అద్వైతం అంటే ఏమిటి? తెలుసుకోవడం వల్ల మన జీవితంలో మార్పేమిటి? | Adi Shankaracharya Philosophy
Author Name:Sanathana Life
Youtube Channel Url:https://www.youtube.com/@Sanathana-Life
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UeN2xt7-RRg
Transcript:
(00:00) మన జీవితంలో మనం ప్రతిరోజు కొన్ని మాటలు పదే పదే చెబుతుంటాం. అవేంటంటే ఇది నేను అది నువ్వు ఇతను నా శత్రువు అది నా కారు నా ఇల్లు నా జీవితం అని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడూ భిన్నత్వం అనే కోణం నుంచే చూస్తాం. మనమంతా వేరు వేరు వ్యక్తులమని వేరు వేరు భావాలతో వేరు వేరు గమ్యాలతో జీవిస్తున్నామని అనుకుంటాం. ఈ వేర్పాటు భావమే మనలో భయాన్ని కోపాన్ని ఒంటరితనాన్ని పెంచుతుంది.
(00:27) కానీ 1200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక మహాజ్ఞాని జన్మించారు. ఆయనే ఆదిశంకరాచార్యులు. ఈ భిన్నత్వాన్ని ఈ విభేదాలని చూసి ఆయన ఒక సత్యాన్ని లోకానికి చాటి చెప్పారు. ఈ ప్రపంచంంతా వేరు వేరు కాదు ఒకటే బ్రహ్మం. అవును మీరు విన్నది నిజం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ రంగుల ప్రపంచం ఈ తేడాలన్నీ కేవలం ఒక పెద్ద బ్రమ.
(00:49) మనం చూస్తున్న ఈ భిన్నత్వం అంటే నేను వేరు నువ్వు వేరు అనే భావన నిజం కాదు అయితే ఇది ఎలా సాధ్యం మనం వేరువేరుగా లేకపోతే నేనంటే ఎవరు మరి ఈ జ్ఞానం మనకు ఉపయోగం ఏమిటి మన నిత్యజీవితంలో ఎదురయ్యే కష్టాలకు బాధలకు భయాలకు ఈ తత్వం ఎలా పరిష్కారం చూపుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల అద్వైతం అనే పదాన్ని విడదీస్తే అర్థం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
(01:14) ఆ అంటే కాదు లేదా లేనిది. ద్వైతం అంటే రెండు అంటే రెండవ లేని స్థితి అని అర్థం. ఈ విశ్వంలో నీ జీవితంలో నీ అనుభవంలో రెండవది అనేదే లేదు అంతా ఒకటే. ఈ విశ్వమంతా కేవలం ఒకే ఒక సత్యంపై ఆధారపడి ఉంది. ఆ ఒకే ఒక సత్యాన్ని మనం వేదాంత పరిభాషలో బ్రహ్మం అంటాం. ఈ బ్రహ్మమే సృష్టికి మూలం, ఆధారం మరియు అంతం. అది నిరాకారం మార్పు లేనిది నిత్యమైనది అనంతమైనది.
(01:42) మనం దీనినే పరమాత్మ ఈశ్వరుడు లేదా దేవుడు అని పిలుస్తాం. మరి మనం చూస్తున్న ఈ ప్రపంచం ఏంటి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మనుషులు జంతువులు ఇవన్నీ ఏంటి శంకరాచార్యుల తత్వం ప్రకారం బ్రహ్మ సత్యం జగత్ మిత్య జీవో బ్రహ్మైవ నాపరః ఇది అద్వైతానికి మూల సిద్ధాంతం దీనిని లోతుగా వివరిస్తే బ్రహ్మ సత్యం బ్రహ్మం ఒక్కటే శాశ్వతమైనది సత్యమైనది దానికి కాలం స్థలం వస్తువు అనే పరిమితులు పరిమితం చేయలేవు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.
(02:14) ఇక జగత్ మిత్య ఇక్కడ మాయ లేదా మిత్య అంటే లేదని కాదు మిత్య అంటే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ శాశ్వతం కాదు లేదా తాత్కాలిక సత్యం అని అర్థం. మనం చూసే ఈ ప్రపంచం మన అనుభవాలు మన భావద్వేగాలు ఇవన్నీ నిరంతరం మారుతూ ఉంటాయి. అందుకే వీటిని వ్యవహరిక సత్యాలు అంటారు. అంటే ట్రాఫిక్ లో హారన్ కొట్టడం ఇక్కడ నిజం. కానీ ఆ హారన్ శబ్దం శాశ్వత సత్యం కాదు.
(02:38) చివరిగా జీవుడే బ్రహ్మము. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవివి కాదు. నీలోని ఆత్మ చైతన్యం నీ అసలైన స్వరూపం అదే బ్రహ్మము ఒక పాత్రలోని నీరు ఎలా సముద్రంలోని నీటి నుంచి వేరు కాదో అలాగే జీవుడు పరమాత్మ నుంచి వేరు కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం నువ్వు ఆ అనంతమైన బ్రహ్మంలో ఒక భాగం కాదు నువ్వే ఆ బ్రహ్మమని అర్థం. ఈ సిద్ధాంతాన్ని బుద్ధిపరంగా అర్థం చేసుకోవడానికి శంకరాచార్యులు అద్భుతమైన ఉదాహరణలు చెప్పారు. వాటిలో ఒక దానిని పరిశీలిద్దాం.
(03:07) మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు కలలు కంటాం. కలలో నువ్వు కొత్త ప్రపంచాన్ని చూస్తావు. అక్కడ నువ్వు ఒక రాజువి కావచ్చు లేదంటే పేదవాడివి కావచ్చు. ఆ కలలో నువ్వు చాలా సంతోషంగా ఉండవచ్చు లేదా విపరీతమైన భయం బాధ అనుభవించవచ్చు. కల ఎంత నిజంగా ఉంటుందంటే లేచినా కూడా కొంతసేపు గుండెదడ ఉంటుంది. కానీ లేవగానే ఏమవుతుంది ఆ కలలో ప్రపంచం నీ సంతోషం నీ బాధ నీ భయం అన్ని ఒక క్షణంలో మాయమవుతాయి.
(03:37) ఆ కలలోని బాధ నీకు నిజమైన బాధ కాదని తెలుసుకుంటావు. అద్వైతం అదే చెబుతుంది. ఈ జాగ్రత్ ప్రపంచం కూడా ఒక కల లాంటిదే. ఇక్కడ కల అంటే అసలు లేనిది అని కాదు నిజమైన నిద్ర లాంటిది అని అర్థం. నీ అసలైన స్వరూపాన్ని నువ్వు మర్చిపోయి కేవలం ఈ శరీరాన్ని నేను అని అనుకుంటున్నావు. ఇదే నిద్ర. నిజమైన మేలుకొలుపు అనేది ఆత్మజ్ఞానం. నీవు ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని ఈ జగత్తు నా కల మాత్రమే అనే జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ మాయా జగత్తు అనే కల మాయమవుతుంది.
(04:07) అప్పుడు నువ్వు శాశ్వతమైన సత్యంలో నిలబడతావు. నువ్వు కల కంటున్నప్పుడు కల నిజం అనిపిస్తుంది. కానీ మేలుకున్న తర్వాతే అది కల అని తెలుస్తుంది. అలాగే మనం మాయలో ఉన్నంతవరకు ఈ ప్రపంచం నిజం అనిపిస్తుంది. జ్ఞానం పొందినప్పుడే ఇది తాత్కాలికం అని తెలుస్తుంది. ఈ తత్వం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది.
(04:31) మన జీవితంలో మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటాం. నేను బాధపడుతున్నాను. నాకు దుఃఖం వచ్చింది నాకు భయంగా ఉంది అని. ఈ వాక్యాలలో మనం నేను అనే పదాన్ని బాధ భయం కోపం అనే భావాలతో కలిపేస్తున్నాం. నీవే ఆ బాధ అనుకుంటావు కానీ అద్వైతం చెబుతుంది ఆ బాధ భయం కోపం అనేవి నీకు వచ్చినవి అవి నువ్వు కాదు నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఈ ఆలోచనలు ఈ భావాలు కాదు నీ నిజమైన స్వరూపం ఆత్మ అది శాంతమైన చైతన్యం మార్పు లేని నిశ్చలమైన సాక్షి ఒక ఉదాహరణ చూద్దాం.
(05:02) మీరు ఒక సినిమా చూస్తున్నారు. సినిమాలో హీరో బాధపడుతున్నాడు. అప్పుడు మీరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. కానీ మీరు ఆ హీరో కాదు మీరు కేవలం చూస్తున్న వ్యక్తి మాత్రమే అలాగే మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలు తెరపై కనిపించే సినిమా లాంటివి. మీరు తెర ముందు కూర్చున్న సాక్షి మాత్రమే. ఈ జ్ఞానం తెలిసిన వాడికి అంటే ఈ సాక్షి భావాన్ని అలవరుచుకున్న వాడికి బయట ఎలాంటి పరిస్థితి వచ్చినా లోపల ప్రశాంతత ఉంటుంది.
(05:27) ఎందుకంటే అతను స్పష్టంగా తెలుసుకున్నాడు నేను ఈ శరీరం కాదు నా మనసు కాదు నేను మార్పు లేని చైతన్యాన్ని నేను ఆ బ్రహ్మమే అని అప్పుడు బాధ అనేది మనసు యొక్క అనుభవం నీ స్వరూపం కాదు. ఈ స్పష్టత మనకు కష్టాల సమయంలో స్థిరత్వాన్ని ఇస్తుంది. నీ బాధను నీ కోపాన్ని నువ్వు కేవలం ఒక సాక్షిగా చూడడం నేర్చుకుంటే అవి నీపై తమ ప్రభావాన్ని కోల్పోతాయి.
(05:50) ఈ సాక్షి భావమే నిన్ను అహంకారం, ఈర్ష అభద్రత భావం నుంచి విముక్తుడిని చేస్తుంది. అద్వైతం కేవలం వేదాంత చర్చ కాదు. ఇది జీవితాన్ని మార్చే శక్తి. ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మన జీవితంలో నాలుగు అద్భుతమైన మార్పులు వస్తాయి. మొదటిగా భయం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రపంచంలో మనిషిని ఎక్కువగా వేధించేది మరణ భయం. మనం శరీరం అనుకున్నంత కాలం ఈ శరీరం నశించిపోతుంది కాబట్టి మరణ భయం వెంటాడుతూ ఉంటుంది.
(06:16) కానీ అద్వైతం చెబుతుంది మరణం కేవలం శరీరాన్ని మార్చుకోవడం ఆత్మకు కాదు నువ్వు ఆత్మవి ఆత్మకు పుట్టుక లేదు చావు లేదు మార్పు లేదు. నీవు నిత్యమైన చైతన్యాన్ని అని తెలుసుకున్నప్పుడు మరణం అనేది కేవలం పాత దుస్తులను విడిచి కొత్త దుస్తులను ధరించడం లాంటిది అనిపిస్తుంది. ఇక భయపడడానికి ఏముంది ఈ జ్ఞానమే మనిషికి నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది.
(06:40) రెండవది ఇతరులపై ద్వేషం, విభేదం పోతాయి. ప్రపంచంలో యుద్ధాలు ఘర్షణలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి? నేను వేరు నా మతం వేరు, నా ప్రాంతం వేరు నువ్వు వేరు అనే భిన్నత్వం వల్లనే కదా అద్వైతం ఈ వేర్పాటును పూర్తిగా తొలగిస్తుంది. నువ్వు గ్రహిస్తావు అతను నేనే నేను అతనే అని మన ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఒక బ్రహ్మం అని నీకు పక్క వ్యక్తికి మధ్య ఉన్నది కేవలం మాయతో కూడిన శరీరం మనసు మాత్రమే లోపల ఉన్నది ఒకే ఒక చైతన్యం నీవు ఇతరులపై ప్రేమ చూపితే నువ్వు నీపైనే ప్రేమ చూపినట్లు అవుతుంది. ఈ జ్ఞానమే ప్రపంచ శాంతికి మూలం.
(07:13) ద్వేషం దానంతట అదే మాయమై విశ్వ ప్రేమ పెరుగుతుంది. మూడవది మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. బయట ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. లాభాలు నష్టాలుగా సంతోషం బాధగా మారుతాయి. ఈ మార్పులకు స్పందిస్తూ ఉంటే మన మనసు అలసిపోతుంది. అద్వైత జ్ఞానం వచ్చిన వ్యక్తికి తెలుసు బయటి మార్పులు నా స్వరూపాన్ని మార్చలేవు.
(07:34) నేను మార్పు లేని సాక్షిని. ఈ స్థిరత్వం కారణంగా ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి లభిస్తుంది. సంతోషం వచ్చినా ఉప్పొంగిపోకుండా స్థిరంగా ఉంటాడు. బయట ఏం జరిగినా లోపల ప్రశాంతత ఉంటుంది. చివరిగా అహంకారం తగ్గుతుంది. నేను గొప్పవాడిని నేను చేశాను నాకు అన్ని తెలుసు అనే అహంకారం మనల్ని ఒంటరి చేస్తుంది. ఈ అహంకారమే అన్నిటికీ మూలం. కానీ నువ్వు తెలుసుకున్నప్పుడు నేను అనుకునే ఈ చిన్న శరీరం మనసు కంటే గొప్పదైన అనంతమైన ఒకటే సత్యం ఉన్నదని ఆ సత్యమే నేనని తెలుసుకున్నప్పుడు అహంకారం దానంతట అదే చిన్నదైపోతుంది.
(08:09) ఈ జ్ఞానం మనల్ని వినయంగా సమభావంతో ఉండేలా చేస్తుంది. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు. ఇది జీవితాన్ని చూసే ఒక కొత్త దృష్టి. అద్వైత సిద్ధాంతాన్ని పుస్తకాల్లో చదవడం, ఉపన్యాసాలలో వినడం మొదటి దశ మాత్రమే. నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఈ జ్ఞానాన్ని నీ అనుభవంగా మార్చాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చడానికి ఏం చేయాలి? నిరంతరం ధ్యానం చేయాలి.
(08:35) అద్వైత సాధనలో అత్యంత ముఖ్యమైనది నేను ఎవరు అనే ప్రశ్నపై ధ్యానం చేయడం. కూర్చొని కళ్ళు మూసుకొని ఈ ప్రశ్న వేయండి. నేను ఈ శరీరం కాదు నేను ఈ ఆలోచనలు కాదు నేను ఈ భావాలు కాదు. మరి నేను ఎవరు? ఈ శరీరాన్ని ఆలోచనలను భావాలను చూస్తున్న ఒక చూసే వాడివి నువ్వు ఆ చూసే వాడిని పట్టుకోవడమే ధ్యానం. ఈ ధ్యానం ద్వారా మనసు యొక్క అలజడి తగ్గి నీ అసలైన స్వరూపం పై దృష్టి కేంద్రీకరిస్తుంది.
(09:02) అలాగే సాక్షిగా ఉండడం సాధన చేయాలి. ఇదే మన జీవితంలో అతి పెద్ద సాధన. దీన్నే సాక్షి భావన అంటారు. ప్రతి నిమిషం మనం దీనిని సాధన చేయాలి. మీకు కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అని అనుకోవద్దు. [సంగీతం] నా మనసులో కోపం అనే భావన వస్తుంది అని గుర్తించండి. మీకు భయం వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అని అనుకోవద్దు. నా శరీరంలో భయమనే అనుభూతి కలుగుతుంది అని చూడండి.
(09:26) మీరు ఆ భావంలో మునిగిపోకుండా ఆ భావాన్ని దూరం నుంచి చూసే సాక్షిగా ఉండండి. ప్రతిరోజు నీ జీవితంలో ఈ సాక్షి భావనను అలవరుచుకుంటే భావద్వేగాలు నీకు బానిసలు అవుతాయి. నువ్వు వాటికి కాదు అప్పుడు నువ్వు రిమోట్ పట్టుకొని టీవీ చూసినంత హాయిగా నీ జీవితాన్ని చూస్తావు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనక ఇచ్చిన [సంగీతం] సందేశం చాలా లోతైనది.
(09:49) తనను తెలుసుకున్నవాడు దేవుడే అద్వైతం అంటే ఏదో కొత్త దేవుడిని వెతకడం కాదు అద్వైతం అంటే తనలోని దేవుణని అనంతమైన చైతన్యాన్ని గుర్తించడం. ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు బయట ప్రపంచం మారకపోయినా నువ్వు మారిపోతావు. బయటి కష్టాలు సంతోషాలు అలాగే ఉన్నా వాటిని స్వీకరించే నీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మారిన ఈ ఆలోచనే మనసుకు శాంతి జీవనానికి దిశ ఆత్మకు స్వేచ్ఛ ఈ స్వేచ్ఛే మోక్షం వైపు మనకు మొదటి అడుగు అవుతుంది.
(10:19) జ్ఞాపకం ఉంచుకోండి నీవు వేరు కాదు నీవే బ్రహ్మమని ఇది కేవలం తత్వం కాదు ఇది మనసుకు శాంతి జీవనానికి దిశ ఆత్మకు స్వేచ్ఛ ఈ సత్యాన్ని అనుభవంగా మార్చుకోవడమే మన జీవిత పరమార్థం ఈ అద్భుతమైన జ్ఞానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయగలరు.
No comments:
Post a Comment