Saturday, May 16, 2026

వాసనలు ఎన్ని విధములు, అమనస్క స్థితి, అభేద దర్శనం జ్ఞానం #srividyaprakashanandagiri #yogavasistham

వాసనలు ఎన్ని విధములు, అమనస్క స్థితి, అభేద దర్శనం జ్ఞానం #srividyaprakashanandagiri #yogavasistham

Author Name:TATTWABODHA

Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498

Youtube Video URL:https://www.youtube.com/watch?v=In1SD4Wiwn0



Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో [పాడటం] గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః మనం గత రెండు వీడియోలలో వాసనలు ఎన్ని రకాలు వాటి గురించి వివరంగా తెలుసుకున్నామండి వాసనలు రెండు రకాలు ఒకటి మలిన వాసన మరిొకటి శుద్ధ వాసన మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణం అయితే శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణం అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ మలిన వాసనలు అజ్ఞానం వల్ల ఏర్పడితే శుద్ధ వాసనలు జ్ఞానం వల్ల ఏర్పడతాయి.
(01:22) ఎందుకు ఈ శుద్ధవాసంలో మరల జన్మ పరంపరల కారణం కావు అంటే అవి వేయించిన గింజల వంటివి అంటారు వశిష్ట మహర్షి [నవ్వు] వేయించిన గింజలు మరల మొలకెత్తవు కదండీ సో అలానే ఈ శుద్ధ వాసనలో ఇక మరల జన్మలకి హేతువులు కావు కానీ మలిన వాసనలో ఉన్నాయి చూసారా ఇవి మరలా జన్మ పరంపరలకు కారణం అవుతాయి. ఎందుకు అంటే మలిన వాసనలు అజ్ఞానం వలన ఏర్పడతాయండి శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడితే మలిన వాసనలు అజ్ఞానం వలన ఏర్పడతాయి.
(01:58) ఈ అజ్ఞానం వలన ఏర్పడిన ఈ మలిన వాసనలు జన్మ పరంపరలకు హేతువులు అవుతున్నాయి అన్నమాట. సో ఈ వీటి గురించి వివరంగా మనం చెప్పుకున్నాము. అలానే అతి పెద్ద మలిన వాసన ఈ దేహ వాసన. మనం మూలాల్లోకి వెళ్లి చూసాం కదండీ ఈ దేహమే నేను అనే ఆ భావం ఉంది చూసారా అండి ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి. ఇది దేహ వాసన ఇది ప్రతి ఒక్కరికి ఉంటదండి ఇదే మూలంఅండి జన్మ పరంపరలకి మరిొక మలిన వాసన లోక వాసన అండి.
(02:36) ఈ రెండిటి గురించి మనము గత రెండు వీడియోల్లో మనము వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో ఇది చివరి భాగం అండి కంక్లూజన్ ఈ వీడియోలో అసలు వాసనలు ఎలా క్షయమవుతాయి దానివలన మనోనాశం ఎలా సిద్ధిస్తుంది అనేది తెలుసుకుందాము. మనం గత వీడియోలో చివరిలో ప్రస్తావన చేసి ఉన్నాము. ఈ జన్మ కర్మ అనేది ఒక వృత్తం లాగా ఉన్నది అంటే కర్మ వలన జన్మ వస్తున్నది కర్మఫలాలు అనుభవించడానికి మరలా జన్మలో మరలా కొత్త కర్మలు చేసి మళ్ళీ అవి పోగు చేసుకొని
(03:24) వాటిని అనుభవించడానికి మరలా జన్మలు ఎత్తుతున్నాడు. ఈ విధంగా కర్మ వలన జన్మ మళ్ళీ ఆ జన్మలో కర్మలు చేస్తాడు మరల కర్మలు అనుభవించడానికి మరల జన్మలు ఈ కర్మ జన్మ కర్మ జన్మ అనేది అంతం లేకుండా ఒక వృత్తం మాదిరి ఉన్నది ఇప్పుడు వృత్తం ఉన్నదండి ఒక సర్కిల్ దానికి అంతం ఎక్కడో ఎండ్ పాయింట్ ఎక్కడో చెప్పండండి చెప్పలేమండి అలా ఇది కూడా ఒక వృత్తం మాదిరి ఉంది చక్రం అనేది జన్మ చక్రం అనేది మరి దీంట్లో నుంచి బయట పడడం ఎలా దీనికి మార్గం ఏంటిదంటే వశిష్ట మహర్షి చెప్తున్నారండి దీనికి మార్గం తత్వ తత్వజ్ఞానం అండి
(04:10) తత్వజ్ఞానం చేత వాసనాక్షయం జరుగుతుదండి. వాసనాక్షయం చేత మనోనాశం అండి మనోనాశం చేత జీవన్ముక్తి కలిగి తీరుతుంది అంటున్నది శాస్త్రం అండి. ఇది సీక్వెన్స్ అండి ఫార్ములా తత్వజ్ఞానము వాసనాక్షయము మనోనాశము వాసనలు రెండు రకాలని చెప్పాను కదండీ ప్రమాదకరమైనది ఏంటిది మలిన వాసన శుద్ధ వాసనతో ప్రమాదం లేదండి అది మనకి మేలు చేస్తుంది.
(04:48) ఎలా అంటే జన్మ పరంపరలకి హేతువు కాకుండా ఉంటుంది అది జన్మ రాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. కానీ మలిన వాసన అలా కాదండి ఇది జన్మ పరంపరలకు కారణం అవుతున్నది. ఎందుకంటే ఈ మలిన వాసనలు అనేవి అజ్ఞానం వల్ల మొలకెత్తుతున్నాయండి. అజ్ఞానం అనే క్షేత్రములు మొలకెత్తి ఇవి జన్మ పరంపరలనే వృక్షాలుగా ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తున్నాయండి. ఈ మలిన వాసనలతోనే ప్రమాదం అండి.
(05:13) ప్రధానంగా రెండు మలిన వాసనలుండి జన్మ పరంపరలకు కారణం అవ్వడానికి ఒకటి దేహ వాసన. ఈ దేహమే నేను అనే భావన ఉన్నది చూసారా అండి ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి ఈ దేహమే నేను అని అనుకుంటున్నాడు కనుకనే ఈ దేహానికి వచ్చే వికారాలన్నీ అంటే ఈ దేహంలో కలిగే మార్పులన్నీ తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే తనకేదో అయిపోయినట్టు బాధపడుతున్నాడు.
(05:44) దేహం రంగు మారితే తను రంగు మారాను అని తనకు ఆపదించుకుంటున్నాడు నేను నల్లబడ్డాను తెల్లబడ్డాను ఎర్రబడ్డాను ఇలాంటి దేహానికి కలిగే వికారాలని తనకు ఆపాదించుకుంటున్నాడు. వృద్ధి క్షయాలు దేహ ధర్మాలు అవి తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. నేను ముసలవాడిన అయ్యానని ముసలితనం దేహానికి తనకి కాదు ఎందుకంటే తన యొక్క స్వరూపం తనకు తెలియదు కాబట్టి దేహాంతో తాదాత్మించి చెంది దేహానికి కలిగే వికారాలని తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు.
(06:23) ఇదే ప్రధానమైన జన్మ పరంపరలకి కారణమయ్యే అతి మూల బీజం ఏదయ్యా అంటే ఇదేనండి ఈ దేహమే నేను ఇక రెండవది లోకవాసన చూడండి ఈ ప్రపంచమే సత్యం అనుకొని ఈ ప్రపంచంలోనే సౌఖ్యం ఉన్నదని ఈ ప్రపంచంలోనే సుఖం ఉన్నదని మనిషి ఎంతలా ఈ ప్రపంచంలో పరిగెడుతున్నాడు అంటే తన జీవితానికి కూడా తనకి సమయం లేదండి. ప్రశాంతంగా భోజనం చేయడానికి కూడా సమయం లేన తీరిక లేనంత అంతగా మనిషి పరిగెడుతున్నాడు అన్నమాట.
(07:06) ప్రశాంతంగా ఒక గంటసేపు భోజనం గనికి కూడా కేటాయించలేనంత ఉరుకులు పరుకులు జీవితం అయిపోయింది మనిషికి ఈ ప్రపంచంలో పరిగెడుతూనే ఉన్నాడు. చివరికి ఏమి తీసుకొని వెళ్ళకుండా కన్ను మూస్తున్నాడు. ఎటువంటి జ్ఞానము లేకుండా అజ్ఞానం చేత ఈ ప్రపంచంలో పరిగెడుతున్నాడండి పరిగెత్తి పరిగెత్తి చివరికి కన్ను మూస్తున్నాడు అంతే అమూల్యమైన దుర్లభమైన ఈ మానవ జన్మని వృధా చేసుకుంటున్నాడండి.
(07:35) అందుకే ఒక గొప్ప మాట అంటారండి ఎవరైతే ఈ మానవ జన్మని సార్ధకం చేసుకోరో ఎవరైతే ఆత్మ ఉన్నతికి ప్రయత్నం చేయరో ఎవరైతే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరో వారు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే అంటారండి. తల్లి నవమాసాలు మోసి పురుటి నొప్పులు పడి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టడానికి సిద్ధపడి నీకు జన్మనిఇస్తది ఆ తల్లి అంత కష్టపడతది తల్లి ఒక బిడ్డకు జన్మని ఇవ్వడానికి
(08:20) మరి ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు ఈ ప్రపంచంలో పరిగెత్తి జలసాలు చేస్తూ ఈ ప్రపంచంలో సుఖాల కోసం ఇంద్రియ సుఖాల కోసం ఇంద్రియ భోగాల కోసం గొప్పదైన మనుష్య జన్మను వృధా చేసుకొని చివరికి కాట కాటికి వెళ్లి అక్కడ కట్టెల మీద తగలబడుతున్నాడు అంతే ఏమి చేయటం లేదండి అటువంటి వాడు అటువంటి వాడి జన్మ దేనికి ఎందుకు ఉపయోగం ఆ తల్లి తల్లిని అనవసరంగా కష్టపెట్టిన వాడే కదా అంత కష్టపడి ఆ తల్లి ప్రసవించి ఆ బిడ్డకు జన్మనిఇచ్చింది ఆ ఆ కష్టమంతా వృదాగా మట్టిలో పోసిన పన్నీరే కదా అని శాస్త్రం చెప్తున్నదండి ఎంత ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట
(09:08) తల్లి రుణం జన్మనిచ్చిన తల్లి రోణం తీర్చుకోవడం అంటే ఇది కాక ఇంకేమిటండి ఎండమావి ఎక్కడెక్కడో దూరం నీటి మడుగులా కనబడుతూ ఉంటే దాహం తీర్చుకోవాలని జంతువు పరిగెత్తుకుంటా వెళ్లి వెళ్లి అక్కడికి [నవ్వు] వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు ఎడారిలో మనకి కి నీటి మడుగులా కనబడుతూ ఉంటాయి. అక్కడికి [నవ్వు] వెళ్లి చూస్తే ఏమఉండదు పాపం అది పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వెళ్లి అక్కడ ఏమి పాపం శోష వచ్చి పడిపోతది.
(09:39) మనిషి కూడా అంతేనండి ఈ ప్రపంచంలో తెలియక ఎండమావి లాగా ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నది ఈ ప్రపంచం సత్యము ఈ కనిపించే ప్రపంచం సత్యము. మనం అనుభవించే ప్రపంచం సత్యం అని ఈ ప్రపంచంలో సుఖించాలని చెప్పేసి ప్రపంచంలో ఆనందం ఉన్నది ప్రపంచం నుంచి సుఖం వస్తున్నది అని పరిగెత్తి పరిగెత్తి చివరికి స్మశానంలో కట్టెల మీద తగలబడుతున్నాడు తప్పనుంచి ఏమీ లేదండి ఈ ప్రపంచం సత్యమ అనుకోబట్టే ఈ ఒక వ్యక్తి మీద ఈర్ష ఒక వ్యక్తి మీద రాగము ఒక వ్యక్తి మీద ద్వేషము ఈ ఈర్ష అసూయ రాగద్వేషాలన్నీ ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద వ్యక్తుల మీద కల్పించుకొని సుఖపడుతూ
(10:24) దుఃఖపడుతూ నానా యాతనలు అనుభవిస్తూ ఉన్నాడు. అనేక సంసార బంధాల్ని మీద వేసుకొని తిరుగుతూ ఉన్నాడు జన్మ పరంపరలో మరి వీటికి మార్గం ఏంది మార్గం ఏమిటి అంటే శాస్త్రం చెప్తున్నదండి. ఈ రెండు వాసనలు ఎలా ఎగిరిపోతాయో తెలుసా అండి ఇది దేహ వాసన మరి ఒకటి లోక వాసన ఈ ప్రపంచం యధార్థం అని పరిగెడుతున్నాడు కదా ఈ వాసన ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కదా ఈ వాసన ఈ రెండు వాసనలు ఒక దెబ్బకి ఎగిరిపోతాయండి ఒక గొప్ప ఒక గొప్ప వేదసారం ఉన్నదండి బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవ నాపరః
(11:09) బ్రహ్మమే సత్యము ఈ జగత్తు మనం ఏదైతే సత్యము అని అనుకుంటున్నామో ఈ జగత్తు మిత్య అని గ్రహించి ఈ జీవుడు ఈ నేను అని ఎవరైతే అంటున్నారో అతడు ఈ దేహం కాదు సాక్షాత్తు ఈశ్వరుడే బ్రహ్మమే జీవో బ్రహ్మైవ నాపరః ఈ జీవుడు సాక్షాత్తు బ్రహ్మమే అన్న ఎరుక కలిగిననాడు అన్న జ్ఞానం గనుక కలిగిననాడు అనుభవ జ్ఞానం అండి ఆ అనుభవ జ్ఞానం కలిగి నప్పుడు ఆ అనుభవం ఉంది చూసారా అండి ఆ అనుభవం మనసు యందు వాసనగా ఏర్పడుతదండి.
(11:49) అదియే శుద్ధ వాసన అండి ఈ శుద్ధ వాసనలు జ్ఞానం వల్ల ఏర్పడతాయండి. అందుకే చెప్తారండి ఏ మనసైతే ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నది సుఖం ఉన్నది ఆనందం ఉన్నది అని ఈ ప్రపంచంలో పరిగెడుతూ ఉన్నదో ఆ మనసును విచారణ చేత అంటే ఆత్మ విచారణ నేనెవరు ఈ జగత్తు ఏమిటి ఇది ఎంతకాలం ఉంటుంది మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను జన్మించక ముందు ఎక్కడినుంచి ఎక్కడి నుంచి వచ్చాను [గొంతు సవరించుకోవడం] ఇటువంటి విచారణ అసలు నేను ఎవరు భగవంతుడు ఎవరు ఈ విచారణ ఆత్మ విచారణ దీని ద్వారా మనసుని అంతర్ముఖం చేయాలండి.
(12:34) అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసి ఈ ప్రపంచం ఉన్నది చూసారా దీని యొక్క యధార్థ స్వరూపం ప్రపంచం యొక్క మిత్యాత్వం దీని యొక్క స్వరూపానికి సంబంధించిన అవగాహనని మనసుకు తెలియజేయాలండి. ఎంతకాలం ఇది సత్యమని మీ మనసు పరిగెడుతున్నదో అంతకాలం మీరు సంసార బంధనాలో తగులుకొని ఉంటారండి సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఈ ప్రపంచం యొక్క యధార్థ తత్వం గురించిన అవగాహన మనసుకు బాగా తెలియజేయాలండి దీని యొక్క మిద్యాత్వం గురించి అవగాహన మనసుకు బాగా తెలియజేసి అధిష్టానం ఉండేది చూసారా అండి అధిష్టానమైన ఆ సత్పదార్థం దాని యొక్క అవగాహన మనసుకు బాగా
(13:19) కలిగించినట్లయితే ఇక [నవ్వు] మనసు ప్రపంచం వెళ్లదండి. ప్రపంచం వెళ్ళమన్నా గాన అది వెళ్ళదండి. అది ప్రపంచం వెళ్ళకుండా ఈ ప్రపంచానికి ఆధారమైన ఒకటి సద్వస్తువు ఒకటి ఉన్నది చూసారా అంటే సత్పదార్థం సన్మాత్రము అంటే ఉనికి ఉనికి మాత్రంగా అన్నిటిలో ఉన్న ఆ సత్పదార్థం ఉన్నది చూసారా అండి దాని వైపు మీ మనసు వెళ్తుందండి. బాగా విచారణ చేసి విచారణ చేయాలండి విచారణ చాలా ముఖ్యంఅండి.
(13:54) బాగా విచారణ చేసి మనసుకి సత్యాన్ని బాగా వంటపట్టించాలండి మనసు పట్టుకోవాలండి అంత మూలంఅంతా మనసు దగ్గరే ఉందండి ఆ మనసు పట్టుకోవాలి మనసు ఒక్కసారి పట్టుకున్నదా ఇంకా అది అసలు చస్తే వదలదండి ఇప్పుడు మీ మనసే కదండీ ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నదని పట్టింది ఆ పట్టు ఉడు పట్టులో పట్టి ప్రపంచంలో మిమ్మల్ని పరిగెత్తిస్తున్నది. అదే మనసుకి సత్య సత్యానికి సంబంధించిన అవగాహనను కల్పించాలండి బాగా విచారణ చేసి మనసుకి ఆ సత్య అవగాహన కల్పించి ఈ జగత్తు యొక్క మిధ్యాత్వం గురించి అవగాహన బాగా కల్పించి మన మనసుని
(14:39) అలా దృడంగా గనక చేసినట్లయితే ఇక ఈ మనసు ప్రపంచం వైపు వెళ్లదండి అది ఎలా అంటే ఒక గొప్ప మాట చెప్తారండి పెద్ద మదగజం ఉండిది చూసారా అండి పెద్ద మదగజము మావటి వాని చేతిలో అంకుశానికి లొంగినట్లు మనసు ఉంది చూసారా అండి మనసు వివేకం అండి వివేకం అంటే నిత్యాన్ని ఏది నిత్యము ఏది అనిత్యము ఈ వివేకం నిత్యానిత్య వస్తు వివేకం సో ఇటువంటి వివేకాన్ని మనసు గనక కలిగించినట్లయితే ఈ మనసు పెద్ద మదగజము మావటి వాని చేతిలో లోని అంకుశానికి లొంగినట్లు మనసు వివేకమనే
(15:24) అంకుశానికి లొంగి విచారణ విచారణ అనే శాల యందు విశ్రమిస్తుంది అంటున్నారండి. చూడండి ఇంతకాలం మిమ్మల్ని ఏ మనసైతే దుఃఖ పెట్టిందో ఏ మనసైతే ఈ ప్రపంచంలో వస్తువు వస్తువుల్ని వివిధ నామరూపాలతో చూపించిందో ఏ మనసైతే ప్రపంచంలో ఇది ఫలానా ఇది ఫలానా అని మిమ్మల్ని చూపించి ఆ వస్తువుల్ని అనుభవించేలాగా మిమ్మల్ని ప్రేరేపించి విషయాల్లో తగులుకొనేటట్లు చేసిందో ఎప్పుడైతే ఈ మనసు జ్ఞానపూర్ణం అవుతున్నదో
(16:11) అంటే జ్ఞానంతో నిండి ఉంటున్నదో అంటే శుద్ధ వాసనలు అని చెప్పాను చూసారా అండి శుద్ధ వాసనలతో నిండి ఉంటుందో అప్పుడు మీ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి ఎక్కడెక్కడైతే మీ మనసు పడుతుందో అంటే ఏ ఏ వస్తువునైతే మీ మనసు చూస్తుందో ఆయా వస్తువును బ్రహ్మ స్వరూపంగా మనసు మనసు చూపిస్తూ ఉంటుందండి గుర్తుపెట్టుకోండిండి మీ మనసు శుద్ధ వాసనలు అంటే బ్రహ్మ జ్ఞానంతో మీ మనసు జ్ఞానపూర్ణంగా ఉన్నప్పుడు బ్రహ్మ జ్ఞానంతో మీ మనసు నిండి ఉన్నప్పుడు మీ మనసు ఏ ఏ వస్తువునైతే చూస్తుందో ఎక్కడెక్కడైతే మీ మనసు పడుతుందో ఆయా వస్తువును బ్రహ్మ స్వరూపంగా మీ మనసు చూపిస్తూ ఉంటుందండి. అందుకే శాస్త్రంలో ఒక
(16:59) గొప్ప మాట చెప్తారండి యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర సమాదయః అని చెప్పేసి చెప్తారన్నమాట ఎక్కడెక్కడైతే నీ మనసు పడుతుందో అన్నిటిని అన్నిటిని సమా సమంగా మీ మనసు చూపిస్తూ ఉంటదండి అంటే అన్ని బ్రహ్మమే అన్న భావనలో మీ మనసు ఉంటదండి ఇప్పుడు మట్టి ఉందండి మట్టితో కుడ్డ చేశారు మూకుడు చేశారు పూజ చేశారు ముంత చేశారు ఈ నాలుగిటిని మీ మనసు చూసినప్పుడు మీ మనసు ఈ నాలుగు వస్తువుల మీద పడినప్పుడు ఈ జ్ఞానపూర్ణమైన మనసు ఎలా చూపిస్తుందో తెలుసా అండి ఇది కుండ ఇది మూకుడు ఇది ఇది ముంత ఇది కూజ అని ఈ నామ రూపాలు ఉన్నాయి
(17:45) చూసారా అండి ఇది చూడదండి మృతికేత్యేవ సత్యం వాచారంభనం వికారో నామధేయం మృతికేతేవ సత్యం అన్న చాందయోగ్య శృతి ప్రకారం మీ మనసు అన్ని వస్తువుల్లో సమంగా ఏముందండి సమంగా వ్యాపించి మట్టే కదండీ మట్టే సత్యం ఆ మట్టినే మీ మనసు చూపిస్తూ ఉంటదండి. ఆ నామరూప విశేషాలను చూపించదండి. నామరూపే విశేషణాలను తొలగించి ఆ ఆధారమైన ఆ మృత్తిక మట్టిని మాత్రమే మీ మనసు చూపిస్తూ ఉంటదండి.
(18:27) అలా ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు నామ రూపాలు ఉంటాయి చూసారా అండి నామ రూపాలను విస్మరించి ఆధారమైన బ్రహ్మము ఎలాగైతే కుండకు మట్టి ఆధారమో అలా ప్రతి వస్తువుకి బ్రహ్మము ఆధారమై ఉన్నది కదండీ సో ఆ బ్రహ్మమును మాత్రమే మనసు చూపిస్తూ ఉంటుందండి ఇటువంటి మనసుఅండి జీవుని ముక్తుని చేస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి మనసు జీవుడిని ముక్తుని చేస్తుంది ఉన్నది ఇక ఆ మనసు జీవుడిని ప్రపంచంలో బంధించదండి.
(19:03) ఎందుకంటే భేద దృష్టి ఉన్నంతవరకేనండి సంసారం ఉండేది. భేద దృష్టి నశించి అభేద దృష్టి ఈ అభేద దృష్టి గనుక వచ్చినట్లయితే అతడిని ఇక దుఃఖ పెట్టగలిగినది ఏది లేదండి. ఇప్పుడు వేరు అని తెలిసినప్పుడే కదండీ మనకి ఒకదాని యందు ఈర్ష ఒకదాని యందు ద్వేషము ఒకదాని యందు రాగము ఇలాంటి భావాలన్నీ కలిగేది. అంతట అన్నీ ఒకటే అని తెలిసినప్పుడు దేని యందు ఈర్ష ఉంటది దేని యందు ద్వేషం ఉంటదండి.
(19:41) ఇప్పుడు మీరు ఉన్నారండి మీ మీద మీకు ఏమనా ద్వేషము ఈర్ష అసూయ ఉంటదండి మీ మీద మీకు ప్రేమే ఉంటది. అలానే ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా మీరు మీలో మీలో ఉన్న బ్రహ్మమే ఎదురుగా ఎదుటి వ్యక్తిలో కూడా నిండి ఉన్నది. అన్న జ్ఞానం మీకు కలిగినప్పుడు సాటి జీవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉంటారండి వేటి పట్ల మీకు ద్వేషం ఉండదు. మీ మనసు పని చేయదండి అక్కడ. మనసు పని చేస్తున్నది అంటే మనసు పని చేస్తున్నది అన్నదానికి గుర్తు ఏందో తెలుసా అండి.
(20:15) అది మిమ్మల్ని ప్రపంచంలో పడేస్తూ ఉంటదండి. మిమ్మల్ని ప్రపంచంలో గనుక మీ మనసు లాగుతుంది అంటే అంటే ప్రపంచంలోకి వెళ్లి ప్రపంచంలో వస్తువులు అనుభవించాలి ఈ ప్రపంచం సత్యము అని మీ మనసు ఈ ప్రపంచంలో గనుక లాగుతుంది అంటే మీ మనసు పని చేస్తున్నదండి మీ మనసు మేల్కొని ఉన్నది. ఇటువంటి మనసు మిమ్మల్ని బంధిస్తదండి. కానీ జ్ఞానపూర్ణమైన మీ మనసు అంటే బ్రహ్మ భావనతో నిండిన మీ మనసు మిమ్మల్ని ప్రపంచంలో పరిగెత్తించదండి.
(20:56) అటువంటి మనసు మిమ్మల్ని ముక్తుని చేస్తదండి మిమ్మల్ని పూర్ణ ఆనందంలో ఉంచుతుందండి. అటువంటి మనసు ముందు చూశరండి అది అమనస్కం అయిపోతదండి. అది ఉన్నా లేనట్లేనండి. ఈ విధంగా అమనస్తమైన మనసు అది ఉన్నా లేనట్లే ఎందుకు ఎందుకు అంటే అది నిన్ను సంసారమును బంధించదండి మరల ఇక మరలా జీవుడిని అజ్ఞానంలో పడవేసి ప్రపంచంలో బంధించదండి అది నశించిన మనసు ఇబ్బంది పెట్టదండి ఈ ప్రపంచం సత్యమని ఈ ప్రపంచంలో పరివెత్తదు ప్రపంచాన్ని మిధ్యగా చూపించి అధిష్టానమైన పరమాత్మను సత్యంగా చూపిస్తదండి.
(21:37) సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తదండి ఆ మనసు ఆ జ్ఞాన దృష్టితో ఈ జీవుడికి గల సంసార బంధనాలన్నీ తొలగి ముక్తుడు అవుతున్నాడండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తదండి అమనస్కము అని చెప్తున్నాం కదండీ అమనస్కం అంటే మనసు లేని స్థితి మరి మనసు లేకుండా ఉండడం ఎలా సాధ్యంఅండి చూడండి మనం ప్రపంచంలో ఏదైనా వ్యవహారం నడపాలి అంటేనే మనసు ఉండాలి కదండీ ప్రపంచంలో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదనా అసలు మనం ఏదైనా ఒకటి ఆలోచించాలి అన్నా ఏదైనా ఒక పని పని చేయాలన్నా గాన
(22:22) మనసు ఉండాలి కదండీ మనసు లేకపోతే ఏం ఆలోచిస్తాం ఏం క్రియలు చేస్తాం అసలు ఒక విషయాన్ని గ్రహించాలి అంటేనే మనసు ఉండి తీరాలి కదండీ అందుకే మనం పరధ్యానంలో ఉంటూ ఎదురుగా వ్యక్తి చెప్పే మాటలు కూడా మనకి మనం గ్రహించలేం. అందుకే చెప్తున్నారు మనకి అమనస్కంలో చెప్తున్నారు ఈ అమనస్క స్థితిలో మనసు ఉంటుంది కానీ ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది అంటున్నారు అన్నమాట అంటే శుద్ధ వాసనలతో నిండి ఉంటుందండి శుద్ధ వాసనలతో నిండి ఉండి ఎలా అంటే
(23:11) ఈ తత్వజ్ఞానం చేత తత్వజ్ఞానం అనే గంగాజలం చేత మనసు యొక్క మాలిన్యం కడిగివేయబడి మనసు స్వచ్ఛమైన అర్థం శుద్ధ వాసనలతో నిండి ఉండి చూడండి నిర్మలమైన అద్దం ఎలాగైతే చంద్రుని ప్రతిబింబాన్ని స్పష్టంగా గోచరింపజేస్తుందో అలానే శుద్ధమైన మనసు అదే ఈ శుద్ధమైన మనసే ఆమనస్కానికి తీసుకొని వెళ్తుందండి శుద్ధమైన మనసు యందు పరమాత్మ ప్రతిబింబం స్పష్టంగా గోచరిస్తుందండి.
(23:44) అంటే ఏమిటంటే మనసు బ్రహ్మాకార వృత్తి అండి మన మనసు యందు వృత్తి ఒక వస్తువు రూపాన్ని పొందడము తదాకార వృత్తి అన్నాం కదండీ గత వీడియోలో చెప్పున్నాము మన మనసు యందు వృత్తి ఒక వస్తు రూపాన్ని పొందడం దాన్నే తదాకార వృత్తి అంటారు. ఒక విషయానికి సంబంధించిన వృత్తి మన మనసులో ఏర్పడితే దాన్ని విషయాకార వృత్తి అంటారు. అదేనండి బ్రహ్మాకార వృత్తి మన మనసంతా బ్రహ్మ భావంతో నిండి ఉంటదండి మన మనసులో మన మనసంతా బ్రహ్మ భావనతో నిండి ఉండి సర్వాన్ని బ్రహ్మ స్వరూపంగా చూపిస్తూ ఉంటదండి అందుకే అటువంటి మనసు ఉన్నా లేనట్లేనండి
(24:35) ఎందుకంటే అది మరలా మనల్ని ఇబ్బంది పెట్టదండి మరలా మనల్ని ఈ ప్రపంచంలో పరిగ పరిగెత్తించదండి అందుకే చెప్తారు అమనస్కం అయితే మనసు అమనస్కం అయితే అది ఉన్నా లేనట్లే పరమాత్మలో లయమైపోయినట్లే అంటున్నదండి శాస్త్రం అంటే అది ఉన్నా లేనట్లే ఎందుకంటే అది ఇబ్బంది పెట్టదు ఒక మంచి సేవకుడు ఒక మంచి సేవకుడు ఉన్నాడు అనుకోండి అతను ఎలాగైతే తన యజమానికి సేవ చేస్తాడో అలా అమనాస్కమైన మనసు ఆ జీవునికి సేవ చేస్తుందండి.
(25:16) ఆ జీవుడిని బంధనం నుంచి విడిపించి ముక్తుని చేస్తదండి. అందుకే మనకి ముక్తికోపని శక్తి ఒక గొప్ప మాట చెప్తుందండి. మనసు యొక్క ఉదయం నశిస్తే మనోశం అవుతుంది. మహోదయం అవుతుంది. జ్ఞానులకు మనసు నాశనం అవుతుంది అజ్ఞానులకు మనసే సంఖ్యలు అవుతుంది అంటుందండి. మనసః అభ్యుదయో నాసో మనోనాసో మహోదయః న మనోనాసం అభ్యయతి మనః అజ్ఞస్హి శృంఖల అంటున్నది ముక్తికోపనిషత్ అందుకేనండి ఈ మనసేనండి మనోనాశం సిద్ధించాలి అండి మనోనాశం గనుక సిద్ధించింది అంటే ఆ మనస్సు ముక్తికి హేతువు అవుతుందండి.
(26:03) తత్వజ్ఞానం చేత వాసనాక్షయము వాసనాక్షయం చేత మనోనాశము ఈ మనోనాశనం చేత జీవన్ ముక్తి కలిగి తీరుతుందండి. అందుకే ఇక్కడ ముక్తికోపనిషత్తు కూడా చెప్తున్నది. అజ్ఞానికి తన మనసే అతి పెద్ద శత్రువు ఎందుకంటే అదే అతన్ని బంధాల్లో కట్టివేస్తుంది. జ్ఞానికి మనోనాశనం సిద్ధించి ఉంటుంది. అదే ఆ మనసే అతనికి గొప్ప బంధువు అవుతుంది అంటున్నదండి ముక్తికోపని చెత్తు కూడా మనసేనండి రెండు వైపుల పదునున్న కత్తి ఇటు బంధంలో బంధించాలి అన్నా అటు మిమ్మల్ని విడిపించాలి అన్నా ఇటు ముక్తి విడుదల అండి ఆ విడుదలే ముక్తి అటు మిమ్మల్ని విడుదల చేయాలి అన్నా ఇటు బంధించాలి అన్నా ఈ
(26:49) మనసేనండి. సో అందుకే అన్ని శాస్త్రాలు అన్ని సాధనలు అన్ని సాధనలు ఈ మనసు దగ్గరికే వచ్చి చేరుతాయండి. ఈ మనసునే మూలంగా చేసుకొని ఉన్నాయి అన్ని ఆధ్యాత్మిక సాధనలు ఆ జ్ఞాన దృష్టి రావాలండి తత్వజ్ఞానం చేత ఆ జ్ఞాన దృష్టి మనసు జ్ఞానపూర్ణమై ఆ బ్రహ్మాకార వృత్తిని పొందినప్పుడు సర్వాన్ని బ్రహ్మమయంగా చూపిస్తూ ఉంటదండి. ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువుని మీ మనసు చూస్తుందో ఆయా వస్తువుని బ్రహ్మ స్వరూపంగా దర్శింపజేస్తూ ఉంటదండి.
(27:31) అంటే భేద భావన ఉండదండి [సంగీతం] అన్నిటిని బ్రహ్మ స్వరూపంగా ఏక స్వరూపంగా దర్శింపచేస్తూ ఉంటదండి. ఆ అభేద దర్శనాన్ని ఆ మనసు ఇస్తుందండి. అందుకే స్కందోపనిషత్తు ఒక గొప్ప మాట అంటుదండి అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః అంటున్నదండి స్కందోపనిషత్తు మనసులోని వృత్తులు తాత్కాలికంగా లయించడం ధ్యానం అయితే అభేద దర్శనమే జ్ఞానం అనే స్కందోపనిషత్ అండి ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళానిసం
(28:17) తు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి

No comments:

Post a Comment