Saturday, May 16, 2026

ఒక మగవాడు ఏడ్చాడు అంటే దాని అర్థం..?@chanakyaneethi1226

ఒక మగవాడు ఏడ్చాడు అంటే దాని అర్థం..?@chanakyaneethi1226

Author Name:CHANAKYANEETHI

Youtube Channel Url:https://www.youtube.com/@chanakyaneethi1226

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IsDl-r_Mdl8



Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్యస్ నీతి జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు. అలాగే ఎవ్వరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. అనుభవంతో చెబుతున్నాను అర్థం చేసుకోండి. అలాగే మనం ఎలా బ్రతకాలో అనేది మనకున్న బాధ్యతలు బాధలు అనుభవాలే మనకు నేర్పిస్తాయి.
(00:41) మనకు ఎవ్వరూ నేర్పాల్సిన అవసరం లేదు జీవితం అంటేనే ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకాల్సిందే జీవితం అంటే ఒక పూలపానుపు కాదు ఎప్పుడూ సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు బాధలను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి ఈ భూమ్మీద బ్రతికే అర్హత ఉంటుంది. అంతేకానీ పిరికి వాళ్ళకు కాదు గుండ్రంగా తిరిగేదే భూమి కాలేదేనే నిప్పు పోరాడేవాడే మనిషి ఇక నువ్వు నిజంగా మనిషివైతే జీవితంలో పోరాడు ఎదుర్కొని నిలబడు మనుషులతో కాదు మీ బలాలని అలాగే మీ
(01:27) బలహీనతల్ని క్షుణణంగా విశ్లేషించుకోండి అప్పుడే అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తా ారు అర్థమైంది కదండీ అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మన జీవితం గురించి తలచుకుంటే మనకే నవ్వవస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎన్ని భరించానో ఎన్ని భరిస్తున్నానో అని ఇంకా ఎన్ని భరించాలో అని నిజమే కదా కానీ ఎన్ని మోసాలు ఎన్ని గాయాలు తట్టుకోలేనంతగా తగులుతున్నా పైకి నవ్వుతూ కనిపించేవాడే నిజమైన ధైర్యవంతుడు
(02:12) గుర్తుంచుకోండి అలాగే అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి. అవసరాలే మనుషులని కలిపేలా చేస్తాయి. ఇక్కడ అవసరం అనేది లేకుండా ఏదీ కూడా జరగదు. నిజమే కదండీ ఎవరి గురించి నీకెందుకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? వయసు పెరిగే కొద్దీ కూడా సమస్యలు కూడా పెరుగుతాయి అని కానీ అదే నిజం నిజమే కదండీ మీ గతం గొప్పది కాకపోవచ్చు కానీ ఎప్పుడూ కూడా గతంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు మాత్రం గొప్పవే అని ఎప్పుడూ మర్చిపోకండి.
(02:58) ఒక్కోసారి తోడ పుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు బాధపడకుండా ఎవ్వరూ కూడా బాగుపడలేరని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండీ సమస్యల నుంచి వచ్చే బాధ కంటే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు అనే బాధే ఎక్కువగా ఉంటుంది. కనికరం లేనటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం కానీ కాలానికి ఎవ్వరూ కూడా చుట్టం కాదు కర్మకి కనికరం ఉండదు కాస్త జాగ్రత్తగా జీవించడం నేర్చుకోండి.
(03:41) అర్థమైంది కదండీ జీవికి మరణం మాత్రం తప్పదు అప్పటివరకు కూడా ఎలా ఉండాలో నీ జీవితం నీ నిర్ణయం అలాగే నీ ఇష్టం అర్థమైంది కదండీ ఇక సమయం ఉన్నప్పుడు మనుషులకి మనుషుల విలువ తెలియదు విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు ఇక అలాగే ఆ మనుషులు ఉండరు అందుకే ఉన్నప్పుడే గుర్తించండి విలువ ఇవ్వండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమయాన్ని మనస్ఫూర్తిగా గడపండి.
(04:21) ఒకరిని కోల్పోయాను అనే బాధ జీవితంలో చాలా నొప్పిని కలగజేస్తుంది. కాబట్టి సమయం తప్పక గడపండి. అర్థమైంది కదండీ ఒక్కోసారి తెలియక చేసే తప్పులే ఇక ఎప్పుడూ కూడా ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి. ఈ రోజుల్లో మాత్రం అప్పు ఇచ్చినా తిరిగి రాదు అలాగే ప్రేమ ఇచ్చినా కూడా తిరిగి రావడం లేదు. నిజమే కదండీ విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకూడదు.
(04:57) ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకూడదు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు అలాగే గౌరవం వచ్చాక గతాన్ని అస్సలు మర్చిపోవద్దు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు మనసున్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని ఒక్కసారి గమనించుకోండి ఎందుకు అంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది.
(05:35) అంతేకానీ సంస్కారం రాదు కదా నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఎందుకు అంటే ఇక కాలానికి అన్నీ తెలుసు అది తప్పక మీకు సమాధానం చెప్పి తీరుతుంది. గుర్తుంచుకోండి ఎవరు ఏంటి అన్నది నీకు అనవసరం. ముందు నువ్వేంటి అన్నది నువ్వు క్షుణణంగా తెలుసుకో. నీ గురించే నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వారి గురించి నీకు ఏం తెలుసని వారి గురించి మాట్లాడుతూ ఉంటావ్ ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు మూర్ఖులతో వాదన ఎలా ఉంటుంది అంటే అది మన బుగ్గ మీద
(06:24) వాలిన దోమని చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు మాత్రం వాయించుకోవడం కాయం నిజమే కదండీ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి.
(06:59) ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ యొక్క కష్టమే నిన్ను గట్టిగా ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక అలాగే నీ యొక్క సహనమే దానికి పెట్టుబడి గుర్తుపెట్టుకోండి బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు కానీ నీతి నిజాయిగా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం ఉంటుంది.
(07:36) అలాగే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు ప్రతిదానికి కూడా నడిపించే కారణం తప్పకుండా ఒకటి ఉంటుందని మర్చిపోకండి మనిషికి ఉన్న రెండు రెండు అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడూ తెలియకపోవడం రెండోది తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం
(08:25) నిజమే కదండీ సో చూశకారు కదా ఇలాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ [గురకలు] మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.

No comments:

Post a Comment