన భార్య అటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు అని ప్రేమగా ఉండే ప్రయత్నం చేయొచ్చండి కానీ ఈ అమ్మాయి అంటే ఈ భార్య అనే అమ్మాయి ఇంతకుముందు చెప్పిన ఇంట్లో పెరిగింది అనుకోండి అంటే తల్లి పెత్తనానికి సాక్షిగా పెరిగింది అనుకోండి అప్పుడు తన తల్లి డామినేషన్ ని పెత్తనాన్ని భర్త మీద అలాగే అత్తగారి మీద చూపించి సంసారాన్ని నాశనం చేసుకోవచ్చు నాశనం చేసుకో కోవచ్చు అంటే ఇక్కడ [గొంతు సవరించుకోవడం] ఒక విషయం మనం గమనించాలండి ఇక్కడ గౌరవం వేరు కంట్రోల్ ఆర్ డామినేషన్ వేరండి కంట్రోల్ అంటే నియంత్రణ డామినేషన్ అంటే పెత్తనం అన్నమాట
(04:57) ప్రతి చిన్న విషయాన్ని భార్యా భర్తలు అంటే తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు అనుకోండి అప్పుడు పిల్లలకి జడ్జిమెంటల్ మైండ్ వస్తుంది లేకపోతే ఒక విధంగా బ్యాలెన్స్డ్ థింకింగ్ వస్తుంది అవసరమైతే కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలా ఈ పిల్లలు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత తొందర పడకుండా ఏదనా సమస్య వచ్చినప్పుడు హాయిగా కూర్చొని భర్తతో అవసరమైతే అప్మాలతో చర్చించి ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్న కొన్ని సొల్యూషన్ ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడు ఆ ఇల్లు చాలా బాగుంటుందండి అంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అంశం అన్నమాట చాలా మంది ఇళ్లల్లో ప్రస్తుతం జరగట్లేదు
(05:42) అన్నమాట అంటే ప్రతి విషయానికి కూడాను నేను ఆధ్యాత్మికత కొంత జోడిస్తాను కాబట్టి [గొంతు సవరించుకోవడం] ఈ ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి కూడాను కుటుంబ వాతావరణాన్ని కాసేపు చూద్దాంండి అంటే ఇక్కడ సంబంధం పోటీ కాదండి అంటే దాంపత్యం పోటి కాదు అదిఒక యజ్ఞం అన్నమాట భార్య భర్త ఎవరు గెలుస్తారు అనే పోటి కాదు ఎవరు అర్థం చేసుకుంటారు అన్నదే ప్రయాణం అన్నమాట.
(06:20) వాళ్ళద్దరి మధ్య వీలైనంత వరకు అర్థవంతమైన వాతావరణం ఉండాలన్నమాట. లేదనుకోండి ఆటోమేటిక్ గా ఈగో వచ్చేస్తుంది. ఈగో ఎక్కువైతే సంబంధం నిలబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను ప్రస్తుత వాతావరణంలో పరుగులో ఉంటూ అలసిపోయి ఇంటికి వచ్చి ఒక కుక్కన ఏదో పెట్టుకొని వండించుకుంటూ అప్పుడప్పుడు బయట నుంచి తెప్పించుకుంటూ ఉన్నారనుకోండి అంటే అలా సంసారాన్ని నడిపిస్తున్నారు అనుకోండి అప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూసి ఏం నేర్చుకుంటారు వాళ్ళకి ఏ విధమైన ఎడ్యుకేషన్ అందుతుంది ఏమీ అందదు.
(06:59) అప్పుడు వాళ్ళు పొందే ఎడ్యుకేషన్ ఏదైనా ఉంది అంటే అది మీడియా ప్రభావం అండి లేకపోతే సమాజం యొక్క ప్రభావం అన్నమాట అంతే ఈ రెండు కలిసి ఈ పిల్లల్లో ఒక పాటర్న్ ని సృష్టిస్తాయి రేపు అదే పాటర్న్ వాళ్ళ జీవితం అయిపోతుంది అన్నమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత బాగుంది కిరణ్ గారు వివరాలు బాగానే చెప్తున్నారు కానీ పరిష్కారం కూడా చెప్తే బాగుంటుంది కదా అని మీరు అనొచ్చు అసలు పరిష్కారం అని చెప్పకుండా నేను వీడియో ఎప్పుడు కూడాను పూర్తి చేయనండి.
(07:32) సో దీనికి పరిష్కారం ఏంటి పెళ్లికి ముందు ఇటు తల్లిదండ్రులు గాన అటు తల్లిదండ్రులు గాని అసలు కుటుంబ పాటర్న్ అర్థం చేసుకోవాలండి. పూజ పునస్కారం ఉందా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారా తల్లిదండ్రుల మధ్య సామరస్యం పాలు ఎంత ఉంది వాళ్ళద్దరూ తరచు గొడవలు పడుతూ ఉంటారా? తల్లి డామినేషన్ ఉందా? అసలు ఖర్చు ఎలా పెడతారు వేస్టేజ్ ఏమన్నా ఉంటుందా ఇల్లు కిచెన్ ఎంత నీట్ గా ఉంటున్నాయి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి కొంచెం బాత్్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి కొంచెం ఆ బెడ్రూము ఆ కిచెన్ అది చూసి రావాలండి
(08:15) ఆడవాళ్ళయినా సరే మగవాళ్ళయినా కూడా అసలు ఇంట్లో ఎంత పెద్ద లైబ్రరీ ఉంది. ఈ సమాజంలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఉంటారు చాలామంది అటువంటప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళకి ఏదనా కొంచెం గౌరవం ఉందా లేదా సో ఇట్లా ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ గనుక పాజిటివ్ గా ఉంటే కనీసం 70 80% పాజిటివ్ గా ఉంటే అప్పుడు పిల్లలకు పెళ్ళళ్లు అయ్యాయి అనుకోండి నేను గెలవాలని కాదండి మనం గెలవాలి అన్న ఆలోచనతో వాళ్ళు వైవాహిక జీవితంలో గడుగుపెడతారు దీన్నే వినివెన్ సిచువేషన్ అంటారు.
(08:54) ఇప్పుడు కొంపలు ఉండవండి అద్భుతమైన [గొంతు సవరించుకోవడం] కుటుంబాలు ఉంటాయి. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అండి చిన్న విషయం చెప్పి ముగిస్తాను. తండ్రి బయట ప్రపంచానికి అర్థం పడుతూ ప్రమిద కావాలి. తల్లి అందరికీ ప్రేమని పంచే నూనె కావాలి. వాళ్ళద్దరి విన్ విన్ ఆటిట్యూడ్ తో పిల్లలు ఒత్తులై వెలగాలండి. ఈ నూనె గాని ప్రమిద గాని వాటి వాటి స్థానాలు గనుక మార్చుకుంటే [గొంతు సవరించుకోవడం] ఈ పిల్లలనే ఒత్తులు కుడిగడతాయండి.
(09:34) చివరికి నైరాస్యము నిస్పృహ చీకటి వెరసి విడాకులు తల కుటుంబాల్లో ఇదే జరుగుతున్నదండి పిల్లలేదో ఆకర్షణ అనే వేడిలో పడి దాన్నే ప్రేమ అనుకొని తల్లిదండ్రులని కాదని పెళ్లిళ్లు చేసుకుంటూ చివరికి ఓ సంవత్సరం లోపో రెండు సంవత్సరాల లోపో విడాకులు తీసేసుకుంటున్నారు లోపల పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళ జీవితం నరక ప్రాయం అయిపోతుంది పిల్లల మధ్యలో నరిగిపోతున్నారు ఇప్పుడు జరుగుతున్నది అదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు కూడాను తల్లిదండ్రుల అనుభవాలని గమనించి గౌరవించి వాళ్ళతో చర్చించి ఆ ప్రేమించిన అబ్బాయిని ఇంటికి పిలిపించి
(10:23) అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ అది జరుగుతుందా [గొంతు సవరించుకోవడం] చెప్పలేమండి ఈ వీడియో విన్న తర్వాత పెద్దలు గాని పిల్లలు గాన సకారాత్మకంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇంతేనండి వీడియోలని సంగతి ఇది గొప్ప సామాజిక సమస్య కదా వివాహ వ్యవస్థని ధ్వంసం చేస్తున్నది కాబట్టి నా సవినయమైన విన్నపం మీ అందరికీ ఏంటంటే దీన్ని వీలైనంత ఎక్కువ మందికి చేర్తీయండి.
(10:52) కొన్ని కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుందండి. సో ఇదండి వీడియోలోని సంగతి నమస్కారం.
No comments:
Post a Comment