సాంగత్యమే సంస్కారం ఎలాంటి గూడు… అలాంటి గుణం
Author Name:Sreesudhee TV
Youtube Channel Url:https://www.youtube.com/@SreesudheeTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c9vaOrzOcr8
Transcript:
(00:00) శ్రీమాత్రే నమః అనగనగనగా ఓ రాజుగారు వేట కోసం అడవికి వెళ్ళారు. రోజంతా వేటాడి అలసిపోయిన ఆయనకు తీవ్రమైన దాహం వేసింది. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని చుట్టూ వెతికారు. తన పరివారానికి దూరమై ఒంటరిగా వచ్చిన రాజుగారు ఎండకు దాహానికి తట్టుకోలేక అన్ని వైపులా తిరుగుతున్నారు. కొంతసేపటికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు వెనుక కొన్ని గుడిసెలు ఉన్నాయి.
(00:34) ఇక్కడ మనుషులు ఉన్నట్టున్నారు అనుకొని రాజుగారు అక్కడికి చేరుకున్నారు. ఆ చెట్టు మీద ఒక చిలుక కూర్చొని ఉంది. రాజుగారిని చూసిన వెంటనే అది గట్టిగా ఎవరో ధనవంతుడు వచ్చినట్టున్నాడు. ఒంటి మీద బంగారు ఆభరణాలు మెరుస్తున్నాయి. త్వరగా రండి వీడి మీద పడి దాడి చేసి ఉన్నదంతా లాక్కోండి అని అరిచింది. ఆ మాటలు విన్న రాజుగారు ఆశ్చర్యపోయారు.
(01:00) ఇదేంటి చిలుక ఇలా మాట్లాడుతుంది అనుకని లోపల ఎంతమంది దొంగలు ఉన్నారో తెలియదు. అసలే దాహం అలసటతో శరీరం నీరసించింది. ఇప్పుడు వీళ్ళతో పోరాడే స్థితిలో లేను. అలసట తీరాక వీళ్ళ సంగతి చూద్దాం. అనుకని వెంటనే గుర్రాన్ని మరో దారికి మల్లించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ముందున్న చెట్టు మీద కూడా ఒక చిలుక ఉంది.
(01:29) అది రాజుగారిని చూసి ఎంతో మృదువుగా నమస్కారం రండి రండి అని ఆహ్వానించి ఎవరో పెద్ద మనిషి వచ్చినట్టున్నారు. అలసిపోయి ఉన్నారు త్వరగా వచ్చి అతిథిని లోపలికి ఆహ్వానించండి ముందుగా ఆయనకు దాహం తీర్చండి అన్నది. ఆశ్రమంలోని మునులు ఆయనకు ఆదిత్యం ఇచ్చి నీళ్లు ఇచ్చి గౌరవంగా చూసుకున్నారు. కొంతసేపటి తర్వాత రాజుగారు అక్కడి మునిని అడిగారు.
(02:00) స్వామి ఒకేలా కనిపించే రెండు చిలుకలు ఇంత భిన్నంగా ఎలా మాట్లాడుతున్నాయి అని ముని చిరునవ్వుతో మహారాజా ఈ రెండు చిలుకలు ఒకే తల్లి పిల్లలు కానీ ఒకటి దొంగల మధ్య పెరిగింది. వారి మాటలు వారి స్వభావం నేర్చుకుంది. మరోటి ఈ ఆశ్రమంలో పెరిగి మర్యాద సంస్కారం అలవర్చుకుంది. పుట్టుకతో రెండు ఒకటే అయినా పెరిగిన వాతావరణం వాటి స్వభావాన్ని మార్చేసింది.
(02:30) సృష్టిలో ఏ జీవినైనా మార్చేది దాని పుట్టుక కాదు దాని సాంగత్యం. అందుకే పుట్టుక కంటే పెంపకం గొప్పది. సాంగత్యం మనిషి భవిష్యత్తును నిర్మిస్తుంది. మనం మాట్లాడే మాట మన సంస్కారానికి అర్థం పడుతుంది. మీరు మొదటి చిలుక మాటలకు కోపంతో స్పందించలేదు అలాగే రెండో చిలుకను చూసి ఆనందంలో కూడా మునిగిపోలేదు. ఆలోచించారు పరిశీలించారు కారణాన్ని అన్వేషించి తెలుసుకున్నారు.
(03:03) అలా ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు అతని ప్రవర్తనను మాత్రమే కాదు ఆ ప్రవర్తన వెనుక ఉన్న వాతావరణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మంచి సాంగత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అంతే కదా మహారాజా అన్నాడు ఆముని నిజమే ఒక వ్యక్తిని అంచనా వేసి నిర్ణయించే ముందు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిశీలించాలి అన్నారు రాజుగారు ఈ రోజుల్లో గూడు అంటే కేవలం ఇల్లు లేదా ఊరు మాత్రమే కాదు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మనము చూస్తున్న వీడియోలు చదువుతున్న కంటెంట్ మన స్నేహితుల వర్గం ఇవన్నీ మన గూడే మనం రోజంతా ఎలాంటి సమాచారాన్ని
(03:46) గ్రహిస్తున్నామో ఆలోచనలు కూడా అలానే మారిపోతాయి. వాతావరణం మారితే మనసు మారుతుంది. మనసు మారితే మనిషి మారిపోతాడు. మంచి పుస్తకాలు మంచి స్నేహితులు మంచి ఆలోచనలు సంస్కారవంతమైన వాతావరణం ఉంటే జీవితం మహోన్నతంగా మారుతుంది. సత్సంగత్వే నిసంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిహి అన్నారు జగద్గురువులు అటువంటి సత్సంగం మనకు దొరకాలన్నా జీవన్ముక్తి వైపు మనం నడవాలన్నా మనమంతా ఆ విశ్వశక్తికి చెందిన ఒకే గూటి పక్షులం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
(04:30) ఆ చైతన్య శక్తితో మన అనుబంధం నిరంతరం నిలకడగా ఉంటే మనకు ఆ నిశ్చల తత్వం సిద్ధిస్తుంది. మన మాటల్లో ప్రేమ మన హృదయంలో కరుణ మన జీవితంలో సంస్కారం వెలుగుతుంది. ఆ వెలుగే జీవన్ముక్తికి మార్గం అవుతుంది. జై శ్రీరామ్!
No comments:
Post a Comment