Saturday, May 16, 2026

శ్రీకృష్ణ తులాభారం : కాపురాన్ని నిలబెట్టే పాఠం | EGO | SEETAKANTH TALKIE

శ్రీకృష్ణ తులాభారం : కాపురాన్ని నిలబెట్టే పాఠం | EGO | SEETAKANTH TALKIE

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3SHBFl4ljlY



Transcript:
(00:00) శ్రీకృష్ణ తులాభారం కథ తెలుసా టన్నుల బంగారం ఓడిపోయింది ఒక్క చిన్న తులసి ఆకు గెలిచింది. ఎందుకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే నరకంలా మారిపోయిన చాలా కాపురాలు స్వర్గంలా మారిపోతాయి వివాహ బంధం నుంచి బయటికి వచ్చేయాలి అనుకుంటున్న చాలామంది తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. తులాభారానికి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఎందుకంటే సమస్య గురించి ముందుగా మాట్లాడుకుంటేనే తర్వాత దాని మందు గురించి మాట్లాడుకోగలం.
(00:30) ఒక కాగితం మీద పడ్డ రెండు సంతకాలు నాలుగు ప్రాణాల్ని నిలువున కోసేసిన దృశ్యం అది ఫ్యామిలీ కోర్టు బయట మెట్ల మీద 10ఏళ్ల బాబు ఎనిమిదఏళ్ల పాప చాలా దిగులుగా భయంతో వణకుతూ కూర్చున్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ చెల్లెలు అడుగుతుంది అన్నయ్య మనం మళ్ళీ కలిసి ఒకే ఇంట్లో ఉండమా అని దానికి ఆ బాబు ఏడుస్తూనే ఏమో చెల్లి అమ్మ నాన్నలు గొడవ పడుతున్నారు ఇద్దరు వేరు వేరు ఇళ్లల్లో ఉంటారంట నన్ను నాన్న తీసుకుపోతే నిన్ను అమ్మ అమ్మ తీసుకుపోతుందట అని చెప్పాడు.
(01:01) ఆ మాట వినగానే ఆ చిన్నారి గుండె పగిలిపోయింది. గట్టిగా వాళ్ళ అన్నయని పట్టుకొని వద్దన్నయ్య నన్ను వదిలి వెళ్ళద్దు మనం కలిసి ఉందాం అమ్మ నాన్న కూడా కలిసే ఉండాలి అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే కోర్టు లోపల నుంచి విడాకులు మంజూరైన భార్య భర్తలు వాళ్ళ పేర్లు రవి కల్పన బయటిక వచ్చారు రవి బాబు చెయ్యి పట్టుకొని కల్పన పాప చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు.
(01:25) ఒకే గర్భంలో పుట్టి ఒకే కంచంలో తిన్న ఆ ఇద్దరు పిల్లలు మమ్మల్ని వేరు చేయొద్దు అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు నన్ను వదిలి వెళ్ళద్దమ్మా అని బాబు ఏడుస్తుంటే మీతో కలిసి ఉంటాను నాన్న అని పాప ఏడుస్తుంది. కానీ ఆ భార్యా భర్తలకి పిల్లల ఏడుపు వినిపించడం లేదు ఎందుకంటే వాళ్ళ మనసులు అవిటి అయిపోయాయి. అక్కడ ఉన్న రవి తల్లిదండ్రులు కల్పనా తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక్కసారి ఆ పిల్లల మొహాలు చూసియనా రాజీ పడండిరా కాపురం నిలబెట్టుకోండి అని బతిమాలుతున్నారు.
(01:54) కానీ వాళ్ళకి ఎవరి మాటలు తలకెక్కే పరిస్థితి లేదు. విడాకులు అప్లై చేయడానికి ముందే ఆలోచించని వాళ్ళు విడాకులు వచ్చాక ఆలోచిస్తారా విడాకులు అనేవి ఆ భార్యా భర్తలకు ఒక స్వేచ్ఛ కావచ్చు కానీ ఆ పిల్లలకు అదిఒక బతికున్నంత కాలం వెంటాడే నరకం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు వీళ్ళ కాపురం ఎందుకు కూలిపోయింది? భర్త సాడిస్టా భార్య మోసం చేసిందా అత్తమామలు టార్చరా ఇవేమీ కాదు ఆ పచ్చని కాపురం కుప్పక కూలిపోవడానికి ఆ పిల్లలు సగం అనాధలు అవ్వడానికి ఒకే ఒక్క కారణం ఈగో ఈజీ ఓ భార్య దగ్గర నేను ఎందుకు తగ్గాలి అన్న అహంకారం భర్తది భర్త దగ్గర నేను ఎందుకు
(02:29) తలవంచాలి అన్న పొగరు భార్యది. ఇక్కడ మనక ఒక సూటి ప్రశ్న మరి భార్యా భర్తలు ఇద్దరు ఎవరికి వాళ్ళు ఇగోలతో తల ఎత్తుకొని నిలబడితే ఆ కాపురాన్ని ఎవరు నిలబెట్టాలి? ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు తల వంచాలి ఇంగ్లీష్ లో ఒక కోట్ ఉంది ఈగో ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ డిస్ట్రాయ్ రిలేషన్షిప్ సో బి ఏ బిగ్గర్ పర్సన్ స్కిప్ ద ఈ అండ్ లెట్ ఇట్ గో ఒక అద్భుతమైన బంధాన్ని సర్వనాశనం చేయడానికి కత్తులు బాంబులు అక్కర్లేదు మీలో ఉన్న ఈగో అనే ఒక్క ఆయుధం చాలు కాబట్టి ఆ బంధం కోసం ఒక గొప్ప వ్యక్తిలా ఆలోచించండి ఈగోలో నుంచి ఈ ని తీసేసి అహంకారాన్ని వెళ్ళిపోనివ్వండి. లెట్ ఇట్
(03:06) గో ఒక ఇగో పెరిగి పెద్దదై రెండు జీవితాలను ఎలా బలి తీసుకుంటుందో రవి కల్పనల గతంలోకి వెళ్తే అరే ఈ మాత్రానికే జీవితాన్ని నాశనం చేసుకున్నారా కాస్త సద్దుకుపోతే ఒక అద్భుతమైన కుటుంబంలా నిలబడేది కదా అనిపిస్తుంది. ఇప్పుడు గతంలోకి వెళ్దాం రవి కల్పన ఇద్దరూ కలిసి ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరికీ మంచి కంపెనీస్ లో లక్షల జీతాలతో జాబ్స్ వచ్చాయి.
(03:30) ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అకౌంట్ లో బ్యాలెన్స్ పెరిగింది కానీ వాళ్ళ మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన కృతజ్ఞత తగ్గిపోయింది. ఎంత ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళయినా సరే జీవితంలో ఎప్పుడూ ప్రతిక్షణం ఆ ప్రేమనే చూపించడం ప్రాక్టికల్ గా కుదరదు ఆఫీస్ టెన్షన్లు కోపాలు అలసట అన్ని కలిపి ఒక మనిషిలో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాయి అలాంటిదే వాళ్ళ మధ్య కూడా జరిగింది.
(03:54) ఒకరోజు రవి ఆఫీస్ వర్క్ ఒత్తిడిలో ఉండి కల్పనని కొంచెం కోపంగా కసురుకున్నాడు. ఇక్కడ కల్పన ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ ఒక్క క్షణం సైలెంట్ గా ఉంటే సరిపోయేది కానీ ఆమె ఈగో కూడా హర్ట్ అయింది. వెంటనే నీకు నా మీద ప్రేమ లేదు ఏదో నాకు జాబ్ ఉందని నేను కూడా సంపాదిస్తున్నానని నన్ను పెళ్లి చేసుకున్నావ్ అని ఒక దారుణమైన మాట అంది. మాటలు కత్తులు కావు గానీ అవి చేసే గాయాలకు మందు ఈ భూమ్మీద దొరకదు.
(04:22) నిజానికి రవి ఏదో చిరాకులో అన్నాడు దానికి ఆగలేక ఆమె కూడా కోపంతో ఒక మాట అంది సర్లే అనుకొని అక్కడితో ఆపేస్తే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండేది కానీ కల్పన అన్న ఆ ఒక్క మాటతో రవి ఈగో కూడా నిద్రలేచింది నాకు కూడా జాబ్ ఉంది కాబట్టే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ లేదంటే నా వైపు కూడా చూసి ఉండేదానివి కాదు అని రవి ఎదురుడి చేశడు నా ప్రేమనే అవమానిస్తావా అని కల్పన నన్ను అనుమానిస్తావా అని రవి ఇలా వాళ్ళద్దరి మధ్య మాట మాట పెరిగి ఇగో క్లాస్ స్టార్ట్ అయింది చూడటానికి ఇది సిల్లీగా అనిపించొచ్చు కానీ దాంపత్యం అనే చెట్టు పచ్చగా ఉండాలంటే ప్రతిరోజు నీళ్లు పోయాలి కానీ వీళ్ళు ఒకరి
(04:58) మీద ఒకరు గెలవాలన్న పంతంతో రోజు ఇగో అనే విషాన్ని పోశారు. దాంపత్యంలో బ్యూటీ ఏంటంటే ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అంతలోనే పశ్చాత్తాప పడి కలిసిపోయే ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇన్నాళ్ళు కాపురం ఎలాగోలాగా సాగదీశారు వాళ్ళద్దరు సంతోషంగా కలిసి ఉండటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలేసి వాళ్ళ మధ్య వచ్చే ప్రతి ఆర్గ్యుమెంట్ కి ఈగోను జోడించారు.
(05:26) వీళ్ళ ఈగోలు ఏ స్థాయికి వెళ్ళాయి అంటే ఒకే ఇంట్లో ఉంటున్న పిల్లల బాధ్యతల్ని ఆఫీస్ షిఫ్ట్లా వాటాలు వేసుకోవడం మొదలు పెట్టారు. పొద్దున ఒకరు స్కూల్లో డ్రాప్ చేస్తే సాయంత్రం ఇంకొకరు పికప్ చేసుకోవాలి. ఒకరు ఖాళీగా ఉండి ఇంకొకరు ఆఫీస్ లో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల్ని తీసుకురావడం ఇవాళ వాళ్ళ డ్యూటీ కదా నాకేంటి సంబంధం అని పంతానికి పోయేవాళ్ళు కన్న పిల్లల్ని ఒక బాధ్యతలా కాకుండా ఒక డ్యూటీలా ఫీల్ అయ్యే అంతలా వాళ్ళ మనసులో ఆ ఈగో కమ్మేసింది.
(05:53) ఒకరికొకరు సపోర్ట్ గా కాకుండా కేవలం నేను నా పని చేశాను అని బతికితే అది హాస్టల్ రూమ్ అవుతుంది తప్ప కాపురం ఎలా అవుతుంది ఈ ఈగో క్లాషస్ కాస్త చివరికి బంధాలని ఎలా కాల్చేసాయో చూడండి. నాలుగు నెలల క్రితం రవి అమ్మ నాన్నలు ఊరు నుంచి వచ్చారు అమ్మ నాన్నలు వస్తున్నారు రెండు రోజులు సెలవు పెట్టు కల్పన అని అడిగాడు రవి కల్పన ఈగో అడ్డు వచ్చింది మీ అమ్మ నాన్నలు వస్తే నేనుఎందుకు సెలవు పెట్టాలి అంది మీ అత్తమామలే కదా నువ్వు ఇంట్లో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు నిన్నేం ఉద్యోగం మానేయమనం లేదు కదా ఒక రెండు రోజులు లీవ్ పెట్టడానికి ఏంటి ప్రాబ్లం అని బతిమలాడాడు
(06:22) రవి. నాకు ఆఫీస్ లో వర్క్ చాలా ఉంది నా వల్ల కాదు అని చెప్పి ఆమె ఆఫీస్ కి వెళ్ళిపోయింది. ఆ రెండు రోజులు రవి ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలను చూసుకున్నాడు బయట నుంచి ఫుడ్ తెప్పించాడు కానీ ఇంటికి వచ్చిన అత్త మామలతో కోడలు వెల్కమింగ్ గా ఉండి ఆప్యాయంగా చూసుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఆ పని కల్పన చేయలేదు. ఇది రవి మనసులో ఒక మాయని గాయంగా నాటుకుపోయింది.
(06:44) ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజంగా ఆఫీస్ లో రెండు రోజులు కూడా సెలవు పెట్టలేనంత ఎక్కువ పని ఉందా ఈ రోజుల్లో ప్రతి ఆఫీస్ లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి ఎక్కడికో టూర్ కి వెళ్ళటానికో ఫంక్షన్ కో వారం రోజులు లీవ్ పెడతాం యాక్చువల్ గా కంపెనీ పని మొత్తం ఒక్కళ్ళ మీద ఆధారపడి నడవదు టీంలో 10 మంది ఉంటారు సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఆఫీస్ పని అనేది కల్పనకి జస్ట్ కవరింగ్ మాత్రమే అసలు కారణం వీళ్ళ అమ్మ నాన్నల్ని నేను ఎందుకు చూడాలి నేను కూడా సంపాదిస్తున్నాను కదా అన్న పొగరు లాంటిది ఇక్కడే ఒకటి ట్విస్ట్ జరిగింది సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ ఈగోకి రివెంజ్ తీసుకునే అవకాశం
(07:17) రవికి వచ్చింది. కల్పన ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్ళింది. అప్పుడు కల్పనా వాళ్ళ నాన్నగారు సిటీలో ఏదో పని ఉండి వస్తున్నాను అని కూతురికి ఫోన్ చేశారు. నేను ముంబైలో ఉన్నాను నాన్న మీ అల్లుడు గారు రిసీవ్ చేసుకుంటారులే అని చెప్పింది. ఆయన బస్ ఎక్కేశారు. కల్పన రవికి ఫోన్ చేసి మా నాన్న వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకొని ఆయన పని దగ్గర ఉండి చేసి పంపించు అని అడిగింది.
(07:40) నిజానికి రవి ఎప్పుడు ఖాళీగానే ఉన్నాడు కానీ మా అమ్మ నాన్నలు వచ్చినప్పుడు తన ఆఫీస్ కి కనీసం రెండు రోజులు సెలవు పెట్టలేదు ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన కోసం ఊరంతా నేనుఎందుకు తిరగాలి అన్న ఈగోకి పోయాడు. నేరుగా కల్పనకు అదే విషయం చెప్పి ఫోన్ కట్ చేశడు. కల్పన వాళ్ళ నాన్న సిటీ బస్సు తెగి రిసీవ్ చేసుకోవడానికి అల్లుడు రాకపోవడంతో కూతురు ముంబైలో ఉండి రాలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆ సిటీలో దిక్కు తోచక అవమాన భారంతో తిరిగి బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోయాడు.
(08:07) ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి ఆ పెద్దాయన ఆ తండ్రి ఒంటరిగా వినుదిరిగి వెళ్తున్నప్పుడు ఆయన అడుగుల్లో ఎంత బరువు ఉంటుందో ఆయన గుండెల్లో ఎంత అవమానం దాగుంటుందో ఈ ఇగోతో రగిలిపోతున్న రవికి ఆ విషయం ఎలా అర్థంవుతుంది తన భార్య తప్పు చేసింది సరే అది మనసులో పెట్టుకొని పాపం ఆ పెద్దాయని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న విశక్షణ రవి కోల్పోయాడు.
(08:27) ఇక్కడ అద్భుతమైన వాట్ ఇఫ్ లాజిక్ చెప్తాను వినండి ఒకవేళ ఆ రోజు రవి తన ఈగో చంపుకొని కల్పన వాళ్ళ నాన్నగారిని అద్భుతంగా రిసీవ్ చేసుకొని ఆయన పని చేసి పెట్టి పంపించిఉంటే ఏమయ్యేది అది కల్పనకు చెంప మీద గట్టిగా కొట్టినట్లు అయి ఉండేది కదా అరెరరే నేను వాళ్ళ అమ్మ నాన్నలను సరిగ్గా చూసుకోకపోయినా ఈయన మాత్రం మా నాన్నని ఎంత బాగా చూసుకున్నాడు అని కల్పన సిగ్గుతో తల వంచుకునేది తన తప్పు తెలుసుకొని భర్త దగ్గర రిగ్రెట్ అయి ఉండేది సారీ చెప్పిఉండేది.
(08:55) ఒక మనిషి ఈగోని చంపడానికి ఇంకో ఇగో అక్కర్లేదు ఒక చిన్న ప్రేమ ఒక కాంప్రమైజ్ చాలు కానీ ఆ ఒక్క చిన్న సర్దుబాటు వాళ్ళు చేసుకోలేకపోయారు. కల్పన ఊరి నుంచి వచ్చాక ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది ఒకరినొకరు నిందించుకోవడానికి లక్ష కారణాలు దొరికాయి కానీ కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. జీవితంలో వీళ్ళకి యుగోనే ముఖ్యమైపోయింది. ఇక తులాభారానికి వెళ్దాం నా దగ్గర సంపాదన ఉంది ఆస్తి ఉంది హోదా ఉంది నేనెందుకు ఎవడికైనా తలవంచాలి అన్న అహంకారంతో ఒక బంధాన్ని లెక్క కట్టాలని చూస్తే ఆ బంధం ఏ స్థాయికి కుప్పక కూలిపోతుందో చెప్పడానికి మన పురాణాల్లో కళ్ళు చెదిరిపోయే ఒక
(09:28) అద్భుతమైన ఉదాహరణ ఉంది అదే శ్రీకృష్ణ తులాభారం ఇప్పటివరకు మనం చెప్పుకున్న కథలో రవి కల్పన క్యారెక్టర్స్ కి ఈ శ్రీకృష్ణ తులాభారంలోని క్యారెక్టర్స్ కి సింక్రణీ ఏమ ఉండదు కానీ రవి కల్పన మైండ్ లో ఉన్న ఈగోకి ఈ ఈ శ్రీకృష్ణ తులాభారంలోని సత్యభామకు ఉన్న ఈగోకి సిమిలారిటీ ఉంటుంది జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి. సత్యభామకి సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంటే పంచప్రాణాలు ఆమెకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అంతకుపంతల భయంకరమైన ఈగో కూడా ఉండేది.
(09:57) ఈ ఎనిమిది మంది భార్యల్లో నాకే ఎక్కువ ఆస్తి ఉంది నా దగ్గరే ఎక్కువ బంగారం ఉంది నేను చాలా అందమైన దాన్ని కృష్ణుడు నాకే సొంతం అన్న అహంకారం ఆమెలో అణువ అణువున నిండిపోయి ఉండేది. అచ్చం మన కథలో రవి కల్పనలకు మేము చెరువక మూడు లక్షలు సంపాదిస్తున్నాం మాకేంటి తక్కువ అన్న పొగరు ఎలా ఉందో ఆరోజు సత్యభామకు కూడా తన సంపద మీద అదే పొగరు ఉంది.
(10:19) ఇక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకరోజు నారద మహామును వచ్చాడు. ఆయన వచ్చింది కేవలం గొడవలు పెట్టడానికి కాదు సత్యభామలో పేరుకుపోయిన అహంకారాన్ని బద్దలు కొట్టడానికి నారదుడు ఆమె దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పాడు అమ్మ సత్యభామ శ్రీకృష్ణుడు ఈ జన్మలోనే కాదు రాబోయే ఏడు జన్మల్లోనూ నీకే సొంతం అవ్వాలంటే నువ్వు ఒక వ్రతం చేయాలి ఆ వ్రతం నియమం ప్రకారం నీ భర్తను ముందుగా నాకు దానం ఇచ్చేయాలి ఆ తర్వాత ఆయన బరువుకు సమానమైన బంగారం నవరత్నాలు త్రాసులో పెట్టి నువ్వు ఆయన్ని మళ్ళీ కొనుక్కోవాలి అని ఒక పర్ఫెక్ట్ ట్రాప్ వేసాడు నిజానికి ప్రాణానికి ప్రాణంగా ా పెంచే భర్తని ఎవరైనా దానం
(10:51) ఇస్తారా పక్కవాడి సొంతం అయిపోతాడేమో అన్న భయం రాదా కానీ ఇక్కడే సత్యభామ ఈగో ఆమె కళ్ళను మూసేసింది. ఓసి ఇంతే కదా నా దగ్గర కొండల కొద్ది ఆస్తి ఉంది ముందు దానం ఇచ్చేసి నాకున్న అంతులేని సంపత్తో చిటికలో మళ్ళీ కొనుక్కుంటాను అప్పుడు నా పవర్ ఏంటో నా రేంజ్ ఏంటో రుక్మిణితో సహా అందరికీ తెలిసిపోతుంది అన్న అహంకారంతో ఏం భయం లేకుండా సాక్షాత్తు తన భర్తనే నారదుడికి దానంగా ఇచ్చేసింది.
(11:18) ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పచ్చి నిజం దాగి ఉంది సత్యభామ దృష్టిలో కృష్ణుడు ఒక పవిత్రమైన బంధం కాదు తనకున్న అంతులేని ఆస్తితో ఎప్పుడైనా తూకం వేసి తిరిగి కొనుక్కోగలిగే ఒక వస్తువు నాకున్న సంపత్తో నా భర్తని శాసించగలను అన్న అహంకారం ఆమెది. ఇప్పుడు సొసైటీలో ఈగోతో విడిపోతున్న చాలా మంది భార్యా భర్తలు కూడా వాళ్ళ దాంపత్యాన్ని అచ్చం ఇలాగే ఒక ట్రాన్సాక్షన్ లా చూస్తున్నారు.
(11:44) నేను నీతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నాను నాకంటూ ఒక స్టేటస్ ఉంది అలాంటప్పుడు నీ ముందు నేను ఎందుకు తలవంచాలి నేను ఎందుకు తగ్గాలి నా మాటే నెగ్గాలి అని పంతానికి పోతున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ పరోక్షంగా తమ భాగస్వామికి ఇస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా నాకున్న సంపాదన ముందు నా ఇగో ముందు నీతో నాకున్న బంధం చాలా తక్కువ అని ఎప్పుడైతే ఒక కాపురంలో బంధం కంటే హోదా పెద్దదయిందో ఆ క్షణమే బంధం చచ్చిపోయినట్లే మళ్ళీ కథలోకి వద్దాం అలా భర్తను దానం ఇచ్చేసాక సభలోకి ఒక పెద్ద త్రాసును తెప్పించారు.
(12:14) ఒకవైపు సాక్షాత్తు శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టారు. ఆయన మొహంలో చిరునవ్వు తన భార్య అహంకారం ఎలా కుప్పకూలబోతుందో తెలిసిన నవ్వు అది ఇంకోవైపు సత్యభామ తన దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు అంతులేని ఆభరణాలు టన్నుల కొద్ది బంగారం మొత్తం ఆ త్రాసులో వేసింది ఆమెలో నమ్మకం ఏంటంటే నా దగ్గర ఉన్న సంపద ముందు ఇదంతా అని కానీ ఆ త్రాసు ఒక్క ఇంచు కూడా పైకి లేవలేదు శ్రీకృష్ణుడు కూర్చున్న వైపు ఏమాత్రం కదలలేదు సత్యభామకు చెమటలు పట్టాయి భయంతో చేతులు వణగుతున్నాయి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం మొత్తం వేసిన లాభం లేదు ఆఖరికి తన తండ్రి సత్రాజిత్తు దగ్గర ఉన్న శమంతక
(12:50) మణిని కూడా తీసుకొచ్చి ఆ త్రాసులో వేసిన అది కదలలేదు. అప్పటివరకు ఆమెకుఉన్న అహంకారం అంతా నీరుగారిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ త్రాసు ముందు కుప్పకూలిపోయింది. తన ప్రాణమైన భర్త తనకు దక్కడేమో తన బంధం శాశ్వతంగా దూరమైపోతుందేమో అన్న భయంతో ఆమె వణకిపోతుంది. ఎంత ఆస్తి ఉన్నా సంపదతో అహంకారంతో ఏ బంధాన్ని ఏ భార్య మనసుని భర్త ఏ భర్త మనసుని భార్య కొనలేరు అన్న పచ్చి నిజం ఆమెకు అప్పుడు అర్థమవుతుంది.
(13:18) ఈరోజు విడాకులు తీసుకొని కోర్టు బయట నిలబడ్డ వాళ్ళ పరిస్థితి అచ్చం ఆ రోజు సత్యభామ లాంటిది. మళ్ళీ కథలోకి వద్దాం సరిగ్గా ఆ సమయంలో అక్కడికి రుక్మిణి వస్తుంది రుక్మిణికి ఎలాంటి ఈగో లేదు ఆమె చేతిలో నవరత్నాలు లేవు ఆమె దగ్గర నేనే గొప్ప అన్న అహంకారం లేదు ఆమె దగ్గర ఉన్నదల్లా భర్త మీద స్వచ్ఛమైన ప్రేమ ఆయన ముందు తలవంచి ఉండే ఒక గొప్ప సరెండర్ నేచర్ మాత్రమే రుక్మిణి ఆ త్రాసులో ఆ బంగారాన్ని మొత్తాన్ని పక్కకు తీసేసింది కృష్ణుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తన అహంకారాన్ని పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క చిన్న తులసి దళాన్ని అంటే తులసి ఆకుని ఆ త్రాసు లో
(13:54) వేస్తుంది అంతే సృష్టి మొత్తం ఆశ్చర్యపోయేలా సత్యభామ వేసిన టన్నులు కొద్ది బంగారానికి ఏమాత్రం కదలని ఆ త్రాసు రుక్మిణి వేసిన ఆ ఒక్క చిన్న బరువు లేని తులసి ఆకుకి అమాంతం పైకి లేస్తుంది. దీని వెనుకున్న ఒక సైకలాజికల్ అనాలసిస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సత్యభామ ఆ త్రాసులో వేసింది బంగారం కాదు నా దగ్గర ఇంత ఉంది నేను ఇంత ఇవ్వగలను అన్న తన ఈగోని ఈగోకి బరువు ఎక్కువ కానీ బంధంలో దానికి ఉన్న విలువ సున్నా అందుకే కృష్ణుడు తోగలేదు.
(14:22) మరి రుక్మిణి ఆ త్రాసులో వేసింది కేవలం తులసి ఆకు కాదు నాకంటూ ఏమీ లేదు స్వామి నా సర్వస్వం నువ్వే అని ఆ బంధం ముందు పూర్తిగా లొంగిపోయిన ఆమె స్వచ్ఛమైన ప్రేమని అందుకే శ్రీకృష్ణుడు పైకి లేచాడు. ఒక బంధాన్ని నీ ఈగోతో నీ అహంకారంతో నీ లక్షల జీతంతో నేనే ఎక్కువ అన్న పొగరతో గెలవాలని చూస్తే నువ్వు నీ జీవితం మొత్తం దారపోసిన ఆ బంధాన్ని గెలవలేవు.
(14:47) ఎప్పుడైతే నీ ఇగోని చంపుకొని ఒక మెట్టు దిగి ప్రేమ అనే చిన్న తులసి దళాన్ని బంధం మీద పెడతావో ఆ బంధం నీకు శాశ్వతంగా సొంతం అవుతుంది. రుక్మిణి త్రాసులో వేసిన ఆ తులసి దళం ఈ కాలం భార్యా భర్తల గొడవ వచ్చినప్పుడు చెప్పే ఒక చిన్న సారీ లాంటిది. నీకంటే నాకు ఏది ముఖ్యం కాదు అని తగ్గటం లాంటిది. సత్యభామ తన ఈగోని వదిలేసినప్పుడే ఆమెకు తన భర్త దక్కాడు ఆరోజు సత్యభామ వేసిన బంగారం లాంటిదే ఈరోజు రవి కల్పనల లక్షల జీతాలు నాకేం తక్కువ నేనెందుకు తగ్గాలి అన్న ఈగోతోని వాళ్ళు ఆ త్రాసులని గెలవాలనుకున్నారు అందుకే సర్వస్వం కోల్పోయి రోడ్డును పడ్డారు. ఈరోజు కోర్టు
(15:21) మెట్ల మీద వాళ్ళు సాధించింది ఏంటి ఒకే చోట ఆడుకుంటూ పెరగాల్సిన అన్న చెల్లెలను దూరం చేయడం తప్ప ఒకళ్ళకి అమ్మని ఒకళ్ళకి నాన్నని లేకుండా చేయడం తప్ప పచ్చని కాపురాన్ని స్మశానం చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. దీనింతటికీ కారణం ఏంటి ఇద్దరికీ డబ్బు ఉంది ఇద్దరు లక్షలు సంపాదిస్తున్నారు. సంపాదన ఉంటే ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి.
(15:41) అంతేగాని ఏ లోటు లేని కాపురాన్ని కూల్చుకోకూడదు. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ కి ట్రాజిడీ ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు భార్యా భర్తల మధ్య ఏదైనా చిన్న గొడవ వస్తే ఆ పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవంతోనో భయంతోనో వెంటనే సద్దుకు పోయేవాళ్ళు అప్పుడు ఆ ఈగోలు బయటిక వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు కోట్లు పెట్టుకున్న విశాలమైన విల్లాల్లోనో లగ్జరీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలోనో ఉండేది కేవలం భార్యా భర్తలు ఇద్దరే నివసించే ఆ ఇల్లు విశాలంగా మారుతుంది కానీ అందులో ఉండే వాళ్ళ గుండెలు మాత్రం ఈగోలకు తప్ప
(16:10) బంధాలకు చోటు ఇవ్వనంత ఇరుగ్గా మారిపోయాయి ఏ గొడవ వచ్చినా సద్ది చెప్పడానికి పెద్దవాళ్ళు లేరు మనల్ని అడిగేవాళ్ళు లేరన్న ధైర్యం ఎవరికీ భయం లేదు బంధం మీద కనీసం బాధ్యత లేదు నేను చెప్పిందే వినాలి అన్న ఈగో తప్ప బుర్రలో మరొక ఆలోచనకి చోటు లేకుండా పోయింది. కొంతమంది అంటారు ఆడది సంపాదిస్తే ఇలాగే పొగరుగా ఉంటుంది అని ఏ మగాడికి మాత్రం సంపాదిస్తున్నాను అన్న పొగర లేదా ఇక్కడ ఆడ మగ అన్న తేడా లేదు సద్దుకుపోయే మనస్తత్వం ఉందా లేదా అన్నదే ముఖ్యం.
(16:39) ఎంతో మంది భార్యా భర్తలు లక్షలు సంపాదిస్తున్నా కూడా అద్భుతంగా ప్రేమగా ఎలా ఉంటున్నారు ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ ఈగోల కంటే వాళ్ళ బంధం ముఖ్యం కాబట్టి చాలా మంది సద్దుకు పోవడం అంటే సరండర్ అయినట్లు ఫీల్ అవుతున్నారు. నేనెందుకు తలంచాలి అని అంటున్నారు. అసలు సరెండర్ అయితే మాత్రం తప్పేంటి భార్యా భర్తలు అంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర స్వరూపం ఇద్దరు వేరు కాదు అని కదా అంటున్నారు అది నమ్మే కదా దానికి ఒప్పుకునే కదా పెళ్లిళ్లు చేసుకుంటున్నాం అప్పుడు శుభలేఖ మీద వేసిన మొదటి శ్లోకం చదవలేదా పెళ్లిలో చదివిన మంత్రాలు వినపడలేదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భర్తకు భార్య సరెండర్
(17:10) అయినా భార్య భర్తకు సరెండర్ అయినా అది పక్కవాడికి తల వంచినట్లు కాదు తమ బంధం కోసం వాళ్ళకి వాళ్లే సరెండర్ అయినట్లు మనకోసం మనమే కాంప్రమైజ్ అయినట్లు ఒక బండి ముందుకు వెళ్ళాలి అంటే ఆ బండికి ఉన్న రెండు చక్రాలు సమానంగా ఉండాలి. ఆ రెండు చక్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లే ఉండాలి కానీ రెండు కలిసి ప్రయాణించాలి. ఒక చక్రం ఎత్తుగా ఉండి ఇంకో చక్రం కిందకున్న బండి కుప్ప కూలిపోతుంది కాపురం కూడా అంతే ఇంగ్లీష్ లో భార్యా భర్తలందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన ఒక గొప్ప మాట ఉంది ఏస్ట్రాంగ్ మ్యరేజ్ రేర్లీ హస్ టూ స్ట్రాంగ్ పీపుల్ అట్ ద సేame్ టైం ఇట్
(17:41) హస్ హస్బెండ్ అండ్ వైఫ్ హటేక్ టర్న్స్ beీయింగ్ స్ట్రాంగ్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ మూమెంట్స్వెన్ ద అదర్ ఫీల్స్ వీక్ ఒక బలమైన కాపురంలో ఇద్దరు ఒకేసారి తమ ఈగోలతో బలంగా నిలబడరు ఒకరు కోపంలో ఉంటే ఇంకొకరు తగ్గి ఒకరి కోసం ఒకరు బలంగా నిలబడి ఆ బంధాన్ని కాపాడుకుంటారు ఈ ప్రపంచంలో ఏ పోటీ తీసుకున్నా సరే ముందు వెళ్ళినవాడు గెలుస్తాడు వెనకపడినవాడు ఓడిపోతాడు కానీ ఈ క్రియేషన్ లో ఒక్క కాపురంలో మాత్రమే ఇద్దరూ కలిసి గెలిస్తేనే గెలుపు ఇద్దరూ కలిసి అడుగులు వేస్తేనే అది ప్రయాణం పార్ట్నర్ మీద ఆర్గ్యుమెంట్ లో గెలవచ్చేమో గానీ బంధాన్ని మాత్రం శాశ్వతంగా ఓడిపోతాం.
(18:16) ఆ ఓటమిలో కన్న పిల్లలు కూడా నలిగిపోతారు. మీలో ఎవరైనా బంధానికి విలువిచ్చి మీ జీవిత భాగస్వామితో రాజీ పడిన అద్భుతమైన క్షణాలు ఉంటే కామెంట్ చేయండి 10 మందికి అది ఆదర్శంగా ఉంటుంది. మరో అద్భుతమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బంధాల్లో నిజాయితీగా ఉండండి ఈగోని చంపుకొని ప్రేమను గెలిపించండి. జైహింద్ జై శ్రీరామ్

No comments:

Post a Comment