Saturday, May 16, 2026

వాసనలతో కూడిన మనస్సు వల్లనే ఈ సంసారమంతా #yogavasistham #srividyaprakashanandagiri

వాసనలతో కూడిన మనస్సు వల్లనే ఈ సంసారమంతా #yogavasistham #srividyaprakashanandagiri

Author Name:TATTWABODHA

Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mniIlRjUtp0



Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో [పాడటం] గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే హరి ఓం సుఖుడు మిధిలా నగరం చేరుకుంటారండి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న సుఖమహర్షి మిధిలా నగరం చేరి జనక మహారాజు ఉండే ఆ రాజభవనం దగ్గరికి చేరుకుంటారండి ద్వారపాలకులు ఉంటారు కదా వారికి తెలియజేస్తారు.
(01:29) మా తండ్రిగారు వ్యాసుడు మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను జనక మహారాజుని దర్శించాలని వచ్చాను అని ఆ ద్వారపాలకులకు చెప్తారు నా విషయాన్ని మీరు మహారాజు గారికి తెలియజేయండి అని ద్వారపాలకులకు చెప్తే ద్వారపాలకులు ఆ విషయాన్ని జనక మహారాజుకు తెలియజేస్తారు. జనక మహారాజు తెలుసండి సుఖుడు ఎందుకు వచ్చారో ఎందుకంటే జనక మహారాజు మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని వారికి తెలుసు వీరు ఎందుకు వచ్చారని ఏ విషయము చెప్పకుండా ఆ విషయాన్ని మోసుకు వచ్చిన ఆ వార్తహారులకి ఏ విషయం చెప్పరండి ఇలా ఏడు రోజులు గడుస్తాయి ఏడు రోజులు సుఖుడు
(02:16) ఆ అంతపురం బయటే ఉంటారండి ఆ రాజభవనం బయటే ఆ ద్వారం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారండి ఆజ్ఞ కోసం జనక మహారాజు పరీక్షిస్తున్నారండి ఇతనికి బ్రహ్మవిద్యను ఆ బ్రహ్మవిద్యను పొందే ఆ యోగ్యత ఉన్నదా లేదా పరీక్షిద్దామనే వారు ఏ విషయము చెప్పలేదు సుఖుడు ఏడు రోజులు అలానే నిలిచిన ఉన్నారండి వెయిట్ చేశారు ఎదురు చూశారు ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజు అక్కడ ఉన్న ద్వారపాలకులకి కబురు
(03:02) వస్తుందండి ఆ ద్వారం దగ్గర నిలుచుని ఉన్న ఆ మునిగారిని రాజమందిరంలోకి లోపలికి తీసుకొని రండి అని కబురు వస్తుంది ఇక సుఖ మహర్షి జనక మహారాజు భవనంలోకి ప్రవేశిస్తాడండి. సుఖుడికి మంచి బస ఏర్పాటు చేస్తారు. అంతఃపురంలో మంచి బస ఏర్పాటు చేస్తారు. ఆయనకు అంతులేని ఉపచారాలు జరిగిపోతూ ఉంటాయండి. సపరీలు జరిగిపోతూ ఉంటాయి. అక్కడ ఆయనకి ఈ ఉపచారాలు చేసేవారంతా ఆ
(03:51) సేవలు చేసేవారంతా అప్సరసలాంటి స్త్రీలండి అప్సరస లాంటి స్త్రీలు ఆ స్త్రీలు వద్దన్నా వినకుండా సంగీతాలు వినిపిస్తున్నారు. నాట్యాలు చూపిస్తున్నారు. మధురమైన పదార్థాలు పెడుతున్నారు. వాస్తవానికి సుఖ మహర్షికి ఇవేమి అక్కర్లేదండి. సుఖ మహర్షికి ఇవేవి అక్కర్లేదు అయినా సరే ఎవ్వరిని దూషించలేదు ఎవ్వరిని ద్వేషించలేదు. దేని యందు వారు ఎటువంటి భావనని ప్రదర్శించలేదండి.
(04:33) ఒకదాని యందు రాగం గాని ఒకదాని యందు ద్వేషం గాని వారి మనసులో లేదండి. ద్వంద్వ భావన లేదండి ఎటువంటి భావన వారి మనసులో లేదండి కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు సుఖ మహర్షి జనక మహారాజు ఎక్కడున్నారు జనక మహారాజు ఎక్కడున్నారు అని ఇంకా జనక మహారాజు వారికి కనిపించలేదండి ఇలా మరొక ఏడు రోజులు గడిచిపోయినాయండి అయినా గాని వారి మనసులో రవ్వంతా కూడా ఎటువంటి కలత కల కలగలేదండి ఎటువంటి ఆందోళన కలగలేదు.
(05:14) ఎటువంటి విషయాల మీద ఆకర్షణ లేదు. అతనికి సేవ చేసే అప్సరస లాంటి స్త్రీలను చూసిన ఆయనకి ఎటువంటి మానసిక భావన కలగలేదండి. ఎటువంటి మధురమైన పదార్థాలు వారు భుజించడానికి పెట్టినా గాని దేని యందు వారికి ప్రీతి కలగలేదు ఏ పదార్థం యందు వారికి ఎటువంటి ప్రీతి కలగలేదు. ఇది మధురంగా ఉందని గాని ఇది మధురంగా లేదని గాని ఎటువంటి ఈ ద్వంద భావాలు ఏమి వారి మనసులో కలగలేదండి.
(05:55) అంటే వారి మానసిక స్థితి ఎలా ఉన్నదో చూడండి. ఇలా 14 రోజులు గడిచాయండి. ఏడు రోజులు ద్వారం బయట నిలబెట్టారు ఏడు రోజులు ఆ రాజభవనంలోకి ప్రవేశించిన తర్వాత బస ఏర్పాటు చేశారు కానీ జనక మహారాజు దర్శనం ఇవ్వలేదండి ఏడు రోజులు వారు సుఖనికి దర్శనం కూడా ఇవ్వలేదు 14 రోజులు వేచి ఉన్నారండి 14 రోజులు వేచి ఉన్నా గానీ సుఖని మనసులో ఎటువంటి భావన లేదండి నిర్లుప్తంగా ఉన్నారండి ఇక
(06:39) 14 రోజులు కలిసాయి కదండీ ఆ తర్వాత రోజు తెల్లవారి సలిక్ర జనక మహారాజు సుఖమహర్షి దగ్గరికి వస్తారండి సుఖ మహర్షి దగ్గరికి వచ్చి వారి పాదాలకు నమస్కారం చేస్తారండి. ఎవరు జనక మహారాజు జనకుడు సుఖుడి యొక్క పాదాలకు నమస్కారం చేస్తున్నారండి. జనక మహారాజుకి సుఖ మహర్షి యొక్క అర్హత వారి యొక్క ఈ వైరాగ్యాన్ని చూసి వారికి పరిపూర్ణమైన తృప్తి కలిగిందండి.
(07:21) చూడండి నిజంగా సమాజాన్ని సమాజంలో మనం చూస్తే వ్యక్తిని ఆడించేవి రెండే అండి ఒకటి స్త్రీ ఇంకొకటి ధనము అంటే స్త్రీ అనే కాదండి స్త్రీ పురుషుడు ఇద్దరు పురుషుడికి స్త్రీ బంధము స్త్రీకి పురుషుడు బంధము మరియొకటి ధనం ఈ రెండేనండి ప్రపంచాన్ని ఆడించేది ఈ కామిని కాంచనాలు మనిషి వీటికోసమే వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉన్నాడు.
(08:04) క్షణం తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నాడు. కంటి ముందు కొంచెం అందంగా ఉన్న దృశ్యం ఏదైనా కనిపిస్తే మనసులో అనేక భావాలు ఉద్భవించి అతన్ని అల్లకల్లోలు పరుస్తున్నాయి. కానీ ఇక్కడ సుకుని యొక్క మానసిక స్థితి చూడండి అప్సరసలాంటి స్త్రీలు ఉపచారాలు చేస్తూ ఉన్నా గానీ వారి మనసులో అసలు ఎటువంటి భావన లేదండి ఎటువంటి
(08:53) భావన వారి మనసులో కలగలేదు గాలి లేని చోట పెట్టిన దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో వారి మనసు కూడా ఈ విషయాలకు చెలించకుండా ఉన్నదండి. ప్రపంచంలో జనులు ఏ విషయాల వెంటయతే పరిగెడుతూ ఉంటారో ఏ విషయాల కోసం అయితే వెంపర్లాడుతూ ఉంటారో అటువంటి విషయాలు సుఖుడిని కదిలించలేకపోయాయండి. ఇది గొప్ప స్థితి అండి ఈ స్థితి పొందితే అతడు జీవన్ముక్తుడు అయిపోయినట్లేనండి.
(09:38) ఈ స్థితి ఉన్నదా లేదా పరీక్షించడానికే జనక మహారాజు సుఖుడిని ఏడు రోజులు బయట వేచి ఉండేలా చేశారండి మరొక ఏడు రోజులు కనిపించకుండా మరొక ఏడు రోజులు ఆయనక అన్ని సపరేలు జరిగేలాగా చేశాడు అన్ని భోగాలు అన్ని అన్ని భోగి వస్తువులు భోగీ పదార్థాలు అన్నీ ఆయన కళ్ళ ముందే కింద పెట్టారండి ఒక భాష ఏర్పాటు చేసి ఏమన్నా చెలిస్తారా అని కానీ ఏమి చెలించలే చెలించలేదండి ఈ విషయాలు గాని వస్తువులు గాని ఏమి సుఖుడిని కదిలించలేకపోయాయండి.
(10:21) ఇటువంటి స్థితిలో ఉన్న సుఖ మహర్షిని చూసి జనకుడు వారి యొక్క పాదాలకు నమస్కారం చేశారండి. చేసి మొదలుగా కొన్ని కుశల ప్రశ్నలు వేస్తారన్నమాట ఇక జనక మహారాజు అంటారు నాయనా మహర్షి చిట్టచివరికి దేన్ని పొందాలో అలాంటి ఆత్మానందాన్ని నీవు పొందేసావయ్యా దేనినైతే మానవుడు సాధించాలో నీవు దాన్ని సాధించేశవు. ఏదైతే మానవ జన్మ పరమార్థం ఉన్నదో నీవు దాన్ని సాధించేశవయ్యా ఇక నీవు పొందవలసింది ఏమీ లేదు.
(11:05) నీ ముఖంలోనే కనిపిస్తూ ఉన్నది. అయినా ఎందుకు ఇక్కడిదాకా వచ్చావు నీకు ఏమి కావాలి తెలియజేయము అని జనక మహారాజు అడుగుతారండి. అడిగితే సుఖమహర్షి చెప్తారు మా తండ్రి గారిని ప్రశ్నించినప్పుడు మా తండ్రి గారు యుక్తియుక్తంగా అనేక సమాధానాలు చెప్పి ఉన్నారు. మరలా అవే ప్రశ్నలని మీకు మీతో నేను మనవి చేస్తున్నాను. అయ్యా జనక మహారాజా
(11:53) ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారము ఎలా పుట్టింది ఎలా నశిస్తుంది ఇవే ప్రశ్నలు కదండీ వ్యాసుడిని కూడా అడిగింది వ్యాసుడు సమాధానం చెప్పారండి అయినా ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో ఉన్నది ఇంకా ఏదో ఉన్నది అని వీరు మనసులో ఆ భావన ఉన్నదండి అందుకే జనక మహారాజు దగ్గరికి పంపించారు సుఖుడు సారీ వ్యాసుడు నిజంగా వ్యాసుడు వ్యాసుల వారికి తెలియని జ్ఞానం ఉంటుందా అండి కానీ సుఖుడికి తెలియాలి కదా ఇంక వేరేది ఏమీ లేదు ఉన్నది ఇదే అని వారికి కూడా తెలియాలి కదా వారు తెలుసుకున్నదే నేను చెప్పాను ఇంక
(12:38) ఇంతకుమించి వేరేది ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళినా ఇదే అని వారికి తెలియాలి కదా అందుకోసమే జనక మహారాజు దగ్గరికి పంపించారండి. అదే ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ వేశారు. అయ్యా జనక మహారాజా ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారం ఎలా పుట్టింది ఎలా నశిస్తుంది? నా సందేహం తీర్చండి అన్నారు సుఖుడు జనక మహారాజు రెండు మూడు గంటల సేపు మహా ఉపన్యాసం చెప్తారండి.
(13:10) అయినా గాని సుఖని మొఖంలో ఏ తృప్తి కనిపించలేదు. మరలా ఇంకొక రెండు మూడు గంటలు ఉపన్యాసం చెప్తారండి అయినా సుఖ మహర్షి ముఖంలో ఎటువంటి తృప్తి కనిపించలేదండి. అప్పుడు జనక మహారాజు అడుగుతారు ఏమిటయ్యా నీ సందేహము అది ఏమిటో చెప్పు నేను ఎంత చెప్పినా నీవు తృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. నీ సమస్య ఏమిటి నీ సందేహం ఏమిటి తెలియజేయి అని జనక మహారాజు అంటే సుఖుడు చెప్తున్నారండి సుఖుడు చెప్తున్నారండి
(13:55) జనక మహారాజా నాకు మీరు ఏమి కొత్త విషయాలు చెప్పలేదు. చిన్నప్పుడు పాఠాలు చదువుకునేటప్పుడు శాస్త్రాల్లో ఈ మాటలే చెప్పారు. ఆ తర్వాత నేనే స్వయంగా ఈ ప్రపంచాన్ని పరిశీలించి ఇదే విషయాన్ని తెలుసుకున్నాను. తర్వాత మా తండ్రి గారిని ప్రశ్నించినప్పుడు వారు కూడా ఈ విషయాలే చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను. మీరు కూడా ఇదే చెప్తున్నారు.
(14:29) వాక్యాలు వేరు విన్యాస విధానాలు వేరు అంటే చెప్పే విధానం వేరు తప్పితే మీరు కూడా అదే చెప్తున్నారు. విషయంలో ఏమీ తేడా లేదు. అందుచేత నాకు కొత్త విషయం ఏమీ దొరకడం లేదు. మహారాజా మీరు పెద్దలు నా పరిశీలనలో నాకు ఒక మాట గట్టిగా తోస్తోంది. మనసు నిండ వాసనలు నిండి ఉన్నాయి. అటువంటి మనసు వల్లే ఈ సంసారం అంతా ఆడంబరంగా దర్శనం ఇస్తుంది.
(15:15) ఆ మనసును సంపూర్ణంగా నాశనం చేస్తేనే ఈ సంసారంఅంతా నశిస్తుంది. ఈ సంసారంలో ఇంతకంటే సారం ఏమీ లేదు. ఇదే నా గట్టి నమ్మకం ఇది నిజమా కాదా మీరు తేల్చి చెప్పండి. మీరు చెబితే నాకు నమ్మకం కుదురుతుంది. మీరు అవునంటే అంటే నేను చెప్పిన విషయము సత్యమే అని మీరు నిర్ధారణ చేసినట్లయితే ఇక ఈ నా మనసును నా మనోబలంతోనే నిర్మూలనం చేస్తాను.
(15:53) శాశ్వతమైన ప్రశాంత స్థితిలో నిలబడిపోతాను. మీరు ఏదో ఒకటి నిష్కర్షగా తీర్చి చెప్పండి. సుఖుడు చెప్పిన ఈ మాటలు విన్న జనక మహారాజు యొక్క ముఖము పద్మం లాగా వికసిస్తుందండి. వికసించి జనక మహారాజు వెంటనే ఇలా అంటారు. నాయనా ఇంతకంటే తెలుసుకోవలసింది ఏమీ లేదయ్యా ఇంతకంటే చేయవలసింది కూడా ఏమీ లేదు. తెలుసుకోవలసిందంతా నీవే తెలుసుకున్నావు.
(16:29) ఇప్పుడు నీవు ఏదైతే చెప్తున్నావో అదే పరమ సత్యం నాయన ఇక ఇంతకంటే వేరే నిర్ణయం లేదు మానవుడు తన సంకల్పం వల్ల తాను బద్ధుడు అవుతున్నాడు. సంకల్పాలు పోతే వాడు ముక్తుడు అవుతున్నాడు. దీనికి మించిన మాట లేనే లేదు ఆ మనస్సుని ఆ మనోనాశాన్ని సాధించినవాడు ముక్తుడు అవుతున్నాడు. దీనిని నీవు తెలుసుకున్నావు తెలుసుకొని భోగాలను విడిచిపెట్టి వేశవు.
(17:10) నీకు ఈ దృశ్య ప్రపంచం మీద ప్రేమ లేదు ద్వేషము లేదు ద్వంద్వాలు లేవు ఇక నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్లే ఎందుకంటే నీ మనసు అమనస్కమ అయిపోయింది. నువ్వు ప్రపంచంలో పడమన్నా పడవు నువ్వు ముక్తివైపోయావు నీవు ముక్తిని పొందావు నీవు ముక్తుడవైపోయావు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని జనక మహారాజు చెప్తున్నారండి. ఇప్పుడు నేను ఈ వాసన గురించి ప్రస్తావన
(17:57) చేసి ముందుకు వెళ్తానండి. అసలు వాసన అంటే ఏమిటి వాసనలు ఎన్ని విధములు వాసనలను ఎలా క్షయం చేసుకోవాలి వాసనలే కర్మలకి ఎలా కారణం అవుతున్నాయి వాసనలే కోరికలకి ఎలా కారణం అవుతున్నాయి? వాసనలను క్షయం చేసుకొని అమనస్క స్థితిని ఎలా సాధించాలి తత్వజ్ఞానము వాసనా క్షయము మనోనాశము దాన్ని అమనస్కం అంటారు తద్వారా జీవన్ ముక్తి ఇవి ఎలా సాధించాలి వాసనలే జన్మలకి కారణం అవుతున్నాయి కనుక ఆ వాసనా
(18:43) రహిత్యాన్ని ఎలా సాధించాలి ఈ వీడియోస్ అన్నీ నేను చేసి ఉన్నానండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లోకి వెళ్లి ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి మీకు అప్పుడు పూర్తి అవగాహన వస్తుందండి. వాసన అంటే ఏమిటి అనేది చెప్పి నేను ముందుకు వెళ్తానండి. మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు ఏదైనా అనుభవించినప్పుడు మన మనసు యందు కొన్ని ముద్రలు ఏర్పడతాయండి. ఆ ముద్రలే వాసనలండి.
(19:19) ఉదాహరణకు మీరు తిరుపతి లడ్డు తిన్నారండి తిరుపతి లడ్డు తిన్నప్పుడు అది మీకు చాలా అద్భుతంగా మధురంగా ఉంది అనిపించింది. చాలా మధురంగా అద్భుతంగా ఉంది ఆహా భలే ఉన్నది అనిపించింది. మరలా ఇంకొకసారి ఎప్పుడైనా గాని మీకు ఆ తిరుపతి లడ్డు కనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆహా ఇది అద్భుతంగా ఉంటుంది భలే ఉంటుంది మధురంగా ఉంటుంది.
(19:48) అని అనిపిస్తున్నది కదండీ అదే వాసన అండి అది ఎక్కడ ఉన్నది మీరు గతంలో తిరుపతి లడ్డు తిన్నారు కదండీ ఆ అనుభవం ఉన్నది కదా అనుభవం మీ చిత్తంలో వాసనగా నిక్షిప్తమై ఉన్నదండి. స్మృతి రూపేన భాతి అది స్మృతి రూపంలో ఉన్నది. సో అది వాసన అండి ఇక ఇక మనము విషయంలోకి వెళ్దాంండి సుఖుడు చెప్తున్నారండి నేను బాగా పరిశీలన చేయగా ఈ విషయమే నేను తెలుసుకున్నాను.
(20:32) ఇటువంటి వాసనలతో నిండిన మనసు వల్లే ఈ సంసారం అంతా ఇంత ఆడంబరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ మనసును గనుక సంపూర్ణంగా నాశనం చేస్తే ఇక సంసారం అంతా నశిస్తుంది. ఇదే మనోనాశం అండి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుందండి తత్వజ్ఞానం వల్ల వాసనలు క్షేమ అయిపోతే వాసనలు క్షయమైపోతే ఇంక మనసు ఉండదండి అది అమనస్కం అయిపోతుంది అది ఉన్నా లేనట్లే మనసుకు బలం ఈ వాసన లేనండి అది ఉన్నా లేనట్లే సో అమనస్కం అయిపోతుంది అమనస్కమైన మనసు ఇక ఆ జీవుని బంధించదండి అతడు జీవన్ ముక్తుడు అయిపోతాడండి సుఖుడు ఈ స్థితి తలోనే ఉన్నాడండి
(21:17) అందుకే చెప్తున్నారు ఇదే మాట మానవుడు తన సంకల్పం వలనే బద్దుడు అవుతున్నాడు. సంకల్పాలు పోతే వాడు ముక్తుడు అవుతున్నాడు అంటున్నారండి. మనమే కల్పించుకుంటున్నామఅండి చూడండి ఒక ఉదాహరణ చెప్తాను మనకి బాగా ప్రేయమైన వారికి బాగా ఇష్టమైన వారికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా చిన్న సమస్య వచ్చిన చిన్న అనారోగ్యం వచ్చినా మనం వెలవెల్లాడిపోతాం.
(21:53) అదే మనకి ఏదో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తికి ఏదైనా జరిగితే మనం పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వమండి. ఎక్కడిదాకా ఎందుకండి మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి ఏదైనా కొంచెం అనారోగ్యం వచ్చి కొంచెం కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉన్నారనుకోండి మనం ఎంతో బాధపడుతూ ఉంటాము. అదే మన వీధిలో ఉన్న ఒక కుటుంబంలో ఒకరు మరణించారు అని మనకు తెలిసింది అనుకోండి మనం ఏమి పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వమండి మహా అయితే అయ్యో అంటామ అంతే అంతకుమించి ఏమ ఉండదండి ఆ ఒక్క క్షణం అయ్యో అనుకుంటాము ఇంక అంతే కానీ ఇక్కడ మనక ఇష్టమైన వారికి చిన్న జ్వరం
(22:39) వచ్చినా మనం వెరవెల్లాడతామే అలా వెరవెల్లాడమండి అక్కడ ఎందుకంటే ఇక్కడ వీరు మన మనసులో ఉన్నారండి వారు మన మనసులో లేరండి అందుకే విషయాలు గాని వస్తువులు గాని వ్యక్తులు గాని బయట ఉంటే ప్రమాదం లేదండి అవి మన మనసులో ఉంటేనే ప్రమాదం అవి మన మనసులో ఉండి మనల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వండి విషయాలు గాని వస్తువులు గాని వాటి వలన అవి బయట ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి మన మనసులో ఉంటేనే ప్రమాదం అండి అదే చెప్తున్నారండి ఇక చెప్పి జనక మహారాజు ఈ విషయాన్ని
(23:25) సుగుడికి చెప్పారు కదండీ నీకు ఈ దృశ్య ప్రపంచం మీద ద్వేషము లేదు ప్రేమ లేదు ఇక నీవు ప్రపంచంలో పరమన్నా పడవు నీవు ముక్తుడువైపోయావు అని చెప్పారు కదండీ జనక మహారాజు ఇలా చెప్తూ ఉండగానే సుఖ మహర్షి తన మనసును లయం చేసి బ్రహ్మ బ్రహ్మ సమాధిలోకి వెళ్ళిపోయారండి. అలా కొంతసేపు ఉండేసరికి అతనికి అంతకుముందు దాకా ఉన్న సందేహాలన్నీ పూర్తిగా పటాపంచలు అయిపోయినాయండి.
(23:59) కొంతసేపు అయ్యాక సుఖమహర్షి జనక మహారాజు వద్ద సెలవు తీసుకొని సరాసరి మేరు పర్వత శిఖరానికి చేరుకున్నారండి. మేరు పర్వత శిఖరానికి చేరిపవేల సంవత్సరాలుండి. 10వేల సంవత్సరాల పాటు ఏకధాటిక నిర్వికల్ప సమాధిలో ఉన్నారండి నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు అని విశ్వామిత్రుడు శ్రీరాముడు చెప్పి ముగిస్తున్నారండి హరిహి ఓం ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు
(24:43) అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి

No comments:

Post a Comment