🔔 *సామాజికం* 🔔
లోకంలో మనుష్యులు నాలుగు రకాలు
ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.
స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!
*స్వార్ధ*:-
తనూ, భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.
*పరార్ధ*:-
తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు ఉదా:- వృక్షములు, నదీనదములు, గోవులు వగైరా.
*పరమార్ధ*:-
కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు. ఉదా:- ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.
*వ్యర్ధ* :-
అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు.
No comments:
Post a Comment