నిన్ను మోసం చేసిన వాడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ | The Most Powerful Revenge On Your Enemy | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TNjkyhzwb3Q
Transcript:
(00:06) మీరు ఎవరినైనా క్షమించకపోతే వాళ్ళు మీ జీవితంలోనే కాదు మీ మెదడులో అద్దికుంటున్నారని అర్థం. అది కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీ ప్రశాంతతను తినేస్తూ ఒక్కడే తిష్టవేస్తారు. నిజం చెప్పనా పగ అనేది ఒక విషయం. ఆ విషయాన్ని మీరు తాగి అవతలవాడు చావాలని కోరుకోవడం ఎంత అమాయకత్వం మనం మన జీవితంలో ఎదురయ్యే మనుషుల వల్ల వాళ్ళు చేసే మోసాల వల్ల ఒక రకమైన బాధని అనుభవిస్తాం.
(00:33) ఎవడో మిమ్మల్ని నమ్మించి గొంతు కోసేసాడు. ఇంకెవడో మీకు అవసరమైనప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. లేకపోతే ఎవడో మీ గురించి అబద్ధాలు ప్రచారం చేశాడు. వెంటనే మీకు ఏమనిపిస్తుంది? వాడిని నాశనం చేయాలి. వాడి మీద పగతీర్చుకోవాలి. వాడిని చూసేటప్పుడల్లా మీ రక్తం మరిగిపోతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ కోపం ఈ పగతీర్చుకోవడం ఈ అసూయ ఇవన్నీ మీ లోపల ఒక క్యాన్సర్ గడ్డలా పేరుకుపోతాయి.
(00:58) ఎలాగంటే మీరు తింటున్నప్పుడు వాడు గుర్తొస్తాడు. నిద్రపోతున్నప్పుడు వాడు గుర్తొస్తాడు. కానీ వాడు ఎక్కడో హాయిగా పార్టీ చేసుకుంటూ వాడి జీవితంలో వాడు హ్యాపీగానే ఉంటాడు. కానీ మీరు మాత్రం ఇక్కడ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక గొప్ప యోగి లాహిరి మహాశయుల గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నారో తెలుసా ఈ ప్రపంచం ఒక కల లాంటిది.
(01:19) ఇక్కడ జరిగే గొడవలు, అవమానాలు అన్నీ నీ నీడతో నువ్వు చేస్తున్న యుద్ధం అని మీరు ఒక వ్యక్తి మీద కోపంగా ఉన్నారంటే మీరు ఇంకా ఆ కలలోనే ఉన్నారని అర్థం. లాహరి మహసయులు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎందరో ఆయన్ని విమర్శించారు. కానీ ఆయన మాత్రం తన మనసులోకి ఎప్పుడూ ఆ బాధని రానివ్వలేదు. ఎందుకంటే ఆయనకి ఒక క్లారిటీ ఉంది. బయట జరిగే ఏదైనా సరే అది మీ లోపల ఉన్న ప్రశాంతతని తాకకూడదు.
(01:48) ఎందుకంటే మీ ప్రశాంతతకి మీరే బాధ్యులు. మీ పక్కన ఉండేవాళ్ళు కాదు కదా మీరు పగని లోపల దాచుకుంటే మీరు ఆత్మీయంగా ఎదవడం అనేది అప్పటికప్పుడే ఆగిపోతుంది. ఒక ఎయిర్ బెల్ ని పైకి ఎగరాలంటే దానికి ఉన్న బరువు వదిలేయాలి. మీ కోపమే ఆ బరువు దాన్ని పట్టుకొని మీరు ఆకాశానికి ఎలా వెళ్తారు నిజం చెప్పనా ఈ సమస్య అంతా ఎందుకు వస్తుందో తెలుసా? మీకు అంచనాలు ఎక్కువ.
(02:11) మీరు ఒకడికి హెల్ప్ చేశారంటే వాడు తిరిగి మీకు ఏదో చేస్తాడని మీరు ముందే ఒక సినిమా స్క్రిప్ట్ రాసేసుకుంటారు. తీరా వాడు మీకు అవసరమైనప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడు మీకు కోపం వస్తుంది. కానీ ప్రాబ్లం వాడిది కాదు మీది ఎందుకంటే మీరు వాడికి మామూలుగా సహాయం చేయలేదు. మీ మనసులో ఒక బిజినెస్ అనే ఆస్పెక్ట్ పెట్టుకొని వాడికి మీరు హెల్ప్ చేశారు.
(02:34) అది ఎలాగంటే నేను నీకు ఇది ఇస్తున్నాను. నువ్వు నాకు అది ఇవ్వాలి అని చెప్పేసి ఒక బిజినెస్ ని మైండ్లో పెట్టుకుంటారు. ఆ బిజినెస్ ఫెయిల్ అవ్వగానే మీకు వాడి మీద కోపం వచ్చేస్తుంది. మనం అంటూ ఉంటాం వాడు నన్ను మోసం చేశాడు అని వాడు నిన్ను ఒకసారి మోసం చేస్తే అది తలుచుకొని తలుచుకొని ప్రతిసారి నువ్వు ఏడుస్తున్నావ్ చూసావు అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లాంటిది.
(02:54) నువ్వు నీ మైండ్ ని ఒక చెత్త కుండిలా మార్చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ దారిలో వెళ్తుంటే ఎవడో నీ మీద బురద చల్లాడు. ఆ బురదని కడుక్కోవడం మానేసి ఆ బురద వేసిన వాడి గురించి ఆలోచిస్తూ రోజంతా ఆ బురదలో కూర్చుంటే ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. లాహిరి మాసేయులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీ సంతోషం కోసం నువ్వు బయట మనుషుల మీద ఆధారపడితే నువ్వు ఎప్పటికీ బానిసే అని చెప్పేసి అన్నారు ఆయన అంటే ఫలానా మనిషి నా పక్కన ఉంటే ఆనందంగా ఉంటాను ఫలానా పని చేస్తే నేను హ్యాపీగా ఉంటాను లేకపోతే నేను బాధపడతాను అని చెప్పేసి మనకి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం అనేది మన
(03:30) చేతనితనం నిజం చెప్పాలంటే మన బానిసతనం. లాహరి మసయులు గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక గృహస్తుడుగా ఉంటూనే యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయనకు ఆఫీస్ లో బాస్ ఉండేవారు చుట్టూ రకరకాల మనుషులు ఉండేవారు కానీ ఆయన అవాస్తవికమైన ఆశలు ఎవరి మీద పెట్టుకోలేదు. ఆయన ఏమనేవారో తెలుసా ప్రతి మనిషి తన సొంత కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు.
(03:56) ఒకడు నన్ను బాధ పెడుతున్నాడు అంటే వాడు తన అజ్ఞానంలో ఉన్నాడు. వాడి అజ్ఞానానికి నువ్వు ఎందుకు శిక్ష అనుభవిస్తావు అనేవాళ్ళు మీరు పగని లోపల పెట్టుకున్నారంటే మీరు వాడికి సరెండర్ అయిపోయారని అర్థం. అంతేకాకుండా ఆ బాధ మీ రక్తాన్ని విషంగా మారుస్తుంది. మీరు ఎవరి మీద అయితే కోపంగా ఉన్నారో వాడు మీ మెదడులో కూర్చొని మీ ప్రశాంతతని తినేస్తాడు.
(04:18) అంతేకాకుండా మీ కొత్త ఐడియాలకి క్రియేటివిటీ కి చోటు అనేది వాడు ఇవ్వడు. కాబట్టి ఎవడి మీదో కోపం పెంచుకొని వాడిని మీ మనసులో పెట్టుకోమాకండి. సరే ఇదంతా బాగానే ఉంది ప్రతి ఒక్కడు చెప్తాడు అవతల వాడి మీద కోపపడొద్దు అని చెప్పేసి అసలు ఒక వ్యక్తి మనకు అన్యాయం చేసినప్పుడు మనకి వాడి మీద కోపం రాకుండా ఎలా ఉంటుంది ఒకవేళ వచ్చినా సరే దీని నుంచి ఎలా బయట పడాలి అంటే దానికైతే ఒక దారి ఉంది.
(04:42) అదే క్షమించడం వినటానికి చాలా సాఫ్ట్ గా ఉంది కానీ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ డెసిషన్ చాలా మంది ఏమనుకుంటారంటే క్షమించడం అనేది అవతల వాడి తప్పుని ఒప్పుకోవడమో లేకపోతే వాడితో మళ్ళీ కలిసి దోస్తీ చేయడమో అని చెప్పేసి అనుకుంటారు. అస్సలు కానే కాదు క్షమించడం అంటే వాడిని మీ మెదడులో నుంచి మీ జీవితంలో నుంచి శాశ్వతంగా డిలీట్ చేయడం లాంటిది.
(05:06) వాడి ముఖం మళ్ళీ మీకు గుర్తొచ్చినా మీ గుండెల్లో ఆ మంట పుట్టకూడదు అదే రియల్ సక్సెస్ చాలా మంది ఏమనుకుంటారంటే అవతలి వాడిని క్షమిస్తే వాడు గెలిచినట్టు కదా అని చెప్పేసి కానీ నిజం ఏంటంటే మీరు కోపాన్ని పట్టుకొని కూర్చుంటే వాడు గెలిచినట్టు అవుతుంది కానీ నువ్వు గెలిచినట్టు అవ్వదు. అదే వాడిని క్షమించేసి ఆ చెత్తని పక్కన పెట్టేస్తే అప్పుడు మీరు గెలిచినట్టు అవుతుంది.
(05:28) మీ ఆఫీస్ లోనో మీ ఇంట్లోనో ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. వాడు ఇన్సల్ట్ చేసినప్పుడు వాడికి తెలుసు వాడు తప్పు చేస్తున్నాడని అలాంటి వాడికి మీరు ఇవ్వాల్సిన బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వెళ్లి హెల్ప్ చేయడమే వాడు షాక్ అవ్వాలి. వాడి లోపల అపరాధ భావం కలగాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకొని పది మందిలో నవ్వులు పాలు చేస్తాడో పది మందిలో మీ పరువు తీస్తూ ఉంటాడో వాడు ఆపదలో ఉన్నప్పుడు మీకు మీరుగా వెళ్లి వాడికి హెల్ప్ చేస్తే వాడు చేసిన తప్పులు వాడికి గుర్తొస్తాయి. నిజం చెప్పాలంటే వాడు
(06:03) ఒంటరిగా కూర్చొని వాడిని వాడు తిట్టుకొని వాడే వాడిని అసహించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు గెలిచినట్లా లేకపోతే ఇన్సల్ట్ చేసినా కూడా మనం వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం గెలిచినట్లా నేనైతే నా పర్సనల్ లైఫ్ లో పాటించే ఒక బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే అవతలి వాళ్ళు నన్ను మోసం చేసేంత అమాయకంగా ఉండను అలా అని చెప్పేసి ఒకవేళ మోసం చేస్తే వాడి మీద పగ పెంచుకొని వాడి మీద ప్రతికారం తీర్చుకునేంత అమాయకంగా అస్సలు ఉండను.
(06:33) మోసపోవడం మన తప్పే మోసం చేసిన వాడిని శత్రువుగా భావించి వాడి మీద రివెంజ్ తెచ్చుకోవాలనుకోవడం కూడా మన తప్పే లాహరి మసైల జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆయన రైల్వే ఆఫీస్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నప్పుడు ఒక అధికారి ఆయనను చాలా నీచంగా చూసేవాడు. లేనిపోని నిందలు వేసేవాడు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ అతనిపై కోప్పడలేదు.
(06:57) కనీసం వాడి గురించి ఎవరికీ తప్పుగా కూడా చెప్పలేదు. ఒకరోజు ఆ అధికారి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అందరూ అతన్ని వదిలేశారు. అప్పుడు లాహిరి మహాశయులు గారు ఆయన ఇంటికి వెళ్లి ఆయన యోగ క్షేమాలు కనుక్కొని మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే నా స్థాయికి నేను చేయగలిగింది చేస్తానని చెప్పేసి ఆయనకి ధైర్యం చెప్పాడు. ఆ అధికారి కళ్ళు తెరిచి లాహరి మాసయుల పాదాల మీద పడి ఏడ్చేశడు.
(07:20) అప్పుడు ఒకే ఒక మాట అన్నారు ఆయన. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను ఎందుకంటే నీ లోపల ఉన్న పరమాత్మను నేను చూశాను కానీ నీ అజ్ఞానాన్ని కాదు కాబట్టి అజ్ఞానం అనేది మనిషికి ఏదో ఒక రోజు తొలగిపోతుంది కానీ పరమాత్మ అనేది ఒక మనిషి మనసులో ఎప్పుడూ ఉంటుంది. పరమాత్మ అంటే ఈ దేవుడు క్రియేట్ చేసిన ఎమోషన్స్ అనేవి ఎందుకంటే భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు అంతేకాకుండా గిల్ట్ ఫీలింగ్ కూడా మనుషులకి ఇచ్చాడు.
(07:48) ఒక్కడే కూర్చున్నా లేకపోతే 10 మందిలో ఉన్న ఒక తప్పు చేస్తే మనం చేసిన తప్పు మనకి గుర్తొస్తూనే ఉంటుంది కదా దాన్నే గిల్ట్ ఫీలింగ్ అంటారు. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనిషి మనసులో ఉన్న అజ్ఞానం అనేది తొలగినప్పుడు అది కచ్చితంగా అందరికీ తొలుగుతుంది. కచ్చితంగా తప్పు చేసిన వాడు నేను తప్పు చేశాను అని చెప్పేసి బాధ పడతాడు. అది ఆయన చెప్పిందన్నమాట.
(08:09) క్షమించడం అనేది మన మనసులో కలిగే ఫీలింగ్ కాదు. అది ఒక కాన్షియస్ డిసిషన్. మీరు రోజువారి పూజలోనో లేదా ధ్యానంలోనో ఉదయాన్నే ఒక పని చేయండి. కళ్ళు మూసుకొని నాకు తెలుసో తెలియకో ఎవరైనా నాకు ద్రోహం చేసి ఉంటే వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పేసి గట్టిగా అనుకోండి. మీ మైండ్ ఎంత లైట్ గా అయిపోతుందో మీకే తెలుస్తుంది.
(08:32) గతాన్ని పట్టుకొని వేలాడకండి. మురికి కాలువని ఎంత కడిగితే అంత వాసన వస్తుందే తప్ప అది క్లీన్ అవ్వదు. సో గతం కూడా ఒక మురికి కాలువ లాంటిదే. మీరు మార్చాలన్నా సరే అది మారదు. సరే ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. ఈ చెత్తంతా క్లీన్ చేశాక మరి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి ముందు ఆ శున్యతత్వం అనే ముసుగు తీసి అవతల పారేయండి.
(08:55) ఈ రోజుల్లో జనం ఎలా తయారయ్యారంటే పక్కనోడు కాస్త ప్రశాంతంగా బతికితే చాలు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అలా తయారయ్యారు. అందులోనూ వాడు నన్ను ఇలా చూశడు వీడు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు నన్ను చూసి కూడా చూనట్టు వెళ్ళిపోయాడు. ఇలాగ రకరకాల కారణాలు చెప్పుకొని కనిపించిన ప్రతి ఒక్కడిని శత్రువు చేసుకునే పనుల్లో మనుషులు చాలా బిజీగా ఉన్నారు.
(09:15) కాబట్టి మీ ఆనందానికి మీరే బాధ్యత వహించండి. ఎవరో వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టాలని ఆశించడం ఆపేయండి. వాడు మిమ్మల్ని పొగిడితే గాలిలో తేలిపోవడం తిడితే మళ్ళీ మీరు వాడిని తిట్టడం ఈ రెండు బానిసత్వాలే మీ లోపల ఒక స్ట్రాంగ్ కోర్ ఉండాలి. బయట తుఫాన్ వచ్చినా లోపల ప్రశాంతంగా ఉండాలి. అది ఉన్నప్పుడే మీరు ఈ ప్రపంచంలో మనుగడ సాధించగలరు.
(09:37) ఒకడు పొగిడిన వెంటనే పొంగిపోవటం తిట్టిన వెంటనే వాడిని మీరు శత్రువు చేసుకోవడం ఇలాంటివి ఆపేయండి. ముఖ్యంగా లాహరి మాసలు చెప్పినట్టు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏదో మంత్రాలు చదవడం కాదు మీ మైండ్ లో ఉన్న అనవసరమైన ఫైల్స్ ని డిలీట్ చేయడం అవన్నీ డిలీట్ చేస్తేనే మీకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. వాడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు, వీడితో నేను మాట్లాడను.
(10:00) వాడు నావాడు ఇలాగ మీరు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటేనే శత్రువులనే వాళ్ళు మిత్రులు అవుతారు మిత్రులనే వాళ్ళు శత్రువులు అవుతూనే ఉంటారు. కాబట్టి ఇవేమీ లేకుండా మీ మనసును క్లియర్ గా ప్రతి ఒక్క మనిషిని మనిషిలా ట్రీట్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే దాన్ని పట్టించుకోమాకండి. ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తున్నాడా మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి.
(10:25) ఒకవేళ మోసం చేసేసాడా క్షమించి మీరు ఇంకోసారి మోసపోకుండా ఉండండి. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండాలంటే ఈ సూత్రాన్ని పాటిస్తే చాలు. గుర్తుంచుకోండి క్షమించడం అంటే మీరు బలహీనులని కాదు. మీరు చాలా బలవంతులని అర్థం. సింహం ఎప్పుడూ కుక్కల అరుపులకి రియాక్ట్ అవ్వదు. మీరు సింహంలా బ్రతకండి. ఆ కుక్కలకి మీరు ఇచ్చే అతి పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా వాళ్ళని పూర్తిగా మర్చిపోయి మీరు మీ లైఫ్ లో సక్సెస్ అయ్యి టాప్ లో కూర్చోవడమే.
(10:52) అది చూసి వాళ్ళు లోపల కుళ్లి చావాలి అదే రియల్ రివెంజ్ అలా అని చెప్పేసి వాళ్ళని మీరు శత్రువులుగా యాక్సెప్ట్ చేయకండి ఎందుకంటే లేని పోవుని తలకాయ నొప్పిని మీ మనసుకు ఇవ్వమాకండి ఇక్కడ మీకు ఎవ్వరు శత్రువులు లేరు మీ మాట వినని మీ మనసు తప్ప ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని మాత్రం కచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్
No comments:
Post a Comment