ప్రపంచానికి తెలియని Arthur Cotton (కాటన్ ) అసలు స్వరూపం Part 1
Author Name:Sri Nighasa
Youtube Channel Url:https://www.youtube.com/@SriNighasa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XuYeg8CXkZE
Transcript:
(00:00) జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహాస ఛానల్ కి స్వాగతం. హృదయాలను కదిలించి మనసులను మెలిపెట్టే అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన కొన్ని నిజాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో చివరికంటా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ముందుగా నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. అపర భగీరథుడిగా పిలవబడే సర్ ఆర్థర్ కాటన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని నేను అడిగితే ఒక సగటు తెలుగు వాడిగా నిజాయితీగా ఇప్పుడు మీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి మీకు మీరు సమాధానం చెప్పుకొని ఆ తర్వాత వీడియో
(00:43) పూర్తిగా చూడండి. ఇదే ప్రశ్నను నన్ను అడిగితే ఒక వారం రోజుల క్రితం వరకు నేనైతే ఏం సమాధానం చెప్పేదాన్ని అంటే కాటన్ కేవలం బ్రిటిష్ ఇంజనీర్ మాత్రమే కాదు తెలుగుల తలరాతను మార్చిన మహామనిషి కరువు కాటకాలతో అల్లాడిపోతున్న గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతాలను అన్నపూర్ణలుగా మార్చిన ఘనత కలిగినవాడు ధవళేశ్వరం వద్ద ఆయన నిర్మించిన ఆనకట్ట ఒక మహా అద్భుతం బ్రిటిష్ ప్రభుత్వానికి లాభాల కంటే ప్రజల ల క్షేమమే ముఖ్యమని నమ్మి తన పదవిని సైతం పణంగా పెట్టి ప్రాజెక్టుల కోసం పోరాడారు.
(01:20) అప్పట్లో అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే అంత పెద్ద ఆనకట్టలను నిర్మించడం ఆయన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. తెలుగువారు ఆయనని దైవసమానుడిగా కొలుస్తారు అతను పరాయి దేశస్తుడైన కాటన్ దొర కాటన్ దొర అంటూ తమవాడిగా భావిస్తారు. ఇళ్లల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన విగ్రహాలు చిత్రపటాలు ఉంటాయి. ఆయన లేకపోతే ఈరోజు మాకు ఈ తిండి ఉండేది కాదు అని సర్వ సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు.
(01:50) మా తాత ముత్తాతలు ఆకలితో చనిపోతూ ఉంటే మాకు నీళ్లు ఇచ్చి బతికించిన దేవుడు అని చెప్తారు. అందుకే ఆయనకు అపర భగీరథుడు అనే బిరుదు సార్ధకమైందని తెలుగువారు నమ్ముతారు. కాటన్దోర జయంతిని ఒక పండుగలా జరుపుకుంటారు. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న ఆయన మ్యూజియం ను ఒక యాత్రా స్థలంలా సందర్శిస్తారు. తెలుగువారి గుండెల్లో ఒక బ్రిటిష్ అధికారిగా కాకుండా దేవుడిగా కొలువై ఉంటాడు నిన్న మొన్నటి వరకు అంటే ఒక వారం రోజుల క్రితం వరకు నాది కూడా ఇదే అభిప్రాయం అయితే ఇక్కడ నేను చెప్పిన నా అభిప్రాయం అలాగే ఒక సగటు తెలుగువాడి స్పందన నుంచే లోతుగా అధ్యయనం చేయడం మొదలు
(02:32) పెడితే కాటన్ గురించి బయట ప్రపంచానికి అంతగా తెలియని చరిత్రలో కనుమరుగైపోయిన కొన్ని పచ్చి నిజాలు తెలుస్తాయి. ధవళేశ్వరం వద్ద ఆయన నిర్మించిన ఆనకట్ట ఒక అద్భుతం అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే అంత పెద్ద ఆనకట్టలను నిర్మించడం ఆయన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఈ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని చరిత్ర పుటలను పరిశీలిస్తే గత వారం రోజులలో నేను సేకరించిన సమాచారంతో బయట ప్రపంచానికి పరిచయం లేని కాటన్ లో ఉన్న కొత్త పార్శవాలు కనిపిస్తాయి.
(03:07) వాటిలో ప్రముఖంగా ఒక మూడింటిని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని నేను చెప్తానన్న మూడు కోణాల్లో మొదటి కోణాన్ని పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే కాటన్ నిర్మించిన అద్భుతమైన అనకట్టల నిర్మాణంలో అతను ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానం అతనిదేనా సమాధానం ఖచ్చితంగా కాదు అని వస్తుంది. అవును మీరు విన్నది నిజమే ఈ విషయాన్ని ఆయన కుమార్తె లేడీ హోప్ే నిర్ధారించింది.
(03:40) కాటన్ కుమార్తె లేడీ హోప్ రచించిన జనరల్ సర్ అర్థర్ కాటన్ హిస్ లైఫ్ అండ్ వర్క్ అనే పుస్తకంలోనే ఈ విషయాలన్నీ ఆవిడ స్వయంగా పొందుపరిచింది. ఆ పుస్తకంలో ఆవిడ స్వయంగా తెలియజెప్పిన విషయాలను బట్టి 1830 ప్రాంతంలో కావేరి నది నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నప్పుడు కాటన్ కలన్నై అనే ఆనకట్టని ఆ నమూనాని అధ్యయనం చేసి కావేరీ నది మీద రెండు ప్రధాన ఆనకట్టలను నిర్మించారు.
(04:13) అది అప్పర్ ఆనకట్ దీనిని తమిళంలో మేలనై అని పిలుస్తారు. ఇది తిరుచిరాపల్లికి సమీపంలో ముక్కంబు వద్ద కావేరి నదిని కొలేరూన్ నదిని విడదీసే చోట నిర్మింపబడింది. కావేరి డెల్టాకు కావలసిన నీటిని మళ్లించడానికి ఇది కీలకమైంది. అలాగే కావేరి నది మీద ఇంకొక ఆనకట్ట లోయర్ ఆనకట్టని దీనిని కీళ్ళనై అని పిలుస్తారు. ఇది కొలేరూన్ నదిపై అనైకారై వద్ద నిర్మింపబడింది.
(04:42) కళ్ళన్నై నుంచి వచ్చే అదనపు జలాలను క్రమబద్ధీకరించడానికి దీనిని నిర్మించారు. ఈ రెండే కాకుండా గోదావరి నదిపై ఆయన నిర్మించిన నాలుగు ఆనకట్టలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు అవి నదిలోని ఇసుకపై రాతితో వేసిన పొరలు వీటి ఆలోచన కావేరీ నదిలోని అదనపు నీటిని కొలెరూన్ నదిలోనికి మళ్ళంచే గ్రాండ్ ఆనికట్ నుండే తీసుకోబడింది. కాటన్ ఇంజనీరింగ్ మిలికోలో నేర్చుకున్న కళన్నై ఆనకట్ట గురించి మనం కొంచెం తెలుసుకోవాలి.
(05:14) ఈ ఆనకట్టకు సంబంధించిన చక్కటి డాక్యుమెంటరీ గల ఒక YouTube వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి గలవారు చూడొచ్చు ఆ ఆనకట్ట గురించి ఇంకా అనేక వీడియోలు YouTube లో అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకంలో పలుమార్లు గ్రాండ్ ఆనకట్ట అని సంబోధించిన అసలు ఆ ఆనకట్ట పేరు కలన్నై కల్ అంటే రాయి అన్నయ అంటే ఆనకట్ట అంటే రాతి ఆనకట్ట అని అర్థం దీనిని దాదాపు 2వేల సంవత్సరాల క్రితం ప్రసిద్ధ చోళ చక్రవర్తి కరికాల చోలుడు నిర్మించాడు.
(05:50) ప్రపంచంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న అత్యంత పురాతనమైన ఆనకట్టలలో ఇది ఒకటి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతంగా పనిచేస్తున్న ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఈ ఆనకట్ట ప్రత్యేకతలు ఏంటంటే పునాది లేని నిర్మాణం మామూలుగా ఇది ఇసుక గర్భం ఉన్న నదిపై నిర్మింపబడింది సాధారణంగా అయితే భారీ కట్టడాలకి లోతైన పునాదులు అవసరమని అప్పట్లో భావించేవారు కానీ ఇది ఇసుకపైనే కట్టబడి స్థిరంగా నిలిచి ఉంది.
(06:25) ఈ ఆనకట్టని నిర్మించడానికి ఉపయోగించిన మిశ్రమం ఆనకట్టి లోపలి భాగం కేవలం మట్టితో కలిపిన విడిరాళ్ళు చెక్క మొద్దులు వీటి కలయకతో నిర్మింపబడింది. లోపల మట్టి రాళ్ళు ఉన్నప్పటికీ పైన మాత్రం సున్నం కాంక్రీట్ మరియు ప్లాస్టర్ తో చేసిన ఒక పూత మాత్రం ఉండేది. ఆనకట్ట యొక్క భద్రత అంతా ఈ పైన ఉన్న ప్లాస్టర్ పొరపైనే ఆధారపడి ఉండేది. ఇదే రక్షణ కవచంలా పనిచేసేది.
(06:54) దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఈ ఆనకట్ట ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా నిలబడడమే కాకుండా కేవలం అప్పుడప్పుడు పైన ఉన్న ప్లాస్టర్ ను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే ఇది మనుగడ సాగించి కాల పరీక్షకి నిలబడింది. పరమశివుని మహాభక్తులైన చోళరాజు కట్టించిన ఈ అద్భుతం నేటికి సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందు వేల ఎకరాలకు నీరు అందిస్తూ జాతికి గర్వకారణమైంది.
(07:23) ఒక రకంగా ఇటువంటి ఆనకట్ట కట్టాలనే ఆలోచన ఆ పరమశివుడు పరవళ్ళు తొక్కుతూ భూమి మీదకి ఉరికి వస్తున్న గంగను తన జటాజూటంలో ఒడిసిపట్టి తర్వాత నెమ్మదిగా పాయలుగా వదిలి పెట్టడం నుంచే వచ్చిందేమో కాటన్ని ఆనకట్టను పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడట ఇది ఎప్పుడూ ప్రమాదానికి గురి కాలేదు ఆందోళనని కలిగించలేదు అని పేర్కొన్నాడట కేవలం అప్పుడప్పుడు పైన ఉన్న సున్నపు పూతను మార్చడం తప్ప లోపల ఉన్న అసలైన నిర్మాణం శతాబ్దాల తరబడి స్థిరంగా ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడట ఆ ఆనకట్ట కట్టడానికి ఉపయోగించిన ఆ విజ్ఞానమే కాటన్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విద్యలో అతి ముఖ్యమైన పాఠంగా
(08:07) భావించాడట చోళరాజులు ఉపయోగించిన కళ్ళన్నై ఆనకట్టలోని విజ్ఞాన సూత్రం ఆధారంగానే కాటన్ ఇతర ఆనకట్టలు కట్టాడు అందుకనే ఆనకట్టలను తక్కువ ఖర్చ ఖర్చుతో కట్టగలిగాడు. కాటన్ కుమార్తె లేడీ హోప్ రచించిన ఈ పుస్తకంలో పలుచోట్ల ఆవిడ ప్రస్తావించిన ఈ విషయాలను బట్టి ఖచ్చితంగా కాటన్ ఆనకట్టల విజ్ఞానం కరికాళ్ళ చోలుడు కట్టించిన కలన్నై ఆనకట్ట సూత్రం మీదే ఆధారపడి అని అర్థంవుతుంది.
(08:40) సొమ్మోకడిది సోకొకడిది అన్నట్లుగా స్వదేశీ విజ్ఞానాన్ని నేర్చుకొని ఆనకట్టలు కట్టిన కాటన్ కి పేరు వచ్చేసింది. కానీ మనం గుర్తించవలసింది మన స్వదేశీ విజ్ఞానాన్ని స్వదేశీ ఇంజనీర్లని
No comments:
Post a Comment