వాసనలు ఎన్ని విధములు(భాగం - 02), కోరికలకు మూలం వాసనలు #srividyaprakashanandagiri #yogavasistham
Author Name:TATTWABODHA
Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498
Youtube Video URL:https://www.youtube.com/watch?v=L1RaZxrS3PM
Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో [పాడటం] గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః మొదటి వీడియోలో వాసనలు రెండు రకాలు ఒకటి మలిన వాసన మరొకటి శుద్ధ వాసన మలిన వాసనలు జన్మ పరంపరలకు హేతువులయితే శుద్ధ వాసనలు జన్మ రహిత్యానికి కారణం అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదండీ ఆ వీడియోలో మనం మూలాల్లోకి వెళ్లి అసలు మలిన వాసన అంటే ఏమిటి శుద్ధ వాసన అంటే ఏమిటనేది తెలుసుకున్నాం.
(01:25) ఎందుకంటే శుద్ధ వాసనలతో ప్రమాదం లేదండి. అవి జన్మ రాహిత్యానికి కారణం ఎందుకు అవి వేయించబడిన గింజల వంటివి. గింజల్ని వేయిస్తే అవి ఎలాగైతే మరలా మొలగెత్తవో అలాగే ఈ శుద్ధ వాసనలు వేయించబడిన గింజల వంటివి ఇవి మరలా జన్మలకి కారణం కావు. సమస్య వచ్చినదల్లా ఈ మలిన వాసనలతోనే జీవుడు ఈ మలిన వాసనల వెంట పరిగెడుతూ అనేక కర్మలని పురోగు చేసుకుంటూ వాటిని అనుభవించడం కోసం మరలా జన్మలు ఎత్తుతూ ఉన్నాడు.
(02:06) గత వీడియోలో మూలమైన మలిన వాసన దాని గురించి మనం ప్రస్తావన చేసుకున్నాము అదిే దేహ వాసన ఈ దేహ వాసన అంటే ఈ దేహమే నేను అనే భావ భావ సంస్కారం ఉంది చూసారా అండి ఇదియే మలిన వాసన ఇది అనాదికాలంగా అజ్ఞానం చేత మన మనసులో మన చిత్తంలో నిక్షిప్తమై ఉన్నదండి అనాది అనాది నుంచి ఈ దేహమే నేను అన్న భావన ఉన్నది కదండి ఆ భావ సంస్కారమే మలిన వాసన ఇది మనం గత వీడియోలో చెప్పుకున్నామఅండి ఇది మూలం అండి మూల బీజం ఇది ఈ దేహ వాసన ఈ దేహమే నేను అన్న ఈ భావన ఉన్నది కదండీ అది
(02:55) ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కనుకనే దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే అమ్మో నాకు ఏమవుతుంది అని భయపడుతున్నాడు దేహం మార్పులు చెందుతుంటే తను మార్పు చెందానని అనుకుంటున్నాడు. దేహం రంగు మారితే తను రంగు మారాను అనుకుంటున్నాడు. దేహం వృద్ధి క్షయాలు పొందితే తాను క్షీణించిపోయాను అనుకుంటున్నాడు. తను గతంలో అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఉన్నాను అని అనుకుంటున్నాడు.
(03:25) గతంలో లావుగా ఉండేవాడిని ఇప్పుడు సన్నబడ్డాను అనుకుంటున్నాడు. గతంలో సన్నగా ఉండేవాడిని ఇప్పుడు లావుగా ఉన్నాను అనుకుంటున్నాడు. అంటే ఆ దేహంతో తాదాత్మం చెంది తన ఐడెంటిటీని చెప్తున్నాడు. తను గతంలో లావుగా ఉన్నాడు ఇప్పుడు సన్నగా ఉన్నాడు. నేను సన్నబడ్డాను అంటున్నాడు. అంటే వాస్తవానికి సన్నబడింది వృద్ధి క్షయాలు దేహం యొక్క ధర్మాలు కానీ అది తనకు ఆపాదించుకుంటున్నాడు.
(03:51) ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. ఇదియే దీనికి కారణం అజ్ఞానం అజ్ఞానం చేత ఈ దేహమే నేను అన్న అనుకుంటున్నారు చూసారా అండి ఇది దేహవాసన ఇక రెండోది ఈ రెండు అత్యంత ప్రమాదకరమైన వాసన మలిన వాసన లోక వాసన అండి ఇది మరియొక మలిన వాసన ఇది ఏమిటి లోక వాసన చూడండి మనం గనం గమనిస్తే ప్రతి వ్యక్తి ప్రపంచంలో అనేక విషయాలను అనుభవించాలని పరిగెడుతూ ఉంటాడు.
(04:37) ఒక విషయాన్ని అనుభవించడానికి ఉదాహరణకి నాకు ఒక తీపి పదార్థం అంటే ఇష్టంఅండి ఆ తీపి పదార్థాన్ని తినాలని నా మనసు ఆరాటపడుతూ ఉంటది. ఉదాహరణకి నాకు పాలకోవ అంటే ఇష్టం అనుకున్నామఅండి దాన్ని తినాలి అని నా మనసులో ఆ కోరిక కలుగుతుంది. అంటే ఈ ఇంద్రియాలతో ఈ పంచ ఇంద్రియాలతో జ్ఞాన ఇంద్రియాలతో ఆ విషయాన్ని అనుభవించాలి ఏదైనా ప్రపంచంలో ఒక విషయం ఉన్నది కదండీ అది ఏదైనా నేను ఉదాహరణకు ఒక తీపి పదార్థం అన్నాను.
(05:14) ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి అనుభవించాలి అని ఆ కోరిక ఉంది చూసారా అండి ఈ కోరికలేనండి మనిషిని అశాంతికి గురి చేసేది. ఈ కోరికలే లేకపోతే అసలు మనిషికి అశాంతి దుఃఖమే ఉండదండి ఈ కోరికలే వాటిని పొందాలి ఎలాగైనా ఆ కోరికలు తీర్చుకోవాలి అని అంటే ఈ విషయాలని అనుభవించి ప్రపంచంలో ఉన్నాయి కదండీ విషయాలు ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ ఐదు విధాలుగా ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు కదండీ జీవుడు అంటే శబ్దము అంటే శబ్దము ఈ చెవితో శబ్దాన్ని వింటున్నాడు.
(05:52) శబ్ద స్పర్శ చర్మంతో స్పర్శన అనుభవిస్తున్నాడు కంటితో రూపాన్ని చూస్తున్నాడు [సంగీతం] ముక్కుతో వాసన చూస్తున్నాడు నాలుకతో రుచును అనుభవిస్తున్నాడు. ఈ పంచ ఇంద్రియాల ద్వారానే ఈ పంచ ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. సో అనుభవించి తన కోరికలని తీర్చుకుంటున్నాడు. ఈ కోరికలే కదండీ మూలం మనిషికి ఏదైనా ఒకటి అనుభవించాలి అని ఆ కోరిక ఒకటి ఉంటే ఉన్నది కదండీ అసలు ఆ కోరికకి మూలం ఏదండి అసలు ఎక్కడ ఉన్నది ఆ కోరికకి మూలం కోరికలేనండి ఈ కోరికలను గనుక జయించగలిగితే అశాంతి పోయి నిత్య శాంతిగా ఉంటాడండి మానవుడు
(06:38) ఒక ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి లేదంటే నాకు ఒక తీపిప పదార్థం ఇష్టము దాన్ని ఈరోజు నేను ఎలాగైనా తినాలి. ఈరోజు నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్లేటప్పుడు ఎలాగైనా సరే నేను ఆ తీపి పదార్థాన్ని తినాలి. ఆ షాప్ లో నేను దాన్ని కొనుక్కొని ఎలాగైనా సరేనా తినాలి. లేదా ఫలానా వస్తువు నేను తిని తినాలి అన్న ఆ కోరిక ఉన్నది చూశారండి.
(07:02) అసలు దానికి మూలం ఎక్కడదండి ఒకటి ప్రపంచంలో ఈ లోకంలో చూసారాండి మనసు విషయాలు అనుభవించాలని పోతున్నది చూసారా ఆ కోరిక ఆ కోరికకి మూలం ఎక్కడ ఉన్నది మూలం ఎక్కడ ఉన్నదో తెలుసా అండి అసలు ఒక వ్యక్తి ఒక పదార్థాన్ని అనుభవించాలి ఒక స్వీట్ ని తినాలి అని అతను తపిస్తున్నాడు అంటే అతని కోరిక పుట్టింది అంటే ఆ కోరికకి మూలం ఎక్కడ ఉండదో తెలుసా అండి ఆ కోరికకి మూలము అతని చిత్తంలో లో వాసనా రూపంలో తిష్ట వేసుకొని ఉన్నదండి.
(07:36) ఈ వాసనే గనుక లేకపోతే అతనికి ఆ పదార్థాన్ని తినాలి అన్న కోరికే ఉండదండి. మీరు ప్రపంచంలో ఏ విషయాన్నైనా గమనించండిండి ఒక విషయం వైపు దాన్ని అనుభవించాలని ఒక విషయాన్ని అనుభవించాలి అని ఇతని మనసు పరితపిస్తున్నది అంటే కోరుకుంటున్నది అంటే ఆ కోరికకు మూలం అతని మనసులో వాసన ఉన్నది బీజ రూపంలో బీజ రూపంలో వాసన ఉండి అది కోరికలకి ప్రేరేపిస్తూ ఉన్నది.
(08:12) ఉదాహరణకి జిలేబి తినని వ్యక్తికి అతని మనసు ఎప్పుడు దాన్ని తినాలని ఆరాట పడదు. కానీ ఒకసారి తిన్నాడు ఆ తిన్నప్పుడు అనుభవం ఉంది చూసారా అండి అది అతని మనసులో ముద్రించకపోయింది వాసనగా భవిష్యత్తులో అతనికి అనారోగ్యం వచ్చింది. వచ్చినప్పుడు షుగర్ తీపి పదార్థం తినకూడదు. కానీ అతని మనసు ఆ జిలేబిని చూసినప్పుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు జిలేబి దుకానం కనిపించింది. దాన్ని తినాలి అని
(08:58) మనసు అతని మనసు ఆరాటపడుతున్నది. తిందామాని ఆరాటపడుతున్నది ఆ కోరిక కలిగింది చూసారా అండి ఆ కోరికకి మూలం ఏదండి అతని మనసులో ఆ వాసన ఉన్నది చూసారా అండి ఆ జిలేబికి సంబంధించి ఆ వాసన అది కదిలిస్తూ అది కదిలిస్తున్నదండి అది తినాలి అనే ప్రేరేపిస్తున్నది ఆ కోరికకి దాన్ని అనుభవించాలి ఆ జిలేబిని అనుభవించాలి అనే కోరిక ఉంది చూసారా అండి ఈ నాలుకతో ఆ జిలేబిని అనుభవించాలి ఈ నాలుక అనే ఇంద్రియం ఉంది చూసారా అండి దానితో ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్న ఆ జిలేబిని అనుభవించాలి అనే కోరికకి మూలం ఏదో తెలుసా అండి ఈ వాసనే అండి అది గనుక లేకపోతే ఈ కోరిక పుట్టదండి
(09:40) తినాలని ప్రతిదీనండి ఈ పంచ ఇంద్రియాలతో ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇంద్రియానుభూతులు ఈ ఇంద్రియనుభవాల కోసమే పరిగెడుతూ ఉంటాడు కదండీ ఈ ఇంద్రియ సుఖాల కోసమే పరిగెడుతూ ఉంటాడు. ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ఉన్న విషయాలను అనుభవించి సుఖపడాలని పరిగెడుతూ ఉంటాడు. తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. తన జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉంటాడు.
(10:05) ఉత్తమమైన దుర్లభం అండి దుర్లభం త్రైమేవైతదేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయః అంటున్నారు శంకరాచార్యుల వారు దుర్లభం అండి అరుదు మనుష్య జన్మ రావడం మోక్షం పొందాలనే కోరిక ఉండడం మహాత్ములను ఆశ్రయించడం ఈ మూడు లభించడం దుర్లభం అండి దుర్లభమైన మరి మానవ జన్మ లభించింది కదండీ మరి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు నష్పరమైన నశించిపోయే ఈ దృశ్య వస్తువుల వెంట పరిగెడి వాటిని అనుభవించాలనే కోరికతో వాటి వెంట పరిగెడుతూ ఈ కోరికలు ఎలాంటివో తెలుసా అండి అగ్నిలో ఆజ్యం పోయడం వంటివే మీరు పోస్తూ ఉంటే అగ్ని రగులుతూ ఉంటది.
(10:47) అలానేనండి ఒక కోరిక తీరితే అయిపోలేదండి అది మరల లోపల కోరికలని పెంచుతూ ఉంటది కోరిక తీర్చుకున్నారండి అది ఏమైపోయింది అక్కడితే అయిపోయిందా కాలేదండి అది మీ లోపల వాసన ఉన్నది చూసారా అండి దాన్ని బలపరుస్తది అది అది మరలా కోరికలకు కారణం అవుతది ఆ కోరిక తీరినప్పుడు ఇంక దాన్ని మీరు జీవితంలో ఎప్పుడు అనుభవించరా మీరు ఒక కోరికని తీర్చుకున్నారండి జీవితంలో ఇంకా ఎప్పుడు దాన్ని మీరు అనుభవించరా మరల మరల రెట్టింపు వేగంతో మరల దీన్ని దాన్ని అనుభవించాలని మీరు తపన పడుతూ ఉంటారండి ఎందుకు అగ్నిలో ఆజ్యం పోసినట్టే అది చల్లార్చలేరండి అది అగ్నిని చల్లార్చలేరు మీరు అగ్నిలో
(11:31) ఆజ్యం పోస్తే అగ్నిని చల్లారుస్తారా లేదు ఇంకా అది వేగంతో పెరుగుతుంది. ఇది కూడా అలాంటిదేనండి కోరికలు కూడా కోరిక తీర్చుకొని నేను దాన్ని అనుభవించి దాన్ని శాంతింప చేసుకుంటాను అంటే లేదండి అలా ఉండదండి అది ఇంకా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ ఇంద్రియానుభవాలు ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఆ వాసనలండి ఆ వాసనలు లాగుతూ ఉన్నాయి ప్రపంచం వైపు ప్రపంచం ప్రపంచంలో ఉన్న విషయాల్ని అనుభవించాలి ఇంద్రియాలతో వీటిని అనుభవించాలి అనుభవించాలని మనసు ప్రపంచం వైపు ఎందుకు పరిగెడుతున్నదో తెలుసా అండి ప్రపంచంలో గల విషయాల విషయాల వైపు ఎందుకు వెళ్తుందో
(12:11) తెలుసా ప్రపంచంలో విషయాల పట్ల అతనికి మనకి గల వాసనలుండి. అవి ఈ జన్మవే కావాల్సిన అవసరం లేదండి అనాదికాలంగా జన్మ జన్మల నుంచి వస్తూ ఉన్నాయి చూసారా అండి ఆ అనాది కాలంగా ప్రోగు చేసుకున్న ఈ వాసనలు ఉన్నాయి చూసారా అండి ఇవి ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయండి. ఇంద్రియాలు ఎందుకండీ ప్రపంచ విషయాల వైపు వెళ్తూ ఉంటే అనుభవించాలి ప్రపంచంలో విషయాలు అనుభవించాలి అని ఈ వాసనలు తోస్తూ ఉంటాయండి.
(12:40) వెళ్ళు వెళ్ళు అనుభవించు ప్రపంచంలో ఉన్న విషయాలను అనుభవించు అని వాసనలు నెడుతూ ఉంటాయండి అది ఈ వాసనలో కోరికలకి కారణం అండి ఒకటి అనుభవించాలని కోరిక ఉంది చూసారా అండి దానికి మూలం ఈ వాసన అండి ఎందుకు ప్రపంచంలో విషయాల కోసం మనిషి ఇంతలా పరిగెడుతున్నాడు ఇంతలా అనుభవించాలని ఇంద్రియ ఇంద్రియాలతో ప్రపంచాన్ని అనుభవించి చివరికి తను పతనం అయపోవాలని పతనం అవుతాడని తెలిసినా కూడా ఎందుకు మనిషి ప్రపంచంలో ఈ సుఖాల వెంట పరిగెడుతున్నాడు.
(13:12) అంటే ఆ వాసన అనే వాయువు వీచినప్పుడుఅండి ఆ ఆ వాయువుకి ఇతను ప్రపంచంలో వెలుపడుతున్నాడండి. వీటిని లోకవాసనలు అంటారండి. ఈ లోక వాసనల్ని అనుభవించడం కోసమే జీవుడు ఈ ప్రపంచంలో పరిగెడుతూ ఉన్నాడు. ఈ కోరికలన్నిటికీ మూలం ఏందండి ఈ వాసనలే అండి. ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో విషయాలు అనుభవించాలి అని అనే కోరిక ఉంది చూసారా అండి ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో విషయాలు అనుభవించడానికి జీవుడు పరిగెడుతున్నాడు కదండీ దానికి మూలం ఏదో తెలుసా అండి ఈ
(13:56) వాసనలేనండి ఇవన్నీ చిత్త కుహరంలో ఉంటాయండి చిత్తం అనే కుహరంలో ఇవన్నీ తిష్ట వేసుకొని ఉన్నాయండి అసలు మనసుకు ఉన్న బలం ఏందో తెలుసా అండి ఈ వాసనలే అండి మనసు అంటే ఏందండి ఆలోచనలు సమూహమే కదండీ వృత్తి ప్రవాహమే మనసు సంకల్పానికి మనోవిద్ధి అని యోగవాసిష్టం సంకల్పమే మనసు మన మనసులో కలిగే ప్రతి ఆలోచన ఈ వాసనలను ఆధారం చేసుకునే ఉంటదండి.
(14:32) చూద్దాం ఎలానో ఈ వాసన యొక్క బీజాలు ఉంటాయి చూసారా అండి అవన్నీ మనసులో ఉంటాయి కదండీ వాసనలు చిత్తంలో బీజ రూపంలో ఉండి వృత్తులుగా మొలకెత్తుతున్నాయండి. అందుకే వృత్తులన్నీ వాసనలను ఆధారం చేసుకునే ఉంటాయండి. చూడండి మనకు కలిగే ప్రతి ఆలోచన వాసనలను ఆధారం చేసుకునే ఉంటదండి. ఈ వాసనలు ఉన్నాయి చూసారా అండి ఇవి మన వృత్తులను కదిలిస్తే ఈ వృత్తులు ఉన్నాయి చూసారా అండి అవి మరల కర్మలను కదిలిస్తాయి.
(15:05) ఈ వాసలు ఉన్నాయి చూసారా అండి మన చిత్త కుహరంలో ఇవి వృత్తులుగా మొలకెత్తుతున్నాయండి ఈ వృత్తులు ఏమవుతున్నాయి మరల కర్మల కారణం అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఒక విషయాన్ని అనుభవించి ఇప్పుడు జిలేబి ఉందండి దానికి సంబంధించిన వాసన మీ చిత్త కుహరంలో ఉన్నదండి మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ జిలేబిని చూసినప్పుడు మీ మనసులో కదిలే ఆలోచన ఉన్నది చూసారా అండి అది దేని ఆధారంగా కదులుతుందండి గతంలో మీరు అనుభవించారు కదండీ ఆ అనుభవం ఉన్నది కదండీ అది ఆ ముద్ర ఉన్నది కదండీ చిత్తంలో అది కదులుతుందండి అది ఆలోచనగా కదిలి ఆ అనుభవం ఉంది చూసారా అండి దాన్ని స్మృతికి తెస్తుంది అది
(15:50) దాన్ని చూసినప్పుడు ఆహా ఇది భలే ఉంటది అద్భుతంగా ఉంటది చాలా బాగుంటది తిన్నాము అన్న ఆ కోరిక ఉన్నది చూసారా అండి దానికి మూలం ఏందండి ఈ వాసనే ఈ వాసన కదిలి ఆలోచనగా మారి రి మీకు ఆ గత అనుభవాన్ని గుర్తుచేసి తినాలి అనే కోరికకి ప్రేరణ ఇస్తూ ఉన్నదండి. మీరు మరలా దాన్ని తినాలి అనే కర్మకి ఇది ప్రేరణ ఇస్తూ ఉన్నది మరల మీరు తింటున్నారు కదండీ కర్మ చేస్తున్నారు కదా దానికి మూలం ఇదే కదా ఇప్పుడు మరలా కర్మ చేస్తారు.
(16:25) ఆ కర్మ మరల ఇంకొక కర్మకు కారణం అవుతది ఇలా కర్మ జన్మ కర్మ జన్మ ఇదొక వృత్తం లాంటిదండి మరల ఇప్పుడు జిలేబి తినాలనే కర్మ చేస్తారు కదండీ ఈ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరల జన్మ తీసుకుంటారు. కర్మ జన్మ కర్మ జన్మ ఇది తిరుగుతూనే ఉంటదండి. ఇదిఒక వృత్తం లాంటిది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక పక్షిని ఒక చెట్టు మీద పక్షి ఉంది అండి దాన్ని వేటగాడు దాన్ని పట్టుకోవాలి.
(16:58) ఏం చేస్తాడు చెట్టు కింద వల వేస్తాడు. దాంట్లో కొన్ని గింజలు వేస్తారు. ఇప్పుడు ఆ పక్షి ఉంది కదండీ ఆ పక్షి ఆ గింజల్ని తినడానికి వచ్చి ఆ వలలో బంధింపబడతది. అప్పుడు ఈ వేటగాడు వచ్చి దాన్ని పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అదేవిధంగా ఈ జీవుడుండి ఈ ఇప్పుడు ఈ లోకంలో జీవుడు బంధింపబడుతున్నాడు కదండీ ఈ జీవుడు ఈ జీవుని బంధించడానికి ఈ జీవుని బంధించడానికి ఈ మనసు ఉంది చూసారా అండి ఈ మనసు ఇక్కడ వేటగాడు మనసుఅండి ఈ జీవుడు పక్షి అనుకుంటే వేటగాడు మనసు అండి ఇప్పుడు ఈ జీవుణని బంధించడానికి ఈ ప్రపంచంలో
(17:45) ఈ ప్రపంచంలో జాగ్రత్తగా వినండి ఈ జీవుడుఅనే పక్షిని ఈ సంసారం అనే వలలో బంధించడానికి మనస్సుఅనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటండి ఈ ప్రపంచంలో బంధించడానికి ఈ సంసారంలో ప్రపంచం అంటే ఈ సంసారం అండి ఈ సంసారంలో ఈ జీవున్నని బంధించడానికి ఈ జీవుడు అనే పక్షి దీని పక్షితో పోలుస్తున్నారండి. ఈ జీవుడు అనే పక్షిని ఈ సంసారము అనే వల ఈ వలలో బంధించడానికి మనస్సు అనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటి? ఆ వేటగాడు అంటే ఒక పక్షిని బంధించడానికి
(18:30) వేటగాడు దగ్గర ధాన్యం గింజలు ఉంటాయి అవి వేస్తాడు అవి తినడానికి వస్తది. అలాగే ఇక్కడ ఈ జీవుని ఈ సంసారం అనే వలలో ఈ ప్రపంచంలో బంధించడానికి మనస్సు అనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటి ఏమిటో తెలుసా అండి వాసనలుండి వాసనలు మనసు యందు మనసు ఈ విషయ వాసనలు ఉన్నాయి చూసారా అండి ఈ విషయాలు ప్రపంచంలో ఉన్న విషయాలు ఉన్నాయి చూసారా అండి ఈ విషయాలు విషయ వాసనలు జీవుని ముందు వేసి జీవుని సంసారంలో తలుకునే చేస్తదండి చూడండి మీరు గమనించండిఅండి అసలు ఒక విషయానికి సంబంధించిన వాసన గనుక మీకు లేకపోతే ఆ విషయం మిమ్మల్ని బంధించలేదండి.
(19:16) మీకు జిలేబి అనే పదార్థం దాని యందు మక్కువ ప్రీతి ఎందుకు ఉన్నది తినాలనే కోరిక ఎందుకు కలుగుతున్నది గతంలో దాని అనుభవం మీకు ఉన్నది ఆ ముద్ర మిమ్మల్ని కదిలిస్తున్నది ఆ వాసన అసలు మీరు ఎప్పుడు తినలేదండి అసలు తినలేదు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు ఆ పదార్థాన్ని చూసినా గాని తినేయాలి అన్న కోరిక పుట్టదండి.
(19:42) మీరు దాన్ని అనుభవించాలి అన్న ఆ ఆలోచన అయితే కలగదండి ఆ కోరిక అయితే మీలో పుట్టదండి. ఎందుకంటే ఆ వాసన మీలో లేదు ఆ వాసన మీకు లేదు గనుక మీ మనసు దాన్ని తినాలి అని ఆరాటపడదు ఆ కోరిక మీలో రగలదండి ఎందుకంటే ఆ వాసన మీకు లేదు ఆ విషయం ఉంది చూసారా అండి జిలేబి విషయం ఆ తీపి పదార్థం అది మిమ్మల్ని ప్రపంచంలో బంధించదండి అందుకే ఈ విషయాలన్నీ చూసారండి ప్రపంచంలో ప్రతిదీ విషయమేనండి ఈ విషయాలే ఈ విషయం వాసనలండి ప్రతి విషయంతో మనకు గల
(20:28) అనుభవం ఉంది కదండీ అవే వాసనలండి ఈ వాసన గనుక లేకపోతే అసలు మనసు అనేది ఈ జీవుని ప్రపంచంలో బంధించడానికి అవకాశమే లేదండి ఈ జీవుడుఅనే పక్షి ఈ సంసారము అంటే ఈ ప్రపంచం అండి ఈ సంసారం అనే వలలో తగులుకొనే అవకాశమే లేదండి. ఎప్పుడు వాసనలు గనుక లేకపోతే వాసనలే లేకపోతే మనసు జీవుని ప్రపంచంలో బంధించడానికి అవకాశమే లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ విషయాన్ని ఒక విషయాన్ని అనుభవించి తృప్తి పడాలి అనుకుంటున్నాడు కదండీ కోరిక
(21:13) తీర్చుకోవాలని అది అంతటితో పోతున్నదా అండి అది మరల రెట్టింపు వేగంతో మరల కర్మకి అది కారణం అవుతదండి. మరి ఈ కర్మ జన్మ వీటికి అంతం ఎక్కడ ఈ కర్మ జన్మ కర్మ జన్మ ఉన్నది చూసారా అండి ఈ కర్మ చేస్తున్నాడు వాడు దాని ఆ ఫలితాన్ని అనుభవించడానికి మరలా జన్మ ఎత్తుతున్నాడు. ఈ వాసనలు కదిలించడం వలన అతను కర్మ చేస్తున్నాడు ఆ కర్మ వలన మరలా జన్మ ఎత్తుతున్నాడు ఆ జన్మలో మరలా కర్మలు చేస్తూ ఉన్నాడు మరలా అవి ఇంకొక జన్మలకు కారణం అవుతున్నాయి.
(21:53) ఇదొక వృత్తం లాగా ఉన్నదండి కర్మ జన్మ కర్మ జన్మ అనేది వృత్తము ఇక్కడ వృత్తం ఉన్నది ఒక సర్కిల్ అండి దానికి ఆది అంతం చెప్పండి ఎక్కడ అంతమో చెప్పండి ఒక సర్కిల్ ఉంది దానికి ఎండ్ పాయింట్ ఎక్కడో చెప్పండి అండి మనిషి జీవితం కూడా అలానే ఉన్నదండి ఒక వృత్తం లాగా అంతం లేకుండా ఉన్నదండి కర్మ జన్మ కర్మ జన్మ కర్మ జన్మ ఒక వృత్తంమా మాదిరి అంతం లేకుండా ఉన్నదండి.
(22:25) మరి అసలు దీనికి మార్గం ఏంది? జీవుడు తప్పించుకునుటకు మార్గం ఏమిటి? ఈ జన్మ పరంపరల నుండి తప్పించుకోవటకు మార్గం ఏమిటి? ఈ వాసనలు ఉన్నాయి కదండీ ఈ వాసనలే కర్మలకు కారణం అవుతున్నాయి కర్మలు మరల జన్మలకు కారణం అవుతున్నాయి. అని చెప్తున్నాం కదా మూలం ఈ వాసనలు కదా అసలు మరి ఈ వాసనల్ని క్షయం చేసుకోవడం ఎలా వాసనా క్షయం అంటారండి ఈ వాసనను క్షయం చేసుకోవడం ఎలా దానికే మనకి యోగ వాశిష్టం చెప్తున్నది అండి ఒక సూత్రం చెప్తారండి దానికి మార్గం ఏమిటో తెలుసా అండి వాసనాక్షయానికి తత్వజ్ఞానం అండి తత్వజ్ఞానము వాసనాక్షయము
(23:10) మనో మనోనాశము తత్వజ్ఞానము వాసనా క్షయము మనోనాశమ అండి తత్వజ్ఞానం చేత వాసనలు క్షయమ అవుతాయండి. వాసనలు క్షయమైనప్పుడు మనసు నశిస్తదండి. మనోనాశనం చేత జీవన్ముక్తి కలిగి తీరుతుందండి. ఈ మనోనాశం ఉన్నది కదండీ తత్వజ్ఞానం చేత వాసనలు క్షయమ అయితే మనసుకున్న బలం వాసనలే కదండీ ఈ వాసన గనుక క్షయమ అయితే మనసు నశిస్తది అంటున్నది శాస్త్రం ఈ మనోనాశాన్నే అమనస్కము అంటున్నదండి ఈ అమనస్కము అంటే మనసు లేని స్థితి అండి ఈ విషయాలు వాసనాక్షయము
(23:59) తత్వజ్ఞానము వాసనాక్షయము మనోనాశము ఈవిష విషయాలు తదుపరి భాగం తదుపరి భాగంలో తెలుసుకుందాంండి ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం ంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి
No comments:
Post a Comment