ఆర్థర్ కాటన్ ఆనకట్టల వెనుక గాగి ఉన్న చీకటి నిజం Part 2
Author Name:Sri Nighasa
Youtube Channel Url:https://www.youtube.com/@SriNighasa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uT_V6TACChk
Transcript:
(00:00) జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఘాస ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో బ్రిటిష్ అధికారి కాటన్ లో ప్రపంచం గుర్తించని రెండవ కోణం భారతదేశంలో కాటన్ కట్టిన ఆనకటలలో అతను ఉపయోగించిన విజ్ఞానం అతనిదేనా అనే కోణాన్ని స్పృసిిస్తూ చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఎవరైనా చూడనట్లయితే చూడవచ్చు. కాటన్ లో నేను పరిశీలించిన రెండవ కోణం గురించి మాట్లాడే ముందు నాకు ఆ అనుమానం ఎందుకు కలిగిందో కొంత నేపథ్యం చెప్పాలి.
(00:35) మనం కాటన్ భారతదేశంలో పనిచేసిన కాలక్రమం గమనించాలి. అతను వివిధ ప్రాజెక్టుల మీద పనిచేసిన కాలం 1821 మధ్య నుంచి 1864 వరకు అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాటన్ భారతదేశంలో ప్రధానమైన ప్రాజెక్టులు చేపట్టే నాటికి బ్రిటిష్ పాలకులకు భారత్ కి స్వాతంత్రయం ఇవ్వాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం చాలా శక్తివంతంగా ఎదుగుతోంది.
(01:12) వారు వాళ్ళ పాలన కొన్ని శతాబ్దాల పాటు కొనసాగుతుందని నమ్మారు. ఇంకా చెప్పాలంటే ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తరువాత అంటే 1852 తర్వాత ఐదు సంవత్సరాల తరువాత గాని సిపాయి తిరుగుబాటు కూడా జరగలేదు. అంటే బ్రిటిష్ పాలకులు బ్రిటిష్ అధికారులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉండి ఉంటారు? భారతదేశాన్న నుంచి సాధ్యమైనంత సంపద ఎలా కొల్లగొట్టాలి అని కాటన్ దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ అక్కడి ప్రజలు దయనీయ స్థితిలో ఎందుకు ఉన్నారో గమనించాలి.
(01:47) అప్పట్లో నూలు వస్త్రాల ఉత్పత్తి ప్రపంచ ప్రసిద్ధి చెందింది దక్షిణ భారత్లో అత్యధిక మందికి ఉపాధినిచ్చే రంగం కూడా ఇదే ఈ వ్యవస్థని బ్రిటిష్ వాణిజ్య విధానాలు పూర్తిగా సర్వనాశనం చేశాయి. కేవలం ముడిసరుకు మాత్రం తక్కువ ధరకే బ్రిటన్ కి తరలించి ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన వస్త్రాలని అక్కడ వాడకూడదని బ్రిటన్ లో లా చేసి అక్కడ యంత్రాలపై తయారైన వస్త్రాలను తీసుకొచ్చి చౌకగా ఇక్కడ భారత్లో మార్కెట్లని ముంచెత్తి చేనేత రంగాన్ని కుప్పకూల్చారు ఫలితంగా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి ఆర్థికంగా చితికిపోయారు. దీనికి తోడు బ్రిటిష్
(02:30) పాలకులు కేవలం లాభాపేక్షతో మాత్రమే పని చేస్తూ ప్రజలని పన్ను కట్టమని ఒత్తిడి చేసేవారు. అటువంటి సమయంలో కాటనా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఒక బ్రిటిష్ అధికారిగా బ్రిటిష్ పాలకుల ఖజానాని నింపడానికి లాభాల పంట పండించడానికి ఏ విధమైన విధానాలు అవలంబించవచ్చో ప్రణాళికలు చేశాడు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు షార్ట్ టర్మ్ ఫలితాల మీద ఆధారపడి ఉండవు.
(02:58) ఐదు సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేసిన లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే కాటన్ పని చేసిన ఆ సమయంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని గాని భారతదేశానికి స్వతంత్రం ఇవ్వవలసి వస్తుందని గాని వాళ్ళు ఊహించలేదు. కొన్ని శతాబ్దాల పాటు వాళ్లే పాలకులుగా ఉంటారు అని ఊహించారు. అయితే బ్రిటిష్ పాలకులు ఎక్కువగా నిధులని రైల్వే నిర్మాణానికి రోడ్ల నిర్మాణానికి ఇచ్చేవారు తప్ప ఇతర ప్రాజెక్టుల మీద ఖర్చు చేసేవారు కాదు కానీ కాటన్ యొక్క నైపుణ్యము జలసంబంధమైనది కాబట్టి అతని కంటికి చక్కటి సారవంతమైన భూములు అద్భుతమైన నదులు అతి
(03:38) చౌకగా లభించే కూలీలు ప్రాజెక్టులకు కావలసిన ముడిసరుకు కనిపించాయి. అతి తక్కువ ఖర్చుతో కొన్ని సంవత్సరాల శ్రమతో ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల ఖజానాని ధనంతో ఎలా నింపవచ్చో ఆయన పక్కాగా ప్రణాళికలు లెక్కలు వేసి బ్రిటిష్ పాలకులను ఒప్పించి వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. ఆయన కుమార్తె రాసిన ఆ పుస్తకాన్ని నిశితంగా గమనిస్తే ఎక్కువగా అతి తక్కువ మొత్తంతో అత్యధిక లాభాలు ఎలా గడించవచ్చో ఆయన వేసిన లెక్కలే కనిపిస్తాయి ఎక్కువగా అయితే అంతా బానే ఉంది కదా ఇందులో అంత అనుమానించాల్సిన విషయం ఏముంది అన్నప్పుడు ఆయన చూసిన సారాంతమైన భూములు అద్భుతమైన నదులు అతి
(04:23) చౌకగా లభించే కూలీలు విచ్చల విడిగా దొరికే ముడి సరుకు వీటిని గమనించినప్పుడు ఏమిటా ముడి సరుకు దగ్గర ప్రశ్న మొదలవుతుంది. ఆనకట్టలు కట్టడానికి సరిపడా అంత ముడిసరుకు ఆయనకి అంత చౌకగా ఎలా లభించింది? ఇందులో వేరే కోణం ఉందా అని ఆలోచిస్తే కాటన్ లోని భయంకరమైన ఇంకో కోణం బయటపడుతుంది. దానినే నేను ఇక్కడ కాటన్ లో నేను గమనించిన రెండవ కోణంగా విశ్లేషణ చేస్తున్నాను.
(04:55) వీడియో చివరికంటా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో నాతో తెలపండి. ప్రశ్న ఏంటంటే కాటన్ వివిధ ఆనకట్టలు కట్టేటప్పుడు కాలో నిర్మాణం జరుగుతున్నప్పుడు పురాతన ఆలయాల మీద కోటల మీద దాడి చేసి ధ్వంసం చేశాడా? సమాధానం ఖచ్చితంగా అవును అనే వస్తుంది. దీనికి ఆధారం ఆయన కుమార్తె రచించిన పుస్తకమే అందులో ఒకచోట ఒక చిన్న తీగ మాత్రమే దొరికింది.
(05:29) దానిని పట్టుకొని లాగితే డొంక కదిలింది. బ్రిటిష్ పాలకులు కాటన్ లాంటివారు ఆనకట్టలు లేదా ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కోటలకు ఆలయాలకు ఉపయోగించిన రాళ్లను ముడి సరుకుగా వాడేవారు. కానీ ఆ విషయాలని రికార్డులలో మాత్రం వివిధ పేర్లతో ఖర్చు తగ్గించే నెపంతో రాసేవారు. విగ్రహాలని ఆలయ భాగాలని కోట భాగాలని వాడినప్పుడు వాటికి ఆ పేర్లు కాకుండా కొన్ని సాంకేతిక పదాలను వాడేవారు.
(06:00) ఉదాహరణకి డెబ్రీస్ అని గాని రబీష్ అని గాని లేదా లోకల్ మెటీరియల్స్ అని గాని రిక్లమేషన్ ఆఫ్ స్టోన్ అని గాని ఇలా వివిధ పేర్లతో రాసేవారు తప్ప ఆలయాలు కోటలకు సంబంధించిన రాళ్ళు అని మాత్రం రాసేవారు కాదు రికార్డులలో ఇవన్నీ నువ్వు ఏ ఆధారంతో చెప్తున్నావు నీ ఊహాజనితమైన మాటలా అనిఅంటే కాదు ఖచ్చితంగా సాక్ష్యం చూపిస్తాను అది కూడా ఆయన కుమార్తె రాసిన ఆ పుస్తకం నుంచే ఆ పుస్తకంలో ఒకచోట కాటన్ లోయర్ ఆనకట్ట కట్టే సమయంలో ఒక ఆలయపు సిధిలాలు వాడినట్లుగా తెలిపారు.
(06:38) అక్కడ దొరికిన సమాచారం ఏంటంటే నాకు ఆ పుస్తకంలో ఒక విలక్షణమైన పరిస్థితి వల్ల ఖర్చు గణనీయంగా తగ్గిందని దేవంగత జనరల్ బెల్ పేర్కొన్నారు. ఎగువ ఆనకట్ట కోసం రాళ్లను నిర్మాణ స్థలానికి సమీపంలోనే తవ్వి తీశారు. కానీ దిగువ ఆనకట్టకు చాలా దూరం వరకు అటువంటి వనరులు అందుబాటులో లేవు దాంతో దానికి అవసరమైన రాళ్ళన్నింటిని ఖచ్చితంగా బ్రాహ్మణుల అనుమతితోనే సమీపంలోని అడవిలో ఉన్న ఎప్పటి నుంచో నిరుపయోగంగా పడి ఉన్న ఒక పురాతన ఆలయ ప్రాకారం నుండి సేకరించడం జరిగింది.
(07:16) అది చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కచ్చితంగా బ్రాహ్మణుల అనుమతితో అని రాయటం నాకు అనుమానం రేకెత్తిచ్చింది. వీళ్ళు చేసే వెధవ పనులన్నీ వీళ్ళు చేసి ఎప్పుడూ అమాయకులైన బ్రాహ్మణులను దోషులుగా చూపించి వారిని నాశనం చేసి తద్వారా ధర్మహాని చేయడం వీళ్ళకి మొదటి నుంచి అలవాటే కదా నాకు అక్కడే అనుమానం మొదలైంది. ఆ ముక్క పట్టుకుని అసలు ఏం జరిగింది ఈ ఆలయం ఏమై ఉంటుంది అని శోధన చేశాను.
(07:47) నాకు ఒక మతి పోయే విషయం తెలిసింది. వీడు ధ్వంసం చేసింది మామూలు దేవాలయం కాదు అద్భుత చారిత్రక నేపథ్యం ఉన్న గంగయకొండ చోళపురం ఆలయం దీనిని నిర్మించినది సామాన్య శకం 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు తన విజయాలకు చిన్హంగా నిర్మించాడు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని పోలి అద్భుతమైన శిల్పకళ కలిగి ఉంటుంది. కాటన్ నేతృత్వంలో ఈ ఆలయ ప్రాకారాలని ఇతర చిన్న ఉపాలయాలని కూల్చి ఆ రాళ్ళని లోయ రాణకట్ట నిర్మాణానికి ఉపయోగించారు.
(08:27) అలా చేయడం వల్ల ఖర్చు బాగా తగ్గిందని రికార్డ్స్ లో రాసుకున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇప్పటికీ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఆ ఆలయాన్ని సందర్శించినప్పుడు గమనిస్తే ఆలయ ప్రాకారాలను కోలగొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కొన్ని విలువైన శాసనాలు కోల్పోయామని చరిత్రకారులు చెప్తూ ఉంటారు.
(08:55) ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ రాళ్లని ఆనకట్టకు వాడినట్లుగా ఆలయానికి సంబంధించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి ఏఎస్ఐ రిపోర్టును చదివినా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అందులో ఆనకట్ట నిర్మాణ పనుల కోసం ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు అప్పట్లో స్థానికంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారని అందుకు ఆ ప్రజలు ధిక్కార శిక్షలు ఎదుర్కొన్నారని కూడా సమాచారం పొందుపరచబడి ఉంది.
(09:26) అందులో వాళ్ళు అప్పట్లో స్థానికంగా ప్రచరింపబడిన ఒక ఇండియన్ యాంటిక్వెరీ పేజ్ 274 నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆ స్టోరీ ఏంటంటే ఉన్నతమైన గంగయకొండ చోళాపురం ఆలయం గురించి మాట్లాడుతున్నప్పుడు దిగువ కెలేరూన్ ఆనకట్ట నిర్మించే సమయంలో ఆ పనుల కోసం అవసరమైన సామాగ్రిని పొందేందుకు ఈ ఆలయాన్ని అలంకరించిన అద్భుతమైన గ్రానైట్ శిల్పాలలో లో ఎక్కువ భాగం తొలగింపబడ్డాయని చుట్టూ గోడ దాదాపు పూర్తిగా ధ్వంసం చేయబడిందని మర్చిపోకూడదు అని చెప్పబడిందిట ఆ ఆలయంలో ఎటువంటి హక్కు లేని ప్రభుత్వ సేవకులు చేస్తున్న ఈ విధ్వంసాన్ని ఆ పవిత్రమైన కట్టడం యొక్క నాశనాన్ని
(10:12) అడ్డుకోవడానికి ప్రజలు తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు సరి కదా పైగా వారు కోర్టు ధిక్కారానికి శిక్షింపబడ్డారు. పగలగొట్టబడిన రాతిగోడకు బదులుగా ఇటుకలతో గోడ నిర్మిస్తామని వాగ్దానం చేయబడింది కానీ దురదృష్టవశాత్తు ఆ వాగ్దానం కూడా నెరవేరలేదని ఇక్కడ నమోదు చేయక తప్పదు అని ఆ సమాచారాన్ని ఈ ఏఎస్ఐ రిపోర్ట్ లో పొందుపరిచారు.
(10:43) ప్రాకారం విషయానికి వస్తే ఇది తంజావురు నమూనాలోనే చుట్టూ రెండు అంతస్తుల మండపాన్ని కరిగి ఉండేది. ప్రస్తుతం ఉత్తర భాగంలో మాత్రమే దీనిలో కొంత భాగం మిగిలి ఉంది. మిగిలిన భాగాలలోని రాళ్లను కొల్లేయడం నదిపై దిగువ ఆనకట్ట నిర్మించడానికి ఉపయోగించారు. గోపురం తూర్పు వైపున ఉన్న ప్రవేశ ద్వారం యొక్క గోపురం పూర్తిగా కూలిపోయింది. ఇది తంజావూరు ఆలయం యొక్క వెలుపలి గోపురం నమూనాను అనుసరించింది.
(11:12) దీని పునాదిపై ద్వారపాలకులు తప్ప మరే ఇతర శిల్పాలు లేవు. పైన పేర్కొన్న ఆనకట్ట నిర్మాణానికి ఈ సిధిలమైన గోపురం నుండి రాళ్లను తొలగించారు. ఈ విషయాలన్నీ ఏఎస్ఐ ఆ రిపోర్ట్ లో భద్రపరిచింది. దీనిని బట్టి కావేరీ నది మీద కట్టిన లోయర్ ఆనకట్టకు ఉపయోగించిన ముడిసరుకు ఆ రాళ్లను ఈ ఆలయం నుంచి సేకరించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
(11:40) ఇది చూసిన తర్వాత నాకు బహుశా కాటన్ మిగతా ప్రాజెక్టులకు కూడా ఖర్చు తగ్గించడానికి ఇవే పద్ధతులని అనుసరించి ఉండవచ్చు భవిష్యత్తులో దాని మీద కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.
No comments:
Post a Comment