Saturday, April 11, 2026

వాళ్ళని తిట్టినందువల్ల ఏమిటి ఉపయోగం#srichaganti #personalitydevelopment #motivational #ethics

వాళ్ళని తిట్టినందువల్ల ఏమిటి ఉపయోగం#srichaganti #personalitydevelopment #motivational #ethics

Author Name:Sri Chaganti Vaani

Youtube Channel Url:https://www.youtube.com/@srichagantivaani

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B3DoXu9pCn4



Transcript:
(00:00) అవతల వ్యక్తి దుర్జనుడు అయితే అంటే చెడ్డవాడైనా కూడా నువ్వు తిట్టకు ఎందుకు తిట్టద్దని చెప్తున్నారు అంటే లోకంలో కేవలము దుర్జనుడు కేవలము సజ్జనుడు అని ఉండే అవకాశం ఉండదు ఒక రోజు అంటే 12 గంటలు చీకటి ఉంటుంది 12 గంటలు పగలు ఉంటుంది. ఒక వ్యక్తి అంటే ఎంతో కొంత చెడు ఉంటుంది ఎంతో కొంత మంచి ఉంటుంది. అంతా మంచే ఉంటుందని చెప్పడం కష్టం అంతా చెడే ఉంటుందని చెప్పడం కష్టం మనం చూడడంలో ఉంటుంది.
(00:40) మీరు చూడండి కొంత కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరిని నింద చేయరు. మీరు ఎవరి గురించి ప్రస్తావించండి ముందు వాళ్ళలో ఉన్న మంచి గురించి మాట్లాడతారు. తప్ప అసలు చెడు గురించి మాట్లాడరు. అసలు చెడు గురించి మాట్లాడడం అన్నది అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఎవరి పేరెత్తినా వాళ్ళలో ఉన్న చెడు ముందు జ్ఞాపకానికి తెచ్చుకోవడం ఆ చెడుని చూడడం చెడు గురించి మాట్లాడడం అవతల వాళ్ళని చెడ్డవాళ్ళం అలవాటు అయిపోతుంది.
(01:13) ఇట్లా అలవాటు అయిపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందిఅంటే మనం ఒక్కళ్ళమే మంచివాళ్ళం అన్న భావన పెంచుకోవడం ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళఅన్న భావన పెంచుకోవడం అలవాట అయిపోతుంది. దాని వలన ఇతరులను నిందిస్తూ ఉండడం మనని మనం పొగుడుకుంటూ ఉండడం అదిఒక దురలవాటుగా మారుతుంది. అందుకని ఒకవేళ నిజంగా అవతల వ్యక్తి చెడ్డవాడయనప్పటికీ కూడా నువ్వు నింద చేయవద్దు అవతల వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు తిట్టకూడదు.
(01:47) ఎందుకని అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే నువ్వు నిజంగా అవతలవారు చెడ్డవారైతే నువ్వు నిందించడం వలన ప్రయోజనం తిట్టడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అంతకన్నా నువ్వు ఒక పని చెయ్ వాళ్ళకి మంచి మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నం చెయ్ వాళ్ళు మనం చెప్పినా వినరేమో అని నీకు అనుమానం ఉంటే వాళ్ళు మారా అని మనసులో ప్రార్థన చేసుకో దానికి కష్టం ఏం లేదుగా అసలు వాళ్ళ దగ్గర ఉండడం సాధ్యం కాదు అంత చెడు ఉందని అనిపించింది అనుకో దూరంగా వెళ్ళిపో అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండు అంతేకానీ
(02:33) నువ్వు చెడ్డవాళ్ళని గుర్తు తెచ్చుకోవడం చెడ్డవాళ్ళతో ఉండడం అవతల వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని తిట్టడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా అది ఒక అంటు వ్యాధి లాగా లోపల పెరిగిపోయి కనబడ్డ ప్రతి వాళ్ళలోనూ చెడు చెడు చూడడం ఆ చెడ్డవాడన్న పేరుతో అవతల వారిని తిట్టడం అలవాటఅవుతుంది

No comments:

Post a Comment